స్ట్రీమింగ్, వీడియో సమస్యలను పరిష్కరించండి

మీ సినిమా, షో, లేదా ఆన్-డిమాండ్ కంటెంట్ బఫరింగ్, ల్యాగ్ అవుతూ ఉంటే, లేదా సరిగ్గా ప్లే అవ్వకపోతే, మీ కంప్యూటర్‌లో లేదా మొబైల్ పరికరంలో, సమస్యలను పరిష్కరించడానికి ఈ పరిష్కారాలలో ఒక దాన్ని ట్రై చేయండి. మీ టీవీలో మీకు సమస్యలు ఉంటే, ఈ దశలను ట్రై చేయండి. ఈ పరిష్కార ప్రక్రియ దశలు చాలా వరకు ప్లేబ్యాక్ సమస్యలు, ఎర్రర్‌ల విషయంలో సహాయపడగలవు.

మీరు ఈ దశలను ట్రై చేసిన తర్వాత కూడా, మీ వీడియో ఇప్పటికీ సరిగ్గా ప్లే కాకపోతే, మీరు వేరొక సపోర్ట్ ఉన్న పరికరంలో చూడటం ద్వారా టెస్ట్ చేయవచ్చు.

మీ కంప్యూటర్‌లో వీడియో సమస్యలను పరిష్కరించండి

సాధారణ ఎర్రర్ మెసేజ్‌లకు సంబంధించిన ఉదాహరణలు:
  • క్షమించండి, ఈ వీడియోకు లైసెన్స్ జారీ చేయడంలో ఎర్రర్ ఏర్పడింది.
  • ఈ వీడియోకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
  • ఎర్రర్ ఏర్పడింది. దయచేసి తర్వాత మళ్లీ ట్రై చేయండి.
  • మా సర్వర్‌ల విషయంలో మేము సమస్యలను ఎదుర్కొంటున్నాము. దయచేసి తర్వాత మళ్లీ ట్రై చేయండి.
  • ఏదో పొరపాటు జరిగింది.

మీకు పైన పేర్కొన్న వాటిని పోలి ఉన్న ఎర్రర్ వస్తే, ఈ దశలను ట్రై చేయండి:

  • మీ కంప్యూటర్ అప్‌డేట్ అయ్యి ఉందని నిర్ధారించుకోండి.
  • మీ వెబ్ బ్రౌజర్‌ను మూసివేసి, మళ్లీ తెరవండి.
  • మీరు పలు బ్రౌజర్ ట్యాబ్‌లను తెరిచి ఉంటే, YouTube కోసం ఉపయోగిస్తున్నది మినహా చాలా వాటిని మూసివేయడానికి ట్రై చేయండి.
  • మీ బ్రౌజర్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.
  • Google Chromeను మీ బ్రౌజర్‌గా ఉపయోగించండి.
  • మీ పరికరాన్ని రీస్టార్ట్ చేయండి.

బఫరింగ్ లేదా వీడియోలను లోడ్ చేయడం విషయంలో సమస్యలను పరిష్కరించండి

Google Chromeను మీ బ్రౌజర్‌గా ఉపయోగించి మీ వీడియోను చూడటానికి ట్రై చేయండి. మీరు Chromeను ఉపయోగించలేకపోతే, లేదా ఇంకా సమస్య ఉన్నట్లయితే, కింది దశలను ట్రై చేయండి.

  1. మీ కంప్యూటర్‌లో, మీ ఇంటర్నెట్ బ్రౌజర్‌ను రిఫ్రెష్ చేయండి లేదా రీస్టార్ట్ చేయండి.
  2. మీ ఇంటర్నెట్ వేగాన్ని చెక్ చేయండి. మీరు తక్కువ వేగం గల ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉపయోగిస్తుంటే, ఇతర బ్రౌజర్‌లను, ట్యాబ్‌లను, ఇంకా యాప్‌లను మూసివేయడానికి ట్రై చేయండి. మీ మోడెమ్ లేదా రూటర్‌ను రీస్టార్ట్ చేయడాన్ని కూడా మీరు ట్రై చేయవచ్చు.
  3. మీ బ్రౌజర్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.
  4. మీ కాష్‌ను, కుక్కీలను క్లియర్ చేయడానికి ట్రై చేయండి.
  5. మీ వీడియో క్వాలిటీని తగ్గించడానికి ట్రై చేయండి.
  6. మీ పరికరాన్ని రీస్టార్ట్ చేయండి.

మీ సినిమా నిలిచిపోవడం విషయంలో సమస్యలను పరిష్కరించండి

సినిమా టైమ్‌లైన్‌లో, సినిమా మళ్లీ సాధారణంగా ప్లే అవుతుందో లేదో చూడటానికి తదుపరి రెండు సీన్‌ల కోసం ఫాస్ట్ ఫార్వర్డ్‌ను క్లిక్ చేయండి.

ఈ చర్య సహాయపడకపోతే, మీ వెబ్ బ్రౌజర్‌ను మూసివేసి, మళ్లీ తెరవడానికి ట్రై చేయండి. మీకు ఇంకా సమస్య ఉన్నట్లయితే, ఏవైనా బ్రౌజర్ అప్‌డేట్‌ల కోసం చెక్ చేయండి లేదా Chrome వంటి వేరొక సపోర్ట్ చేసే బ్రౌజర్‌ను ట్రై చేయండి. ఈ చర్యలు సహాయపడకపోతే, మీ కాష్‌ను, కుక్కీలను క్లియర్ చేయడానికి ట్రై చేయండి.

లైబ్రరీలో కొనుగోళ్లు మిస్ అవ్వడం విషయంలో సమస్యలను పరిష్కరించండి

మీరు కొనుగోలు చేసిన కంటెంట్‌ను చూడటానికి, కొనుగోలు జరిపిన వ్యక్తిగత ఖాతాకు మీరు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి. సినిమాలు లేదా షోలను చూడటానికి బ్రాండ్ ఖాతాలు సపోర్ట్ చేయవు, కాబట్టి మీ వ్యక్తిగత ఖాతాకు మీరు మారాల్సి ఉంటుంది.

మీ వ్యక్తిగత ఖాతాకు మారడానికి:

  1. YouTubeలో ఎగువ కుడి మూలన, మీ ఛానెల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో పక్కన ఉన్న, ఖాతాను మార్చండి ఆ తర్వాత ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. మీరు మేనేజ్ చేసే ఖాతాల లిస్ట్, అలాగే మీ Google ఖాతా గుర్తింపు మీకు కనిపిస్తుంది.
  3. మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతాను క్లిక్ చేయండి. మీరు ఛానెల్ లేని బ్రాండ్ ఖాతాను ఎంచుకుంటే, ఆ పేజీ కోసం ఛానెల్‌ను క్రియేట్ చేయవచ్చు.

మీ టీవీలో వీడియో సమస్యలను పరిష్కరించండి

మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేయండి

HD స్ట్రీమింగ్ కోసం కనీసం 7 Mbps కనెక్షన్ వేగం సిఫార్సు చేయబడింది. మీ కనెక్షన్ వేగాన్ని మీరు ఇక్కడ టెస్ట్ చేయవచ్చు.
టీవీ పక్కనే దీన్ని చేయాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము. మీ ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉంటే, మీ పరికరం లేదా స్మార్ట్ టీవీ మీ రూటర్ పరిధిలో ఉండేలా, అలాగే తక్కువ అంతరాయం ఉండేలా (ఉదా., లోహంతో బ్లాక్ చేయబడిన గోడలో ఉంచకపోవడం, మొదలైనవి) చూసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. ఇది కనెక్టివిటీని మెరుగుపరుస్తుందో లేదో చూడటానికి మీ పరికరాన్ని కదల్చడానికి ట్రై చేయండి. మీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడిన వేరే పరికరాలను తగ్గించడానికి కూడా మీరు ట్రై చేయవచ్చు.

మీ స్ట్రీమింగ్ క్వాలిటీని చెక్ చేయండి

క్వాలిటీని మాన్యువల్‌గా సర్దుబాటు చేయడానికి ట్రై చేయండి.
  1. వీడియో ప్లేయర్‌లో సెట్టింగ్‌లు  ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. క్వాలిటీ ని ఎంచుకుని, మాన్యువల్‌గా సర్దుబాటు చేసే ఆప్షన్ మీకు ఉందో లేదో చూడండి.

YouTube యాప్ నుండి నిష్క్రమించి, మళ్లీ తెరవండి

  1. మీ రిమోట్‌లో హోమ్ బటన్‌ను నొక్కండి.
  2. YouTube యాప్‌ను మళ్లీ తెరవండి.
  3. మీ వీడియోను మళ్లీ ప్లే చేయడానికి ట్రై చేయండి.

YouTube యాప్ నుండి సైన్ అవుట్ చేసి, మళ్లీ సైన్ ఇన్ చేయండి

  1.  YouTube యాప్‌ను తెరవండి.
  2. మీ ప్రొఫైల్‌ను మేనేజ్ చేయడానికి మీ ప్రొఫైల్ ఫోటో ను ఎంచుకోండి, ఆపై దిగువున ఉన్న చిహ్నాన్ని ఎంచుకోండి.
  3. కొనసాగించి, సైన్ అవుట్ చేయడానికి తర్వాత ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. సెట్టింగ్‌లకు తిరిగి వెళ్లి, సైన్ ఇన్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  5. మీ వీడియోను మళ్లీ ప్లే చేయడానికి ట్రై చేయండి.

మీ పరికరాన్ని రీస్టార్ట్ చేయండి

  1. మీ పరికరాన్ని పవర్ నుండి డిస్‌కనెక్ట్ చేయండి.
  2. పలు సెకన్లు వేచి ఉండండి.
  3. మీ పరికరాన్ని మళ్లీ కనెక్ట్ చేయండి.
  4. YouTube యాప్‌నకు తిరిగి వెళ్లి, మీ వీడియోను మళ్లీ ప్లే చేయడానికి ట్రై చేయండి.

మీ పరికరానికి సంబంధించిన సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి

మీ పరికర సిస్టమ్‌కు అందుబాటులో ఉన్న ఏవైనా అప్‌డేట్‌ల కోసం చెక్ చేయండి. మీ పరికర సెట్టింగ్‌లలోని సిస్టమ్ అప్‌డేట్ విభాగంలో చూసి, మీరు అప్‌డేట్‌ల కోసం చెక్ చేయవచ్చు. అప్‌డేట్ అందుబాటులో ఉంటే, సిస్టమ్‌ను అప్‌డేట్ చేయడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి, ఆపై మీ వీడియోను మళ్లీ ట్రై చేయండి.

మీకు అప్‌డేట్ చేయడంలో సమస్య ఉంటే, లేదా అనేక విభిన్న సర్వీస్‌లలో స్ట్రీమింగ్ సమస్యలు కనిపిస్తుంటే, పరిష్కార ప్రక్రియలో సహాయం కోసం మీ పరికర తయారీదారు సపోర్ట్ సైట్‌ను చెక్ చేయండి.

మీ టీవీలో టైటిల్‌ను ప్లే చేయడానికి మీరు మరొక పద్ధతిని ఉపయోగించి కూడా ట్రై చేయవచ్చు:

  • మీ వద్ద Chromecast ఉంటే, మరొక పరికరంలో ప్లే చేసి, మీ టీవీకి ప్రసారం చేయండి.
  • మీ వద్ద HDMI కేబుల్ ఉంటే, ల్యాప్‌టాప్ నుండి ప్లే చేసి, మీ టీవీకి కనెక్ట్ చేయండి.

అదేవిధంగా, అదే సమస్య కొనసాగుతుందో లేదో తెలుసుకోవడానికి మరొక పరికరంలో చూడటానికి ట్రై చేయండి.

Primetime ఛానెల్స్ కోసం మీ టీవీలో ప్రసారంలో ఆలస్యాన్ని తగ్గించండి

ప్రసారంలో ఆలస్యం అనేది కెమెరా ఈవెంట్‌ను క్యాప్చర్ చేయడం, అలాగే మీ టీవీలో మీరు చూస్తున్నప్పుడు ఈవెంట్ ప్రదర్శించబడటం మధ్య ఆలస్యం. 

ప్రసారంలో ఆలస్యం ఎంత తక్కువగా ఉంటే, వీడియో ప్లేయర్‌లో అంత తక్కువ బఫర్ ఉంటుంది. ప్రసారంలో తక్కువ ఆలస్యంతో, మీరు ప్లేబ్యాక్ అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నెట్‌వర్క్ ట్రాఫిక్, ఇతర అంశాలు కూడా లైవ్ కార్యక్రమాల షెడ్యూల్ సమస్యలను కలిగించవచ్చు, దీని వల్ల స్ట్రీమ్ ఆలస్యం కావచ్చు. మీకు అద్భుతమైన నెట్‌వర్క్ ఉన్నా కూడా ఆలస్యాలు జరగవచ్చు.

మీ టీవీలోని YouTube యాప్‌లో మీ ప్రసారంలో ఆలస్యాన్ని అప్‌డేట్ చేయండి

  1. దిగువున కుడి వైపున ఉన్న, సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. ప్రసారంలో ఆలస్యం ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. తగ్గించండి లేదా ఆటోమేటిక్ సెట్టింగ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

ప్లేబ్యాక్ అంతరాయాలను తగ్గించడానికి “ఆటోమేటిక్ సెట్టింగ్” ఉత్తమమైనది. లైవ్ స్పాయిలర్‌లను తగ్గించడానికి, “తగ్గించడమే” ఉత్తమమైనది. తక్కువ ప్లేబ్యాక్ అంతరాయాలతో ప్రసారంలో ఆలస్యం తక్కవ ఉండాలంటే, “తగ్గించే” ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఫీడ్‌బ్యాక్‌ను పంపండి

మీరు YouTube యాప్‌లో వీడియోలను చూడటంలో సమస్యల గురించి, మీ ప్రొఫైల్ చిహ్నం ఆ తర్వాత సహాయం, ఫీడ్‌బ్యాక్ ఆ తర్వాత ఫీడ్‌బ్యాక్‌ను పంపండికి వెళ్లడం ద్వారా ప్లేబ్యాక్ సమస్య గురించి నేరుగా మీ ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14185524232054090370
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false