గేమ్‌ల విషయంలో మానిటైజేషన్

YouTubeలోని వీడియోల్లో గేమింగ్ అనేది జనాదరణ పొందిన ఒక టాపిక్. గేమింగ్ వీడియోల క్రియేటర్‌లకు వర్తించే వివిధ మానిటైజేషన్ స్టేటస్‌లను అర్థం చేసుకోవడానికి, ఈ పేజీ సహాయకరంగా ఉంటుంది. ఇవి కొత్త పాలసీలు కావు, ఈ గైడ్‌లైన్స్ ఇప్పటికే ఉన్నాయి. YouTube అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ నుండి వీటిని తీసుకోవడం జరిగింది. గేమింగ్ వీడియోలకు సంబంధించిన సాధారణ అంశాలపై ఈ పేజీ ఫోకస్ చేస్తున్నప్పటికీ, మీ వీడియోలు అన్నింటికి అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ అన్నీ వర్తించడం కొనసాగుతుందని గుర్తుంచుకోండి.

ఈ కింది నియమాలను ఉల్లంఘిస్తే మానిటైజ్ అయ్యే మీ వీడియోల్లో అడ్వర్టయిజర్‌లు యాడ్‌లను పరిమిత సంఖ్యలో ప్రదర్శించడం కానీ లేదా ఏ యాడ్‌లనూ ప్రదర్శించకపోవడం కానీ చేయవచ్చు. మీ వీడియోలు YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించడం లేదని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండటమనేది ఉత్తమం, ఈ ఉల్లంఘన వల్ల మీ మానిటైజేషన్ స్టేటస్ కూడా ప్రభావితమవవచ్చు.

గేమింగ్ వీడియోలను మానిటైజ్ చేయడానికి సంబంధించిన చిట్కాలు

గేమింగ్ టాపిక్‌లకు సంబంధించిన మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు ఈ కింద కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. నిజమైన సబ్జెక్ట్‌లున్న లేదా కంప్యూటర్ ద్వారా రూపొందిన సబ్జెక్ట్‌లున్న వీడియోలలో ఆడియో లేదా విజువల్ రూపంలో (టెక్స్ట్‌తో సహా) పాలసీ ఉల్లంఘనలు జరిగితే, దిగువున పేర్కొన్న మానిటైజేషన్ చిహ్నం మార్పులు అన్నీ సదరు వీడియోలపై వర్తించవచ్చు. ఇది వీడియో థంబ్‌నెయిల్‌కు, అలాగే టైటిల్‌కు కూడా వర్తిస్తుంది.

అనుచితమైన భాష

మీ గేమింగ్ వీడియోలలో ప్రారంభంలో గాని, లేదా మొత్తం వీడియోలో అధిక భాగంలో గాని, అసభ్య పదజాలాన్ని, లేదా అసభ్యతతో కూడిన కంటెంట్‌ను గాని ఫీచర్ చేయడం వలన మానిటైజేషన్ స్టేటస్ మారవచ్చు. మీ కంటెంట్‌లో అసభ్య పదజాలాన్ని తరచుగా కాకుండా, లేదా అక్కడక్కడా ఉపయోగించినంత మాత్రాన (మ్యూజిక్ వీడియోలలో, బ్యాకింగ్ ట్రాక్‌లలో, ఇంట్రో/అవుట్రో మ్యూజిక్‌లో, లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేసిన మ్యూజిక్‌లో ఉపయోగించిన సందర్భాల వంటివి), మీ వీడియో అడ్వర్టయిజింగ్‌కు తగినదిగా కాకుండా పోవాలనే నియమం ఏమీ లేదు.

ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి (అసంపూర్ణమైనవి):

యాడ్‌ల గైడెన్స్ ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు

ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

టైటిల్, థంబ్‌నెయిల్, లేదా వీడియోలో “దీనబ్బ” లేదా “దీనమ్మ” వంటి సంక్షిప్తీకరించిన, సెన్సార్ చేయబడిన అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగించడం. “లంజ”, “బోకు గాడు”, "గుద్ద", “పియ్య” వంటి అసభ్య పదాలను వీడియోలో తరచుగా ఉపయోగించడం. మ్యూజిక్‌లో లేదా స్టాండ్ అప్ కామెడీ వీడియో కంటెంట్‌లో ఉపయోగించే దాదాపు అసభ్య పదజాలం అంతా ఇందులో పరిగణించబడుతుంది.

నిర్వచనాలు:

  • “సెన్సార్ చేసిన అసభ్య పదజాలం”, పదాన్ని బ్లీప్ లేదా మ్యూట్ చేయడం, అలాగే రాసి ఉన్న పదాలను నల్లని బార్‌లు, చిహ్నాలు, లేదా పోస్ట్-ప్రొడక్షన్‌లో జోడించిన టెక్స్ట్‌తో కప్పివేయడం వంటి వాటిని సూచిస్తుంది.
  • “సంక్షిప్తీకరించిన అసభ్య పదజాలం” అంటే MG (“మొ* గూ*”) వంటి సంక్షిప్త పదాన్ని సూచించడం, ఇలాంటప్పుడు ఒరిజినల్ పదానికి బదులుగా దాని సంక్షిప్త పదాలు ఉపయోగించబడతాయి.

ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయం పరిమితంగా రావచ్చు లేదా అసలు ఆదాయమే రాకపోవచ్చు

మొదటి 7 సెకన్లలో తీవ్రమైన అసభ్య పదజాలాన్ని (దెం* వంటిది) ఉపయోగించడం, లేదా కొద్దిపాటి అసభ్య పదజాలాన్ని (“పియ్య” వంటిది) టైటిల్ లేదా థంబ్‌నెయిల్‌లో ఉపయోగించడం.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

  • వీడియో అంతటా అసభ్య పదజాలాన్ని ప్రధానంగా ఉపయోగించడం (చాలా వాక్యాలలో అసభ్య పదజాలం ఉపయోగించడం వంటివి).
  • మ్యూజిక్ టైటిల్‌లో లేదా థంబ్‌నెయిల్‌లో లేదా స్టాండ్ అప్ కామెడీ కంటెంట్‌లో అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం.

ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

థంబ్‌నెయిల్స్‌లో లేదా టైటిల్స్‌లో తీవ్రమైన అసభ్య పదజాలాన్ని (దెం* వంటిది) ఉపయోగించడం. వీడియో, థంబ్‌నెయిల్‌లో లేదా టైటిల్‌లో "మా*గోడు" లేదా "హో*" వంటి ద్వేషపూరిత భాష లేదా దూషణలు ఉన్న ఏదైనా అత్యంత అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం.

ద్వేషపూరిత భాషకు లేదా దూషణలకు సంబంధించి అదనపు సమాచారం కోసం, మా సహాయ కేంద్రంలో ఉన్న ద్వేషపూరిత, అవమానకరమైన కంటెంట్‌కు సంబంధించిన మా గైడ్‌లైన్స్‌ను కూడా చూడవచ్చు.

పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్

యాడ్‌ల గైడెన్స్ లైంగిక భావనలను సూచించే కంటెంట్ నగ్నత్వం ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు

ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

లైంగిక కోరికలను ప్రేరేపించని టాపిక్‌లు (గైనకాలజిస్ట్‌ను సంప్రదించే కథాంశం వంటివి).

సాధారణ శృంగార సన్నివేశాలు (పాత్రల మధ్య ఆప్యాయతతో కూడిన ముద్దు సన్నివేశాల వంటివి).

అసభ్యకరమైన లేదా అశ్లీల పదాలు లేకుండా లైంగిక జోకులు, పరోక్ష లైంగిక కామెంట్‌లను ఉపయోగించినప్పుడు (లైంగిక చర్యలను చేతులతో హాస్యాస్పదంగా అనుకరించడం వంటివి).

దుస్తులు లేని శరీరాలను పూర్తిగా సెన్సార్ చేసి, అస్పష్టంగా చూపినప్పుడు.

పూల్ వంటి అనుచితం కాని ప్రదేశాలలో తక్కువ దుస్తులను వేసుకొని లైంగిక ప్రేరేపణలు కలిగించకుండా చూపే కంటెంట్ (కథనంలో భాగంగా గేమ్‌లోని పాత్రలు బికినీలు వేసుకొని స్విమ్మింగ్ చేయడం వంటివి).

నగ్నత్వంపై ఫోకస్ చేయకుండా, పూర్తిగా సెన్సార్ చేసి చూపినప్పుడు (దుస్తులు లేకుండా ఉన్న శరీర భాగాలను పూర్తిగా సెన్సార్ చేయడం వంటివి).

శృంగార చేష్టలు లేదా ముద్దు పెట్టుకోవడం; సంభోగాన్ని గురించిన ప్రస్తావన లేకుండా, శృంగార బంధాలను గురించి లేదా లైంగికతను గురించి సాగే చర్చలు; అస్పష్టమైన అలాగే ప్రేక్షకులను ప్రేరేపించే ఉద్దేశం లేకుండా పూర్తిగా సెన్సార్ చేయబడిన నగ్నత్వం; సన్నివేశంలో బిడ్డ కూడా ఉండి, తల్లిపాలు ఇచ్చేటప్పుడు చూపబడే నగ్నత్వం; లైంగిక అంశాలను స్పష్టంగా చూపని లైంగిక విద్య; ఇష్టంగా లేదా ఆకర్షణీయంగా కనిపించే ప్రయత్నంలో లైంగిక సంబంధిత శరీర భాగాల లయబద్ధమైన కదలికలతో కూడిన డ్యాన్స్, అయితే అది లైంగికంగా స్పష్టంగా ఉండకూడదు; ప్రొఫెషనల్ సెట్టింగ్‌లో ప్రదర్శించిన లైంగికంగా స్పష్టంగా చూపే డ్యాన్స్, కొరియోగ్రాఫ్ చేసిన డ్యాన్స్ లేదా మ్యూజిక్ వీడియో వంటివి.

ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయం పరిమితంగా రావచ్చు లేదా అసలు ఆదాయమే రాకపోవచ్చు

కురచ దుస్తులను ధరించి డ్యాన్స్ స్టూడియో లేదా లైవ్ ఈవెంట్‌ల్లో నిపుణుల పర్యవేక్షణలో శృంగారభరితంగా డ్యాన్స్ చేయడం (రెచ్చగొట్టే డ్యాన్స్‌ల వంటివి).

ఏదీ కాదు.

సంభోగాన్ని ప్రదర్శించే క్లాసిక్ ఆర్ట్ (లైంగిక చర్యకు సంబంధించిన ఫోటో) లేదా థంబ్‌నెయిల్స్‌లో జననేంద్రియాలను ఫోకస్ చేసి చూపించడం; యానిమేట్ చేసిన లైంగిక చర్యలు కలిగి ఉన్న లైంగిక ప్రేరేపణలు కలిగించని విధంగా ఉన్న లైంగిక విద్య; లైంగికపరమైన థీమ్‌లను కలిగిన ప్రాంక్‌లు; కురచ దుస్తులను ధరించి డ్యాన్స్ చేయడం; డ్యాన్స్‌లో లైంగిక శరీర భాగాలను ఉద్దేశపూర్వకంగా తాకడం లేదా తదేకంగా ఫోకస్ చేయడం.

ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

లైంగిక చర్యలు లేదా లైంగిక శరీర ద్రవాలు కనిపించినప్పుడు.

కథాంశంలో భాగంగా (అది క్విక్ స్టాప్/టాస్క్ అయినా కూడా) లైంగిక సంబంధమైన వినోదం (స్ట్రిప్ క్లబ్‌ల వంటివి) కలిగి ఉండే గేమ్ కథనం.

లైంగిక కోరికల గురించి చూపినప్పుడు లేదా చర్చించినప్పుడు.

“hot s3x” (ఉద్దేశపూర్వకంగా అక్షర దోషాలను ఉంచడంతో సహా) లేదా “JERK OFF compilation” వంటి అందరికీ తగని, అసభ్యమైన టైటిల్స్ లేదా థంబ్‌నెయిల్స్.

వీడియోలో పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్ ఏదీ ఉండకపోయినా, ఉందని తప్పుదారి పట్టించే మెటాడేటా (లైంగిక చర్యలు ఉంటాయని హామీని టైటిల్ కలిగి ఉండటం వంటివి) ఉన్నప్పుడు.

అత్యంత లైంగికంగా అనిపించే టైటిల్స్ లేదా థంబ్‌నెయిల్స్ (“18+,” “పెద్దలకు మాత్రమే” వంటివి).

పెద్దవారిని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన లైంగికపరమైన వీడియో గేమ్‌లు లేదా ప్రేక్షకుల్లో లైంగిక ప్రేరేపణలను కలిగించాలనే లేదా సంతోషపెట్టాలనే ఉద్దేశంతో వీడియో గేమ్ పాత్రలను లైంగికంగా చూపినప్పుడు.

అసభ్యకరమైన పదాలతో సహా అశ్లీలమైన భాషను (గేమ్ ఆడే విధానంలో లం* వంటి పదాన్ని పూర్తిగా ఉచ్చరించడం లేదా పలకడం వంటివి) ఉపయోగించినప్పుడు.

వినియోగంలో లేని శృంగార ఉపకరణాలు లేదా భావప్రాప్తిని పెంచే అలాంటి ప్రోడక్ట్‌లు (గేమ్ ఐటెమ్‌లు లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించడం వంటివి) వినియోగించినప్పుడు.

పరోక్ష లైంగిక చర్యలు (దుప్పట్లలో కదలికలు) లేదా లైంగిక చర్యల సౌండ్‌లు (లైంగిక సంపర్క సమయంలో వచ్చే శబ్దాల వంటివి).

గేమ్ ఆడే విధానంలో వివరణాత్మకంగా లైంగిక టాపిక్‌లను ప్రస్తావించినప్పుడు (హస్త ప్రయోగం లేదా గేమ్‌లోని ఒక పాత్ర లేదా సన్నివేశం ఆధారంగా లైంగిక టాపిక్‌ను వివరించడం వంటివి).

లైంగిక శరీర భాగాలు పూర్తిగా కనిపించినప్పుడు (జననేంద్రియాలు స్పష్టంగా కనిపించడం వంటివి).

పిక్సెలేట్ లేదా సెన్సార్ చేసినప్పటికీ, లైంగిక శరీర భాగాలను గుర్తించగలిగేలా ఉన్న నగ్నత్వం (నగ్నంగా ఉన్న సన్నివేశాలలో, ఆ శరీరాలను స్టార్ లేదా బ్లర్ చేసినప్పటికీ, వాటి నీడల ఆధారంగా గుర్తించదగినవిగా ఉన్న సన్నివేశాల వంటివి).

ప్రేక్షకులను లైంగికంగా ప్రేరేపించే ఉద్దేశ్యంతో వక్షోజాల మధ్య గల భాగాన్ని లేదా ఒంపులను పదే పదే చూపుతూ లేదా ఫోకస్ చేస్తూ లైంగిక శరీర భాగాలను చూపినప్పుడు (గేమ్‌లోని పాత్రల వక్షోజాలను లేదా జననేంద్రియాలను దగ్గరగా చూపడం వంటివి).

లైంగిక శరీర భాగాలను తక్కువగా కప్పి లేదా పూర్తి నగ్నత్వాన్ని బహిర్గతం చేసి చూపడం; చిన్నారి కనిపించకుండా స్తన్యమిచ్చే సమయాలకు సంబంధించిన నగ్నత్వాన్ని కలిగిన సన్నివేశం; లైంగిక చర్యలు (బ్లర్ చేసి చూపినా లేదా పరోక్షంగా అర్థమయ్యేలా చూపినా), లైంగిక కోరికలు, చిట్కాలు, అనుభవాల వంటి లైంగిక టాపిక్‌ల గురించి చర్చించడం; లైంగిక కంటెంట్ కలిగిన వీడియో థంబ్‌నెయిల్ (టెక్స్ట్‌లు లేదా లింక్‌లతో సహా); రెచ్చగొట్టే డ్యాన్స్‌లు లేదా హావభావాలు కలిగిన లైంగికంగా ప్రేరేపించే సన్నివేశాలు; శృంగార ఉపకరణాలు లేదా పరికరాలను చూపడం; లైంగిక రంగం, అందులో పని చేసే వారికి సంబంధించిన కంటెంట్; జననేంద్రియాలు లేదా సంపర్క సన్నివేశాలను ఫీచర్ చేసే జంతువుల లైంగికత; డ్యాన్స్‌లో లైంగిక కదలికలను లేదా చర్యలను అనుకరించడం లేదా సిమ్యులేట్ చేయడం; ప్రేక్షకులను లైంగికంగా ప్రేరేపించే ఉద్దేశంతో ఉన్న శృంగారభరితమైన డ్యాన్స్‌లను స్పష్టంగా చూపడం.

హింస

యాడ్‌ల గైడెన్స్ గేమ్‌లలో హింస ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు

ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

హింసను స్పష్టంగా చూపకుండా ఫీచర్ చేసే గేమ్ ఆడే విధానం. స్పష్టంగా చూపని గేమ్ ఆడే విధానం కింది వాటిని కలిగి ఉంటుంది:

  • వీడియోలోని మొదటి 15 సెకన్ల వెలుపల స్పష్టంగా చూపే సన్నివేశాలు ఉంచడం (ఒక వ్యక్తిపై తీవ్రంగా దాడి చేయడం వంటివి).

హింసను స్పష్టంగా చూపే సెన్సార్ చేసిన క్లిప్‌లు (హత్య జరుగుతున్న క్షణం లేదా బ్లర్ చేయబడిన తలను నరికే సీన్ వంటివి).

స్పష్టంగా చూపే హింసను కలిగి లేని సాధారణ గేమ్ ఆడే విధానం (స్పష్టంగా చూపే హింసకు నిర్వచనం కోసం కింద ఉన్న “ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయం పరిమితంగా రావచ్చు లేదా అసలు ఆదాయమే రాకపోవచ్చు” విభాగాన్ని చూడండి).

అవాస్తవికమైన, సరదాగా ఉండే, అలాగే అన్ని వయస్సుల వారికి ఆమోదయోగ్యమైన హింస (రాకాసుల నుండి పారిపోవడాన్ని చూపించే ఫ్యామిలీ-ఫ్రెండ్లీ వీడియో గేమ్‌ల వంటివి).
పోలీసులు, ఇతర సాయుధ దళాలు తరచుగా చేపట్టే చర్యలు (బలవంతంగా అరెస్ట్ చేయడం, గుంపును కంట్రోల్ చేయడం, అధికారితో వివాదం, బలవంతంగా ప్రవేశించడం); ఎడిట్ చేయని గేమ్ ఆడే విధానాన్ని వివరించే వీడియోలో భాగంగా ఏర్పడిన హింస; తక్కువ రక్తాన్ని చూపే స్వల్ప హింస; పూర్తిగా సెన్సార్ చేయబడిన, బ్లర్ చేసి అస్పష్టంగా చూపిన, ఖననం చేయడానికి సిద్ధం చేయబడిన లేదా విద్యా సంబంధ వీడియోలో భాగంగా యుద్ధాల వంటి చారిత్రక సంఘటనలలో చూపబడిన మృత దేహాలు.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయం పరిమితంగా రావచ్చు లేదా అసలు ఆదాయమే రాకపోవచ్చు

థంబ్‌నెయిల్‌లో లేదా వీడియోలోని మొదటి 8 నుండి 15 సెకన్లలో గ్రాఫిక్ గేమ్ హింస.

  • “గేమ్‌లో స్పష్టంగా హింసను చూపడం”లో క్రూరమైన హత్యలు లేదా శరీర ద్రవాలు అలాగే భాగాలపై ఫోకస్ చేసే తీవ్రమైన గాయాలు ఉంటాయి, ఉదాహరణకు తలను నరకడం అలాగే అవయవాల నరికివేత వంటివి ఉంటాయి.
కనబడే గాయాల వంటి పోలీసుల లేదా ఇతర సాయుధ దళాల చర్యలలో జరిగే హింసను స్పష్టంగా చూపడం; విద్యాపరమైన లేదా డాక్యుమెంటరీ సందర్భాలలో భాగంగా (చరిత్ర గురించి తెలిపే ఛానెల్ వంటివి), స్పష్టమైన గాయాలు ఉన్న లేదా దారుణమైన స్థితిలో ఉన్న మృతదేహాలను చూపినప్పుడు; థంబ్‌నెయిల్‌లో లేదా కంటెంట్‌లో ముందుగా గేమ్‌లోని హింసను స్పష్టంగా చూపడం; గాయాలు లేకుండా ఏదైనా సాయుధ పోరాట ఫుటేజ్‌ను ప్రాసెస్ చేయకుండా చూపినప్పుడు; విషాదాలను స్పష్టంగా వివరాలతో చూపడం; తీవ్రమైన, షాక్‌కు గురి చేసే గాయాలను నాటకీకరించి చూపినప్పుడు.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

షాక్‌కు గురి చేసే అనుభవాన్ని క్రియేట్ చేయడానికి రూపొందించబడిన ‘గేమ్ ఆడే విధానం‘ మీద ఫోకస్ చేయడం. ఉదాహరణలలో ఇవి ఉంటాయి:

  • సామూహిక హత్యల కోసం గేమ్‌కు సంబంధం లేని పాత్రలను అగ్రిగేట్ చేయడం.

థంబ్‌నెయిల్‌లో లేదా వీడియోలోని మొదటి ఏడు సెకన్లలో గేమ్‌లో స్పష్టంగా హింసను చూపడం.

  • “గేమ్‌లో హింసను స్పష్టంగా చూపడం”లో శరీర ద్రవాలు మరియు/లేదా దీర్ఘకాలంగా లేదా తీవ్రమైన నొప్పితో కూడిన భాగాలపై ఫోకస్ చేసే తీవ్రమైన గాయాలు (తలను నరకడం అలాగే అవయవాల నరికివేత వంటివి) ఉంటాయి.

లైంగిక హింసను చూపే గేమ్ ఆడే విధానాన్ని వివరించే వీడియో (గేమ్‌లోని పాత్ర యొక్క బాధ కనిపించేలా లైంగికంగా వేధించడం వంటివి).

ప్రత్యేక హక్కులు గల గ్రూప్‌ను టర్గెట్ చేసుకుని విద్వేషం లేదా హింస వలన ప్రేరేపించబడిన హింసను చూపించే 'గేమ్ ఆడే విధానాన్ని వివరించే వీడియో' (ద్వేషాభిప్రాయంతో నిర్దిష్ట మతానికి చెందిన గ్రూప్‌ను చంపడం వంటివి).

హింసను స్పష్టంగా చూపే 'గేమ్ ఆడే విధానాన్ని వివరించే వీడియో'.

మైనర్‌ల పట్ల జరిగే హింసను స్పష్టంగా చూపే గేమ్ ఆడే విధానాన్ని వివరించే వీడియో (గేమ్‌లో మైనర్ పాత్రను కొట్టడం వంటివి).

నిజ జీవితంలోని వ్యక్తుల పేర్లు కలిగిన పాత్రలపై జరిగే హింసను స్పష్టంగా చూపే గేమ్ ఆడే విధానాన్ని వివరించే వీడియో (సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి పేరు కలిగిన పాత్రను చంపడం వంటివి).

విద్యతో సంబంధం లేని వీడియోలో మృతదేహాన్ని స్పష్టంగా చూపడం; నిషేధించబడిన థీమ్‌లను ఫీచర్ చేసే గేమ్ ఆడే విధానాన్ని వివరించే వీడియో (లైంగిక వేధింపు వంటివి).

అత్యంత తీవ్రమైన హింసను స్పష్టంగా చూపే చర్యలను (వీటిలో చట్టాన్ని అమలు చేయవలసిన అవసరం వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి), గాయాలను కలిగి ఉండటం.

హింసను ప్రేరేపించడం లేదా దాని గురించి గొప్పగా చెప్పడం.

వివాదాస్పదమైన సమస్యలు

యాడ్‌ల గైడెన్స్ వివాదాస్పదమైన సమస్యలు ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు

ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

'యాడ్‌లు లేవు' నిలువు వరుసలో లిస్ట్ చేసిన టాపిక్‌లు లేదా ఈవెంట్‌లలో వేటికైనా ఇచ్చే, క్లూపంగా ఉన్న, గ్రాఫిక్ కాని వివరణాత్మకమైన రెఫరెన్స్‌లు.

  • వీడియో గేమ్ సందర్భంలో “ఆత్మహత్య” అనే పదాన్ని వినియోగించడం (గేమ్‌ను మళ్లీ ప్రారంభించేందుకు గేమ్ పాత్రను చంపడం).
  • “నన్ను నేను చంపుకోబోతున్నాను" అని చెప్పే పాత్రలు లేదా గేమర్స్.

వివాదాస్పద టాపిక్‌లను నివారించడానికి సంబంధించిన కంటెంట్. ఎటువంటి స్పష్టంగా చూపే దృశ్యాలు లేదా వివరణ లేకుండా వీడియోలో వివాదాస్పద టాపిక్‌ల గురించి తాత్కాలికంగా ప్రస్తావించిన కంటెంట్. గృహ హింస, స్వీయ హాని, పెద్దల లైంగిక హింస, గర్భస్రావం, లైంగిక వేధింపులకు సంబంధించిన ఎటువంటి స్పష్టంగా చూపే దృశ్యాలు, వివరణ లేని కంటెంట్.

ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయం పరిమితంగా రావచ్చు లేదా అసలు ఆదాయమే రాకపోవచ్చు

పిల్లలపై హింస మినహా కంటెంట్ లేదా థంబ్‌నెయిల్‌లోని వివాదాస్పద టాపిక్‌ల గ్రాఫిక్ వర్ణనలు లేదా వివరణలు.

  • థంబ్‌నెయిల్‌లో, ఎవరినైనా తంతున్న ఇమేజ్.
దృశ్యపరంగా అంతరాయం కలిగించినప్పటికీ వివరణాత్మక భాషను కలిగి ఉండే వివాదాస్పద టాపిక్‌లకు సంబంధించిన కంటెంట్. వివాదాస్పదమైన టాపిక్‌లకు సంబంధించిన ఆర్ట్, డాక్యుమెంటరీ, లేదా సైన్స్ సంబంధిత ప్రెజెంటేషన్‌లు. పిల్లలపై హింసకు సంబంధించిన ఎటువంటి స్పష్టంగా చూపే దృశ్యాలు, వివరణ లేని ప్రధాన టాపిక్. పెద్దల లైంగిక హింస, లైంగిక వేధింపులు, లేదా గృహ హింసకు సంబంధించి ఎటువంటి స్పష్టంగా చూపే దృశ్యాలు లేకుండా, వివరణను కలిగి ఉన్న కంటెంట్.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

వివాదాస్పద టాపిక్‌లకు సంబంధించిన అంశాలను స్పష్టంగా చూపడం లేదా వివరణాత్మకంగా చెప్పడం (రక్తంతో కూడిన గాయం వంటివి) లేదా వివరణాత్మకంగా ప్రదర్శించడం.

  • పిల్లలపై దురాగతం
  • పిల్లల పట్ల లైంగిక ఆకర్షణ
  • బాల్య వివాహం
  • స్వీయ హాని
  • ఆత్మహత్య
  • గృహ హింస
  • రోగిని నొప్పిలేకుండా చంపడం

గేమ్‌లో పాత్ర స్వీయ హానికి పాల్పడి, తన చేతి మణికట్టుపై తానే కోసుకొని, రక్తస్రావం వలన మరణించినట్లు చూపించడం.

కంటెంట్‌లో గాని, టైటిల్‌లో గాని, లేదా థంబ్‌నెయిల్‌లో గాని వివాదాస్పద టాపిక్‌ల గురించి ప్రచారం చేయడం లేదా గొప్పగా చెప్పడం.

  • "నా భార్యను నేను చితగ్గొట్టబోతున్నాను, ఆమెకు తగిన శాస్తి జరగాల్సిందే” లాంటి ప్రస్తావనలు.

సంచలనాత్మక రీతిలో అందించిన వివాదాస్పద టాపిక్‌ల యానిమేటెడ్ చిత్రీకరణ.

  • ఇతరులపై జులుం చలాయించే పాత్రల ప్రదర్శన.

వివాదాస్పద టాపిక్‌లు ప్రధాన అంశంగా, వాటిని స్పష్టంగా చూపే వర్ణనలు లేదా వివరణాత్మక వర్ణనలు; కింద పేర్కొన్న ఏవైనా రెఫరెన్స్‌లు లేదా సందర్భం ఉన్న కంటెంట్ ఆహారపు రుగ్మతలకు సంబంధించిన స్పష్టమైన రెఫరెన్స్‌గా పరిగణించబడుతుంది:

  • అత్యల్ప BMI లేదా బరువు.
  • మరీ బక్క పలచగా, లేదా కృశించిన శరీరాన్ని చూపడం.
  • బరువు లేదా శరీర ఆకృతికి సంబంధించిన ఇతర అంశాల ఆధారంగా అవమానించడం లేదా జులుం చలాయించడం.
  • ఆహారాన్ని అతిగా తినడం, ఆహారాన్ని దాచడం లేదా నిల్వ చేయడాన్ని సూచించడం.
  • కేలరీల లోటును చేరుకోవడానికి వ్యాయామం చేయడం.
  • వాంతి చేసుకోవడం లేదా విరోచనాల మందుల దుర్వినియోగం.
  • బరువు తగ్గడంలో ప్రోగ్రెస్‌ను చెక్ చేయడం.
  • పై ప్రవర్తనలలో దేనినైనా దాచడాన్ని సూచించేవి.

సహాయకర నిర్వచనాలు:

  • ఫోకస్ లేదా ఫోకస్ చేసి చూపడం అంటే, వీడియోలో ఏదైనా ఒక భాగంలో లేదా పూర్తి వీడియోలో ప్రధానంగా ఒక టాపిక్‌పై ఫోకస్ చేయడం జరుగుతుంది, అంటే ఆ టాపిక్‌ను పదే పదే ప్రస్తావించడం, ఫోకస్ చేయడం జరుగుతుంది. వివాదాస్పదమైన లేదా సున్నితమైన టాపిక్‌లుగా లిస్ట్ చేసిన వాటిలో ఏదైనా ఒక దాని గురించి క్లుప్తంగా చర్చించడం, యాడ్‌లు చూపకపోవడానికి కారణం కాదు. ఉదాహరణకు, వివాదాస్పదమైన లేదా సున్నితమైన టాపిక్‌ను క్లుప్తంగా ధృవీకరించడం (ఉదా. “వచ్చే వారం వీడియోలో, ఆత్మహత్యల సంఖ్య తగ్గుదల గురించి మేము చర్చిస్తాము.”) ఫోకల్‌గా కాకుండా అటువంటి టాపిక్ గురించి ప్రత్యేకించి చూపే వీడియోలో ఒక భాగం ఫోకల్‌గా పరిగణించబడుతుంది. ఫోకస్ పదాల రూపంలో ఉండకూడదు. సున్నితమైన సమస్యను ఫోకస్ చేసే ఇమేజ్ లేదా టెక్స్ట్ ఉంటే, అది కూడా ఫోకస్‌గానే పరిగణించబడుతుంది. కొన్ని ఉదాహరణలు:

    • స్వీయ హాని ఎలా చేసుకోవాలి అనే దాన్ని ప్రధానంగా చూపే వీడియో.
    • ఇతర సందర్భం లేదా కారణం ఏదీ లేకుండా కేవలం తీవ్రమైన అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపైనే పోకస్ చేసే కంటెంట్.
  • కొద్ది సమయం పాటు ప్రస్తావించబడేవి కంటెంట్‌లో ప్రధానాంశాలు కావు (అప్రధానమైనవి), వాటిలో వివాదాస్పదమైనవి లేదా సున్నితమైనవిగా లిస్ట్ చేసిన టాపిక్‌లకు సంబంధించి యధాలాపంగా వచ్చే రెఫరెన్స్‌లు ఉంటాయి. ఉదాహరణకు, వివాదాస్పదమైన లేదా సున్నితమైన టాపిక్‌ను క్లుప్తంగా ధృవీకరించడం (ఉదా. “వచ్చే వారం వీడియోలో, ఆత్మహత్యల సంఖ్య తగ్గుదల గురించి మేము చర్చిస్తాము.”) ఫోకల్‌గా కాకుండా తాత్కాలిక సూచనగా పరిగణించబడుతుంది.

మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

ఏ రకాలు వర్తిస్తాయి

మా గేమింగ్ మానిటైజేషన్ పాలసీలకు సంబంధించి ఏ రకమైన వీడియోలు సంబంధితంగా ఉంటాయి అన్నదాని గురించిన వివరాలను చూడండి.

వర్తించే వీడియో రకాలు

గేమ్‌లో కట్ సీన్‌లు లేదా సినిమాటిక్‌లు

వాస్తవ గేమ్ సమయంలో మధ్యలో చేర్చిన యానిమేట్ చేసిన సీన్‌లు కూడా మా పాలసీ గైడ్‌లైన్స్ పరిధిలోకి వస్తాయి. ఫోకస్ చేసి, స్పష్టంగా చూపే సీన్‌ను షేర్ చేయడానికి ఎడిట్ చేయడం లేదా చూసేందుకు బాగాలేని క్లిప్‌లు కలిగిన సీన్‌ల నుండి కంపైలేషన్‌లను చేయడం అన్నవి పసుపు రంగు చిహ్నానికి లోబడి ఉంటాయి.

రియాక్షన్ వీడియోలు

మీ రియాక్షన్ వీడియోలో పొందుపరిచిన ఒరిజినల్ క్లిప్‌లో మా పాలసీలను ఉల్లంఘించే సీన్‌లు ఉంటే, అది అప్పటికీ మా గైడ్‌లైన్స్, ఆంక్షల పరిధిలోకి వస్తాయి; కాబట్టి పాలసీ ఉల్లంఘనలకు కారణమైన ఆ క్లిప్ మీరు రూపొందించకపోయినా కూడా మీ వీడియోకు పసుపు రంగు చిహ్నం వస్తుంది.

సంభాషణ / వాయిస్-ఓవర్ గేమ్ ఆడే విధానం

గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్ ద్వారా కాకుండా మీరు రూపొందించిన ఆడియో(వాయిస్-ఓవర్) వీడియోలో ఉంటే అది కూడా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండాలి.

వీడియోలో చేర్చిన టెక్స్ట్‌లు లేదా గ్రాఫిక్‌లు

బ్రాండ్‌కు సురక్షితం కాని కంటెంట్ ఏదైనా టెక్స్ట్‌లో (వీడియోలో పొందుపరిచిన స్వయంగా క్రియేట్ చేసిన క్యాప్షన్‌లు, సబ్‌టైటిళ్ల వంటివి), ఆడియోలో (సిగ్నేచర్ ప్రారంభ పాట తదితరమైనవి) ఉంటే లేదా స్పష్టంగా చూపే ఇమేజ్‌లు (మీ బ్రాండ్ చిహ్నం, నినాదం తదితరమైనవి) మీ వీడియోలో చేర్చితే పసుపు రంగు చిహ్నానికి దారి తీస్తుంది.

మీ వీడియోలో క్యాప్చర్ చేయబడి, కనిపించే కామెంట్‌లు

మీ వీడియో కంటెంట్‌లో కనిపించే వీక్షకులు చేసిన కామెంట్‌లు (వేగంగా స్క్రోల్ అయ్యే కామెంట్‌లు, యూజర్ విరాళ పాప్ అప్‌లు, తదితరమైనవి) ఏదో ఒక విధంగా మీ వీడియోలో ప్రస్తావనకు వస్తే తప్ప (వీడియోలో చదివి వినిపించడం లేదా జూమ్ చేసి దాన్ని హైలైట్ చేయడం మాదిరిగా) మా రివ్యూల పరిధిలోకి రావు. అదే విధంగా, వీడియోతో అనుబంధించబడిన కామెంట్‌ల విభాగాల్లోని కంటెంట్, అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు లోబడి ఉండదు, అనుచితమైన కామెంట్‌లు మీకు కనిపిస్తే వాటిని నియంత్రించే బాధ్యత మీదే (మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి).

జూదానికి సంబంధించి గేమ్ ఆడే విధానాన్ని ఫీచర్ చేసే కంటెంట్

'ఎలా చేయాలి' వీడియోలు, ట్యుటోరియల్స్, జూదం వెబ్‌సైట్‌లకు నేరుగా తీసుకువెళ్లే లింక్‌లు (కరెన్సీ రూపంగా వర్చువల్ వస్తువులను ఉపయోగించి మ్యాచ్‌లపై బెట్టింగ్ వేయడం వంటివి) లేదా గేమ్‌లో కరెన్సీతో బెట్టింగ్ వేయడం అనేవి మా “చట్టవిరుద్ధమైన కంటెంట్” పాలసీ ఉల్లంఘనల పరిధిలోకి వస్తాయి. గేమ్ ఆడే సాధారణ సమయంలో కాకుండా ఇతర సమయంలో వర్చువల్ ఐటెమ్‌లను పొందడం కూడా పాలసీ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది (ఇది అనుబంధ ప్రోగ్రామ్‌ల వంటి క్రియేటర్ కోడ్‌లో చేర్చబడదు). YouTube యూజర్‌లు మా పాలసీ నియమాలకు కట్టుబడి ఉండాలి, అలా ఉండని ఫలితంగా వినియోగ పరిమితులు వర్తిస్తాయి. మరింత సమాచారాన్ని పేజీలో చూడండి.

ఎక్కువ నిడివి ఉన్న కంటెంట్

వీడియో నిడివి ముఖ్యమైనది, కానీ వీడియో ఉద్దేశం, సందర్భం అత్యంత ముఖ్యమైనది. వీడియోలో ఏదైనా అభ్యంతరకరమైన అంశం ఉంటే, అది అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీగా పరిగణించబడదు. ఉదాహరణకు, అటుఇటుగా ఒక గంట నిడివి ఉన్న గేమింగ్ వీడియోలోనూ ద్వేషపూరిత జాతిపరమైన దూషణల వంటివి ఉపయోగిస్తే, అది పసుపు రంగు చిహ్నానికి దారి తీస్తుంది.

ఉల్లంఘనలను ప్రధాన అంశంగా పరిగణించడం

ఉల్లంఘన అంశం ఈ కింది కేటగిరీల్లో ఒకటి అయితే దాన్ని మేము ప్రధాన అంశంగా పరిగణిస్తాము:

  • ప్రేక్షకులను షాక్‌కు గురి చేసేలా ఏదైనా ప్రస్తావించడం లేదా చూపడం (గేమ్‌లో తీవ్రమైన గాయం, అలాగే రక్తపాతంతో హింసాత్మక దాడిని అనవసరంగా జూమ్ చేసి చూపడం వంటివి).
  • హింసాత్మక అంశం వీడియోలో ప్రధాన భాగం (గేమ్‌లో తల నరకడం వంటి సీన్‌ల కంపైలేషన్ వంటివి).

అలాంటి సీన్‌లు మీ వీడియోలో చేర్చడం అనివార్యం అయినప్పుడు, మీరు స్వచ్ఛందంగా మీ వీడియోను పసుపు రంగు చిహ్నంతో మార్క్ చేయాలి.

థంబ్‌నెయిల్‌లు, టైటిల్‌లు

వీక్షకులను ఆకట్టుకోవడానికి షాక్‌కు గురి చేసే, ఉత్తేజపరిచే పదబంధాలు థంబ్‌నెయిల్‌‌లు లేదా టైటిల్స్‌లో తరచుగా చేర్చడం జరుగుతుంది. అయితే, వీడియో కంటెంట్ మాదిరిగానే థంబ్‌నెయిల్‌లు లేదా టైటిల్స్‌లో గుర్తించబడే హింసాత్మక అంశాలు కూడా పరిమిత యాడ్‌లకు లేదా అసలు ఎలాంటి యాడ్ రాకపోవడానికి దారి తీస్తుంది.

కొన్ని ఉదాహరణ థంబ్‌నెయిల్‌లలో ఇవి ఉంటాయి (ఈ లిస్ట్ అసంపూర్ణమైనది):

  • చుట్టూ గీత గీసి చూపడం లేదా ఆసక్తి కలిగించేలా చేయడం (అస్పష్టంగా కనిపించే జననేంద్రియాలను హైలైట్ చేయడం వంటివి)
  • లైంగిక చర్యలకు సంబంధించిన టెక్స్ట్ (“ఈ పాత్ర భావిప్రాప్తిని ఎలా పొందుతోందో చూడు” వంటివి)
  • అందరికీ తగని లైంగిక చర్యలు లేదా స్పష్టంగా చూపే హింస వంటి షాక్‌కు గురి చేసే ఇమేజ్‌లు

కొన్ని ఉదాహరణ టైటిల్స్‌లో ఇవి ఉంటాయి (ఈ లిస్ట్ అసంపూర్ణమైనది):

  • పూర్తి అక్షరాలతో, సెన్సార్ చేసిన లేదా ఉద్దేశపూర్వకంగా అక్షర దోషాలను ఉపయోగించిన అసభ్య పదజాలం (“వాట్ ద ఫ#%”)
  • లైంగిక కంటెంట్ ఉంటుందని హామీ ఇస్తూ తప్పుదారి పట్టించే టైటిల్స్
  • పెద్దలకు మాత్రమే అని సూచిస్తూ ఉండే టైటిల్స్ (19+ లేదా పెద్దలకు మాత్రమే వంటివి)
  • ఆకట్టుకోవడానికి టైటిల్‌లో అన్నీ క్యాపిటల్ లెటర్స్‌ను ఉపయోగించడం (“EXTREME FATALITY WINS” వంటివి)

మరింత తెలుసుకోండి

పాలసీ అప్‌డేట్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలనుకుంటున్నారా? మేము పాలసీ అప్‌డేట్‌లు చేసినప్పుడు ఈమెయిల్ అలర్ట్‌లను పొందడానికి ఇక్కడ మా YouTube కమ్యూనిటీ ఫోరమ్‌లో సబ్‌స్క్రయిబ్ చేసుకోండి. మీరు @teamyoutube లేదా @youtubecreators ద్వారా Twitterలో కూడా మమ్మల్ని ఫాలో అవ్వవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15791729574931958577
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false