నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

Google Searchలో ప్రోడక్ట్ ధరలను ట్రాక్ చేయండి

ముఖ్య గమనిక: ధర ట్రాకింగ్ అనేది US, ఇంకా ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంది.

మీరు Google Searchలో "ధరను ట్రాక్ చేయండి" అనే బటన్‌ను కనుగొన్నప్పుడు, ప్రోడక్ట్ ధరను ట్రాక్ చేయవచ్చు. మీరు వెబ్‌సైట్‌లోని లేదా Google యాప్‌లోని మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉంటే, మీరు "ధరను ట్రాక్ చేయండి" అనే ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.

చిట్కాలు:

  • ధరలో గుర్తించదగిన తగ్గింపు ఉన్నప్పుడు, మీరు Google యాప్ లేదా మీ ఫోన్ నుండి నోటిఫికేషన్‌ను పొందుతారు.
  • మీరు ట్రాక్ చేసిన ప్రోడక్ట్‌లపై ఇటీవలి ధరల తగ్గింపులను వివరించే ఈమెయిల్‌ను కూడా మీరు అందుకోవచ్చు.
  • ధరలు డైనమిక్‌గా మార్పుకు లోనవుతూ ఉంటాయి.
  • ప్రోడక్ట్ కార్డ్‌ల ద్వారా మాత్రమే ధరలను ట్రాక్ చేయవచ్చు.
  • మీరు సెర్చ్ చేసిన ప్రోడక్ట్ కోసం, ప్రోడక్ట్ కార్డ్‌లు ఉండకపోవచ్చు.

ప్రోడక్ట్ ధరను ట్రాక్ చేయండి

  1. Google యాప్ లేదా మీ మొబైల్ బ్రౌజర్‌ను తెరవండి.
  2. "Google Pixel 7 Pro" వంటి నిర్దిష్ట ప్రోడక్ట్ కోసం లేదా "సెల్‌ఫోన్‌లు" వంటి ప్రోడక్ట్ కేటగిరీ కోసం సెర్చ్ చేయండి.
  3. ప్రోడక్ట్ కార్డ్ ఉన్నట్లయితే దాన్ని చూడటానికి లేదా తెరవడానికి స్క్రోల్ చేయండి.
  4. ధరను ట్రాక్ చేయండి ని ట్యాప్ చేయండి.
  5. మీరు "ధర తగ్గింపులు ఇంకా సంబంధిత కంటెంట్‌పై పుష్ నోటిఫికేషన్‌లను, ఈమెయిల్స్‌ను పొందుతారు" అని చెప్పే నిర్ధారణను మీరు పొందుతారు.

చిట్కా: మీరు సైన్ ఇన్ చేశారని, నోటిఫికేషన్‌లు ఆన్‌లో ఉన్నాయని నిర్ధారించుకోండి.

ధర ట్రాకింగ్‌ను ఆఫ్ చేయండి

  1. మీ మొబైల్ యాప్‌లో, సేవ్ చేయబడినవి ఆప్షన్‌కు వెళ్లండి.
  2. సేవ్ చేయబడిన అన్ని ఐటెమ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. పైన కుడి వైపున, ఎంచుకోండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు తీసివేయాలనుకుంటున్న ఐటెమ్‌లను ఎంచుకోండి.
  5. ఎగువున కుడి వైపున ఉన్న, తీసివేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

నోటిఫికేషన్‌లు & ఈమెయిల్ సెట్టింగ్‌లు

మొబైల్ నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి

మీ Android పరికరంలో ధరల తగ్గింపు నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడానికి:

  1. Google యాప్‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటోను లేదా ఇనిషియల్‌ను ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత నోటిఫికేషన్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. “షాపింగ్” అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

మీ iPhone లేదా iPadలో ధరల తగ్గింపు నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడానికి:

  1. Google యాప్‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటోను లేదా ఇనిషియల్‌ను ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత నోటిఫికేషన్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. “షాపింగ్” అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

ధర ట్రాకింగ్ ఈమెయిల్స్‌ను ఆఫ్ చేయండి

  1. "Googleతో షాపింగ్ చేయండి" నుండి ఏదైనా ధర ట్రాకింగ్ ఈమెయిల్‌ను తెరవండి.
  2. ఈమెయిల్‌కు కింద, సబ్‌స్క్రిప్షన్ తీసివేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి లేదా ట్యాప్ చేయండి.

యాక్టివిటీ ఆధారిత నోటిఫికేషన్‌లు

మీ Google యాక్టివిటీ ఆధారంగా, మీరు ఆసక్తి చూపిన ప్రోడక్ట్‌లపై ధరల తగ్గింపు నోటిఫికేషన్‌లను పొందవచ్చు. ఈ నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడానికి, "నోటిఫికేషన్‌లు, ఈమెయిల్ సెట్టింగ్‌లు" విభాగంలోని సూచనలను ఫాలో అవ్వండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1894074161447170736
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false