నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

Googleలో ఎలా వెతకాలి

Googleలో సమాచారాన్ని సులభంగా కనుగొనడంలో మీకు సహాయపడటానికి కొన్ని చిట్కాలు మరియు సూచనల గురించి తెలుసుకోండి.

చిట్కా 1: ప్రాథమిక అంశాలతో మొదలుపెట్టండి

మీరు వెతికేది దేని గురించి అయినప్పటికీ, దగ్గరలో విమానాశ్రయం ఎక్కడ ఉంది? లాంటి సాధారణ సెర్చ్‌తో ప్రారంభించండి. మీరు కావాలనుకుంటే కొన్ని వివరణ పదాలను ఎల్లవేళలా జోడించవచ్చు.

మీరు ఒక స్థలం కోసం లేదా నిర్దిష్ట లొకేషన్‌లో ఉత్పత్తి కోసం వెతుకుతున్నట్లయితే, లొకేషన్‌ను జోడించండి. ఉదాహరణకు, బేకరీ సియాటెల్

చిట్కా 2: మీ వాయిస్ ఉపయోగించి సెర్చ్ చేయండి

టైప్ చేసి విసిగిపోయారా? మీ వాయిస్‌తో సెర్చ్ చేయడానికి,  మైక్రోఫోన్‌ను ట్యాప్ చేయండి. మీ వాయిస్‌తో ఎలా సెర్చ్ చేయాలో తెలుసుకోండి.

చిట్కా 3: పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి

సెర్చ్ బాక్స్‌లో ఏ పదాలను ఉంచాలో మీరు నిర్ణయించినప్పుడు, మీరు వెతుకుతున్న సైట్‌లో కనిపించే అవకాశం ఉన్న పదాలను ట్రై చేయండి. ఉదాహరణకు, నా తల బద్దలవుతోంది, అని చెప్పడానికి బదులుగా తలనొప్పిగా ఉంది అని చెప్పండి, ఎందుకంటే అది వైద్యపరమైన సైట్‌లో ఉపయోగించే పదం.

చిట్కా 4: చిన్న విషయాల గురించి పట్టించుకోకండి

  • స్పెల్లింగ్: మీరు స్పెల్లింగ్ సరిగ్గా పేర్కొన్న, పేర్కొనకపోయినా Google స్పెల్-చెకర్ ఇవ్వబడిన ఆ పదానికి అత్యంత సాధారణమైన స్పెల్లింగ్‌ను ఆటోమేటిక్‌గా వాడుతుంది. 
  • క్యాపిటలైజేషన్: A search for New York Times అని సెర్చ్ చేసినా లేదా new york times అని సెర్చ్ చేసినా ఒకటే.

చిట్కా 5: క్విక్ ఆన్సర్స్‌ను కనుగొనండి

చాలా సెర్చ్‌ల కోసం, Google మీ కోసం పని చేసి, సెర్చ్ ఫలితాల్లో మీ ప్రశ్నకు సమాధానాన్ని చూపుతుంది. క్రీడా జట్ల గురించిన సమాచారం లాంటి కొన్ని ఫీచర్‌లు అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉండవు. 

  • వాతావరణం: మీ లొకేషన్‌లో వాతావరణం చూడటానికి 'వాతావరణం' అని వెతకండి లేదా వాతావరణం హైదరాబాద్ లాగా నగరం పేరును జోడించి, నిర్దిష్ట స్థలంలో వాతావరణాన్ని కనుగొనండి.
  • నిఘంటువు: ఏదైనా పదం యొక్క నిర్వచనాన్ని చూడటానికి, ఆ పదం ముందు define అని జోడించండి. 
  • గణనలు: 3*9123 లాంటి గణిత సమీకరణాన్ని ఎంటర్ చేయండి లేదా సంక్లిష్టమైన గ్రాఫింగ్ సమీకరణాలను పరీక్షించండి.
  • యూనిట్ మారకాలు: 3 డాలర్లు అంటే రూపాయలలో ఎంత లాంటి ఏదైనా మారకాన్ని ఎంటర్ చేయండి.
  • క్రీడలు: మీ జట్టు షెడ్యూల్, గేమ్ స్కోర్‌లు, మరిన్నింటిని చూడటానికి మీ జట్టు పేరు కోసం వెతకండి. 
  • క్విక్ ఫాక్ట్స్: సంబంధిత సమాచారాన్ని కనుగొనడానికి సెలబ్రిటీ పేరు, లొకేషన్, సినిమా లేదా పాట కోసం సెర్చ్ చేయండి. 

నిపుణుల సెర్చ్ చిట్కాలు

బాగా అనుభవం ఉన్న వారి లాగా వెతకడానికి మీకు సహాయపడే మరిన్ని చిట్కాలు మరియు సూచనలు కావాలా? దిగువున ఇచ్చిన లింక్‌లను సందర్శించడం ద్వారా మరింత అధునాతన శోధన పద్ధతుల గురించి తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
405217252086150023
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false