మీ కంటెంట్ మేనేజర్ ఖాతాను సంరక్షించుకోండి

ఈ ఫీచర్‌లు YouTube Studio కంటెంట్ మేనేజర్‌ను ఉపయోగించే పార్ట్‌నర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. యాక్సెస్ పొందడానికి మీ YouTube పార్ట్‌నర్ మేనేజర్‌ను సంప్రదించండి.
గమనిక: Studio కంటెంట్ మేనేజర్‌ను యాక్సెస్ చేయడానికి, మీరు Studio కంటెంట్ మేనేజర్‌కు సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించే Google ఖాతాలో 2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేయాలి.

మీ YouTube ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడం అనేది మీ YouTube ఖాతా లేదా ఛానెల్ హ్యాక్ అవ్వకుండా, హైజాక్ అవ్వకుండా, లేదా చోరీకి గురి కాకుండా నివారించడంలో సహాయపడుతుంది.

YouTube Studio కంటెంట్ మేనేజర్ యూజర్‌లు, అనధికారిక యాక్సెస్ నుండి తమ కంటెంట్ మేనేజర్ ఖాతాను సంరక్షించుకోవడానికి ఈ అదనపు చర్యలు తీసుకోవాలనుకోవచ్చు:

  సైన్ ఇన్ చేయడానికి వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్‌లను ఉపయోగించండి

ఖాతా లాక్ అయిపోకుండా నివారించడానికి, ప్రతి యూజర్ వారి సొంత ఈమెయిల్ అడ్రస్‌తో Studio కంటెంట్ మేనేజర్‌కు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.

 అనుమతులను రివ్యూ చేసి, తెలియని యూజర్‌లను తీసివేయండి

క్రమం తప్పకుండా మీ కంటెంట్ మేనేజర్ యూజర్ లిస్ట్‌ను రివ్యూ చేయండి, అలాగే యూజర్‌లు ఖచ్చితమైన అనుమతుల స్థాయిని కలిగి ఉన్నారని నిర్ధారించండి.

మీరు యూజర్‌లను గుర్తించలేకపోతే, మీ ఖాతా హ్యాక్ చేయబడి ఉండవచ్చు. యూజర్‌లను తీసివేయడం లేదా వారి రోల్‌ను మార్చడం ఎలాగో మరింత తెలుసుకోండి.

  నోటిఫికేషన్ ఈమెయిళ్లను చెక్ చేయండి

కొత్త క్లెయిమ్స్, రిపోర్ట్‌లు, లేదా యాజమాన్య హక్కు వైరుధ్యాలు వంటి కంటెంట్ మేనేజర్ యాక్టివిటీకి సంబంధించిన ఈమెయిల్ నోటిఫికేషన్‌లను తెరవడానికి ముందు, అవిyoutube.com డొమైన్ నుండి పంపబడ్డాయని నిర్ధారించుకోండి.

  అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోండి

వీలైతే, అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి. ఈ ప్రోగ్రామ్ అనేది భౌతిక సెక్యూరిటీ కీలను 2-దశల వెరిఫికేషన్ పద్ధతిగా ఉపయోగించడం ద్వారా యూజర్‌లను రక్షిస్తుంది.

  Google Chromeలోని సురక్షిత బ్రౌజింగ్‌తో మెరుగైన రక్షణను ఆన్ చేయండి

మీరు Google Chromeను ఉపయోగిస్తే, సురక్షిత బ్రౌజింగ్‌తో మెరుగైన రక్షణను ఆన్ చేయడం వలన మీకు అవాంఛిత సాఫ్ట్‌వేర్, రిస్క్ ఉన్న ఎక్స్‌టెన్షన్‌లు, ఫిషింగ్ లేదా సురక్షితం కాని వెబ్‌సైట్‌ల గురించి అలర్ట్‌లు పంపబడతాయి.

  మీ ఖాతాను మరింత సురక్షితం చేయండి

తెలియని యాప్‌లను లేదా తెలియని మూలాల నుండి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకండి. మీ కనెక్ట్ అయిన పరికరాల నుండి మీకు అవసరం లేని యాప్‌లు ఏవైనా ఉంటే తీసివేయండి.

మీ YouTube ఛానెల్‌ను సురక్షితంగా ఉంచడం గురించి మరింత తెలుసుకోండి లేదా మరిన్ని ఖాతా సెక్యూరిటీ చిట్కాల కోసం మా క్రియేటర్ భద్రతా కేంద్రానికి వెళ్లండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15174147898773161137
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false