నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

మీ వెబ్ & యాప్ యాక్టివిటీలో ఆడియో రికార్డింగ్‌లను మేనేజ్ చేయడం

Google Search, Assistant అలాగే Mapsతో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు Google సర్వర్‌లలో వాయిస్, ఆడియో యాక్టివిటీని Google మీ Google ఖాతాకు సేవ్ చేయాలో వద్దో మీరు ఎంచుకోవచ్చు. Google ఆడియో గుర్తింపు టెక్నాలజీలను, అలాగే వాటిని ఉపయోగించే Google సర్వీస్‌లను అభివృద్ధి చేసి, మెరుగుపరచడంలో మీ వాయిస్, ఆడియో Googleకు సహాయపడగలవు.

ఈ వాయిస్, ఆడియో యాక్టివిటీ సెట్టింగ్‌ను మీరు ఆన్ చేయడానికి ఎంపిక చేసుకుంటే తప్ప, అది ఆఫ్‌లో ఉంటుంది.

ముఖ్యమైనది: ఇతర సెట్టింగ్‌ల మీద ఆధారపడి, ఆడియో రికార్డింగ్‌లు ఇతర స్థలాలలో సేవ్ చేయబడవచ్చు.

వాయిస్, ఆడియో యాక్టివిటీని ఆన్ లేదా ఆఫ్ చేయడం

  1. మీ Google ఖాతా ఆప్షన్‌కు వెళ్లండి.
  2. ఎగువ ఎడమ వైపున, డేటా & గోప్యత ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌లు" కింద, వెబ్ & యాప్ యాక్టివిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. "వాయిస్, ఆడియో యాక్టివిటీని చేర్చండి" పక్కన ఉన్న, బాక్స్‌ను ఎంచుకోండి లేదా దాని ఎంపికను తీసివేయండి.

ఈ వాయిస్, ఆడియో యాక్టివిటీ సెట్టింగ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, మీరు సైన్ ఇన్ చేసినప్పటికీ, Google Search, Assistant, ఇంకా Mapsతో వాయిస్ ఇంటరాక్షన్‌ల నుండి ఆడియో రికార్డింగ్‌లు Google సర్వర్‌లలోని మీ Google ఖాతాలో సేవ్ చేయబడవు. మీరు ఈ వాయిస్, ఆడియో యాక్టివిటీ సెట్టింగ్‌ను ఆఫ్ చేస్తే, మునుపు సేవ్ చేసిన ఆడియో తొలగించబడదు. మీరు ఎప్పుడైనా మీ ఆడియో రికార్డింగ్‌లను తొలగించవచ్చు.

మీ ఆడియో రికార్డింగ్‌లను కనుగొనడం లేదా తొలగించడం

మీ ఆడియో రికార్డింగ్‌లను కనుగొనండి

ముఖ్యమైనది: ఇతర సెట్టింగ్‌ల మీద ఆధారపడి, ఆడియో రికార్డింగ్‌లు ఇతర స్థలాలలో సేవ్ చేయబడవచ్చు.

  1. మీ Google ఖాతా ఆప్షన్‌కు వెళ్లండి.
  2. ఎగువ ఎడమ వైపున, డేటా & గోప్యత ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌లు"కు దిగువున ఉన్న, వెబ్ & యాప్ యాక్టివిటీ ఆ తర్వాత యాక్టివిటీని మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఈ పేజీలో, మీరు ఇవి చేయవచ్చు:
    • మీ గత యాక్టివిటీ లిస్ట్‌ను చూడండి: ఆడియో చిహ్నం Speakతో ఉన్న ఐటెమ్‌లు రికార్డింగ్‌ను కలిగి ఉంటాయి.
    • రికార్డింగ్‌ను ప్లే చేయండి: ఆడియో పక్కన Speak, వివరాలు ఆ తర్వాత రికార్డింగ్‌ను చూడండి ఆ తర్వాత ప్లే చేయండిప్లే చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

అనేక ఆడియో రికార్డింగ్‌లు: మీ Google Assistant ఎనేబుల్ చేయబడిన పరికరాలలో ఒకటి కంటే ఎక్కువ పరికరాలు మీ ఆడియోను ప్రాసెస్ చేసినట్లయితే, మీరు ఒక యాక్టివిటీకి సంబంధించిన అనేక ఆడియో రికార్డింగ్‌లను చూడవచ్చు. మీకు ఏ పరికరం సమాధానమివ్వాలో నిర్ణయించే మా టెక్నాలజీలను మెరుగుపరచడానికి మేము ఈ ఆడియోను ఉపయోగిస్తాము.

మీరు "టైప్ చేసిన మాటల ఫైల్ అందుబాటులో లేదు" అనే మెసేజ్‌ను పొందినట్లయితే, ఆ యాక్టివిటీ జరిగే సమయంలో చాలా ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉండవచ్చు.

మీరు మీ Google ఖాతాలో సేవ్ చేసిన మీ ఆడియోను Google Takeout ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఆడియో, ఇతర Google డేటాను ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

చిట్కా: మరింత సెక్యూరిటీని జోడించడానికి మీకు నా యాక్టివిటీలో మీ పూర్తి హిస్టరీని చూడటానికి, ఒక అదనపు వెరిఫికేషన్ దశ అవసరం కావచ్చు.

మీ వెబ్ & యాప్ యాక్టివిటీ నుండి ఆడియో రికార్డింగ్‌లను తొలగించండి

ముఖ్యమైనది: ఇతర సెట్టింగ్‌ల మీద ఆధారపడి, ఆడియో రికార్డింగ్‌లు ఇతర స్థలాలలో సేవ్ చేయబడవచ్చు.

ఒక్కొక్క సారి, ఒక్కొక్క ఐటెమ్ చొప్పున తొలగించడం

  1. మీ Google ఖాతా ఆప్షన్‌కు వెళ్లండి.
  2. ఎగువ ఎడమ వైపున, డేటా & గోప్యత ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌లు"కు దిగువున ఉన్న, వెబ్ & యాప్ యాక్టివిటీ and then యాక్టివిటీని మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఈ పేజీలో, మీ గత యాక్టివిటీ లిస్ట్ మీకు కనిపిస్తుంది. ఆడియో చిహ్నం Speakను కలిగి ఉండే ఐటెమ్‌లు, రికార్డింగ్‌ను కలిగి ఉంటాయి.
  4. మీరు తొలగించాలనుకునే ఐటెమ్ పక్కన, మరిన్ని More and then తొలగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

అన్ని ఐటెమ్‌లనూ ఒకేసారి తొలగించండి

ముఖ్యమైనది: రికార్డింగ్‌ను కలిగి ఉన్న ఐటెమ్‌లనే కాక ఈ దశలు మీ వెబ్ & యాప్ యాక్టివిటీ మొత్తాన్ని తొలగిస్తాయి.

  1. మీ Google ఖాతా ఆప్షన్‌కు వెళ్లండి.
  2. ఎగువ ఎడమ వైపున, డేటా & గోప్యత ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌లు"కు దిగువున ఉన్న, వెబ్ & యాప్ యాక్టివిటీ and then యాక్టివిటీని మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఈ పేజీలో, మీ గత యాక్టివిటీ లిస్ట్ మీకు కనిపిస్తుంది. ఆడియో చిహ్నం Speakను కలిగి ఉండే ఐటెమ్‌లు, రికార్డింగ్‌ను కలిగి ఉంటాయి.
  4. మీ యాక్టివిటీ ఎగువన, తొలగించండి and then మొత్తం డేటా ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

మీ ఆడియో రికార్డింగ్‌లను ఆటోమేటిక్‌గా తొలగించండి

ముఖ్యమైనది: ఆడియో రికార్డింగ్‌ను కలిగి ఉన్న ఐటెమ్‌లకే కాక, మీ వెబ్ & యాప్ యాక్టివిటీ ఐటెమ్‌లు అన్నింటికీ, ఈ దశలు ఆటోమేటిక్ తొలగింపు ఆప్షన్‌ను ఆన్ చేస్తాయి.

  1. మీ కంప్యూటర్‌లో, మీ Google ఖాతా ఆప్షన్‌కు వెళ్లండి.
  2. ఎగువ ఎడమ వైపున, డేటా & గోప్యత ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌లు"కు దిగువున ఉన్న, వెబ్ & యాప్ యాక్టివిటీ ఆ తర్వాత యాక్టివిటీని మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీ యాక్టివిటీకి ఎగువున ఉన్న, సెర్చ్ బార్‌లో మరిన్ని More ఆ తర్వాత ఇంత కాలం పాటు యాక్టివిటీని ఉంచండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. మీ యాక్టివిటీని ఎంతసేపు ఉంచాలనుకుంటే అంతసేపు ఆ తర్వాత తర్వాత ఆ తర్వాత నిర్ధారించండి బటన్‌ను క్లిక్ చేయండి.

Google ఆడియో గుర్తింపు టెక్నాలజీలను, వాటిని ఉపయోగించే సర్వీస్‌లను డెవలప్ చేయడానికి, మెరుగుపరచడానికి ఇకపై అవసరం లేనప్పుడు, మీరు ఎంచుకున్న సమయ పరిధి కంటే ముందుగానే Google మీ ఆడియో రికార్డింగ్‌లను Google సర్వర్‌ల నుండి తొలగించవచ్చు. ఉదాహరణకు, కొన్ని భాషలకు కాలానుగతంగా తక్కువ ఆడియో అవసరం కావచ్చు.

ఈ వాయిస్ & ఆడియో యాక్టివిటీ సెట్టింగ్ గురించి

మీరు Google సర్వీస్‌లతో మాట్లాడినప్పుడు, Google దాని ఆడియో గుర్తింపు టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా మీ ఆడియోను ప్రాసెస్ చేసి, మీకు ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు, మీరు వాయిస్ ద్వారా సెర్చ్ చేయడానికి మైక్ చిహ్నాన్ని తాకితే, Googleకు చెందిన ఆడియో గుర్తింపు టెక్నాలజీలు మీరు చెప్పే మాటలను ఇండెక్స్‌లో Search వెతకగలిగే పదాలు, పదబంధాల రూపంలోకి అనువదించడం ద్వారా మీకు అత్యంత సందర్భోచిత ఫలితాలను అందిస్తాయి.

వెబ్ & యాప్ యాక్టివిటీ, Google Sites, యాప్‌లలోని విషయాలను, ఇంకా మీ Google ఖాతాలోని సర్వీస్‌లను Google సర్వర్‌లలో సేవ్ చేస్తుంది. ఇది లొకేషన్ వంటి అనుబంధిత సమాచారాన్ని కలిగి ఉండవచ్చు. కొన్ని ఇంటరాక్షన్‌లు సేవ్ చేయబడకపోవచ్చు.

ఈ ఆప్షనల్ వాయిస్, ఆడియో యాక్టివిటీ సెట్టింగ్‌తో, మీరు Google Search, Assistan ఇంకా Mapsతో ఇంటరాక్ట్ అయినప్పుడు, వెబ్ & యాప్ యాక్టివిటీతో ఆడియో రికార్డింగ్‌లను కూడా సేవ్ చేయవచ్చు. ఈ వాయిస్, ఆడియో యాక్టివిటీ సెట్టింగ్‌ను మీరు ఆన్ చేయడానికి ఎంపిక చేసుకుంటే తప్ప, అది ఆఫ్‌లో ఉంటుంది.

ఈ సెట్టింగ్, మీరు Search, Assistant ఇంకా Mapsకు సైన్ ఇన్ చేసి ఉండే చోట్ల ఈ సెట్టింగ్ ప్రభావం చూపుతుంది, ఉదాహరణకు, Google Assistant యాప్ ఇంకా Google Home స్మార్ట్ స్పీకర్ రెండింటిలో ఉండే Assistantపై ప్రభావం చూపడం లాంటిది.

ఆడియో రికార్డింగ్‌లు ఎలా ఉపయోగపడతాయి

Google తన ఆడియో గుర్తింపు టెక్నాలజీలను ఇంకా Google Assistant వంటి వాటిని ఉపయోగించే Google సర్వీస్‌లను అభివృద్ధి చేయడానికి, మెరుగుపరచడానికి, ఈ సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు సేవ్ చేయబడిన ఆడియోను ఉపయోగిస్తుంది.

ఆడియో రివ్యూ ప్రాసెస్

కొన్ని ఆడియో టెక్నాలజీ మెరుగుదలల కోసం, ఈ సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు Google సర్వర్‌లలో సేవ్ చేయబడిన ఆడియో శాంపిల్స్‌ను వినటం, మాటలను టైప్ చేయడం, అదనపు గమనికలు చేర్చడం వంటి వాటిలో శిక్షణ పొందిన రివ్యూవర్‌లు విశ్లేషించారు, కాబట్టి Google సర్వీస్‌లు ఆడియోను మెరుగ్గా అర్థం చేసుకోగలవు, ఉదాహరణకు, రణగొణ ధ్వనులతో నిండిన పరిసరాల్లో లేదా నిర్దిష్ట భాషలో ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు. ఈ ప్రాసెస్‌లో భాగంగా మీ గోప్యతను కాపాడటానికి మేము తగిన చర్యలు తీసుకుంటాము, అంటే మీ ఆడియోను రివ్యూవర్‌లు విశ్లేషించే సందర్భాలలో దానిని మీ ఖాతాతో సంబంధం లేకుండా చేయడం లాంటివి.

ఈ ప్రాసెస్ వ్యక్తులు ఏం చెప్తున్నారో మరింత బాగా అర్థం చేసుకోవడంలో సర్వీస్‌లకు సహాయపడుతుంది. ఉదాహరణకు, డేటా సమృద్ధిగా ఉండే భాషల నుండి మాటల టైపింగ్ ఆడియో కలిగి ఉన్న ఒక నమూనాకు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా డేటా తక్కువ ఉండే భాషల కోసం ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్‌ను Google మెరుగుపరిచింది, ఇది రియల్ టైమ్‌లో బహుభాషా స్పీచ్ రికగ్నిషన్ కోసం అనుమతించబడుతుంది.

వాయిస్ టెక్నాలజీలు

ముఖ్యమైనది: మీరు జూన్ 6, 2022 తర్వాత వాయిస్, ఆడియో యాక్టివిటీని ఆన్ చేస్తే ఈ సమాచారం వర్తిస్తుంది.

వాయిస్ మ్యాచ్ వంటి కొన్ని Google ఆడియో టెక్నాలజీలు ఒకే రకంగా ఉండే వాయిస్‌లను సరిపోల్చగలవు, విభిన్న వాయిస్‌లను గుర్తించగలవు లేదా వాటిని ప్రత్యేక వాయిస్‌లతో మెరుగుపరచగలవు. మీరు వాయిస్ మ్యాచ్‌తో Google Assistantను ఉపయోగిస్తుంటే, మీరు ఈ వాయిస్, ఆడియో యాక్టివిటీ సెట్టింగ్‌ను ఆన్ చేసినట్లయితే, Google వాయిస్ టెక్నాలజీలను, వాటిని ఉపయోగించే Google సర్వీస్‌లను అభివృద్ధి చేయడానికి, మెరుగుపరచడానికి మీరు సేవ్ చేసిన ఆడియో నుండి మీ వాయిస్‌కు సంబంధించిన మోడల్‌ను కూడా Google తాత్కాలికంగా ప్రాసెస్ చేయవచ్చు. ఇతర సెట్టింగ్‌లతో మీ వాయిస్ ఎలా పని చేస్తుందో తెలుసుకోండి.

ఈ ప్రాసెస్‌లో భాగంగా మీ గోప్యతను కాపాడటానికి మేము తగిన చర్యలు తీసుకుంటాము. ఉదాహరణకు, మీ వాయిస్ మోడల్ సేవ్ చేయబడిన ఆడియో నుండి లెక్కించబడితే, అది మీ ఖాతా నుండి వేరు చేయబడి, మా ఆడియో గుర్తింపు టెక్నాలజీలను మెరుగుపరచడానికి తాత్కాలికంగా ప్రాసెస్ చేయబడి, ఆపై తొలగించబడుతుంది. ఈ వాయిస్ ప్రాసెస్ విధానానికి సంబంధించిన ప్రతి సందర్భానికి 7 రోజుల వరకు పట్టవచ్చు. కొన్ని అధికారిక ప్రదేశాలలో, వాయిస్ మోడల్‌లు బయోమెట్రిక్ డేటాగా పరిగణించబడవచ్చు.

ఈ వాయిస్ & ఆడియో యాక్టివిటీ సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు

మీ వెబ్ & యాప్ యాక్టివిటీ కోసం, ఈ వాయిస్, ఆడియో యాక్టివిటీ సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు, మీరు మీ Google ఖాతాలో Google Search, Assistant, అలాగే Mapsతో ఇంటరాక్ట్ అయినప్పుడు, Google ఆడియో రికార్డింగ్‌లను సేవ్ చేస్తుంది.

మీ పరికరం యాక్టివేషన్‌ను గుర్తించినప్పుడు ఆడియో సేవ్ చేయబడుతుంది. పరికరాలు వివిధ రకాల యాక్టివేషన్‌లకు సపోర్ట్ ఇవ్వగలవు, అంటే, “Ok Google,” అని చెప్పడం మీరు ఆన్ చేసిన క్విక్ ఫ్రేజ్, సంభాషణలను కొనసాగిస్తూ ఉండటం, లేదా మైక్‌ను కొన్ని సార్లు నొక్కడం వంటి యాక్టివేషన్‌లకు సపోర్ట్ ఇవ్వగలవు. కొన్ని పరికరాలు పూర్తి రిక్వెస్ట్‌ను క్యాచ్ చేయడానికి, యాక్టివేషన్‌కు ముందు కొన్ని సెకన్లను చేర్చుతాయి.

ఒకొక్కసారి, “Ok Google”లా అనిపించే నాయిస్ వల్ల మీ పరికరం తప్పుగా యాక్టివేట్ అయితే ఆడియో సేవ్ చేయబడవచ్చు. అనవసర యాక్టివేషన్‌లను తగ్గించడంలో మా సిస్టమ్‌లను మరింత మెరుగుపరచడానికి మేము నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాము.

మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా మీ పరికరాన్ని ఉపయోగిస్తుంటే, మీరు ఆన్‌లైన్‌లోకి తిరిగి వచ్చిన తర్వాత, ఆడియో మీ Google ఖాతాలో సేవ్ చేయబడవచ్చు.

ఈ వాయిస్ & ఆడియో యాక్టివిటీ సెట్టింగ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు

మీరు ఈ వాయిస్, ఆడియో యాక్టివిటీ సెట్టింగ్‌ను ఆఫ్ చేస్తే, మీరు Google Search, Assistant, Mapsతో ఇంటరాక్ట్ అయినప్పుడు Google ఇకపై మీ వెబ్ & యాప్ యాక్టివిటీతో Google సర్వర్‌లలో మీ Google ఖాతాలో ఆడియో రికార్డింగ్‌లను సేవ్ చేయదు. మీరు Google సర్వీస్‌లతో మాట్లాడినప్పుడు మీకు ప్రతిస్పందించడానికి Google మీ ఆడియోను ప్రాసెస్ చేయడం కొనసాగిస్తుంది.

వాయిస్, ఆడియో యాక్టివిటీ సెట్టింగ్‌ను ఆఫ్ చేయడం వలన ప్రత్యేక Assistant ఆడియో సెట్టింగ్‌లు ఆఫ్ చేయబడవు.

వాయిస్, ఆడియో యాక్టివిటీ సెట్టింగ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, వాయిస్ మ్యాచ్ వంటి వాయిస్ టెక్నాలజీలను మెరుగుపరచడానికి ఈ సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు Google గతంలో సేవ్ చేసిన ఆడియోను ఉపయోగించదు. ఇంతకు ముందు సేవ్ చేసిన ఆడియోను, దాన్ని మీరు తొలగిస్తే తప్ప, ఇతర ఆడియో టెక్నాలజీలను మెరుగుపరచడం కోసం ఉపయోగించడాన్ని కొనసాగించవచ్చు.

మీరు వెబ్ & యాప్ యాక్టివిటీలో ఇంతకు ముందు సేవ్ చేసిన ఆడియోను activity.google.com సైట్‌లో తొలగించవచ్చు.

ఆడియో రికార్డింగ్‌లు ఇతర స్థలాలలో సేవ్ చేయబడవచ్చు

ఈ వాయిస్, ఆడియో యాక్టివిటీ సెట్టింగ్ వీటిని ప్రభావితం చేయదు:

  • Google Voice, YouTube వంటి ఇతర Google సర్వీస్‌ల ద్వారా సేవ్ చేయబడి మేనేజ్ చేయబడుతున్న ఆడియో.
  • మీ వ్యక్తిగత వాయిస్ మ్యాచ్‌ను సెటప్ చేయడం ఇంకా మెరుగుపరచడం లేదా మీ పరికరంలో ఆడియో టెక్నాలజీలను వ్యక్తిగతీకరించడం వంటి ప్రయోజనాల కోసం మీ పరికరంలో ఆడియో సేవ్ చేయబడింది.

ఈ సెట్టింగ్ ద్వారా మేనేజ్ చేయబడని ఇతర మెషీన్ లెర్నింగ్ ప్రాసెస్‌లు, ఫెడరేటెడ్ లెర్నింగ్ లేదా స్వల్పకాలిక లెర్నింగ్‌తో ఆడియో గుర్తింపు టెక్నాలజీలను మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు.

స్పీచ్ మోడల్స్‌ను Google ఎలా మెరుగుపరుస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5176985132296528380
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false