నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

SafeSearchతో అందరికీ తగని ఫలితాలను ఫిల్టర్ చేయండి, లేదా బ్లర్ చేయండి

మీ Google సెర్చ్ ఫలితాలలో, ఆఫీస్ పని కోసమైనా, పిల్లలతో అయినా, లేదా మీ కోసమైనా సరే, SafeSearch అందరికీ తగని కంటెంట్‌ను మేనేజ్ చేయడంలో మీకు సహాయపడుతుంది. అందరికీ తగని ఫలితాలలో ఇటువంటి కంటెంట్ ఉంటుంది:

  • నగ్నత్వం, స్పష్టంగా చూపే లైంగిక చర్యలు, అందరికీ తగని అంశాలు
  • హింస, రక్తపాతం

Google Search కంటెంట్ పాలసీల గురించి మరింత తెలుసుకోండి.

ముఖ్య గమనిక: SafeSearch కేవలం Google Search ఫలితాలలో మాత్రమే పని చేస్తుంది. మీకు ఇతర సెర్చ్ ఇంజిన్‌లలో కనిపించే లేదా మీరు నేరుగా వెళ్లే వెబ్‌సైట్‌లలోని అందరికీ తగని కంటెంట్‌పై ఇది ప్రభావం చూపదు.

SafeSearch సెట్టింగ్‌లను మార్చండి

మీకు స్వంత Google ఖాతా ఉంటే, మీ వ్యక్తిగత ఖాతా లేదా బ్రౌజర్ కోసం SafeSearchను మేనేజ్ చేయవచ్చు.

Google యాప్‌లో

  1. మీ Android ఫోన్‌లో లేదా టాబ్లెట్‌లో, Google యాప్ ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ ఆ తర్వాతను ట్యాప్ చేయండి సెట్టింగ్‌లు ఆ తర్వాత SafeSearchను ట్యాప్ చేయండి.
  3. ఫిల్టర్ చేయండి, బ్లర్ చేయండి, లేదా ఆఫ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
మొబైల్ బ్రౌజర్
  1. మీ Android ఫోన్‌లో లేదా టాబ్లెట్‌లో, మీ SafeSearch సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  2. ఫిల్టర్ చేయండి, బ్లర్ చేయండి, లేదా ఆఫ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఎగువ కుడి వైపున, వెనుకకు Back అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
Android TV
  1. మీ Android TV మొదటి స్క్రీన్‌లో, కిందికి స్క్రోల్ చేసి, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. "ప్రాధాన్యతలు" విభాగంలో, Search ఆ తర్వాత SafeSearch ఫిల్టర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

SafeSearch ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి

Google Searchలో, SafeSearch పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్, స్పష్టంగా చూపే హింస వంటి అందరికీ తగని కంటెంట్‌ను గుర్తించగలదు.

  • ఏదైనా అందరికీ తగని కంటెంట్ కంటెంట్‌ను గుర్తిస్తే, దానిని బ్లాక్ చేయడానికి, ఫిల్టర్‌ను ఎంచుకోండి.
    • మీ వయస్సు 18 ఏళ్లలోపు ఉండవచ్చని Google సిస్టమ్‌లు సూచించినప్పుడు ఉండే ఆటోమేటిక్ సెట్టింగ్ ఇది.
  • అందరికీ తగని ఇమేజ్‌లను బ్లర్ చేసేందుకు బ్లర్‌ను ఎంచుకోండి. పైన పేర్కొన్నవి వర్తించకపోతే ఇది ఆటోమేటిక్ సెట్టింగ్ అని అర్థం.
    • ఈ సెట్టింగ్ అందరికీ తగని ఇమేజ్‌లను బ్లర్ చేయడంలో సహాయపడుతుంది, కానీ మీ సెర్చ్‌కు సందర్భోచితంగా ఉంటే, అందరికీ తగని టెక్స్ట్‌ను, లింక్‌లను చూపవచ్చు.
  • SafeSearch "ఆఫ్"లో ఉంటే, మీ సెర్చ్‌కు సందర్భోచితమైన ఫలితాలు అందరికీ తగనివిగా ఉన్నప్పటికీ అవి కనిపిస్తాయి.

మీరు మీ SafeSearch సెట్టింగ్‌ని మార్చలేకపోతే, దానికి కారణం దానిని మీ ఖాతా, పరికరం లేదా నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ కంట్రోల్ చేయడం. ఉదాహరణకు:

  • చిన్నారి, విద్యార్థి ఖాతాల విషయంలో, తల్లిదండ్రులు, స్కూల్స్ "ఫిల్టర్ చేయండి"లో SafeSearchను లాక్ చేయగలవు.
  • విమానాశ్రయం లేదా లైబ్రరీ వంటి పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లు కూడా "ఫిల్టర్ చేయండి"లో SafeSearchను లాక్ చేయగలవు.
  • మీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో, యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌లో తల్లిదండ్రుల కంట్రోల్స్ అనేవి మీ వ్యక్తిగత SafeSearch సెట్టింగ్‌ను ఓవర్‌రైడ్ చేయవచ్చు.

మీ SafeSearch సెట్టింగ్‌ను ఎవరు మార్చగలరో తెలుసుకోండి

ఇతరుల కోసం SafeSearch సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి

Family Link యాప్‌లో మీ చిన్నారి SafeSearch సెట్టింగ్‌ను మార్చండి

Family Linkతో మేనేజ్ చేయబడుతున్న ఖాతాకు సైన్ ఇన్ చేసిన పిల్లల కోసం, 13 ఏళ్ల లోపు లేదా మీ దేశంలో లేదా ప్రాంతంలోని వయోపరిమితి కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం "ఫిల్టర్ చేయండి"లో SafeSearch ఆటోమేటిక్‌గా సెట్ చేయబడి ఉంటుంది. ఈ ఖాతాల విషయంలో, తల్లిదండ్రులు మాత్రమే SafeSearch సెట్టింగ్‌ను మార్చగలరు. మీ చిన్నారి Google ఖాతాలో Searchను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

మీరు మేనేజ్ చేసే పరికరాలలో, నెట్‌వర్క్‌లలో SafeSearch సెట్టింగ్‌ను లాక్ చేయండి

మీరు మేనేజ్ చేసే మీ PC లేదా MacBook వంటి మరొక పరికరంలో తప్పకుండా SafeSearch ఫలితాలను పొందాలనుకుంటే, మీరు Google డొమైన్‌లను forcesafesearch.google.com లింక్‌కు మ్యాప్ చేయవచ్చు. మీరు మేనేజ్ చేసే ఖాతాలు, పరికరాలు, నెట్‌వర్క్‌ల కోసం SafeSearchను ఎలా లాక్ చేయాలో తెలుసుకోండి.

SafeSearch సంబంధిత సమస్యలను పరిష్కరించండి

SafeSearch పని చేయకపోయినట్లయితే, SafeSearch సంబంధిత సమస్యలను పరిష్కరించడం ఎలాగో తెలుసుకోండి.

అందరికీ తగని కంటెంట్ గురించి రిపోర్ట్ చేయండి

మీ SafeSearch ఫిల్టరింగ్‌ను ఆన్ చేసి ఉండి, అందరికీ తగని కంటెంట్ మీకు కనిపిస్తూ ఉంటే, మీరు కంటెంట్‌ను రిపోర్ట్ చేయవచ్చు.

సంబంధిత రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ