ఫోటోలు & వీడియోలు షేర్ చేయడం

మీ కాంటాక్ట్‌లు Google Photos యాప్ ఉపయోగించకపోయినా కూడా, మీరు వారితో ఫోటోలను, వీడియోలను, హైలైట్ వీడియోలను షేర్ చేయవచ్చు.

సంభాషణలో ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, photos.google.comను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. ఫోటో లేదా వీడియో పైన మీ కర్సర్‌ను ఉంచి, ఎంపిక చేయండిని Done క్లిక్ చేయండి.
  4. 'షేర్ చేయి Share' ఎంపికను క్లిక్ చేయండి.
  5. "Google Photos ద్వారా పంపండి" కింద, షేర్ చేయాలనుకునే వ్యక్తులను ఎంచుకోండి.
    • ఒక వ్యక్తితో షేర్ చేయడానికి, వారి పేరుపై క్లిక్ చేయండి.
    • ప్రత్యేకంగా ఒకరిని కనుగొనడానికి, 'సెర్చ్ ' ఎంపికపై క్లిక్ చేయండి. వారి పేరు, ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
    • గ్రూప్‌తో షేర్ చేయడానికి, కొత్త గ్రూప్ క్లిక్ చేసి, ఆపై అనేక వ్యక్తులను ఎంచుకోండి.
    • షేర్ చేయడాన్ని మరింత సులభం చేయడానికి, Google మీ ఇంటరాక్షన్‌ల ఆధారంగా షేర్ చేయడానికి వ్యక్తులను సూచిస్తుంది.
  6. తప్పనిసరి కాదు: మీరు షేర్ చేసే మీడియాతో పాటు ఏదైనా మెసేజ్‌ను పంపాలనుకుంటే, ఇక్కడ రాయండి.
  7. పంపండి అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

చిట్కా: సంభాషణలలో గరిష్ఠంగా 20,000 ఫోటోలు మాత్రమే పంపగల పరిమితి ఉంది.

షేర్ చేసిన ఆల్బమ్‌ను క్రియేట్ చేయండి

ముఖ్య గమనిక: మీరు ఆల్బమ్‌ను షేర్ చేసినప్పుడు, ఆల్బమ్‌కు యాక్సెస్ ఉన్న ఎవరైనా ఫోటోలను చూడగలరు, అలాగే ఆల్బమ్‌కు కొత్తవి జోడించగలరు. షేర్ చేసిన కంట్రోల్స్ మీ ఫోటోలకు మరింత గోప్యతను ఎలా అందిస్తాయో తెలుసుకోండి.

  1. మీ కంప్యూటర్‌లో, photos.google.comను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. ఎడమ వైపున, Photosని క్లిక్ చేయండి.
  4. ఫోటో లేదా వీడియో పైన మీ కర్సర్‌ను ఉంచి, 'ఎంపిక చేయి Done' క్లిక్ చేయండి.
  5. ఎగువున, 'దీనికి యాడ్ చేయి లేదా కొత్తది క్రియేట్ చేయి Add' ఎంపికను క్లిక్ చేయండి.
  6. షేర్ చేసిన ఆల్బమ్ ఆ తర్వాత కొత్త షేర్ చేసిన ఆల్బమ్ ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  7. ఆల్బమ్ టైటిల్‌ను ఎంటర్ చేయండి.
  8. ఎగువున కుడి వైపున, షేర్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  9. ఆల్బమ్‌ను ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో, వారిని ఎంచుకుని, 'పంపండి Send' ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
లింక్‌ను పంపండి లేదా ఇతర యాప్‌ల ద్వారా షేర్ చేయండి

ముఖ్య గమనిక: మీరు మీ ఫోటోలకు లింక్‌ను షేర్ చేసినప్పుడు, లింక్‌ను కలిగి ఉన్న ఎవరైనా వాటిని చూడగలరు. షేర్ చేసిన ఆల్బమ్ కంట్రోల్స్ మీ ఫోటోలకు మరింత గోప్యతను ఎలా అందిస్తాయో తెలుసుకోండి.

  1. మీ కంప్యూటర్‌లో, photos.google.comను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. ఫోటో లేదా వీడియో పైన మీ కర్సర్‌ను ఉంచి, ఎంపిక చేయండిని Done క్లిక్ చేయండి. 
  4. లింక్‌ను పంపడానికి, 'షేర్ చేయి Share' ఎంపికను క్లిక్ చేయండి.
  5. మీ లింక్‌ను ఎలా షేర్ చేయాలో ఎంచుకోండి.
    • లింక్‌ను షేర్ చేయడానికి, లింక్‌ను క్రియేట్ చేయి ఎంపికను క్లిక్ చేయండి.
    • ఇతర యాప్‌ల ద్వారా షేర్ చేయడానికి, మీరు ఉపయోగించాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి.

మీ ఆల్బమ్‌లు, సంభాషణలను మేనేజ్ చేయండి, రివ్యూ చేయండి లేదా వదిలిపెట్టండి

మీరు షేర్ చేసిన ఆల్బమ్‌లను, సంభాషణలను కనుగొనండి
  1. మీ కంప్యూటర్‌లో, photos.google.comకు వెళ్లండి.
  2. ఎగువున ఎడమ వైపు, షేరింగ్ ను క్లిక్ చేయండి. మీ షేర్ చేసిన ఆల్బమ్‌లు, సంభాషణలు, కామెంట్‌లు, ఇటీవల యాడ్ చేసిన ఫోటోల వంటి షేరింగ్ యాక్టివిటీని మీరు కనుగొనగలరు.
ఆల్బమ్ నుండి వైదొలగండి

ముఖ్యమైన విషయం: మీరు షేర్ చేసిన ఆల్బమ్ నుండి నిష్క్రమిస్తే, మీరు యాడ్ చేసిన అన్ని ఫోటోలు, వీడియోలు, కామెంట్‌లు, లైక్‌లు తీసివేయబడతాయి.

  1. ఆల్బమ్‌పై క్లిక్ చేయండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని More ఆ తర్వాత ఆల్బమ్ నుండి నిష్క్రమించండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
సంభాషణ నుండి వైదొలగండి

ముఖ్యమైన విషయం: మీరు సంభాషణ నుండి నిష్క్రమిస్తే, మీరు యాడ్ చేసిన అన్ని ఫోటోలు, వీడియోలు, కామెంట్‌లు, లైక్‌లు తీసివేయబడతాయి.

  1. సంభాషణపై క్లిక్ చేయండి.
  2. సంభాషణలో, మీ ఖాతా చిహ్నం లేదా మొదటి అక్షరాన్ని క్లిక్ చేయండి.
  3. మీ పేరు పక్కన ఉన్న, నిష్క్రమించండి ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

ఆల్బమ్‌లు, సంభాషణల నుండి వ్యక్తులు లేదా ఐటెమ్‌లను తీసివేయండి

ఆల్బమ్ నుంచి ఎవరినైనా తీసివేయండి

ముఖ్యమైన విషయం: ఆల్బమ్ నుండి వేరొకరిని తీసివేయాలంటే మీరు తప్పనిసరిగా దాని ఓనర్ అయ్యుండాలి.

  1. మీరు వేరొకరిని తీసివేయాలనుకుంటున్న ఆల్బమ్‌ను తెరవండి.
  2. 'మరిన్ని More ఆ తర్వాత ఆప్షన్‌లు' క్లిక్ చేయండి.
  3. మీరు తీసివేయాలనుకుంటున్న కాంటాక్ట్‌ను కనుగొనడానికి స్క్రోల్ చేయండి.
  4. 'మరిన్ని More ఆ తర్వాత వ్యక్తిని తీసివేయి' ఎంపికను క్లిక్ చేయండి.
ఫోటోలను, వీడియోలను తీసివేయండి
  1. షేర్ చేసిన ఆల్బమ్ లేదా సంభాషణ థ్రెడ్‌లో, ఫోటో లేదా వీడియో పైన క్లిక్ చేయండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని More ఆ తర్వాత తీసివేయండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
కామెంట్‌లను, లైక్‌లను తీసివేయండి
  1. షేర్ చేసిన ఆల్బమ్ లేదా సంభాషణ థ్రెడ్‌లో, కామెంట్ లేదా లైక్ పక్కన ఉన్న తేదీపై క్లిక్ చేయండి.
  2. తొలగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు ఫోటోలు, వీడియోలు షేర్ చేసినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోండి

మీరు Google Photosలో ఒక కాంటాక్ట్‌కు పంపినప్పుడు:

  • వ్యక్తులు యాప్‌లో ఒక నోటిఫికేషన్‌ను, అలాగే ఒక పుష్ నోటిఫికేషన్‌ను పొందుతారు. కొత్త ఆల్బమ్ లేదా సంభాషణ అయితే, వారు ఒక ఇమెయిల్ నోటిఫికేషన్‌ను పొందుతారు.
  • షేర్ చేసిన ఐటెమ్‌లు వారి షేరింగ్ పేజీలో కనిపిస్తాయి.
  • వారి ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా మొదటి అక్షరం ఆల్బమ్ లేదా సంభాషణకు యాడ్ అవుతుంది, వారు ఆల్బమ్ లేదా సంభాషణను చూసే వరకు అది అస్పష్టంగా కనిపిస్తుంది.
  • వారు ఆల్బమ్ లేదా సంభాషణను చూసినప్పుడు, వారు చూసిన తాజా ఫోటోలు, కామెంట్‌లు లేదా లైక్‌లు పక్కన ఉన్న యాక్టివిటీ వీక్షణలో వారి ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా మొదటి అక్షరం కనిపిస్తుంది.
  • వారు షేర్ చేసిన ఆల్బమ్ లేదా సంభాషణలో చేరితే లేదా ఫోటోలను లైక్, కామెంట్ చేస్తే లేదా జోడిస్తే, వారి ప్రొఫైల్ ఇమేజ్ అన్నది వారి ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్‌గా మారుతుంది.
  • మీరు గతంలో లింక్ షేరింగ్ ద్వారా షేర్ చేసిన ఫోటోను ఎడిట్ చేస్తే, ఒరిజినల్ లింక్ ద్వారా వ్యక్తులు ఎడిట్ చేయని వెర్షన్‌ను తాత్కాలికంగా చూడవచ్చు.
మీరు షేర్ చేసిన ఆల్బమ్‌లు లేదా సంభాషణలలో ఫోటోలను లేదా వీడియోలను జోడించినప్పుడు
  • మీరు జోడించే అన్ని ఫోటోలలో మీ ప్రొఫైల్ పేరు కనిపిస్తుంది.
  • మీరు జోడించే కొత్త ఫోటోల పక్కన మీ ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ కనిపిస్తుంది.
  • మీరు పూర్తిగా లేదా పాక్షికంగా స్లో మోషన్‌లో క్యాప్చర్ చేసిన వీడియోను షేర్ చేస్తే, వీక్షకులు ఆ వీడియోలోని ఏ భాగాన్ని అయినా మరింత తక్కువ వేగంతో వారి సొంత ప్లేయర్‌లో చూడవచ్చు.
ఎవరైనా మీతో ఆల్బమ్ లేదా సంభాషణను షేర్ చేసినప్పుడు

ముఖ్య గమనిక: ఎవరైనా మిమ్మల్ని స్పామ్ చేస్తున్నారని లేదా ఇతర దుర్వినియోగ పాలసీలను ఉల్లంఘిస్తున్నారని మీరు భావిస్తే, మీరు వారిని బ్లాక్ చేయవచ్చు లేదా రిపోర్ట్ చేయవచ్చు. మా దుర్వినియోగ పాలసీల గురించి మరింత తెలుసుకోండి.

  • మీరు యాప్‌లో ఒక నోటిఫికేషన్‌ను, అలాగే ఒక పుష్ నోటిఫికేషన్‌ను పొందుతారు. కొత్త ఆల్బమ్ లేదా సంభాషణ అయితే, మీరు ఇమెయిల్ నోటిఫికేషన్‌ను పొందుతారు.
  • షేర్ చేసిన ఐటెమ్ మీ షేరింగ్ పేజీలో కనిపిస్తుంది.
  • మీరు ఆల్బమ్ లేదా సంభాషణను చూసినప్పుడు, మీ ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా ఆల్బమ్‌లోని మొదటి అక్షరం కాంతివంతం అవుతుంది, అలాగే మీరు చూసిన తాజా ఫోటోలు, కామెంట్‌లు లేదా లైక్‌ల పక్కన అది కనిపిస్తుంది.
  • మీరు షేర్ చేసిన ఆల్బమ్ లేదా సంభాషణలో చేరితే, ఫోటోలను లైక్ చేస్తే, కామెంట్ చేస్తే లేదా జోడిస్తే, మీ ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ మీరు తీసుకున్న చర్య పక్కన కనిపిస్తుంది.
  • ఎవరైనా మీతో లింక్‌ను షేర్ చేసిన తర్వాత ఫోటోను ఎడిట్ చేస్తే, ఒరిజినల్ లింక్ షేరింగ్ వెంటనే ఫోటోకు చెందిన కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ కాకపోవచ్చు.
మీతో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలను సేవ్ చేయండి

మీతో షేర్ చేయబడిన ఫోటో లేదా వీడియోను మీరు సేవ్ చేసినప్పుడు, మీ లైబ్రరీలో దాని కాపీని మీరు అందుకుంటారు. షేర్ చేయబడిన ఒరిజినల్ ఫోటో సేవ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఏవైనా ఎడిట్‌లు మీ సేవ్ చేసిన కాపీకి వర్తించవు. నిర్దిష్ట పార్ట్‌నర్ షేరింగ్ సందర్భాలలో మినహా సేవ్ చేయబడిన ఫోటోలు, వీడియోలు మీ కోటాలో లెక్కించబడతాయి. పార్ట్‌నర్ షేరింగ్ గురించి మరింత తెలుసుకోండి.

మీ పరికర గ్యాలరీ యాప్‌లో ఫోటోలు లేదా వీడియోలను కనుగొనడానికి, మీరు వాటిని తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫోటోలు లేదా వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవలో తెలుసుకోండి.

సంభాషణలో మీతో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలను సేవ్ చేయడానికి:

  1. సంభాషణలో, మీరు సేవ్ చేయాలనుకుంటున్న ఫోటో లేదా వీడియోకు స్క్రోల్ చేయండి.
  2. ఫోటో లేదా వీడియో కింద, సేవ్ చేయండి  ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

షేర్ చేసిన ఆల్బమ్‌లో, మీరు వీటిని చేయవచ్చు:

  • మీ లైబ్రరీ‌కి ఫోటో లేదా వీడియో‌ను సేవ్ చేయండి: ఆల్బమ్‌లో, మీరు సేవ్ చేయాలనుకుంటున్న ఫోటో లేదా వీడియో‌ను క్లిక్ చేయండి. ఎగువున, సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  • ఆల్బమ్‌లోని అన్ని ఫోటోలు, వీడియోలను మీ లైబ్రరీలో సేవ్ చేయండి: ఆల్బమ్‌లో, ఎగువ కుడి వైపున, సేవ్ చేయండి  ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  • మీ ఆల్బమ్‌ల ట్యాబ్‌లో ఆల్బమ్‌ను సేవ్ చేయండి: ఆల్బమ్‌లో, మరిన్ని ఆ తర్వాత ఆల్బమ్‌లలో చూపండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.

చిట్కా: మీ ఆల్బమ్‌ల ట్యాబ్‌లో షేర్ చేసిన ఆల్బమ్‌ను సేవ్ చేసినప్పుడు, మీ ఆల్బమ్‌ల ట్యాబ్‌లో ఆల్బమ్ కాపీని మీరు అందుకుంటారు. ఇది మీ లైబ్రరీకి ఆల్బమ్ కంటెంట్‌ను సేవ్ చేయదు.

సంబంధిత రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14335759844729551574
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
105394
false
false