నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

మీ పరికరాల నుండి యాప్ సమాచారాన్ని నిర్వహించండి

ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల గురించిన సమాచారాన్ని, అంటే యాప్ పేరు, వెర్షన్ లాంటివి మీ సైన్ ఇన్ చేసిన పరికరాల నుండి మీ Google ఖాతాలో సేవ్ చేసేలా ఎంచుకోవచ్చు. మీ Google అసిస్టెంట్ లేదా Google శోధనను ఉపయోగిస్తున్నప్పుడు ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లతో సులభంగా ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ డేటా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, చర్యను పూర్తి చేయడానికి ఏ యాప్‌ను ఉపయోగించాలో మీ Google అసిస్టెంట్ అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

  1. ' అసిస్టెంట్‌లో మీ డేటా' లేదా 'శోధనలో మీ డేటా' ఎంపికకు వెళ్లండి.
  2. "Google అంతటా నియంత్రణలు" దిగువన, 'మీ పరికరాల నుండి యాప్ సమాచారం'ఎంపికపై నొక్కండి.
  3. ' మీ పరికరాలలో యాప్ సమాచారం' నొక్కండి.

గమనిక: Google Play లేదా Android బ్యాకప్ లాంటి ఇతర Google సేవల ద్వారా ఇన్‌స్టాల్ చేయబడిన యాప్ సమాచారాన్ని సేవ్ చేయడంపై ఈ సెట్టింగ్ ప్రభావం చూపదు.

మీ పరికరాల నుండి యాప్ సమాచారాన్ని తొలగించండి

మీరు సెట్టింగ్‌ను ఆఫ్ చేసినప్పుడు మీ పరికరాల నుండి మీ Google ఖాతాలోకి అందించబబడిన యాప్ సమాచారం తొలగించబడుతుంది. మీ యాప్‌లు మీ పరికరాల నుండి తొలగించబడవు.

మీ పరికరాలలోని యాప్ సమాచారం మీకు ఎలా సహాయపడుతుంది

టాస్క్‌ను పూర్తి చేయడానికి ఉపయోగించాల్సిన యాప్‌ను గుర్తుపట్టడంలో Googleకు ఈ డేటా సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు "Ok Google, సంగీతం ప్లే చేయి" లాంటి విషయాలను మీ Google అసిస్టెంట్ లేదా స్మార్ట్ పరికరానికి చెప్పినప్పుడు, మీ Google అసిస్టెంట్ ఒక సంగీతం యాప్‌ను ఎంపిక చేసి, దానిని తెరవడానికి ఈ డేటా సహాయపడుతుంది.

మీ పరికరాల నుండి యాప్ సమాచారం ఎందుకు ఆన్ చేయబడింది

మీ పరికరాల సెట్టింగ్‌లో యాప్ సమాచారం ద్వారా సేవ్ చేయబడిన డేటా ఇంతకుముందు పరికర సమాచార సెట్టింగ్ ద్వారా సేవ్ చేయబడింది. మీ అనుభవాన్ని స్థిరంగా ఉంచడంలో సహాయం చేయడానికి, మీ పరికర సమాచార సెట్టింగ్ ఆన్‌లో ఉంటే, మీ పరికరాల సెట్టింగ్‌లోని యాప్ సమాచారం ఆన్‌లో ఉంటుంది. మీరు మీ పరికరాల కోసం యాప్ సమాచారాన్ని ఎప్పుడైనా ఆఫ్ చేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
Android iPhone & iPad
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11451011104903512968
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false