నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

సెర్చ్ ఫలితాల భాషను Google ఎలా నిర్ణయిస్తుంది

మీరు Googleలో సెర్చ్ చేసినప్పుడు, మీరు సెర్చ్ చేసిన భాషలో కాకుండా, ఇతర భాషలలో ఫలితాలను పొందవచ్చు, ముఖ్యంగా చాలా మంది వ్యక్తులు రెండు లేదా అంతకంటే ఎక్కువగా సాధారణ భాషలు మాట్లాడే ప్రదేశాలలో ఈ విధంగా పొందవచ్చు. మీకు, ఫలితాలకు సంబంధించిన భాష ఆటోమేటిక్‌గా ఎలా నిర్ణయించబడుతుందో, అలాగే నిర్దిష్ట భాష కోసం మీరు మాన్యువల్‌గా ఎలా ఫిల్టర్ చేయవచ్చో, ఈ పేజీ వివరిస్తుంది.

ఫలితాలకు సంబంధించిన భాషను మనం ఎలా నిర్ణయిస్తాము

అనేక దేశాలు, ప్రాంతాలలో, ప్రజలు Googleలో సెర్చ్ చేయడానికి పలు రకాల భాషలను ఉపయోగిస్తారు. బహుభాషా వ్యక్తులకు ఉత్తమంగా సర్వీస్‌లను అందించేందుకు, ఫలితాల కోసం ఏ భాష లేదా భాషలను ఉపయోగించడం అత్యంత సహాయకరంగా ఉంటుందనేది ఆటోమేటిక్‌గా నిర్ణయించడానికి, Google అనేక అంశాలను పరిగణిస్తుంది:

సెర్చ్ చేయడానికి యూజర్ ఉపయోగించిన భాష

ఎవరైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఉపయోగించే భాష ఒక ముఖ్యమైన అంశం. ఇది, వ్యక్తులు తమ భాషా సెట్టింగ్‌లలో పేర్కొన్న భాషలో కాకుండా వేరే భాషలో ఫలితాలు కోరుకుంటున్నారో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, ఫ్రెంచ్ భాషా సెట్టింగ్‌లతో ఫ్రాన్స్‌లోని ఒక వ్యక్తి ఇంగ్లీష్, అరబిక్ లేదా ఇతర భాషలలో సెర్చ్ చేయవచ్చు, అలాగే ఆ భాషల్లోని కంటెంట్‌ను స్వీకరించవచ్చు.

కంటెంట్ సహాయకత్వం

వివిధ భాషల్లో సెర్చ్ చేసే యూజర్‌లకు నిర్దిష్ట భాషలోని కంటెంట్ సహాయకరంగా ఉందో, లేదో, మా సిస్టమ్‌లు అర్థం చేసుకుంటాయి. ప్రజలు ఒకటి కంటే ఎక్కువ భాషలను అర్థం చేసుకునే లొకేల్స్‌లో ఇది చాలా సర్వ సాధారణం, ప్రత్యేకించి సెర్చ్ భాషలో తగినంత సమాచారం లేనప్పుడు ఈ విధంగా ఉంటుంది.

డిస్‌ప్లే భాష సెట్టింగ్

మీరు డిస్‌ప్లే భాష సెట్టింగ్‌తో Google Searchలోనే బటన్‌లు, ఇతర డిస్‌ప్లే టెక్స్ట్ కోసం ఉపయోగించే భాషను కంట్రోల్ చేయవచ్చు. ఈ సెట్టింగ్ సెర్చ్ ఫలితాలను ఏ భాషల్లో చూపాలో నిర్ణయించడంలో Googleకు సహాయపడుతుంది. అయితే అన్ని ఫలితాలు ఒకే భాషలో చూపించాల్సిన అవసరం లేదు.

బ్రౌజర్, పరికర సెట్టింగ్‌లు

కొన్ని బ్రౌజర్‌లు, పరికరాలు ప్రాధాన్య భాషలను సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. బ్రౌజర్‌లు లేదా పరికరాలు ఈ ప్రాధాన్యతలను Googleకి కమ్యూనికేట్ చేయగలిగితే, ఏ భాషలో సెర్చ్ ఫలితాలు చూపాలనేది నిర్ణయించడంలో, ఇది సహాయపడుతుంది. అయితే, అన్ని ఫలితాలు ఒకే భాషలో చూపించాల్సిన అవసరం లేదు.  

లొకేషన్, ప్రాంత సెట్టింగ్‌లు

సెర్చ్ ఫలితాల భాషను గుర్తించడానికి, యూజర్ సెర్చ్ చేయడానికి ఉపయోగిస్తున్న భాషను కూడా Google ఉపయోగిస్తుంది. వివిధ భాషలలో "ట్యాక్సీ" వంటి పదాలను ఒకే విధంగా పలుకుతున్నప్పుడు, యూజర్ లొకేషన్ సహాయకరంగా ఉంటుంది. Google మీ లొకేషన్‌ను ఆటోమేటిక్‌గా నిర్ధారిస్తుంది, కానీ మీరు ఎప్పుడైనా మీ ప్రాంత సెట్టింగ్‌లను మార్చవచ్చు

కంటెంట్ క్రియేటర్‌లు అందించిన సమాచారం

మీరు బహుభాషా కంటెంట్‌ను క్రియేట్ చేస్తే, నిర్దిష్ట భాషల కోసం ఏ వెర్షన్ చూపబడాలనేది మీరు Googleకు తెలియజేయవచ్చు. 

నిర్దిష్ట భాషకు సంబంధించి ఫలితాలను ఎలా ఫిల్టర్ చేయాలి

సెర్చ్ ఫలితాలను, నిర్దిష్ట భాషకు మాన్యువల్‌గా ఫిల్టర్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి:

  • ఫలితాల భాషకు సంబంధించిన ఫిల్టర్: ఇది సెర్చ్ ఫలితాల పైన కనిపించే ఫిల్టర్, ఇది ఫలితాలను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రాధాన్య భాషలకు పరిమితం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మరింత తెలుసుకోండి.
  • అధునాతన సెర్చ్ భాషకు సంబంధించిన ఫిల్టర్: అధునాత సెర్చ్ పేజీలో ఫలితాలను ఫిల్టర్ చేయండి.

భాషకు సంబంధించిన ఫిల్టర్‌లు ప్రధానంగా వెబ్ ఫలితాల కోసం రూపొందించబడ్డాయని దయచేసి గమనించండి. కొన్ని సెర్చ్ ఫీచర్‌లు అయిన, విజ్ఞాన గ్రాఫ్ డిస్‌ప్లేలు ఇంకా టాప్ స్టోరీలు వంటి వాటిని ఉపయోగించినప్పుడు, అవి మారకపోవచ్చు. పేజీలోని భాషను Google గుర్తించలేకపోతే, వెబ్ ఫలితాలకు కూడా ఈ ఫీచర్‌లు పని చేయకపోవచ్చు. ఇది అనేక కారణాల వల్ల జరుగుతుంది. ఉదాహరణకు, ఒక పేజీలోని కంటెంట్ ఒకటి కంటే ఎక్కువ భాషల్లో ఉన్నట్లయితే లేదా ఆ కంటెంట్, బహుభాషా సైట్‌లను అర్థం చేసుకోవడంలో Googleకు ఎలా సహాయపడాలి అనే దానికి సంబంధించిన గైడెన్స్‌ను ఫాలో కానట్లయితే ఈ విధంగా జరుగుతుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6136278393925345102
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false