నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

Googleలో Search యొక్క ముదురు రంగు రూపం

Chrome లేదా Firefox వంటి బ్రౌజర్‌లో, మీరు Google Search కోసం మీకు ఇష్టమైన రూపాన్ని ఎంచుకోవచ్చు. మీరు Search పేజీల కోసం నిర్దిష్ట రంగు స్కీమ్‌ను కావాలనుకుంటే, మీరు ఎల్లప్పుడూ లేత రంగు రూపం లేదా ముదురు రంగు రూపంను ఉపయోగించడానికి ఎంచుకోవచ్చు. Search పేజీలలో Google హోమ్‌పేజీ, సెర్చ్ ఫలితాల పేజీ, అలాగే Search సెట్టింగ్‌లు ఉన్నాయి.

Search పేజీల కోసం రూపాన్ని ఎంచుకోండి

ముఖ్యమైనది: ఆటోమేటిక్‌గా, Search పేజీల కోసం రంగు స్కీమ్ మీరు ఉన్న పరికరం రంగు స్కీమ్‌కు సరిపోతుంది.

Search కోసం మీ ఇష్టమైన రూపాన్ని మార్చడానికి, మీరు మీ Search సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయవచ్చు. మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు మీరు ఎంచుకున్న రూపం ప్రతి డెస్క్‌టాప్‌లో సేవ్ చేయబడుతుంది.

  1. మీ కంప్యూటర్‌లో, google.comలో సెర్చ్ చేయండి.
  2. మీ డెస్క్‌టాప్ బ్రౌజర్‌లు అన్నింటిలోనూ ఒకే Search సెట్టింగ్‌లు కావాలంటే, మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి. ఎగువ కుడివైపున, సైన్ ఇన్ చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మీరు మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్‌ను కనుగొంటే, మీరు ఇప్పటికే సైన్ ఇన్ చేసినట్టు అర్ధం.
  3. ఎగువ ఎడమ వైపున, సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. ఎడమ వైపున, కనిపించే తీరు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. పరికర ఆటోమేటిక్ సెట్టింగ్, ముదురు రంగు రూపం, లేదా లేత రంగు రూపం అనే ఆప్షన్‌లను ఎంచుకోండి.
    • పరికర ఆటోమేటిక్ సెట్టింగ్: మీ ప్రస్తుత పరికరానికి సంబంధించిన రంగు స్కీమ్‌ను ఆటోమేటిక్‌గా సరిపోల్చండి
    • ముదురు రంగు రూపం: ముదురు రంగు బ్యాక్‌గ్రౌండ్‌లో లేత రంగు టెక్స్ట్
    • లేత రంగు రూపం: లేత రంగు బ్యాక్‌గ్రౌండ్‌లో ముదురు రంగు టెక్స్ట్
  6. దిగువున, సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
చిట్కా: రూపాల మధ్య త్వరగా మారడానికి, సెట్టింగ్‌లు ఆ తర్వాత పరికర ఆటోమేటిక్ సెట్టింగ్, ముదురు రంగు రూపం, లేదా లేత రంగు రూపం అనే ఆప్షన్‌లను క్లిక్ చేయండి.

మొబైల్ పరికరాలలో రూపాన్ని ఎంచుకోండి

ముఖ్యమైనది: ఆటోమేటిక్‌గా, Search పేజీల కోసం రంగు స్కీమ్ మీరు ఉన్న పరికరం రంగు స్కీమ్‌కు సరిపోతుంది.

మొబైల్ పరికరాలు, టాబ్లెట్‌లలో Search కోసం మీ ఇష్టమైన రూపాన్ని మార్చడానికి, మీ Search సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి మీరు ఉపయోగించే అన్ని మొబైల్ పరికరాలు, టాబ్లెట్‌లలో మీ రూపం సెట్టింగ్‌లు సేవ్ చేయబడతాయి.
  1. మీ మొబైల్ పరికరం లేదా టాబ్లెట్‌లో, google.comలో సెర్చ్ చేయండి.
  2. మొబైల్ పరికరం బ్రౌజర్‌లు అన్నింటిలోనూ ఒకే Search సెట్టింగ్‌లు కావాలంటే, మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి. పైన కుడి వైపున, సైన్ ఇన్‌ను ట్యాప్ చేయండి.
    • మీరు మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్‌ను కనుగొంటే, మీరు ఇప్పటికే సైన్ ఇన్ చేసినట్టు అర్ధం.
  3. ఎగువ ఎడమవైపున ఉన్న, మరిన్ని More ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. “కనిపించే తీరు,” కింద పరికర ఆటోమేటిక్ సెట్టింగ్, ముదురు రంగు రూపం, లేదా లేత రంగు రూపాన్ని ఎంచుకోండి.
    • పరికర ఆటోమేటిక్ సెట్టింగ్: మీ ప్రస్తుత పరికరానికి సంబంధించిన రంగు స్కీమ్‌ను ఆటోమేటిక్‌గా సరిపోల్చండి
    • ముదురు రంగు రూపం: ముదురు రంగు బ్యాక్‌గ్రౌండ్‌లో లేత రంగు టెక్స్ట్
    • లేత రంగు రూపం: లేత రంగు బ్యాక్‌గ్రౌండ్‌లో ముదురు రంగు టెక్స్ట్
చిట్కా: రూపాల మధ్య త్వరగా మారడానికి, మరిన్ని More ఆ తర్వాత ముదురు రంగు రూపం: ఆన్ లేదా ముదురు రంగు రూపం: ఆఫ్ ఆప్షన్‌లను క్లిక్ చేయండి.

ఇతర ప్రోడక్ట్‌ల కోసం ముదురు రంగు రూపం గురించి తెలుసుకోండి

సంబంధిత రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6189287017192183085
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false