ఫోటోలు & వీడియోలు షేర్ చేయడం

మీ కాంటాక్ట్‌లు Google Photos యాప్ ఉపయోగించకపోయినా కూడా, మీరు వారితో ఫోటోలను, వీడియోలను, హైలైట్ వీడియోలను షేర్ చేయవచ్చు.

మీరు ప్రారంభించే ముందు

సంభాషణలో ఫోటోలను, వీడియోలను షేర్ చేయండి.

Google ఖాతా ఉన్న ఎవరైనా మీ కాంటాక్ట్‌లలో ఉంటే లేదా వారి ఇమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్‌ను మీరు వెతికి, వారితో నేరుగా షేర్ చేయవచ్చు. మిగిలిన అందరికీ, మీరుషేర్ చేయడానికి లింక్‌ను క్రియేట్ చేయండి.

మీ కాంటాక్ట్ యొక్క ఫోన్ నంబర్ వారి Google ఖాతాతో అనుబంధించి లేకపోతే, వారు మిమ్మల్ని కనుగొని, మీతో కనెక్ట్ అయ్యేలా మీరు చేయవచ్చు. మీ కాంటాక్ట్‌కు Google ఖాతా లేకపోతే, మీరు వారికి లింక్‌ను పంపవచ్చు లేదా బదులుగా వేరే యాప్‌ను ఉపయోగించి షేర్ చేయవచ్చు.

సంభాషణలోని ఇతర వ్యక్తులతో షేర్ చేయడానికి:

  1. మీ మొబైల్ పరికరంలో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. ఫోటో, ఆల్బమ్ లేదా వీడియోను ఎంచుకోండి.
  4. 'షేర్ చేయండి' Share అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. "Google Photos ద్వారా పంపు" కింద, షేర్ చేయాలనుకునే వ్యక్తులను ఎంచుకోండి. 
    • ఒక వ్యక్తితో షేర్ చేయడానికి, వారి పేరుపై ట్యాప్ చేయండి.
    • ప్రత్యేకంగా ఒకరిని కనుగొనడానికి, సెర్చ్‌పై ట్యాప్ చేయండి. వారి పేరు, ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
    • ఒకరి కంటే ఎక్కువ మందితో షేర్ చేయడానికి, పలు వ్యక్తులను ఎంచుకోండి.
    • (ఆప్షనల్) మీరు షేర్ చేసే మీడియాకు ఒక మెసేజ్‌ను జోడించండి.
    • మీ ఇంటరాక్షన్‌ల ఆధారంగా Google సూచనలు చేస్తుంది. సూచనల గురించి మరింత తెలుసుకోండి.
  6. షేర్ చేయడానికి, పంపండి అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. ఇది కొనసాగుతున్న సంభాషణ థ్రెడ్‌ను క్రియేట్ చేస్తుంది, ఇందులో మీరు, మీరు షేర్ చేసిన వ్యక్తులు అదనంగా ఫోటోలు, వీడియోలు, కామెంట్‌లు, లైక్‌లను కాలానుగుణంగా జోడించవచ్చు.  

చిట్కాలు

  • సంభాషణలలో గరిష్ఠంగా 20,000 ఫోటోలు మాత్రమే పంపగల పరిమితి ఉంది. 
  • సూచించబడిన షేరింగ్ కాంటాక్ట్‌ను దాచడానికి, వారి ప్రొఫైల్ ఫోటోను నొక్కి, పట్టుకోండి, సూచనను దాచండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. తర్వాత వారితో ఏదైనా షేర్ చేయడానికి వారిని మళ్లీ కనుగొనడానికి, Search ఆప్షన్‌ను ట్యాప్ చేసి, వారి పేరును ఎంటర్ చేయండి, దాచబడిన సూచనలను చూడండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ మొత్తం లైబ్రరీని కూడా ఎవరితోనైనా ఆటోమేటిక్‌గా షేర్ చేయవచ్చు.

షేర్ చేసిన ఆల్బమ్‌ను క్రియేట్ చేయండి
  1. మీ మొబైల్ పరికరంలో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. కింద ఉన్న, Photosపై ట్యాప్ చేయండి.
  4. ఆల్బమ్ కోసం ఫోటోలు లేదా వీడియోలను ఎంచుకోండి. 
  5. ఎగువున ఉన్న, 'జోడించు' Addను ట్యాప్ చేయండి. 
  6.  షేర్ చేసిన ఆల్బమ్‌పై ట్యాప్ చేయండి. 
  7. ఆల్బమ్ టైటిల్‌ను ఎంటర్ చేయండి. 
  8. ఆల్బమ్ పూర్తయిన తర్వాత, 'షేర్ చేయి'ని ట్యాప్ చేయండి. 
  9. మీ ఆల్బమ్‌ను ఎవరితో షేర్ చేసుకోవాలో ఎంచుకోండి.

ముఖ్య గమనిక:

ఇతర యాప్‌లకు లింక్‌ను పంపండి లేదా షేర్ చేయండి
  1. మీ మొబైల్ పరికరంలో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. ఫోటో, ఆల్బమ్ లేదా వీడియోను ఎంచుకోండి.
  4. 'షేర్ చేయండి' Share అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. “యాప్‌లకు షేర్ చేయండి” అనే ఆప్షన్ కింద, షేర్ చేయడానికి వేరొక యాప్‌ను ఎంపిక చేయండి. మరిన్ని యాప్‌లను కనుగొనడానికి ఎడమ వైపునకు స్వైప్ చేయండి. 
  6. లింక్‌ను క్రియేట్ చేసి, షేర్ చేయడానికి లింక్‌ను క్రియేట్ చేయండి.

షేర్ చేసిన లింక్ ఉన్న ఎవరైనా ఆల్బమ్‌ను చూడగలరు. మీ షేరింగ్ ఆప్షన్‌లను ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి.

మీ సంభాషణలను, ఆల్బమ్‌లను మేనేజ్ చేయండి, సమీక్షించండి లేదా వాటి నుండి వైదొలగండి

మీరు షేర్ చేసిన ఆల్బమ్‌లను, సంభాషణలను కనుగొనండి
  1. మీ మొబైల్ పరికరంలో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. పైన ఉన్న, షేరింగ్‌ను  ట్యాప్ చేయండి.
    • ముఖ్య గమనిక: కొంత మంది యూజర్‌ల కోసం, షేరింగ్ ఆప్షన్ కింద ఉంటుంది.
  3. మీరు షేర్ చేసిన ఆల్బమ్‌లను, కామెంట్‌లు, ఇటీవల జోడించిన ఫోటోల వంటి షేరింగ్ యాక్టివిటీని యాక్సెస్ చేయవచ్చు. కొత్త షేరింగ్ యాక్టివిటీ బోల్డ్‌లో కనిపిస్తుంది.
ఒక ఆల్బమ్‌ను రివ్యూ చేయండి
  1. మీరు షేర్ చేసిన ఆల్బమ్‌ను తెరవండి.

  2. మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఆప్షన్‌లను క్లిక్ చేయండి.

ఆల్బమ్ నుండి వైదొలగండి

మీరు షేర్ చేసిన ఆల్బమ్ నుండి వైదొలగినట్లయితే, మీరు యాడ్ చేసిన అన్ని ఫోటోలు, వీడియోలు, కామెంట్‌లు, లైక్‌లు తీసివేయబడతాయి.

ఆల్బమ్ నుండి వైదొలగడానికి:

  1. ఆల్బమ్‌పై క్లిక్ చేయండి.
  2. పైన కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత  ఆల్బమ్ నుండి వైదొలగండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
సంభాషణ నుండి వైదొలగండి

మీరు సంభాషణ నుండి వైదొలగినట్లయితే, మీరు యాడ్ చేసిన అన్ని ఫోటోలు, వీడియోలు, కామెంట్‌లు, లైక్‌లు తీసివేయబడతాయి.

సంభాషణ నుండి వైదొలగడానికి:

  1. సంభాషణను ట్యాప్ చేయండి.
  2. పైన, మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. మీ పేరు పక్కన, 'వైదొలగండి'ని ట్యాప్ చేయండి.

Remove people or items from albums & conversations

ఆల్బమ్ నుంచి ఎవరినైనా తీసివేయండి

ఆల్బమ్ నుంచి వేరొకరిని తీసివేయండి

ఆల్బమ్ నుంచి వేరొకరిని తీసివేయాలంటే మీరు తప్పనిసరిగా దాని ఓనర్ అయ్యుండాలి.

  1. కావాల్సిన ఆల్బమ్‌ను తెరవండి.
  2. మరిన్నిమరిన్ని ఆ తర్వాతఆప్షన్‌లును క్లిక్ చేయండి.
  3. మీరు తీసివేయాలనుకుంటున్న కాంటాక్ట్‌ను కనుగొనడానికి స్క్రోల్ చేయండి.
  4. మరిన్ని మరిన్ని ఆ తర్వాత వ్యక్తిని తీసివేయిని క్లిక్ చేయండి.
ఫోటోలను, వీడియోలను తీసివేయండి

మీరు సంభాషణలు, షేర్ చేసిన ఆల్బమ్‌లకు జోడించిన ఫోటోలను, వీడియోలను తీసివేయవచ్చు.

ఫోటోలను, వీడియోలను తీసివేయడానికి:

  1. షేర్ చేసిన ఆల్బమ్ లేదా సంభాషణ థ్రెడ్‌లో, ఫోటో లేదా వీడియో పైన క్లిక్ చేయండి.
  2. పైన కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత తీసివేయండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
కామెంట్‌లను, లైక్‌లను తీసివేయండి

కామెంట్‌లను, లైక్‌లను తీసివేయడానికి:

  1. షేర్ చేసిన ఆల్బమ్ లేదా సంభాషణ థ్రెడ్‌లో, కామెంట్ లేదా లైక్‌ను క్లిక్ చేయండి. 
  2. తొలగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Learn about what happens when you share photos & videos

మీరు షేర్ చేసినప్పుడు ఏమవుతుంది
  • మీరు Google Photosలో కాంటాక్ట్‌కు ఏదైనా పంపినప్పుడు:
    • మీరు కాంటాక్ట్‌లతో ఏదైనా షేర్ చేసి ఉంటే, వారు యాప్‌లో నోటిఫికేషన్, యాప్ నుండి పుష్ నోటిఫికేషన్‌లను పొందుతారు. షేర్ చేసిన ఐటెమ్(లు) వారికి షేర్ చేసిన పేజీలో, కనిపిస్తాయి.
    • మీరు కొత్త ఆల్బమ్ లేదా సంభాషణను వారితో షేర్ చేసినప్పుడు, వారు కూడా ఇమెయిల్ నోటిఫికేషన్‌ను అందుకుంటారు.
    • వారి ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా మొదటి అక్షరం ఆల్బమ్ లేదా సంభాషణకు జోడించబడుతుంది, వారు ఆల్బమ్ లేదా సంభాషణను చూసే వరకు అది అస్పష్టంగా కనిపిస్తుంది.
    • వారు ఆల్బమ్ లేదా సంభాషణను చూసినప్పుడు, వారు చూసిన తాజా ఫోటోలు, కామెంట్‌లు లేదా లైక్‌లు పక్కన ఉన్న యాక్టివిటీ వీక్షణలో వారి ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా మొదటి అక్షరం కనిపిస్తుంది.
    • వారు, షేర్ చేసిన ఆల్బమ్‌లో చేరితే లేదా షేర్ చేసిన ఆల్బమ్ లేదా సంభాషణలో ఫోటోలను లైక్, కామెంట్ చేసినా లేదా ఫోటోలను జోడించినా, వారి ప్రొఫైల్ ఇమేజ్, ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా మొదటి అక్షరంగా మారుతుంది
  • మీరు ఫోటోలు లేదా వీడియోలను ఆల్బమ్‌లు లేదా సంభాషణలకు జోడించినప్పుడు, మీ ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా మొదటి అక్షరం, మీరు జోడించిన తాజా ఫోటోల పక్కన కనిపిస్తుంది.
  • మీరు పూర్తిగా లేదా పాక్షికంగా స్లో మోషన్‌లో క్యాప్చర్ చేసిన వీడియోను షేర్ చేస్తే, ఇతరులు ఆ వీడియోలోని ఏ భాగాన్ని అయినా మరింత తక్కువ వేగంతో వారి సొంత ప్లేయర్‌లో చూడవచ్చు.
  • మీరు గతంలో లింక్ షేరింగ్ ద్వారా షేర్ చేసిన ఫోటోను ఎడిట్ చేస్తే, ఒరిజినల్ లింక్ ద్వారా వ్యక్తులు ఎడిట్ చేయని వెర్షన్‌ను తాత్కాలికంగా చూడవచ్చు.
ఎవరైనా మీతో షేర్ చేసినప్పుడు ఏమవుతుంది
మీ కాంటాక్ట్ వారి మీడియాను షేర్ చేయలేకపోతే, వారు మిమ్మల్ని కనుగొని, మీతో కనెక్ట్ అయ్యేలా మీరు సహాయపడవచ్చు.
  • ఎవరైనా మీతో ఆల్బమ్ లేదా సంభాషణను షేర్ చేసినప్పుడు, మీరు ఇమెయిల్‌ను అందుకుంటారు. 
  • మీరు ఇప్పటికే Google ఫోటోలను ఉపయోగిస్తుంటే, మీరు యాప్‌లో నోటిఫికేషన్, పుష్ నోటిఫికేషన్‌లను కూడా అందుకుంటారు, షేర్ చేసినవి, షేర్ చేసిన పేజీలో కనిపిస్తాయి.
  • మీరు ఆల్బమ్ లేదా సంభాషణను చూసినప్పుడు, మీ ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా ఆల్బమ్‌లోని మొదటి అక్షరం హైలైట్ అయ్యి ,  మీరు చూసిన తాజా ఫోటోలు, కామెంట్‌లు లేదా లైక్‌ల పక్కన కనిపిస్తుంది. 
  • మీరు, షేర్ చేసిన ఆల్బమ్‌లో చేరితే లేదా షేర్ చేసిన ఆల్బమ్ లేదా సంభాషణలో ఫోటోలను లైక్, కామెంట్ చేసినా లేదా ఫోటోలను జోడించినా, మీ ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా మొదటి అక్షరం మీరు తీసుకున్న చర్య పక్కన కనిపిస్తుంది. 
  • ఎవరైనా మీతో లింక్‌ను షేర్ చేసిన తర్వాత ఫోటోను ఎడిట్ చేస్తే, ఒరిజినల్ లింక్ షేరింగ్ వెంటనే ఫోటోకు చెందిన కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ కాకపోవచ్చు.
  • ఎవరైనా మిమ్మల్ని స్పామ్ చేస్తున్నారని లేదా ఇతర దుర్వినియోగ పాలసీలను ఉల్లంఘిస్తున్నారని మీరు భావిస్తే, మీరు వారిని బ్లాక్ చేయవచ్చు లేదా రిపోర్ట్ చేయవచ్చు. మా దుర్వినియోగ పాలసీల గురించి మరింత తెలుసుకోండి.
మీతో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలను సేవ్ చేయండి

మీతో షేర్ చేయబడిన ఫోటోను లేదా వీడియోను మీరు సేవ్ చేసినప్పుడు, మీ లైబ్రరీలో దాని కాపీని మీరు అందుకుంటారు. షేర్ చేయబడిన ఒరిజినల్ ఫోటో సేవ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఏవైనా ఎడిట్‌లు మీ సేవ్ చేసిన కాపీకి వర్తించవు. నిర్దిష్ట పార్ట్‌నర్ షేరింగ్ సందర్భాలలో మినహా సేవ్ చేయబడిన ఫోటోలు, వీడియోలు మీ కోటాలో లెక్కించబడతాయి. పార్ట్‌నర్ షేరింగ్ గురించి మరింత తెలుసుకోండి.

మీ పరికర గ్యాలరీ యాప్‌లో ఫోటోలు లేదా వీడియోలను కనుగొనడానికి, మీరు వాటిని తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫోటోలు లేదా వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవలో తెలుసుకోండి.

సంభాషణలో మీతో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలను‌ సేవ్ చేయడానికి:

  1. సంభాషణలో, మీరు సేవ్ చేయాలనుకుంటున్న ఫోటో లేదా వీడియోకు స్క్రోల్ చేయండి. 
  2. ఫోటో లేదా వీడియో కింద, సేవ్ చేయండి  ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. 

షేర్ చేసిన ఆల్బమ్‌లో, మీరు వీటిని చేయవచ్చు:

  • మీ లైబ్రరీకి ఫోటో లేదా వీడియోను సేవ్ చేయండి: మీరు సేవ్ చేయాలనుకుంటున్న ఫోటో లేదా వీడియోపై ట్యాప్ చేయండి. ఎగువున, సేవ్ చేయండి ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
  • ఆల్బమ్‌లోని అన్ని ఫోటోలు, వీడియోలను మీ లైబ్రరీలో సేవ్ చేయండి: యూజర్ చిహ్నాల కింద, సేవ్ చేయండి ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
  • ఆల్బమ్‌ను మీ లైబ్రరీ ట్యాబ్‌లో సేవ్ చేయండి: ఎగువున, మరిన్ని  ఆ తర్వాత లైబ్రరీ‌లో చూపండి ఆప్షన్‌లపై ట్యాప్ చేయండి.

చిట్కా: మీ ఆల్బమ్‌ల ట్యాబ్‌లో షేర్ చేసిన ఆల్బమ్‌ను సేవ్ చేసినప్పుడు, మీ ఆల్బమ్‌ల ట్యాబ్‌లో ఆల్బమ్ కాపీని మీరు అందుకుంటారు. ఇది మీ లైబ్రరీకి ఆల్బమ్ కంటెంట్‌ను సేవ్ చేయదు.

సంబంధిత రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11205203493215251148
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
105394
false
false