హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీలు

క్రియేటర్‌లు తాము YouTubeకు అప్‌లోడ్ చేసే కంటెంట్‌కు అవసరమైన అన్ని హక్కులను కలిగి ఉండాలి, లేదా కంటెంట్ హక్కుదారుల నుండి అవసరమైన చట్టపరమైన అనుమతులన్నీ పొందాలి. Creator Musicతో, అర్హత కలిగిన క్రియేటర్‌లు తమ నిడివి ఎక్కువ ఉన్న వీడియోల్లో ఉపయోగించడానికి లైసెన్స్ పొందడం ద్వారా లేదా మ్యూజిక్ హక్కుదారులకు ఆదాయంలో వాటా ఇవ్వడం ద్వారా వృద్ధి చెందుతున్న మ్యూజిక్ కేటలాగ్‌ను యాక్సెస్ చేయగలుగుతారు. లైసెన్స్‌లను కొనుగోలు చేయకపోతే, బదులుగా అర్హత కలిగిన క్రియేటర్‌లు మ్యూజిక్ హక్కుదారులకు తమ ఆదాయంలో వాటాను ఇవ్వవచ్చు.

మ్యూజిక్ ఆదాయ షేరింగ్‌ను ఎనేబుల్ చేయడానికి, మ్యూజిక్ హక్కుదారులతో ప్లే చేయగల హక్కుల వంటి అదనపు మ్యూజిక్ హక్కులను YouTube క్లియర్ చేయవచ్చు. అదనపు మ్యూజిక్ హక్కులు పొందేందుకు అయ్యే ఖర్చుల కోసం క్రియేటర్ ఆదాయ షేరింగ్ నుండి చేసే డిడక్షన్ అనేది హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీగా ఉంటుంది.

హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీలు ఎప్పుడు వర్తిస్తాయి?

హక్కులు ఏ దేశం/ప్రాంతానికి చెందినవి అన్నదానిపై హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీలు ఆధారపడి ఉంటాయి. నిర్దిష్టంగా, నిడివి ఎక్కువ ఉన్న వీడియోలు ఆదాయాన్ని పొందే దేశాలు/ప్రాంతాల్లో మాత్రమే హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీలు వర్తిస్తాయి.

ఆదాయ షేరింగ్‌కు ఏ పాటలు అర్హత కలిగి ఉంటాయనేది తెలుసుకోవడానికి, అర్హత కలిగిన క్రియేటర్‌లు Creator Music‌లో ట్రాక్ వినియోగ వివరాలను బ్రౌజ్ చేయవచ్చు. వీడియో పబ్లిష్ అయిన తర్వాత, వీడియో ఏ దేశాలు/ప్రాంతాల్లో ఆదాయంలో వాటాను పంచుతోంది అన్నది తెలుసుకోవడానికి క్రియేటర్‌లు YouTube Studioను ఉపయోగించవచ్చు.

ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి: హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీలు లైవ్ స్ట్రీమ్‌లు లేదా షార్ట్‌లకు కాకుండా నిడివి ఎక్కువ ఉన్న వీడియోలకు మాత్రమే వర్తిస్తాయి. లైవ్ స్ట్రీమ్‌లు, అలాగే Shortsకు సంబంధించిన మానిటైజేషన్ గురించి మరింత తెలుసుకోండి.

హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీలు వర్తించకపోతే ఏమి జరుగుతుంది?

ఈ పేజీలో వివరించిన హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీలు వర్తించబడకుండా ఉండి, పైగా ఆ క్రియేటర్‌లు అవసరమైన అన్ని హక్కులను పొందలేదని ఒకరు లేదా అంత కంటే ఎక్కువ థర్డ్-పార్టీలు YouTubeకు తెలియజేసి ఉంటే, ప్రభావితమైన ఆ కంటెంట్ YouTube నుండి తీసివేయబడవచ్చు, అలాగే దానికి సంబంధించిన ఆదాయాన్ని పొందడానికి ఆ క్రియేటర్‌లకు అర్హత ఉండకపోవచ్చు. 

ప్రత్యేకించి, కంటెంట్‌లో ఏదైనా భాగాన్ని ఒకటి కంటే ఎక్కువ పార్టీలు మానిటైజేషన్ కోసం కంటెంట్ ID సిస్టమ్ ద్వారా క్లెయిమ్ చేసినప్పుడు, క్రియేటర్‌కు రావలసిన ఆదాయాలు, క్లెయిమ్ చేసిన పార్టీ(లు)కు పే చేయబడతాయి. ఒకటి కంటే ఎక్కువ పార్టీలు ఆదాయాన్ని క్లెయిమ్ చేస్తూ ఉంటే, ఆ ఆదాయాలు వారి మధ్య ప్రో రాటా ఆధారంగా షేర్ చేయబడతాయి, ఆ ప్రో రాటా షేర్‌ను YouTube, తన విచక్షణానుసారం నిర్ణయిస్తుంది. 

కంటెంట్ ID క్లెయిమ్‌ల గురించి మరింత తెలుసుకోండి.

హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీలు ఎలా లెక్కించబడతాయి?

Creator Musicతో, ఆదాయ షేరింగ్‌కు అర్హత కలిగిన ట్రాక్‌లను నిడివి ఎక్కువ ఉన్న వీడియో ఉపయోగిస్తే, ఈ కింద ఉన్న ఉదాహరణల్లో చూపిన విధంగా మ్యూజిక్ హక్కులు పొందేందుకు అయ్యే ఖర్చుల కోసం స్టాండర్డ్ 55% ఆదాయ షేరింగ్ సర్దుబాటు చేయబడుతుంది. ఇది ఈ కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది:

  • ఉపయోగించిన ట్రాక్‌ల సంఖ్య: ఒక క్రియేటర్ తమ వీడియోలో ఆదాయ షేరింగ్‌కు అర్హత కలిగిన ఎన్ని ట్రాక్‌లను ఉపయోగిస్తారు (ఈ కింద ఉదాహరణలను చూడండి).
  • అదనపు మ్యూజిక్ హక్కుల కోసం అయ్యే ఖర్చులు: ప్లే చేయగల హక్కుల వంటి అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చుల కోసం డిడక్షన్. ఈ డిడక్షన్ 5% దాకా ఉండవచ్చు, ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న Creator Music ట్రాక్‌లన్నింటికి సంబంధించిన ఈ అదనపు మ్యూజిక్ హక్కుల మొత్తం ఖర్చును ఇది ప్రతిబింబిస్తుంది.
ఆదాయ షేరింగ్ లెక్కింపుల ఉదాహరణలు

ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు

ఉదాహరణ: క్రియేటర్ నిడివి ఎక్కువ ఉన్న వీడియోలో ఆదాయ షేరింగ్‌కు అర్హత కలిగిన 1 ట్రాక్‌ను ఉపయోగించి, స్టాండర్డ్ 55% ఆదాయ షేరింగ్‌లో సగం వాటా (27.5%)ను పొందుతారు. ఉదాహరణకు, అదనపు మ్యూజిక్ హక్కుల ధరలకు సంబంధించి డిడక్షన్ 2.5% ఉంటుంది.

ఈ వీడియో కోసం క్రియేటర్ మొత్తం ఆదాయంలో 25% పొందుతారు (27.5% - 2.5%).

 
ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు
ఉదాహరణ ఆదాయ షేరింగ్: 55% ÷ 2 27.5%
ఉదాహరణ అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చులు - 2.5%
ఉదాహరణ మొత్తం ఆదాయం 25%

ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 2 ట్రాక్‌లను, అలాగే లైసెన్స్ పొందిన 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు

ఉదాహరణ: క్రియేటర్ తమ నిడివి ఎక్కువ ఉన్న వీడియోలో ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 2 ట్రాక్‌లను, లైసెన్స్ ఉన్న 1 ట్రాక్‌ను ఉపయోగించి, స్టాండర్డ్ 55% ఆదాయ షేర్‌లో 1/3 వంతు (18.33%)ను పొందుతారు. ఉదాహరణకు, అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చులకు సంబంధించి డిడక్షన్ 2% ఉంటుంది.

ఈ వీడియో కోసం క్రియేటర్ మొత్తం ఆదాయంలో 16.33% పొందుతారు (18.33% - 2%).

 
ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 2 ట్రాక్‌లను, అలాగే లైసెన్స్ పొందిన 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు
ఉదాహరణ ఆదాయ షేరింగ్: 55% ÷ 3 18.33%
ఉదాహరణ అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చులు - 2.5%
ఉదాహరణ మొత్తం ఆదాయం 15.83%

హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీలను సవాలు చేయవచ్చా?

హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీపై వివాదాన్ని ఫైల్ చేయడానికి కంటెంట్‌కు అవసరమైన అన్ని హక్కులను కలిగి ఉండేటువంటి సరైన కారణాన్ని క్రియేటర్ చూపగలిగితే, వారు కంటెంట్ ID క్లెయిమ్ గురించి వివాదాన్ని ఫైల్ చేయవచ్చు.

కంటెంట్ ID క్లెయిమ్‌పై వివాదాన్ని ఫైల్ చేయడానికి ముందు కంటెంట్ ID వివాదాల సమయంలో మానిటైజేషన్‌కు ఏం జరుగుతుందన్నది అర్థం చేసుకున్నట్టు క్రియేటర్‌లు నిర్ధారించుకోవాలి.

Creator Musicతో ఆదాయ షేరింగ్ గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14751919661772403190
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false