YouTube క్రియేటర్ జనాభా కేటగిరీల గురించి

క్రియేటర్ & ఆర్టిస్ట్ సర్వే U.S.లో పూర్తిగా స్వచ్ఛందం, U.K., బ్రెజిల్‌కు, భారతదేశానికి చెందిన ఆర్టిస్ట్‌లు, క్రియేటర్‌ల YouTube ఛానెల్స్.

సర్వే YouTube Studio సెట్టింగ్‌ల విభాగంలో క్రియేటర్ జనాభా కేటగిరీ కింద ఉంటుంది. ప్రస్తుతం, U.S.లో మాత్రమే అందుబాటులో ఉంది., U.K., బ్రెజిల్‌కు, భారతదేశానికి చెందిన ఛానెల్ ఓనర్‌లు ఈ సెట్టింగ్‌ను ఉపయోగించవచ్చు.

మీరు YouTube Studio మొబైల్ యాప్‌లోని సెట్టింగ్‌ల విభాగంలో కూడా క్రియేటర్ జనాభా కేటగిరీని కనుగొనవచ్చు.

క్రియేటర్ జనాభా కేటగిరీలో YouTube ఆర్టిస్ట్‌లు అలాగే క్రియేటర్‌లు షేర్ చేసే డేటా, వారిని బాగా అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడుతుంది. మేము సేకరించే సమాచారం ప్రాంతం వారీగా మారుతూ ఉంటుంది, కానీ క్రియేటర్‌లు షేర్ చేయడానికి ఎంచుకుంటే, ఇప్పుడు YouTube జనాభా కేటగిరీ, గుర్తింపు సమాచారంలో భాగంగా దానిని షేర్ చేయవచ్చు.

మా సిస్టమ్‌లు అప్రయత్నంగా పక్షపాత వైఖరిని చూపించకుండా జాగ్రత్తపడటానికి, YouTube ఛానెల్స్‌కు సంబంధించిన ఈ సమాచారం మాకు సహాయపడుతుంది.

YouTube అందరినీ కలుపుకుని పోయేలా అలాగే అందరికీ ఉపయోగపడేలా ఉండాలన్నది మా ఉద్దేశం. YouTubeలోని ఛానెల్స్‌కు సంబంధించిన గుర్తింపు సమాచారం మా దగ్గర లేకపోవడం వల్ల, ప్రస్తుతం మా సిస్టమ్‌ల పరిశీలనా ప్రక్రియ ప్రాథమిక స్థాయిలోనే ఉంటోంది. నిర్దిష్ట జనాభా కేటగిరీ లేదా గుర్తింపు ఆధారంగా క్రియేటర్, ఆర్టిస్ట్ కమ్యూనిటీల ఛానెల్స్ విషయంలో మా ప్రోడక్ట్‌లు, పాలసీలు ఎలా పని చేస్తున్నాయి అనే అంశాన్ని లార్జ్ స్కేల్‌లో అధ్యయనం చేయడానికి మా దగ్గర ఏ మార్గం లేదు.

గమనిక: గుర్తింపు అనేది వ్యక్తిగతమని మాకు తెలుసు; అందువల్ల ఈ సమాచారాన్ని ఇవ్వడం అన్నది ఆప్షనల్. YouTubeలోని క్రియేటర్‌లు అలాగే ఆర్టిస్ట్‌ల ఛానెల్స్ గురించి సాధారణంగా మాకు తెలియని గుర్తింపు డేటాను ఈ సెట్టింగ్ మాకు అందిస్తుంది. సర్వేకు సంబంధించి మీ ప్రతిస్పందన సమాచారం మీ YouTube ఛానెల్‌లో స్టోర్ చేయబడుతుంది అలాగే ఇతర Google ప్రోడక్ట్‌ల ద్వారా ఉపయోగించబడదు. మీరు ఇచ్చే సమాచారం, YouTube సిస్టమ్‌లలో నిర్దిష్ట వీడియో పనితీరును లేదా నిర్దిష్ట ఛానెల్ పనితీరును ప్రభావితం చేయడానికి ఉపయోగించబడదు.

U.K. క్రియేటర్‌లందరినీ ఆహ్వానిస్తున్నాము: క్రియేటర్ జనాభా కేటగిరీ Studio సెట్టింగ్

మేము క్రియేటర్ జనాభా కేటగిరీ డేటాను ఎలా ఉపయోగిస్తాము

వివిధ కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం వహించే క్రియేటర్‌లు అలాగే ఆర్టిస్ట్‌ల ఛానెల్స్ కోసం YouTube ఎలా పని చేస్తుందో అంచనా వేయడానికి మేము ఈ సేకరించిన డేటాను ఉపయోగిస్తాము. మీరు షేర్ చేసే డేటాను మేము వీటికి ఉపయోగిస్తాము:

  • వివిధ కమ్యూనిటీలకు సంబంధించిన కంటెంట్ విషయంలో మా అల్గారిథమ్‌లు అలాగే సిస్టమ్‌లు ఎలా వ్యవహరిస్తాయో పరిశీలించడానికి
  • YouTubeలో వివిధ కమ్యూనిటీలు ఎలా ఎదుగుతున్నాయో అర్థం చేసుకోవడానికి
  • పీడించడం, విద్వేషాన్ని ప్రదర్శించడంతో పాటు దుర్వినియోగానికి అవకాశం ఉన్న తీరును గుర్తించడానికి
  • మా ప్రస్తుత ప్రోగ్రామ్‌లను, క్యాంపెయిన్లను, ఆఫర్‌లను మెరుగుపరచడానికి

నిర్దిష్ట కమ్యూనిటీలను ప్రభావితం చేసే సమస్యలను మేము, మా సిస్టమ్‌లలో కనుగొంటే, వాటిని పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నాము. ఈ ప్రయత్నాలకు సంబంధించి మేము సాధించిన పురోగతిని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాము.

మీరు మీ సమాచారాన్ని క్రియేటర్ జనాభా కేటగిరీలో షేర్ చేయడాన్ని ఎంచుకుంటే, Google LLC మీ డేటాను Google గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉంచుతుంది. మీరు షేర్ చేసే సమాచారం మీ YouTube ఛానెల్‌లో స్టోర్ చేయబడుతుంది అలాగే ఇతర Google ప్రోడక్ట్‌ల ద్వారా ఉపయోగించబడదు. మీ సమ్మతి లేకుండా ఇది పబ్లిక్ చేయబడదు లేదా అడ్వర్టయిజింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగించబడదు.

మీరు షేర్ చేసే డేటాను మేము ఎలా ఉపయోగిస్తామనే దాని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి:

వివిధ కమ్యూనిటీలకు సంబంధించిన కంటెంట్ విషయంలో మా అల్గారిథమ్‌లు అలాగే సిస్టమ్‌లు ఎలా వ్యవహరిస్తాయో పరిశీలించడానికి

వివిధ కమ్యూనిటీల నుండి వచ్చే కంటెంట్ విషయంలో మా సిస్టమ్‌లు ఎలా వ్యవహరిస్తాయో అర్థం చేసుకోవడానికి ఈ డేటా మాకు సహాయపడుతుంది.
మా ఆటోమేటిక్ సిస్టమ్‌లలో తలెత్తగల సమస్యలను మెరుగ్గా గుర్తించాలనేది మా లక్ష్యం. ఈ సిస్టమ్‌లు, అందరినీ కలుపుకుని పోయేలా పని చేస్తున్నాయని నిర్ధారించడానికి, మాకు ఏవైనా ఎర్రర్లు కనబడితే వాటిని కూడా మేము పరిష్కరించాలని భావిస్తున్నాము.

YouTubeలో వివిధ కమ్యూనిటీలు ఎలా ఎదుగుతున్నాయో అర్థం చేసుకోవడానికి

YouTubeలో వివిధ క్రియేటర్ కమ్యూనిటీలు ఎలా ఎదుగుతున్నాయో అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడటానికి కూడా ఈ డేటా ఉపయోగించబడుతుంది.

YouTubeలో వివిధ కమ్యూనిటీలు ఎలా మానిటైజ్ చేస్తాయో పరిశీలించడమనేది, వృద్ధిని మేము ఎలా అంచనా వేస్తామనే దానికి ఒక ఉదాహరణ. మా మానిటైజేషన్ సిస్టమ్‌లు ఆశించినట్లుగా పని చేయని సందర్భాల గురించి క్రియేటర్‌లు అలాగే ఆర్టిస్ట్‌ల నుండి మేము ఫీడ్‌బ్యాక్‌లో తెలుసుకున్నాము. క్రియేటర్‌లు అందరి కోసం అలాగే అన్ని రకాల కంటెంట్ కోసం మా సిస్టమ్‌లు, పాలసీలు బాగా పని చేసేలా చూసుకోవడానికి మేము కృషి చేస్తున్నాము.

పీడించడం అలాగే విద్వేషంతో సహా హాని కలిగించగల ప్రవర్తనా ధోరణులను గుర్తించడానికి

విద్వేషం అలాగే పీడించడానికి సంబంధించిన మా పాలసీలను కంటెంట్ ఉల్లంఘిస్తే, మేము దాన్ని తీసివేస్తాము. కానీ, అభ్యంతరకరమైన అలాగే బాధించే కంటెంట్ ఇంకా కామెంట్ ప్రవర్తన అనేది చాలా మంది క్రియేటర్‌లను ప్రభావితం చేస్తూనే ఉందని మేము ఫీడ్‌బ్యాక్‌లో తెలుసుకున్నాము. ఈ రకమైన ప్రవర్తన వివిధ క్రియేటర్ కమ్యూనిటీలను ఎలా ప్రభావితం చేస్తుందో ముందుగానే అర్థం చేసుకోవడంలో ఈ డేటా మాకు సహాయపడుతుంది. ఇది కాలక్రమేణా మా ఆటోమేటిక్ సిస్టమ్‌లను కూడా మెరుగుపరుస్తుంది.

మా ప్రస్తుత ప్రోగ్రామ్‌లను, క్యాంపెయిన్లను, ఆఫర్‌లను మెరుగుపరచడానికి

ప్రోగ్రామ్‌లు ఇంకా ఈవెంట్‌లకు ఆహ్వానాలను పంపించే విషయంలో మీ సమాచారాన్ని ఉపయోగించడానికి, క్రియేటర్ జనాభా కేటగిరీ కింద మీరు మాకు సమ్మతిని అందించవచ్చు. మా ప్రస్తుత ప్రోగ్రామ్‌లు, క్యాంపెయిన్‌లు, అలాగే ఆఫరింగ్‌ల గురించి బాగా అర్థం చేసుకోవడంలో ఈ సమాచారం మాకు సహాయపడవచ్చు. ఈ ఆఫరింగ్‌లలో క్రియేటర్ ఈవెంట్‌ల వంటి ప్రోగ్రామ్‌లు అలాగే ఎదుగుతున్న క్రియేటర్‌లు వృద్ధి చెందడంలో సహాయపడే ప్రోగ్రామ్‌ల వంటివి ఉంటాయి. ఫోకస్ గ్రూప్‌లు, స్వయంగా హాజరు అయ్యే ఫీడ్‌బ్యాక్ సెషన్‌లు, సర్వేలతో పాటు ఇతర రకాల రీసెర్చ్ పద్ధతులను కూడా ఉపయోగించి మేము క్రియేటర్లపై రీసెర్చ్ చేస్తాము. ఈ చర్య ద్వారా, క్రియేటర్‌ల అభిప్రాయాలను మేము మా ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ టీమ్‌ల దృష్టికి తీసుకురాగలము. YouTubeలోని కమ్యూనిటీల భిన్నత్వాన్ని ప్రతిబింబించే మరింత మంది క్రియేటర్‌లకు రీసెర్చ్ ఆహ్వానాలను పంపించడానికి, క్రియేటర్ జనాభా కేటగిరీ నుండి వచ్చే సమాచారం మాకు వీలు కల్పిస్తుంది.

మీ ప్రతిస్పందన సమాచారాన్ని ఎడిట్ చేయడానికి లేదా తొలగించడానికి ఆప్షన్

మీ ప్రతిస్పందన సమాచారాన్ని ఎలా తొలగించాలి అనే దాని గురించి సూచనల కోసం దిగువున చదవండి. మీరు షేర్ చేసే సమాచారాన్ని 45 రోజుల వ్యవధిలో ఒకసారి ఎడిట్ చేయవచ్చు. మీరు సమాచారాన్ని పంపడానికి మళ్లీ ట్రై చేయగల తదుపరి తేదీ Studioలో చూపబడుతుంది. మీ ప్రతిస్పందనలను పూర్తిగా తొలగించడం ఎల్లప్పుడూ సాధ్యమే.

గమనిక: మీరు ఈ సమాచారాన్ని ఎడిట్ చేయాలని లేదా తొలగించాలని నిర్ణయించుకుంటే, ఆ నిర్ణయం YouTubeలో మీ కంటెంట్ పనితీరును ప్రభావితం చేయదు.

YouTube Studioలో క్రియేటర్ జనాభా కేటగిరీ ప్రతిస్పందనలను ఎడిట్ చేయండి:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపున, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. క్రియేటర్ జనాభా కేటగిరీ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. సర్వేని ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. మీ ప్రతిస్పందనలను ఎడిట్ చేయండి.
  6. సమర్పించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

YouTube Studio యాప్‌లో క్రియేటర్ జనాభా కేటగిరీ ప్రతిస్పందనలను ఎడిట్ చేయండి:

  1. YouTube Studio app ను తెరవండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  3. మెనూలో సెట్టింగ్‌ల ను ట్యాప్ చేయండి.
  4. ఛానెల్ కింద ఉన్న, క్రియేటర్ జనాభా కేటగిరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. సర్వేని ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  6. మీ ప్రతిస్పందనలను ఎడిట్ చేయండి.
  7. సమర్పించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

YouTube Studioలో క్రియేటర్ జనాభా కేటగిరీ ప్రతిస్పందనలను తొలగించండి:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపున, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. క్రియేటర్ జనాభా కేటగిరీ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. డేటాను తొలగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. నిర్ధారణ విండో పాప్-అప్ అయినప్పుడు తొలగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

YouTube Studio యాప్‌లో క్రియేటర్ జనాభా కేటగిరీ ప్రతిస్పందనలను తొలగించండి:

  1. YouTube Studio app ను తెరవండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  3. మెనూలో సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఛానెల్ కింద, క్రియేటర్ జనాభా కేటగిరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. డేటాను తొలగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  6. నిర్ధారణ విండో పాప్-అప్ అయినప్పుడు తొలగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

క్రియేటర్ జనాభా కేటగిరీ ప్రతిస్పందనలను డౌన్‌లోడ్ చేయండి:

మీ క్రియేటర్ జనాభా కేటగిరీ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి, ఈ సూచనలను ఫాలో అవ్వండి. మీ YouTube ఛానెల్ లేదా ఛానెల్స్‌కు సంబంధించిన డేటాను మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, తప్పనిసరిగా మీ వ్యక్తిగత Google ఖాతాతో సైన్ ఇన్ చేయాలి, బ్రాండ్ ఖాతాతో కాదు.

క్రియేటర్ జనాభా కేటగిరీ గురించి మరింత తెలుసుకోండి

ఈ సెట్టింగ్‌ను నేను ఎప్పుడు ఉపయోగించగలను?

మేము 2021లో U.S.లోని ఆర్టిస్ట్‌లు అలాగే క్రియేటర్‌ల కోసం క్రియేటర్, ఆర్టిస్ట్ జనాభా కేటగిరీ సర్వేను రూపొందించాము, జూలై 2023లో U.K.కి, సెప్టెంబర్ 2023లో బ్రెజిల్‌కు, అలాగే ఇప్పుడు భారతదేశానికి విస్తరించాము. ఈ ప్రశ్నలను ఇప్పుడు కంప్యూటర్‌లో మీ YouTube Studio సెట్టింగ్‌ల విభాగంలోని క్రియేటర్ జనాభా కేటగిరీ కింద కనుగొనవచ్చు.

మీరు ఈ సెట్టింగ్‌కు వెళ్లాలనుకుంటే, మీరు తప్పనిసరిగా ఛానెల్ ఓనర్ అయి ఉండాలి. మీరు బ్రాండ్ ఖాతాను ఉపయోగిస్తున్నట్లయితే, మీరు ప్రధాన ఓనర్ అయి ఉండాలి. మీరు YouTube ఛానెల్ అనుమతులను ఉపయోగిస్తున్నట్లయితే, మీరు ఓనర్ అయి ఉండాలి.

మీరు ఈ సెట్టింగ్‌ను ఇతర దేశాలు లేదా ప్రాంతాలకు అలాగే మరిన్ని గుర్తింపులకు ఎప్పుడు విస్తరిస్తారు?

త్వరలో మరిన్ని దేశాలు లేదా ప్రాంతాలకు విస్తరించే ప్లాన్‌లతో, మేము 2023లో భారతదేశానికి విస్తరిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా అందరు వ్యక్తులు వారి వారి గుర్తింపులను నిర్వచించే అన్ని మార్గాలను సర్వేలో ఉన్న కేటగిరీలు, ఎంపికలు ప్రతిబింబించవని మాకు తెలుసు. మేము భవిష్యత్తులో ఈ కేటగిరీలు అలాగే ఎంపికలను విస్తరించాలని చూస్తున్నాము.

క్రియేటర్‌లు అలాగే వీక్షకులు అందరికీ అనుభవాన్ని మెరుగుపరచడంలో మాకు సహాయపడటానికి చేస్తున్న ఇతర ప్రయత్నాలకు ఈ సెట్టింగ్ అదనంగా ఉంటుంది. ఉదాహరణకు, ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేయడానికి అలాగే YouTubeలో ప్రతి ఒక్కరూ కలుపుకుని పోయే అనుభవాన్ని ఖచ్చితంగా పొందేలా చేయడంలో సహాయపడటానికి, వైకల్యాలు ఉన్న వీక్షకులు అలాగే క్రియేటర్‌లతో YouTube కలిసి కృషి చేస్తూనే ఉంటుంది.

క్రియేటర్ జనాభా కేటగిరీలోని ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలా?

లేదు, మీరు క్రియేటర్ జనాభా కేటగిరీని పూరించాలని నిర్ణయించుకుంటే, ప్రతి ప్రశ్న ఆప్షనల్‌గానే ఉంటుంది. మీరు కొన్ని ప్రశ్నలను ఖాళీగా వదిలివేయవచ్చు లేదా “సమాధానం చెప్పదలచుకోలేదు” అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

ఈ సెట్టింగ్ నా ఛానెల్ పనితీరును ప్రభావితం చేస్తుందా?

మీరు షేర్ చేసే సమాచారం, YouTube సిస్టమ్‌లలో నిర్దిష్ట కంటెంట్ పనితీరును ప్రభావం చేయడానికి ఉపయోగించబడదు.

మా సిస్టమ్‌లు యాదృచ్ఛికమైన పక్షపాత వైఖరిని చూపించకుండా మేము జాగ్రత్తపడాలనుకుంటున్నాము. క్రియేటర్ జనాభా కేటగిరీ నుండి వచ్చే డేటా, YouTubeలో భాగాలైన మా సెర్చ్, అన్వేషణ, అలాగే మానిటైజేషన్ సిస్టమ్‌ల వంటి వాటిని అంచనా వేయడానికి ఉపయోగించబడుతుంది. నిర్దిష్ట కమ్యూనిటీలను ప్రభావితం చేసే ఎర్రర్‌లను మేము కనుగొంటే, మా సిస్టమ్‌లను మరింత ఖచ్చితమైనవిగా అలాగే కలుపుకుని పోయేవిగా చేయడానికి, వాటికి సంబంధించిన ట్రైనింగ్‌ను మెరుగుపరచడంపై మేము ఫోకస్ చేస్తాము.

మీరు క్రియేటర్ జనాభా కేటగిరీ ప్రశ్నావళిని ఎలా క్రియేట్ చేశారు?

మేము పౌర హక్కులు, మానవ హక్కుల నిపుణులతో పాటు వివిధ కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం వహించే క్రియేటర్‌లతో కలిసి పని చేశాము.

నా ప్రతిస్పందనలు YouTube వెలుపల షేర్ చేయబడతాయా?

క్రియేటర్ & ఆర్టిస్ట్ సర్వేలో లేదా క్రియేటర్ జనాభా కేటగిరీ సెట్టింగ్‌లో మీరు షేర్ చేసే సమాచారం మీ YouTube ఛానెల్‌లో స్టోర్ చేయబడుతుంది అలాగే ఇతర Google ప్రోడక్ట్‌ల ద్వారా ఉపయోగించబడదు. మీ అదనపు సమ్మతి లేకుండా అది పబ్లిక్ చేయబడదు, అలాగే అడ్వర్టయిజింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగించబడదు. మేము ఈ సమాచారాన్ని అడ్వర్టయిజర్‌లకు షేర్ చేయము లేదా దీన్ని యాడ్స్ టార్గెటింగ్ కోసం ఉపయోగించము.

ప్రోగ్రామ్‌లు అలాగే ఈవెంట్‌లకు ఆహ్వానాలను పంపించే విషయంలో మీ సమాచారాన్ని ఉపయోగించడానికి మాకు సమ్మతి ఇవ్వాలా వద్దా అనేది మీరు ఎంచుకోవచ్చు. మీ ఛానెల్ లేదా కంటెంట్ హైలైట్ చేయబడటం; లేదా వర్క్‌షాప్‌లు, యూజర్ రీసెర్చ్, లేదా ఇతర క్యాంపెయిన్‌లు వీటిలో ఉండవచ్చు.

నా సమాచారాన్ని సమర్పించిన తర్వాత నేను దాన్ని అప్‌డేట్/ఎడిట్ చేయవచ్చా?

మీరు మీ క్రియేటర్ జనాభా కేటగిరీ ప్రతిస్పందనలను 45 రోజుల వ్యవధి లోపు ఒకసారి ఎడిట్ చేయవచ్చు. మీరు సమాచారాన్ని పంపడానికి మళ్లీ ట్రై చేయగల తదుపరి తేదీ Studioలో చూపబడుతుంది. మీ ప్రతిస్పందనలను పూర్తిగా తొలగించడం ఎల్లప్పుడూ సాధ్యమే.

క్రియేటర్ జనాభా కేటగిరీల ప్రతిస్పందనలను ఎడిట్ చేయండి:

  1. కంప్యూటర్‌లో YouTubeకు సైన్ ఇన్ చేయండి లేదా మీ ఛానెల్ ఓనర్ ఖాతాతో YouTube Studio యాప్‌ను ఉపయోగించండి.
  2. YouTube Studio సెట్టింగ్‌లకు వెళ్లి, క్రియేటర్ జనాభా కేటగిరీ ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • YouTube Studio యాప్‌లో, మీ ప్రొఫైల్ ఫోటో ప్రొఫైల్ను ట్యాప్ చేసి, సెట్టింగ్‌లు ను ట్యాప్ చేయడం ద్వారా క్రియేటర్ జనాభా కేటగిరీని కనుగొనండి.
  3. సర్వేను ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీ ప్రతిస్పందనలను ఎడిట్ చేయండి.
  5. సమర్పించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

క్రియేటర్ జనాభా కేటగిరీ ప్రతిస్పందనలను తొలగించండి:

  1. కంప్యూటర్‌లో YouTubeకు సైన్ ఇన్ చేయండి లేదా మీ ఛానెల్ ఓనర్ ఖాతాతో YouTube Studio యాప్‌ను ఉపయోగించండి.
  2. YouTube Studio సెట్టింగ్‌లకు వెళ్లి క్రియేటర్ జనాభా కేటగిరీ ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • YouTube Studio యాప్‌లో, మీ ప్రొఫైల్ ఫోటో ప్రొఫైల్ను ట్యాప్ చేసి, సెట్టింగ్‌లు ను ట్యాప్ చేయడం ద్వారా క్రియేటర్ జనాభా కేటగిరీని కనుగొనండి.
  3. డేటాను తొలగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. నిర్ధారణ విండో పాప్-అప్ అయినప్పుడు తొలగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

క్రియేటర్ జనాభా కేటగిరీ ప్రతిస్పందనలను డౌన్‌లోడ్ చేయండి:

మీ క్రియేటర్ జనాభా కేటగిరీ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి, ఈ సూచనలను ఫాలో అవ్వండి. మీ YouTube ఛానెల్ లేదా ఛానెల్స్‌కు సంబంధించిన డేటాను మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, తప్పనిసరిగా మీ వ్యక్తిగత Google ఖాతాతో సైన్ ఇన్ చేయాలి, బ్రాండ్ ఖాతాతో కాదు.

ఇది నా Google ఖాతాకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని మారుస్తుందా?

క్రియేటర్ & ఆర్టిస్ట్ సర్వేలో లేదా క్రియేటర్ జనాభా కేటగిరీ సెట్టింగ్‌లో మీరు షేర్ చేసే సమాచారం మీ YouTube ఛానెల్‌లో స్టోర్ చేయబడుతుంది. ఇది ఇతర Google ప్రోడక్ట్‌ల ద్వారా ఉపయోగించబడదు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15820271238361363932
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false