YouTubeలో పాఠశాల ఖాతాలకు మార్పులను అర్థం చేసుకోండి

Google Workspace for Education ఖాతా అనేది మీ పాఠశాల మీకిచ్చిన ఈమెయిల్ అడ్రస్. ఈ రకమైన ఖాతాలో, YouTube వంటి, Google ప్రోడక్ట్‌లకు మీ యాక్సెస్‌ను, మీ స్కూల్ అడ్మినిస్ట్రేటర్ మేనేజ్ చేస్తారు.

సెప్టెంబర్ 1, 2021 నాటికి, మీ వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ అని మీ స్కూల్ అడ్మినిస్ట్రేటర్ మార్క్ చేస్తే, మీ స్కూల్ YouTube ఖాతా YouTubeలో పరిమిత వెర్షన్‌కు మార్చబడుతుంది. మీ YouTube ఛానెల్ ఇకపై మీ స్కూల్ ఖాతాకు అనుబంధించబడి ఉండదు, అలాగే మీరు ఇకపై ఆ ఛానెల్‌కు కొత్త వీడియోలను అప్‌లోడ్ చేయలేరు. కానీ ఈ మార్పులు Google Workspace for Education ద్వారా గల మీ స్కూల్ ఖాతాలోని మీ YouTube అనుభవంపై మాత్రమే ప్రభావితం చూపిస్తాయి, మీ వ్యక్తిగత ఖాతాలోని YouTube అనుభవాన్ని ఇవి ప్రభావితం చేయవు.

18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్‌ల కోసం ఖాతా పరిమితులు

మీరు ప్రైమరీ లేదా సెకండరీ స్కూల్‌లో ఉండి, మీ స్కూల్ అడ్మినిస్ట్రేటర్ మీకు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్టుగా మార్క్ చేస్తే, మీరు మీ Google Workspace for Education ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు YouTube కంటెంట్, ఫీచర్‌లపై మీకు పరిమితులు ఉంటాయి.

మీ స్కూల్ అడ్మినిస్ట్రేటర్ మీకు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్టుగా మార్క్ చేస్తే, అందుబాటులో లేని కొన్ని ఫీచర్‌లు ఇక్కడ ఉన్నాయి:

చూడటం

  • లైవ్ స్ట్రీమింగ్ వీడియోలు

ఎంగేజ్

  • నోటిఫికేషన్‌లు (యాక్టివిటీ హైలైట్‌లతో వ్యక్తిగతీకరించిన నోటిఫికేషన్‌లు మినహా)
  • కామెంట్‌లు
  • లైవ్ చాట్
  • క్రియేట్ చేయండి
  • ఛానెల్
  • లైవ్ స్ట్రీమ్
  • పోస్ట్‌లు
  • పబ్లిక్, అన్‌లిస్టెడ్ ప్లేలిస్ట్
  • కథనాలు
  • Shorts
  • వీడియో అప్‌లోడ్‌లు

కొనుగోలు చేయండి

  • ఛానెల్ మెంబర్‌షిప్‌లు
  • క్రియేటర్ అమ్మకపు వస్తువులు
  • YouTube విరాళం
  • సినిమాలు & టీవీ షోలు
  • సూపర్ చాట్ & సూపర్ స్టిక్కర్స్

YouTube యాప్‌లు

  • YouTube Music
  • YouTube Studio
  • YouTube TV
  • YouTube VR

ఇతర విషయాలు

  • TVలో ప్రసారం
  • కనెక్ట్ చేయబడిన గేమింగ్ ఖాతాలు
  • అజ్ఞాత మోడ్
  • వ్యక్తిగతీకరించిన యాడ్‌లు
  • పరిమిత మోడ్

మీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయడానికి

మీకు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉంటే:

మీ స్కూల్ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి:

  • మీ ఖాతా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిదిగా మార్క్ చేయమని మీ స్కూల్ అడ్మినిస్ట్రేటర్‌ను అడగండి.

మీ సెట్టింగ్‌లను మీ అడ్మినిస్ట్రేటర్ అప్‌డేట్ చేసిన తర్వాత:

  • YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  • ఛానెల్‌ను క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌కు వెళ్లి, వర్క్‌ఫ్లోను పూర్తి చేయండి. మీ ఖాతా కనిపిస్తుంది, మీ పాఠశాల ఖాతాతో అనుబంధించబడిన YouTube ఛానెల్‌లో మీరు వీడియోలను క్రియేట్ చేయడం కొనసాగించవచ్చు.

మీ వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ అయితే:

  • మీరు YouTubeలో క్రియేట్ చేసిన ఇతర డేటా (కామెంట్‌లు, సెర్చ్ హిస్టరీ వంటివి)ను, మీ వీడియోలను డౌన్‌లోడ్, సేవ్ చేయడానికి Google టేక్అవుట్‌ను ఉపయోగించండి. సెప్టెంబర్ 2021 తర్వాత మీ ఖాతా క్రియేట్ చేయబడితే, మీ వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ అని మీ స్కూల్ అడ్మినిస్ట్రేటర్ మార్క్ చేసిన తేదీ నుండి, మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి 60 రోజుల సమయం ఉంటుంది.
గమనిక: మీ స్కూల్ అడ్మినిస్ట్రేటర్ మీ ఖాతా కోసం Google టేక్అవుట్‌ను యాక్టివేట్ చేస్తే, అది అందుబాటులో ఉంటుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17871692341686716436
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false