నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

మీ Search హిస్టరీని మేనేజ్ చేయడం, తొలగించడం

వెబ్ & యాప్ యాక్టివిటీను ఆన్ చేసి, మీరు Googleలో సెర్చ్ చేసినప్పుడు, Google మీ Search హిస్టరీ వంటి యాక్టివిటీను మీ Google ఖాతాకు సేవ్ చేస్తుంది. వెబ్ & యాప్ యాక్టివిటీ మీ అనుభవాన్ని మరింత వ్యక్తిగతీకరించడానికి మీ ఖాతాలో లొకేషన్‌ల వంటి అనుబంధిత సమాచారంతో సహా Google సర్వీస్‌ల అంతటా మీరు చేసే పనులకు సంబంధించిన డేటాను సేవ్ చేస్తుంది. యాప్, ఇంకా కంటెంట్ సిఫార్సుల వంటి మరింత వ్యక్తిగతీకరించిన అనుభవాలను మీకు అందించడానికి మేము మీ సేవ్ చేసిన యాక్టివిటీను ఉపయోగిస్తాము.

'నా యాక్టివిటీ'లో, మీరు వీటిని చేయవచ్చు:

  • మీ Google ఖాతాకు సేవ్ చేయబడిన Search హిస్టరీని తొలగించండి.
  • Google ఏ యాక్టివిటీని సేవ్ చేస్తుందో, ఇంకా Google ఎప్పుడు మీ హిస్టరీని ఆటోమేటిక్‌గా తొలగిస్తుందో వంటి Search సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి.

మీరు మీ Google ఖాతా నుండి సైన్ అవుట్ చేయబడి ఉండగా, మీరు Google యాప్‌ను ఉపయోగించడం వంటి మీ Search హిస్టరీ కూడా మీ పరికరంలో కూడా సేవ్ కాగలదు. మీ పరికరంలో Search హిస్టరీని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

మీ Google ఖాతా‌లో సేవ్ చేయబడిన Search హిస్టరీని మేనేజ్ చేయండి

Search హిస్టరీని తొలగించడం

ముఖ్యమైనది: మీరు ఒకసారి మీ Google ఖాతాలో సేవ్ చేయబడిన Search హిస్టరీని తొలగిస్తే, దానిని తిరిగి పొందలేరు.

మీరు నిర్దిష్ట యాక్టివిటీని తొలగించవచ్చు, లేదా నిర్దిష్ట రోజు గానీ, ఇవ్వబడిన తేదీల మధ్య గానీ ఉండే సెర్చ్ హిస్టరీని తొలగించవచ్చు లేదా మొత్తం సెర్చ్ హిస్టరీని తొలగించవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇంటి పేరు ఆ తర్వాత సెర్చ్ హిస్టరీని ట్యాప్ చేయండి.
  3. మీరు తొలగించాలనుకుంటున్న సెర్చ్ హిస్టరీని ఎంచుకోండి. మీరు వీటిని ఎంచుకోవచ్చు:
    • మీ మొత్తం సెర్చ్ హిస్టరీ: మీ హిస్టరీ పైన కనిపించే, తొలగించు Down arrow ఆ తర్వాత మొత్తం తొలగించు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • నిర్దిష్ట కాల వ్యవధి: మీ హిస్టరీ పైన కనిపించే, తొలగించు Down arrow ఆ తర్వాత నిర్దిష్ట కాల పరిధికి సంబంధించిన హిస్టరీని తొలగించు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • నిర్దిష్ట రోజు: రోజు పక్కన, [day] నాటి యాక్టివిటీ అంతటినీ తొలగించు ను ట్యాప్ చేయండి.
    • నిర్దిష్ట యాక్టివిటీ: యాక్టివిటీ పక్కన, యాక్టివిటీ ఐటెమ్‌ను తొలగించు ను ట్యాప్ చేయండి.

మీ Search హిస్టరీని కంట్రోల్ చేయండి

చిట్కా: మరింత సెక్యూరిటీని జోడించడానికి, మీకు మీ పూర్తి హిస్టరీని చూసేందుకు, ఒక అదనపు వెరిఫికేషన్ దశ అవసరం కావచ్చు.
మీ Search హిస్టరీని ఆటోమేటిక్‌గా తొలగించండి
ముఖ్యమైనది: మీరు మీ Search హిస్టరీని ఆటోమేటిక్ తొలగింపునకు సెట్ చేసి ఉన్నప్పటికీ, మీరు ఎప్పుడైనా మీ హిస్టరీని మాన్యువల్‌గా తొలగించవచ్చు.
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇంటి పేరు ఆ తర్వాత సెర్చ్ హిస్టరీ ఆ తర్వాత కంట్రోల్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "వెబ్ & యాప్ యాక్టివిటీ" కార్డ్ పైన, ఆటోమేటిక్ తొలగింపు (ఆఫ్)ను ట్యాప్ చేయండి.
    • మీకు “ఆటోమేటిక్ తొలగింపు (ఆన్)” కనిపించినట్లయితే, నిర్దిష్ట సమయ పరిధి తర్వాత, మీ సెర్చ్ హిస్టరీని కలిగి ఉన్న మీ వెబ్ & యాప్ యాక్టివిటీని Google ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది అని అర్థం. సమయ వ్యవధిని మార్చడానికి లేదా దానిని ఆఫ్ చేయడానికి, ఆటోమేటిక్ తొలగింపు (ఆన్)ను ట్యాప్ చేయండి.
  4. స్క్రీన్‌పై సూచనలను ఫాలో చేయండి.
మీ Search హిస్టరీని సేవ్ చేయడం పాజ్ చేయడం
చిట్కా: మీరు వెబ్‌ను ప్రైవేట్‌గా సెర్చ్ అలాగే బ్రౌజ్ చేసినప్పుడు మీ Search హిస్టరీ మీ Google ఖాతాకు సేవ్ చేయబడదు.

మీ హిస్టరీని సేవ్ చేయడం పాజ్ చేయడానికి:

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ ను తెరవండి.
  2. పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ ఆ తర్వాత సెర్చ్ హిస్టరీ ఆ తర్వాత కంట్రోల్స్ ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. "వెబ్ & యాప్ యాక్టివిటీ" కింద, ఆఫ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఆఫ్ చేయండి లేదా యాక్టివిటీను ఆఫ్ చేసి, తొలగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. మీరు "యాక్టివిటీను ఆఫ్ చేసి, తొలగించండి" ఆప్షన్‌ను ఎంచుకుంటే, మీరు ఏ యాక్టివిటీను తొలగించాలనుకుంటున్నారో ఎంచుకోవడానికి, అలాగే నిర్ధారించడానికి, అదనపు దశలను ఫాలో అవ్వండి.

మీ పరికరంలో సేవ్ అయిన Search హిస్టరీని మేనేజ్ చేయడం

Google యాప్‌లో ఇటీవలి సెర్చ్ క్వెరీలను తొలగించండి

మీరు సెర్చ్ బార్ నుండి మీ ఇటీవలి క్వెరీలను తొలగించినప్పుడు, అది 'నా యాక్టివిటీ' నుండి కూడా తొలగించబడుతుంది.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google సెర్చ్ బార్‌ను ట్యాప్ చేయండి.
    • మీకు సెర్చ్ బార్ కనిపించకపోతే, Google యాప్ ను తెరవండి.
  2. ఇటీవలి క్వెరీ ని నొక్కి, పట్టుకోండి.
  3. తొలగించును ట్యాప్ చేయండి.
బ్రౌజర్ హిస్టరీని తొలగించండి

మీ Google ఖాతాలో మీ Search హిస్టరీ సేవ్ చేయబడకపోయినా, లేదా దానిని మీరు 'నా యాక్టివిటీ' నుండి తొలగించినా కూడా, అది మీ బ్రౌజర్‌లో స్టోర్ అయ్యి ఉండవచ్చు.

మీ బ్రౌజర్ హిస్టరీని మీరు తొలగించవచ్చు:

మీ Google ఖాతా నుండి సైన్ అవుట్ చేస్తున్నప్పుడు Search అనుకూలీకరణను ఆఫ్ చేయండి
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత సాధారణం ఆ తర్వాత Search అనుకూలీకరణ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. Search అనుకూలీకరణ అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

మీ Search హిస్టరీతో ఉన్న సమస్యలను పరిష్కరించడం

తొలగించబడిన హిస్టరీ, 'నా యాక్టివిటీ'లో కనబడుతోంది
  • మీ పరికరం ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయండి: మీరు 'నా యాక్టివిటీ' నుండి మీ హిస్టరీని ఒక పరికరంలో తొలగిస్తే, అవి ఆఫ్‌లైన్‌లో ఉండే పరికరంలో ఇప్పటికీ కనిపించవచ్చు. మీ పరికరం ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయినప్పుడు, అది మీ తొలగించబడిన Search హిస్టరీ తీసివేయబడుతుంది.
  • మీ కాష్‌ను, కుక్కీలను క్లియర్ చేయడం: మీ కాష్, అలాగే కుక్కీలను క్లియర్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
తొలగించబడిన మీ హిస్టరీని సెర్చ్ బార్ లిస్ట్ చేస్తుంది
మీ Google ఖాతా నుండి మీరు సైన్ అవుట్ చేసి ఉన్నప్పుడు Google యాప్‌ను ఉపయోగిస్తే, మీ "Search అనుకూలీకరణ" ఆప్షన్‌ను ఆన్ చేసి ఉండవచ్చు. అది ఆన్ చేసి ఉంటే, Google ఈ పరికరం నుండి సెర్చ్‌లను ఉపయోగించి మీకు మరిన్ని సంబంధిత ఫలితాలు, సిఫార్సులను అందజేస్తుంది

Search అనుకూలీకరణను ఆఫ్ చేయడానికి:

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత సాధారణం ఆ తర్వాత Search అనుకూలీకరణ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. Search అనుకూలీకరణ అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

మీ Google ఖాతాలో మీ హిస్టరీని Google ఎలా తొలగిస్తుంది

మీరు యాక్టివిటీని మాన్యువల్‌గా తొలగించాలని ఎంచుకున్నప్పుడు లేదా మీ ఆటోమేటిక్ తొలగింపు సెట్టింగ్ ఆధారంగా ఆటోమేటిక్‌గా యాక్టీవిటీ తొలగించబడినప్పుడు, మేము వెంటనే ప్రోడక్ట్ నుండి, అలాగే మా సిస్టమ్‌ల నుండి దాన్ని తీసివేసే ప్రాసెస్‌ను ప్రారంభిస్తాము.

ముందుగా, మేము దాన్ని వెంటనే వీక్షణ నుండి తీసివేయడానికి ప్రయత్నిస్తాము, ఇకపై ఆ డేటా మీ Google అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి ఉపయోగించబడకపోవచ్చు.

ఆ తర్వాత, మా స్టోరేజ్ సిస్టమ్‌ల నుండి డేటాను సురక్షితంగా, పూర్తిగా తొలగించడానికి రూపొందించబడిన ఒక ప్రాసెస్‌ను మేము ప్రారంభిస్తాము. 

బిజినెస్ లేదా చట్టపరమైన అవసరాలు వంటి పరిమిత ప్రయోజనాల కోసం, మరింత ఎక్కువ కాలం పాటు Google  కొన్ని రకాల డేటాను స్టోర్ చేయవచ్చు.

సంబంధిత కథనాలు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16937549660967551114
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false