నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

మీ ఇంటర్నెట్ స్పీడ్‌ను టెస్ట్ చేయండి

 ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ అనేది మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్‌ను కొలుస్తుంది. మీ కనెక్షన్ స్పీడ్‌లో డౌన్‌లోడ్ స్పీడ్, అప్‌లోడ్ స్పీడ్ వంటివి ఉంటాయి.

ముఖ్యమైనది:ఈ ఫీచర్ కొన్ని దేశాలలోనూ, ప్రాంతాలలోనూ అందుబాటులో లేదు.

మీరు మీ ఇంటర్నెట్ డౌన్‌లోడ్, అప్‌లోడ్‌ల స్పీడ్‌లను టెస్ట్ చేయవచ్చు: 

  1. Google.comకు వెళ్లండి.
  2. ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ కోసం సెర్చ్ చేయండి.
  3. స్పీడ్ టెస్ట్‌ను రన్ చేయిని నొక్కండి లేదా క్లిక్ చేయండి

ఈ టెస్ట్‌ను రన్ చేయడానికి Google, 'Measurement Lab' (M-Lab)తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.

టెస్ట్ ఎలా పనిచేస్తుంది

టెస్ట్‌కు 30 సెకన్లు పడుతుంది. ఆ సమయంలో మీ కనెక్షన్ ద్వారా ఎంత డేటా కదలగలదో కొలవడం ద్వారా, ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్‌ను గుర్తిస్తుంది.

ముఖ్యమైనది: మీ కనెక్షన్ ఎంత స్పీడ్‌గా ఉంది, మీరు ఎక్కడ టెస్ట్ చేస్తారు అనే వాటిపై ఆధారపడి టెస్ట్ వేర్వేరు మొత్తాల్లో డేటాను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, USలో ఒక సాధారణ టెస్ట్‌కు 9.4 MB డేటాను ఉపయోగిస్తుంది, కానీ US వెలుపల ఒక టెస్ట్‌కు 4.4 MBని ఉపయోగిస్తుంది. మొబైల్ డేటా ధరలు వర్తిస్తాయి.

టెస్ట్ ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి మరింత తెలుసుకోండి.

మీ టెస్ట్ ఫలితాలను అర్థం చేసుకోండి

ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ అనేది మీ కనెక్షన్ యొక్క డౌన్‌లోడ్ స్పీడ్‌ను, అప్‌లోడ్ స్పీడ్‌ను ఇంకా ప్రతిస్పందన సమయాన్ని కొలుస్తుంది. ఉత్తమ ఇంటర్నెట్ కనెక్షన్‌లలో అధిక డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ స్పీడ్‌లు ఉంటాయి కానీ ప్రతిస్పందన సమయం తక్కువ ఉంటుంది.

  • డౌన్‌లోడ్ స్పీడ్ అంటే మీకు ఎంత వేగంగా సమాచారం పంపించగలదో చెప్పేది. పెద్ద ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడానికి లేదా పేజీలను చాలా ఫోటోలతో చూపించడానికి ఎంత సమయం పడుతుంది అనే లాంటి విషయాలను ఇది ప్రభావితం చేస్తుంది. డౌన్‌లోడ్ స్పీడ్‌ను సెకనుకు మెగాబిట్‌లలో కొలుస్తారు (Mbps). 
  • అప్‌లోడ్ స్పీడ్ అంటే మీ నుండి ఎంత వేగంగా సమాచారం పంపించగలదో చెప్పేది. సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది వంటి విషయాలను ఇది ప్రభావితం చేస్తుంది. అప్‌లోడ్ స్పీడ్‌ను సెకనుకు మెగాబిట్‌లలో కొలుస్తారు (Mbps).
  • ప్రతిస్పందన సమయం సర్వర్ నుండి మీరు ఎంత త్వరగా ప్రతిస్పందన పొందుతారనే దానిని కొలుస్తుంది. వీడియో కాల్‌లు, ఆన్‌లైన్ గేమింగ్ వంటి రియల్-టైమ్ యాప్‌లకు తక్కువ ప్రతిస్పందన సమయాలు అనేవి ముఖ్యమైనవి. ప్రతిస్పందన సమయాన్ని మిల్లీసెకన్లలో కొలుస్తారు (ms).

గమనిక: ప్రస్తుతం, టెస్ట్ 700 Mbps వరకు కనెక్షన్ స్పీడ్‌లను కొలవగలదు. మీకు 700 Mbps కన్నా ఎక్కువ కనెక్షన్ స్పీడ్ ఉంటే, మీ ఫలితాలు మీ వాస్తవ కనెక్షన్ కంటే తక్కువగా ఉండవచ్చు.

మీ టెస్ట్ ఫలితాలు ఎందుకు మారవచ్చు

మీ టెస్ట్ ఫలితాలు తక్కువ సమయంలో మారవచ్చు, అవి ఇతర ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ ఫలితాల కంటే భిన్నంగా ఉండవచ్చు. ఫలితాలు అనేక కారణాల వల్ల మారవచ్చు:

  • నెట్‌వర్క్ పరిస్థితులలో మార్పులు
  • టెస్ట్ సర్వర్‌లు ఉన్న చోట తేడాలు
  • టెస్ట్ పద్ధతుల్లో తేడాలు

M-Lab నుండి మీ ఫలితాలు ఇతర టెస్ట్ ఫలితాల కంటే ఎందుకు భిన్నంగా ఉంటాయనే దాని గురించి మరింత తెలుసుకోండి.

M-Lab‌తో Google భాగస్వామ్యం

టెస్ట్‌ను రన్ చేయడానికి, M-Labతో మీ IP అడ్రస్ షేర్ చేయబడింది, కానీ ఇతర వ్యక్తిగత సమాచారం ఏదీ షేర్ చేయబడలేదు. M-Lab మీ టెస్ట్ ఫలితాలను (మీ IP అడ్రస్‌తో సహా) వారి గ్లోబల్ ఇంటర్నెట్ పనితీరు డేటా సేకరణలో పొందుపరుస్తుంది. M-Lab ఆధునిక ఇంటర్నెట్ పరిశోధనను అందుబాటులోకి తీసుకురావడానికి, ఈ సమాచారాన్ని పబ్లిక్‌గా అందుబాటులో ఉంచుతుంది.

M-Lab గురించి మరింత తెలుసుకోండి .

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
false
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2618569724434417918
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false