మీ గుర్తింపును లేదా పేమెంట్ సమాచారాన్ని వెరిఫై చేయండి

Google ప్రోడక్ట్‌లకు లేదా సర్వీస్‌లకు సైన్ అప్‌లు, లావాదేవీలు, లేదా పేమెంట్ ఆప్షన్ మార్పులు వంటి నిర్దిష్ట Google ఖాతా యాక్టివిటీల కోసం, వినియోగించిన పేమెంట్ ఆప్షన్ గుర్తింపును లేదా యాజమాన్య హక్కును మీరు వెరిఫై చేయాల్సి రావచ్చు.
చిట్కా: Google Pay యాప్‌లో మీ గుర్తింపును వెరిఫై చేయడానికి, ఈ సూచనలను ఫాలో అవ్వండి.

వెరిఫికేషన్ గురించిన వివరాలు

వెరిఫై చేయమని మేము మిమ్మల్ని ఎందుకు అడగాల్సి రావచ్చు
  • మీరు నిర్దిష్ట కంటెంట్‌ను యాక్సెస్ చేసినప్పుడు మీ సమాచారం సరైనదని వెరిఫై చేయడానికి.
  • మీరు Googleతో లావాదేవీని పూర్తి చేసినప్పుడు మీ గుర్తింపును వెరిఫై చేయడానికి.
  • మేము అసాధారణ యాక్టివిటీని లేదా లావాదేవీలను కనుగొన్నప్పుడు.
  • చట్టపరమైన లేదా నియంత్రణ అవసరాల దృష్ట్యా, మాకు మరింత సమాచారం అవసరమైనప్పుడు.

ముఖ్య గమనిక: మీ ఖాతాను వెరిఫై చేయమని మేము మిమ్మల్ని అడిగితే, పెండింగ్‌లో ఏమైనా లావాదేవీలు ఉంటే, అవి రద్దు చేయబడతాయి. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో పెండింగ్‌లో ఉన్న ఛార్జీలు 14 పని దినాలలో కనిపించడం మానేస్తాయి.

ఏ సమాచారాన్ని అందించమని మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది

వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి, ప్రతి ఒక్క పేమెంట్ ఆప్షన్‌ను వెరిఫై చేయమని మిమ్మల్ని అడగవచ్చు. అలా చేయడానికి, మీరు వెరిఫికేషన్ కోడ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.

దీనిని కూడా అందించమని మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది:

  • చట్టపరమైన పేరు
  • మీ పేమెంట్స్ ప్రొఫైల్‌లో ఉపయోగించిన పేరు
  • అడ్రస్
  • పుట్టిన తేదీ
  • మీ ప్రభుత్వ IDకి చెందిన ఇమేజ్
  • అడ్రస్ రుజువు
  • మీ పేమెంట్ ఆప్షన్ యొక్క ఇమేజ్
మేము మీ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము

మీరు అందించే సమాచారాన్ని Google వీటి కోసం ఉపయోగిస్తుంది:

  • మీ గుర్తింపును లేదా పేమెంట్ ఆప్షన్‌ను వెరిఫై చేయడానికి.
  • మోసం, అలాగే దుర్వినియోగం నుండి రక్షించడానికి.
  • Google ప్రోడక్ట్‌ల కోసం వెరిఫికేషన్ సర్వీస్‌లను మెరుగుపరచడానికి.

మీ పేరు, అడ్రస్ వంటి వెరిఫై చేయబడిన మీ సమాచారాన్ని మీ Google ఖాతాతో పాటుగా స్టోర్ చేయడం జరుగుతుంది. మీరు దాన్ని pay.google.com లింక్ ద్వారా మేనేజ్ చేయవచ్చు.

వర్తించినప్పుడు, మీరు సమర్పించే సమాచారాన్ని Google గోప్యతా పాలసీ, Google Payments గోప్యతా ప్రకటనకు అనుగుణంగా హ్యాండిల్ చేయడం జరుగుతుంది.

వెరిఫికేషన్‌ను ఎలా పూర్తి చేయాలి

మీ సమాచారాన్ని వెరిఫై చేయడానికి, మీరు డాక్యుమెంట్‌లను సమర్పించాల్సి రావచ్చు లేదా కోడ్‌ను రిక్వెస్ట్ చేయాల్సి రావచ్చు. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రోడక్ట్‌ను లేదా పూర్తి చేయాలనుకుంటున్న యాక్టివిటీని బట్టి, కొన్ని వెరిఫికేషన్ పద్ధతులు అందుబాటులో ఉండకపోవచ్చు.

  1. payments.google.comకు వెళ్లండి.
  2. మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. ఎగువ కుడి వైపున, అలర్ట్‌లు Alertఆ తర్వాతవెరిఫై చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. వెరిఫై చేయాల్సిన కార్డ్‌కు పక్కన, వెరిఫై చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీ వెరిఫికేషన్ పద్ధతికోసం స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
  6. తప్పనిసరిగా వెరిఫై చేయాల్సిన ప్రతి ఒక్క పేమెంట్ ఆప్షన్ కోసం, పైన పేర్కొన్న దశలను రిపీట్ చేయండి.

వెరిఫికేషన్ పద్ధతులు

వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి, ఈ కింది పద్ధతులలో ఒక దాన్ని ఉపయోగించాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది.

వెరిఫికేషన్ కోడ్‌ను రిక్వెస్ట్ చేయండి
  1. కోడ్‌ను పొందండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. మీ పేమెంట్ ఆప్షన్ జారీ చేసిన వెబ్‌సైట్‌కు వెళ్లి, మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. మీ లావాదేవీ హిస్టరీలో, మీకు "GOOGLE" అనే పేరుతో $1.95 USD కంటే తక్కువ తాత్కాలిక ప్రామాణీకరణ ఛార్జీ కనిపిస్తుంది. చివరి 6 అంకెలు వెరిఫికేషన్ కోడ్ అవుతుంది.
    • తాత్కాలిక ఛార్జీ మొత్తం కరెన్సీ రకాన్ని బట్టి మారుతుంది.
    • కోడ్ మీకు తక్షణమే అందాలి, అయితే కొన్నిసార్లు దీనికి గరిష్ఠంగా 7 రోజులు పట్టవచ్చు.
    • చిట్కా: మీ ఖాతాకు విధించే ఛార్జీ లేదా ప్రామాణీకరణ ఛార్జీ అనేది తాత్కాలికం. ఛార్జీలు 30 రోజుల్లో రీఫండ్ చేయబడతాయి.
  4. 6-అంకెల కోడ్‌ను ఎంటర్ చేయండి.
  5. వెరిఫై చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి

ముఖ్య గమనికలు:

  • ఈ ప్రాసెస్ కోసం మీరు అప్‌లోడ్ చేసే సమాచారం, గుర్తింపు అవసరాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది, సదరు సమాచారం స్థానికంగా ఉండే రెగ్యులేటరీ సంబంధిత ఆవశ్యకతలకు అనుగుణంగా హ్యాండిల్ చేయబడుతుంది.
  • YouTube, Google Store కొనుగోలు వెరిఫికేషన్ విషయంలో, డాక్యుమెంట్ అప్‌లోడ్ పద్ధతి అందుబాటులో లేదు.

మీ గుర్తింపును లేదా పేమెంట్ ఆప్షన్‌ను వెరిఫై చేయడానికి, వెరిఫికేషన్ రిక్వెస్ట్‌ను కనుగొనండి. ఆమోదించిన డాక్యుమెంట్‌లను, సూచనల లిస్ట్‌ను కనుగొనడానికి, వెరిఫికేషన్ రిక్వెస్ట్‌లోని లింక్‌ను ఉపయోగించండి.

మీ డాక్యుమెంట్‌లు ఇలా ఉన్నాయని నిర్ధారించుకోండి:

  • మీరు సబ్‌మిట్ చేసే అన్ని డాక్యుమెంట్‌లలో అదే పూర్తి పేరు ఉండాలి.
  • అవి అప్‌డేట్ అయ్యి ఉండాలి, గడువు ముగిసినవి ఉండకూడదు.
  • స్పష్టంగా ఉండాలి.

మీరు అప్‌లోడ్ చేసే ఇమేజ్ ఇలా ఉందని నిర్ధారించుకోండి:

  • అది డాక్యుమెంట్ తాలూకు ఇమేజ్ తప్ప మరేదీ కాకూడదు
  • అది స్పష్టంగా ఉండాలి
  • అది నలుపు మరియు తెలుపు కాకుండా రంగులో ఉండాలి
  • బ్లర్‌గా, కాంతి తక్కువగా, లేదా మసకబారినట్లుగా ఉండకూడదు
  • పూర్తి డాక్యుమెంట్ తాలూకు మొత్తం 4 మూలలను చూపుతుంది

డాక్యుమెంట్‌లలో మీరు సమాచారాన్ని దాచిపెట్టి ఉంటే:

  • బ్యాంక్ స్టేట్‌మెంట్‌ల కోసం, వీటిని దాచిపెట్టండి:
    • కేవలం చివరి 4 అంకెలు మాత్రమే కనిపించేలా పూర్తి ఖాతా నంబర్‌లు
    • ఏవైనా ఖాతా బ్యాలెన్స్‌లు లేదా లావాదేవీలు. వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం అవసరమైన ఖాతా బ్యాలెన్స్‌లు, లావాదేవీలు
  • దాచిపెట్టడానికి, మీరు గోప్యమైన సమాచారాన్ని అప్‌లోడ్ చేసే ముందు దాన్ని కవర్ చేయడానికి ముదురు రంగు బాక్స్‌ను గీయవచ్చు.

చిట్కాలు:

  • payments.google.com‌లో మీ పేరు, అడ్రస్, పేమెంట్ సమాచారం అప్‌డేట్ అయ్యి ఉన్నాయని నిర్ధారించుకోండి.
  • మీరు మీ డాక్యుమెంట్‌లను సమర్పించిన తర్వాత, వెరిఫికేషన్‌కు కొన్ని రోజుల సమయం పట్టవచ్చు.

బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో వెరిఫై చేయండి (Play డెవలపర్‌లకు మాత్రమే)

నిర్దిష్ట దేశాలు లేదా ప్రాంతాలలో, Google Play డెవలపర్‌లు పంపిణీకి సంబంధించిన తమ పేమెంట్ ఆప్షన్‌ను బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో వెరిఫై చేయాల్సి రావొచ్చు. మీరు అప్‌లోడ్ చేసే బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు 180 రోజుల కంటే పాతవి కాకూడదు.

  1. payments.google.com‌కు సైన్ ఇన్ చేయండి.
  2. సబ్‌స్క్రిప్షన్‌లు, సర్వీసులు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "Google Play యాప్‌లు” కింద, మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. “మీరు పేమెంట్‌ను ఎలా పొందుతారు” అనే దాని కింద, పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. పంపిణీ కోసం మీరు మీ పేమెంట్ ఆప్షన్‌గా జోడించిన బ్యాంక్ ఖాతాను కనుగొనండి.
  6. వెరిఫై చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  7. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ కాపీని అప్‌లోడ్ చేయండి. మీరు ఇమేజ్‌ను లేదా PDFను అప్‌లోడ్ చేయవచ్చు.
    • బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో గోప్యమైన సమాచారాన్ని దాచిపెట్టండి, కానీ దిగువ సమాచారం స్పష్టంగా కనిపించేలా చూసుకోండి:
      • బ్యాంక్ ఖాతా నంబర్‌లోని చివరి 4 అంకెలు
      • రూటింగ్ నంబర్, బ్యాంక్ కోడ్, IFSC కోడ్, సార్ట్ కోడ్, SWIFT కోడ్, లేదా అదే ID యొక్క పూర్తి వివరాలు.
      • మీరు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నారనే దానిపై ఆధారపడి, బ్యాంక్ గుర్తింపు కోడ్ వేరే పేరును కలిగి ఉండవచ్చు.

మీరు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను సమర్పించిన తర్వాత, వెరిఫికేషన్‌కు కొన్ని రోజులు పట్టవచ్చు.

వెరిఫికేషన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి

వెరిఫికేషన్ కోడ్‌లకు, అలాగే తాత్కాలిక ప్రామాణీకరణ ఛార్జీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి

వెరిఫికేషన్ కోడ్‌తో పేమెంట్ ఆప్షన్‌లను వెరిఫై చేయడానికి మీరు ట్రై చేసినప్పుడు ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి.

డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి

సమస్యను పరిష్కరించడానికి:

  • మీరు ఏదయినా ఈమెయిల్ అందుకున్నా లేదా ఎర్రర్ మెసేజ్ వచ్చినా: ఆ మెసేజ్‌లోని సూచనలను ఫాలో అవ్వండి.
  • సమస్యను పరిష్కరించడానికి మీకు మా టీమ్ నుండి సహాయం అవసరమైతే: మీ సమాచారాన్ని రివ్యూ చేసిన తర్వాత మేము మిమ్మల్ని సంప్రదిస్తాము.

వెరిఫికేషన్ విఫలమైంది.

ఒకవేళ మీ వెరిఫికేషన్ విఫలమైతే, ఆ నిర్ణయం తర్వాత కొంత సమయానికి మీకు ఈమెయిల్ అందుతుంది. నిర్ణయాన్ని అప్పీల్ చేయడానికి, ఈమెయిల్‌లోని సూచనలను ఫాలో అవ్వండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10917044093617287034
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
5150109
false
false