నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

Googleలో వైద్య సమాచారం

వైద్యులచే రివ్యూ చేయబడిన వైద్య సమాచారం కోసం మీరు Googleలో సెర్చ్ చేయవచ్చు. మీరు ఈ కింది వాటి గురించి మరింత తెలుసుకోవచ్చు:
  • వ్యాధి లక్షణాలు
  • చికిత్సలు
  • వైద్య పరిస్థితులు
  • నివారణ, భద్రత
  • ఆందోళనలు

చిట్కా: వ్యాధి లక్షణాలు, చికిత్సలకు సంబంధించిన వైద్య సమాచారం కొన్ని దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అత్యంత తరచుగా వెతికిన అంశాలకు సంబంధించిన వైద్య సమాచారాన్ని మేము అందిస్తాము. ఇమేజ్‌లు సమాచారం కోసం మాత్రమే.

వైద్య సమాచారం ఎక్కడ నుండి అందించబడుతుంది

Googleలోని వైద్య సమాచారం అధిక క్వాలిటీ గల వెబ్‌సైట్‌లు, వైద్య నిపుణులు, సెర్చ్ ఫలితాల నుండి అందించబడుతుంది.
  1. మేము వెబ్ అంతటా ఉన్న అధిక క్వాలిటీ గల సైట్‌లలోని ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని కనుగొని, విశ్లేషిస్తాము.
  2. వైద్య బృందాలు సమాచారాన్ని జాగ్రత్తగా రివ్యూ చేసి, మెరుగుపరుస్తాయి. 
  3. లైసెన్స్ ఉన్న వైద్య చిత్రకారులు విజువల్స్‌ను క్రియేట్ చేస్తారు.
మీరు ఒక వ్యాధి లక్షణం గురించి సెర్చ్ చేసినట్లయితే, "ఈ సెర్చ్‌కు సంబంధించిన ఆరోగ్య పరిస్థితులు" అనే విభాగాన్ని మీరు కనుగొనవచ్చు. ఈ విభాగం, సెర్చ్ ఫలితాలు ఇంకా మా విజ్ఞాన గ్రాఫ్ నుండి అందించబడుతుంది. సందర్భోచితం కోసం ఈ ఫలితాలను మేము చెక్ చేస్తాము.
వైద్య సమాచార సోర్స్‌లు

ప్రభుత్వ సంస్థలు

  • Bundesministerium für Gesundheit (BMG - జర్మన్ ఫెడరల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ)
  • వ్యాధుల నియంత్రణ మరియు నివారణ చర్యల కేంద్రాలు (CDC)
    • 'CDC' గుర్తు, US ఆరోగ్య, మానవ సర్వీస్‌ల విభాగం (HHS) యజమాన్యంలో ఉంది, ఇది సరైన అనుమతితో ఉపయోగించబడుతుంది. ఈ లోగో ఉపయోగించడం, ఏదైనా నిర్దిష్ట ప్రోడక్ట్, సర్వీస్, లేదా ఎంటర్‌ప్రైజ్‌కు HHS లేదా CDC సమర్థనను సూచించదు.
  • ClinicalTrials.gov
  • ఆహారం మరియు ఔషధ నిర్వహణ (FDA)
  • నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (NCI)
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH)
  • నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (NLM)
  • యునైటెడ్ స్టేట్స్ సర్జన్ జనరల్
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)

భాగస్వామ్యాలు (ప్రాంతాన్ని బట్టి మారతాయి)

  • ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్, బ్రెజిల్
  • అపోలో హాస్పిటల్స్, భారతదేశం
  • క్లీవ్‌ల్యాండ్ క్లినిక్, USA
  • వైద్య శాస్త్ర కళాశాల, ఇబాడాన్ విశ్వవిద్యాలయం, నైజీరియా
  • కొలంబియా ఆసియా హాస్పిటల్స్, భారతదేశం
  • హార్వర్డ్ మెడికల్ స్కూల్ (HMS), USA
  • మాయో క్లినిక్, USA
  • మెడికల్ నోట్, జపాన్
  • మిత్రా కెలుఆర్గా హాస్పిటల్స్, ఇండోనేషియా
  • జాతీయ ఆర్యోగ్య సేవా సంస్థ
  • పవర్ టు డిసైడ్
  • పార్ట్‌నర్‌షిప్ ఫర్ డ్రగ్-ఫ్రీ కిడ్స్
  • డిసీజ్ ఆంటాలజీ డేటాబేస్
  • ట్రూవెన్ హెల్త్ ఎనలిటిక్స్
  • వాక్స్‌హెల్త్

వైద్య చిత్రకారులు

  • అలిసన్ ఇ. బర్క్
  • కాసియో లిన్
  • కేథరీన్ డెల్ఫియా
  • క్రిస్టీ క్రామ్స్
  • జెన్నిఫర్ ఇ. ఫెయిర్‌మాన్
  • లారీ ఓ కీఫ్
  • మిచెల్ గ్రాహం
  • మోలీ బోర్మన్-పుల్లెన్
  • సుమన్ కస్తూరియా
  • టాడ్ బక్

ఆరోగ్య సంరక్షణ నిపుణులను ఎప్పుడు సంప్రదించాలి

Googleలోని వైద్య సమాచారం అందరికీ వర్తించదు, ఇది వైద్యపరమైన సలహా కాదు. మీకు ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తిని లేదా సంస్థను సంప్రదించాలని నిర్ధారించుకోండి. మీకు అత్యవసర వైద్య పరిస్థితి ఉందని మీరు భావిస్తే, వెంటనే మీ వైద్యులకు లేదా మీ స్థానిక అత్యవసర నంబర్‌కు కాల్ చేయండి.

తప్పుగా ఉన్న సమాచారాన్ని రిపోర్ట్ చేయడం

మీకు Googleలోని వైద్య సమాచారంతో ఏవైనా సమస్యలు ఉంటే, మీరు ఈ విధంగా చేయవచ్చు:

  1. వైద్య సమాచారం కింద, ఫీడ్‌బ్యాక్‌ను ఎంచుకోండి.
  2. ఏ సమాచారం తప్పుగా ఉందో వివరించడానికి స్క్రీన్‌పై దశలను ఫాలో అవ్వండి.
  3. మీ ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించండి.

భవిష్యత్తులో చూపించే ఫలితాలను మెరుగుపరచడానికి, మేము మీ ఫీడ్‌బ్యాక్‌ను ఉపయోగిస్తాము.

మీ వైద్య రంగానికి చెందిన సెర్చ్‌ల గురించి Google స్టోర్ చేసే సమాచారం

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14784500866813121211
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false