నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

లైబ్రరీ ప్రాజెక్ట్‌ గురించి పరిచయం

లైబ్రరీ ప్రాజెక్ట్‌ అనేది చాలా అరుదైన, ప్రింట్‌లో లేని, లేదా సాధారణంగా లైబ్రరీలలో తప్ప బయట అందుబాటులో లేని పుస్తకాలతో సహా పలు భాషలలో రాయబడిన లక్షలాది పుస్తకాలను Googleలో వెతకడం యూజర్‌లకు సాధ్యం చేస్తుంది.

లైబ్రరీ ప్రాజెక్ట్‌లో పుస్తకాన్ని చూడండి

లైబ్రరీ ప్రాజెక్ట్ నుండి ఏదైనా పుస్తకం పబ్లిక్ డొమైన్‌లో ఉండాలని నిర్ణయించబడినట్లయితే, Google దానిని పబ్లిక్‌కు పూర్తిగా అందుబాటులోకి తెస్తుంది. మీరు ఆ పుస్తకాన్ని మొదటి నుండి చివరి వరకు చదవగలరు. Google పుస్తకాలులో పుస్తకాలను ఎలా చూడాలో తెలుసుకోండి. 

ఎలా చూడాలో తెలియనప్పటికీ, మీరు పుస్తకంలోని వచనం ఆధారంగా వెతకగలరు. కానీ, మీ శోధన పదం, పుస్తకం యొక్క వచనంలో ఎక్కడ కనిపిస్తుందో చూపించడానికి Google పుస్తకాలు ఆ వచనం యొక్క కొన్ని స్నిప్పెట్‌లను మాత్రమే డిస్‌ప్లే చేస్తుంది. కొన్ని సార్లు కాపీరైట్ ఉన్న పుస్తకాల హక్కుదారులు స్నిప్పెట్‌ల కంటే అధిక సమాచారాన్ని చూపించడానికి మాకు అనుమతి ఇస్తారు. అటువంటి సందర్భాలలో, హక్కుదారు అనుమతిని బట్టి, పుస్తకంలో కొన్ని పేజీలను, లేదా పూర్తి పుస్తకాన్ని మీరు చూడవచ్చు.

ఒక పుస్తకం ఉనికిలో ఉందని మాకు తెలిసి, అది ఇంకా స్కాన్ చేయబడనట్లయితే, మీకు లైబ్రరీ క్యాట్‌లాగ్‌లో కనిపించే విధంగా ఆ పుస్తకం గురించి ప్రాథమిక గ్రంథ సమాచారం మాత్రమే కనిపిస్తుంది. మీరు ప్రింట్ కాపీని కనుగొనాలనుకుంటే, అక్కడ మీకు అందించిన రిటైలర్‌ లేదా లైబ్రరీ లింక్‌లను ఉపయోగించండి.

Google పుస్తకాలులో పుస్తకాలు ఇలా డిస్‌ప్లే చేయబడతాయి:

లైబ్రరీలు, Googleలు కలిసి ఇలా పని చేస్తాయి:

వారి సేకరణలను Google పుస్తకాలులో చేర్చడానికి Google ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక లైబ్రరీలతో కలిసి పనిచేస్తుంది. కాపీరైట్ చట్టం అనుమతించే సందర్బాలలో పుస్తకాలను పోషకులకు అందుబాటులో ఉంచి, వాటిని భద్రపరచడానికి, లైబ్రరీలు వాటి సేకరణల నుండి తీసుకుని స్కాన్ చేసిన ప్రతి పుస్తకం యొక్క డిజిటల్ కాపీని పొందుతాయి. 

మేము కలిసి పనిచేసే అనేక లైబ్రరీలు, వాటి ఒప్పందాలను బహిరంగంగా అందుబాటులో ఉంచాయి, ఇవి Googleతో వాటి పని యొక్క పూర్తి పరిధిని చూపుతాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇంకా యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్, యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా, ది ఒహాయో స్టేట్ యూనివర్సిటీ వంటి సంస్థలు భాగంగా ఉన్న బిగ్ టెన్ అకాడమిక్ అలయన్స్ వంటివి కొన్ని ఉదాహరణలు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6221388943013434346
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false