పర్యవేక్షించబడే ఖాతాల గురించి తల్లిదండ్రుల కోసం FAQలు

YouTubeలో పర్యవేక్షించబడే ఖాతాకు, సాధారణ YouTube లేదా YouTube Music ఖాతాకు మధ్య తేడా ఏమిటి?

మీ చిన్నారికి చెందిన పర్యవేక్షించబడే ఖాతా సాధారణ YouTube లేదా YouTube Music ఖాతా మాదిరిగానే కనిపిస్తుంది, కానీ అందుబాటులో ఉన్న ఫీచర్‌లు ఇంకా సెట్టింగ్‌లలో మారుతూ ఉంటుంది.

మీ చిన్నారి ప్లే చేయగల కంటెంట్, వారి పర్యవేక్షించబడే ఖాతా కోసం మీరు ఎంచుకున్న కంటెంట్ సెట్టింగ్‌‌పై ఆధారపడి ఉంటుంది. YouTube, YouTube Musicలలో సాధారణంగా అందుబాటులో ఉండే కొన్ని ఫీచర్‌లు అందుబాటులో ఉండవు. అందుబాటులో లేని ఫీచర్‌ల లిస్ట్‌ను పొందడానికి, YouTubeలో యాక్సెస్ పర్యవేక్షణ మోడ్ అంటే ఏమిటి?కి వెళ్లండి.

స్వీయ వ్యక్తీకరణ, కమ్యూనిటీ అనేవి YouTubeలో ముఖ్యమైన భాగం కాబట్టి, పర్యవేక్షించబడే ఖాతాలకు ఏ ఫీచర్‌లు ప్రభావితం అవుతాయో నిర్ణయించేటప్పుడు మేము తల్లిదండ్రులు, నిపుణులతో కలిసి పని చేస్తాము.

YouTube Kids అంటే ఏమిటి? ఇది YouTubeలో పర్యవేక్షించబడే ఖాతాకు ఎలా భిన్నంగా ఉంటుంది?

YouTube Kids అన్నది ప్రత్యేకంగా పిల్లలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన యాప్. పర్యవేక్షించబడే ఖాతా ద్వారా, పిల్లలు YouTubeలో YouTube Musicలో కనుగొని, ప్లే చేయగల కంటెంట్‌ను పరిమితం చేసే కంటెంట్ సెట్టింగ్‌ను తల్లిదండ్రులు ఎంచుకుంటారు.

YouTube Kidsలోని వీడియోలు భిన్నంగా ఉంటాయి, అయితే సాధారణ YouTubeతో పోలిస్తే తక్కువ రకాల వీడియోలు ఉంటాయి. వీడియోలు అనేక కాంబినేషన్‌ల ద్వారా ఎంచుకోబడతాయి. హ్యూమన్ రివ్యూ ద్వారా, నిపుణుల నుండి సేకరించిన ప్లేలిస్ట్‌ల ద్వారా ఈ వీడియోలు ఎంచుకోబడతాయి. తగిన వీడియోలను ఎంచుకోవడంలో అల్గారిథమిక్ ఫిల్టరింగ్ కూడా సహాయపడుతుంది.

YouTube Kids, పర్యవేక్షించబడే ఖాతాల మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోవడానికి, ఫ్యామిలీగా మీ ఎంపికలను అర్థం చేసుకోండికి వెళ్లండి.

పరిమిత మోడ్ అంటే ఏమిటి? ఇది YouTubeలో పర్యవేక్షించబడే ఖాతాకు ఎలా భిన్నంగా ఉంటుంది?

పరిమిత మోడ్ అన్నది YouTubeలో ఆప్షనల్ సెట్టింగ్. మీరు చూడకూడదని భావించే లేదా మీ పరికరాన్ని ఉపయోగించే ఇతరులు చూడకూడదని మీరు అనుకొనే, పెద్దలకు మాత్రమే ఉద్దేశించినది అయ్యే అవకాశమున్న కంటెంట్‌ను కనిపించకుండా దాచడంలో ఇది సహాయపడుతుంది. లైబ్రరీలు, స్కూల్‌లు, ప్రభుత్వ సంస్థల వంటి మరింత పరిమిత YouTube అనుభవాన్ని కోరుకునే యూజర్‌లు సాధారణంగా పరిమిత మోడ్‌ను ఆన్ చేస్తారు.

13 సంవత్సరాలు పైబడిన టీనేజర్‌ల Google ఖాతాకు పర్యవేక్షణను జోడించిన తల్లిదండ్రులు, బహుశా పెద్దలకు మాత్రమే తగిన కంటెంట్‌ను కనిపించకుండా దాచడంలో సహాయపడటానికి పరిమిత మోడ్‌ను కూడా ఉపయోగించవచ్చు.

ఇప్పటికే ఉన్న తమ Google ఖాతాలకు పర్యవేక్షణను జోడించి, వారి దేశం/ప్రాంతంలో సంబంధిత వయస్సు పైబడిన యుక్తవయస్కులకు పర్యవేక్షించబడే ఖాతాలు అందుబాటులోకి రాలేదు. పర్యవేక్షించబడే ఖాతాలు 13 ఏళ్లలోపు (లేదా వారి దేశం/ప్రాంతంలో సంబంధిత వయస్సు) చిన్నారులకు అందుబాటులో ఉంటాయి, వారి చిన్నారి YouTube అనుభవాన్ని మేనేజ్ చేయడానికి తల్లిదండ్రులకు నియంత్రణలను అందిస్తాయి.

నా చిన్నారికి నేను ఒక పర్యవేక్షించబడే ఖాతాను సెటప్ చేసినప్పుడు కంటెంట్ సెట్టింగ్‌ల కోసం నాకు ఉన్న ఆప్షన్‌లు ఏమిటి?

3 కంటెంట్ సెట్టింగ్‌ల నుండి మీరు ఎంచుకోవచ్చు:

  • అన్వేషణ: ఇది సాధారణంగా 9+ వయస్సు ఉన్న వీక్షకులకు సరిపోయే కంటెంట్ రేటింగ్‌లకు అనుగుణంగా ఉంటుంది. వీడియోల్లో వ్లాగ్‌లు, ట్యుటోరియల్స్, గేమింగ్ వీడియోలు, మ్యూజిక్ వీడియోలు, వార్తలు మరెన్నో ఉంటాయి. ప్రీమియర్‌లు మినహా లైవ్ స్ట్రీమ్‌లేవీ ఉండవు. కొన్ని వీడియోలలో కొద్దిపాటి హింస, అభ్యంతరకరమైన భాష, ఇంకా నియంత్రిత పదార్థాలకు సంబంధించిన సందర్భాలు ఉంటాయి. కొన్ని వీడియోలలో శరీర ఇమేజ్, మార్పులతో పాటు మానసిక, లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన విద్యాపరమైన కంటెంట్ కూడా ఉండవచ్చు.
  • మరింతగా అన్వేషణ: సాధారణంగా 13+ వయస్సు ఉన్న వీక్షకులకు సరిపోయే కంటెంట్ రేటింగ్‌లకు అనుగుణంగా ఉంటుంది. ఈ సెట్టింగ్‌లో చాలా ఎక్కువ వీడియోలు కూడా ఉంటాయి. ఈ వీడియోలలో లైవ్ స్ట్రీమ్‌లు, వ్లాగ్‌లు, ట్యుటోరియల్స్, గేమింగ్ వీడియోలు, మ్యూజిక్ వీడియోలు, వార్తలు, విద్యకు సంబంధించిన టాపిక్‌లు, కళలు, క్రాఫ్ట్‌లు, డ్యాన్స్, మరెన్నో ఉంటాయి. కొన్ని వీడియోలలో వాస్తవ ప్రపంచంలోని హింస, పరిమిత అసభ్య పదజాలం, లేదా నియంత్రిత పదార్థాలకు సంబంధించిన సందర్భాలు ఉంటాయి. శారీరక, మానసిక, లైంగిక ఆరోగ్యం ఇంకా శ్రేయస్సుకు సంబంధించిన అందరికీ తగిన లైంగిక రెఫరెన్స్‌లు, టాపిక్‌లు కూడా ఉండవచ్చు.
  • YouTubeలో ఎక్కువ భాగం: ఈ సెట్టింగ్ దాదాపు YouTubeలో ఉన్న ప్రతిదాన్ని అందుబాటులోకి తెస్తుంది, అయితే 18+ అని గుర్తించబడ్డ వీడియోలు, అలాగే యాక్సెస్ పర్యవేక్షణ మోడ్‌ను ఉపయోగించే వీక్షకులకు సరికాని ఇతర వీడియోలు ఉండవు. ఈ వీడియోల్లో లైవ్ స్ట్రీమ్‌లు, వ్లాగ్‌లు, ట్యుటోరియల్స్, గేమింగ్ వీడియోలు, మ్యూజిక్ వీడియోలు, వార్తలు, విద్యకు సంబంధించిన వీడియోలు, కళలు, క్రాఫ్ట్‌లు, డ్యాన్స్, మరెన్నో ఉంటాయి. కొన్ని వీడియోలు యుక్త వయస్కు‌లకు మాత్రమే తగిన సున్నితమైన టాపిక్‌లను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, తీవ్రమైన హింస, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్, నగ్నత్వం, అందరికీ తగని అసభ్య పదజాలం, మానసిక అనారోగ్యం, డైటింగ్, లైంగిక ఆరోగ్యం మొదలైన టాపిక్‌లు.

యాక్సెస్ పర్యవేక్షణ మోడ్‌ను ఉపయోగిస్తున్న ఫ్యామిలీల కోసం కంటెంట్ సెట్టింగ్‌లలో మరింత తెలుసుకోండి.

YouTube Music లేదా YouTube TVకి నా పిల్లల పర్యవేక్షించబడే ఖాతా యాక్సెస్‌ను నేను మంజూరు చేయవచ్చా?

YouTube Music కోసం పర్యవేక్షించబడే ఖాతాలకు సపోర్ట్ ఉంటుంది. మీ చిన్నారికి చెందిన పర్యవేక్షించబడే ఖాతా కోసం మీరు ఎంచుకునే కంటెంట్ సెట్టింగ్, వారు యాప్ లేదా వెబ్‌సైట్‌కు సైన్ ఇన్ చేసినప్పుడు YouTube Music కంటెంట్‌కు కూడా వర్తిస్తుంది.

మా చిన్నారి iOS పరికరంలో నేను YouTube లేదా YouTube Musicను డౌన్‌లోడ్ చేయలేకపోతే, ఏం చెయ్యాలి?

YouTube లేదా YouTube Music యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి తల్లిదండ్రులు, వారి చిన్నారి iOS పరికరంలో, తమ కంటెంట్ & గోప్యతా పరిమితుల సెట్టింగ్‌లను రివ్యూ చేయాలి.

మా చిన్నారికి పర్యవేక్షించబడే ఖాతా ఉంటే, వారు మా టీవీలో YouTubeను ఉపయోగించవచ్చా?

పర్యవేక్షించబడే ఖాతాలు చాలావరకు అర్హత ఉన్న స్మార్ట్ టీవీలు, Microsoft Xbox, Nintendo Switch, ఇంకా Sony PlayStationలో YouTubeను ఉపయోగించగలవు. పాత Android TV పరికరాలలో పర్యవేక్షించబడే ఖాతాలకు సపోర్ట్ ఉండదు.

Google Assistant ఎనేబుల్ అయిన పరికరాన్ని ఉపయోగించి నేను పర్యవేక్షించబడే ఖాతాను ఎలా సెటప్ చేయాలి?

మీ చిన్నారిని జోడించడానికి, మీ పిల్లలను మీ పరికరాలలో Google Assistantను ఉపయోగించనివ్వండిలోని దశలను అనుసరించండి.  మీ చిన్నారి Google ఖాతా ఇంకా వాయిస్‌ను మీరు పరికరానికి జోడించినట్లయితే, షేర్ చేసిన పరికరంలో Google Assistantను పర్యవేక్షించబడే ఖాతాలు ఉపయోగించవచ్చు.

అనుచితమైన కంటెంట్‌ను YouTube ఎలా ఫిల్టర్ చేస్తుంది?

YouTubeలో దేన్ని అనుమతించాలి, దేన్ని అనుమతించకూడదు అన్నది మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ సంక్షిప్తంగా వివరిస్తాయి. ఈ గైడ్‌లైన్స్ వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. మీ చిన్నారి కోసం మీరు పర్యవేక్షించబడే ఖాతాను సెటప్ చేస్తే, వివిధ కంటెంట్ సెట్టింగ్‌ల కోసం ఏ కంటెంట్‌కు అర్హత ఉంటుంది అన్నది ఈ పాలసీలు నిర్ణయిస్తాయి.

మేము మా యూజర్‌లను చాలా జాగ్రత్తగా చూసుకుంటాము, వారికి తగని కంటెంట్‌ను కనిపించకుండా చేయడానికి తీవ్రంగా శ్రమిస్తాము, కానీ ఫిల్టర్‌ల ఆటోమేటిక్ సిస్టమ్ ఏదీ కూడా ఖచ్చితమైనది కాదు. మీరు ఎప్పుడైనా మీ చిన్నారి కోసం యాప్ అనుమతి, అలాగే కంటెంట్ సెట్టింగ్‌లను మార్చవచ్చు. YouTubeకు తగినది కాదు అని మీరు భావించే వీడియో ఏదైనా మీకు కనిపిస్తే, మీరు దాన్ని రిపోర్ట్ చేయవచ్చు.

యాడ్‌లు అనేవి పర్యవేక్షించబడే ఖాతాలతో ఎలా పని చేస్తాయి?

పిల్లలకు మరింత సంరక్షణ కల్పించడానికి, నిర్దిష్ట కేటగిరీల్లో యాడ్‌లపై నిషేధం విధించబడింది, అలాగే వ్యక్తిగతీకరించిన యాడ్‌లు ఆఫ్ చేయబడ్డాయి. "పిల్లల కోసం రుపొందించబడింది" కంటెంట్ వీక్షకులు వీడియో యాడ్ కనిపించడానికి ముందు, అలాగే తర్వాత యాడ్ బంపర్‌ను చూడవచ్చు. ఇది అడ్వర్టయిజ్‌మెంట్ ప్రారంభం అవుతున్నప్పుడు, అలాగే ముగుస్తున్నప్పుడు వారిని అలర్ట్ చేయడంలో ఈ బంపర్ సహాయపడుతుంది. మీరు YouTube Premium ఫ్యామిలీ ప్లాన్‌ను కలిగి ఉంటే, మీ చిన్నారి యాడ్స్-లేని కంటెంట్‌కు, అలాగే ఇతర షేర్ చేసిన మెంబర్‌షిప్ ప్రయోజనాలకు అర్హత కలిగి ఉంటారు.

క్రియేటర్ తమ వీడియోలో పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్ లేదా ఎండార్స్‌మెంట్ ఉందని మాకు వెల్లడించిన వీడియోలు, YouTubeలో పర్యవేక్షించబడే ఖాతాలకు చూపబడతాయి. పిల్లల కోసం రూపొందించిన వీడియోలపై యాడ్ పాలసీకి కూడా ఈ వీడియోలు అనుగుణంగా ఉండాలి.

YouTube నా చిన్నారి గోప్యతను ఎలా రక్షిస్తుంది?

YouTube అన్నది Googleలో భాగం, అలాగే Google గోప్యతా పాలసీలకు, నియమాలకు ఇది కట్టుబడి ఉంటుంది. మీ చిన్నారి Google ఖాతాతో అనుబంధంగా మేము ఏ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తామనే దాని గురించి మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని మాకు తెలుసు. మేము దీన్ని ఎందుకు సేకరిస్తాము, ఇంకా మీరు ఆ సమాచారాన్ని ఎలా కంట్రోల్ చేయవచ్చు, తొలగించవచ్చు అనే విషయాలను తెలుసు కొనవలసిన అవసరం ఉందని కూడా మాకు తెలుసు. 13 ఏళ్లలోపు (లేదా వారి దేశం/ప్రాంతంలో వర్తించే వయస్సు) పిల్లలకు సంబంధించిన Google ఖాతాల కోసం Google గోప్యతా పాలసీ, మా గోప్యతా ప్రకటన అనేవి మా గోప్యతా పద్ధతులను వివరిస్తాయి.

మీ చిన్నారి తమ ఖాతాలోని "YouTubeలో మీ డేటా" కింద ఉన్న వారి YouTube గోప్యతా సెట్టింగ్‌లు, అలాగే కంట్రోల్స్‌ను మేనేజ్ చేయవచ్చు, అలాగే మరింత తెలుసుకోవచ్చు. ఈ పేజీలో వారి వీడియో సారాంశం, యాక్టివిటీ డేటాతో పాటు ఈ డేటాను మేనేజ్ చేయడానికి సెట్టింగ్‌లు ఉంటాయి. మీ చిన్నారి చూసిన వాటిని వారికి రిమైండ్ చేయడంతో పాటు సిఫార్సులు ఇవ్వడం వంటి, తమ YouTube ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి వారి డేటా ఎలా ఉపయోగించబడుతుందనే దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ పేజీ వివరంగా తెలియజేస్తుంది.

మీ చిన్నారి Google ఖాతాకు సంబంధించిన తల్లి/తండ్రి మేనేజర్‌గా, మీరు Family Link నుండి వారి సెర్చ్, వీక్షణ హిస్టరీని పాజ్ చేయవచ్చు లేదా క్లియర్ చేయవచ్చు. మీరు YouTubeలోని మీ తల్లిదండ్రుల సెట్టింగ్‌ల పేజీ నుండి కూడా హిస్టరీని క్లియర్ చేయవచ్చు.

పర్యవేక్షించబడే ఖాతాలు స్కూల్స్ లేదా విద్యా సంస్థలకు అందుబాటులో ఉంటాయా?

పర్యవేక్షించబడే ఖాతాలు ప్రస్తుతం వ్యక్తిగత ఖాతాలకు అందుబాటులో ఉన్నాయి. పర్యవేక్షించబడే ఖాతాలు స్కూల్స్ లేదా విద్యా సంస్థలకు అందుబాటులో లేవు. మీ పరికరానికి మీరు సైన్ ఇన్ చేసిన విధానం, YouTubeను ఉపయోగించవచ్చా లేదా అనే దాన్ని ప్రభావితం చేయవచ్చు. పర్యవేక్షించబడే ఖాతాల గురించి మరింత తెలుసుకోండి.

YouTubeలో పర్యవేక్షించబడే ఖాతా కోసం ఎవరికి అర్హత ఉంటుంది?

13 సంవత్సరాల వయస్సులోపు (లేదా వారి దేశం/ప్రాంతంలో సంబంధిత వయస్సు) చిన్నారి కోసం మీరు పర్యవేక్షించబడే ఖాతాను సెటప్ చేయవచ్చు.

మీకు ఈ కింద పేర్కొన్నవి వర్తిస్తే, YouTubeలో పర్యవేక్షించబడే ఖాతాకు మీకు అర్హత ఉండదు:

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5503530653656252902
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false