ఫిషింగ్ ఇమెయిల్‌లను నివారించండి, రిపోర్ట్ చేయండి

మోసపూరితమైన రిక్వెస్ట్‌లను ఆన్‌లైన్‌లో ఎలా గుర్తించాలో తెలుసుకొని మీ Gmail ఇంకా Google ఖాతాలను సురక్షితం చేయడంలో సహాయపడండి. 

ఫిషింగ్ అంటే ఏమిటి

ఫిషింగ్ అనేది వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఒక ప్రయత్నం లేదా మోసపూరితమైన ఇమెయిల్‌లు, మెసేజ్‌లు, యాడ్‌లు లేదా మీరు ఉపయోగించే సైట్‌ల మాదిరిగానే కనిపించే సైట్‌లను ఉపయోగించి ఆన్‌లైన్ ఖాతాలలోకి చొరబడే ప్రయత్నం. ఉదాహరణకు, ఫిషింగ్ ఇమెయిల్ మీ బ్యాంక్ నుండి వచ్చిన ఇమెయిల్‌లాగా అనిపిస్తుంది అలాగే మీ బ్యాంక్ ఖాతా గురించిన వ్యక్తిగత సమాచారాన్ని రిక్వెస్ట్ చేస్తుంది.

ఫిషింగ్ మెసేజ్‌లు లేదా కంటెంట్ ఈ విధంగా ఉండవచ్చు: 

  • మీ వ్యక్తిగత లేక ఫైనాన్షియల్ సమాచారాన్ని అడగవచ్చు.
  • మిమ్మల్ని లింక్‌లను క్లిక్ చేయమని లేదా సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేయమని అడగవచ్చు.
  • పేరున్న సంస్థ లాగా నటించడం అంటే మీ బ్యాంక్ లాగా లేదా మీరు ఉపయోగించే మీ సోషల్ మీడియా సైట్ లాగా లేదా మీ వర్క్‌ప్లేస్ లాగా చూపవచ్చు. 
  • మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్ లాగా, ఫ్రెండ్ లాగా లేదా సహోద్యోగి లాగా వ్యవహరించవచ్చు.
  • మీరు బాగా నమ్మిన సంస్థ లేదా వ్యక్తి నుంచి వచ్చిన మెసేజ్ లాగా కనిపించవచ్చు.

ఫిషింగ్ మెసేజ్‌లు & కంటెంట్‌ను నివారించడం

మోసపూరిత మెసేజ్‌లు, రిక్వెస్ట్‌లను నివారించడంలో సహాయపడటానికి కింద పేర్కొన్న చిట్కాలను పాటించండి.

1. Google నుండి వచ్చిన హెచ్చరికల విషయంలో జాగ్రత్త పడండి

హానికారకమైన మెసేజ్‌ల నుండి, సురక్షితం కాని కంటెంట్ నుండి లేదా మోసపూరిత వెబ్‌సైట్‌ల నుండి మిమ్మల్ని హెచ్చరించడానికి, Google అధునాతన సెక్యూరిటీని ఉపయోగిస్తుంది. మీరు సెక్యూరిటీకి సంబంధించిన హెచ్చరికను అందుకొని ఉంటే, లింక్‌లను క్లిక్ చేయడం, అటాచ్‌మెంట్‌లను డౌన్‌లోడ్ చేయడం, లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయడం వంటి వాటిని చేయవద్దు. ఒకవేళ మీరు హెచ్చరికను అందుకోకపోయినా సరే, నమ్మదగని లేదా అనామక ప్రొవైడర్‌ల నుండి వచ్చిన లింక్‌లను క్లిక్ చేయవద్దు, ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు, లేదా ఇమెయిల్‌లలో, మెసేజ్‌లలో, వెబ్‌పేజీలలో, లేదా పాప్-అప్‌లలో వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయవద్దు.

2. వ్యక్తిగత సమాచారం కోసం అడిగే రిక్వెస్ట్‌లకు ఎప్పుడూ స్పందించవద్దు

ఇమెయిల్ ద్వారా, టెక్స్ట్ మెసేజ్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారం కోసం వచ్చిన రిక్వెస్ట్‌లకు స్పందించవద్దు. 

కింద పేర్కొన్న వాటితో కూడిన మీ వ్యక్తిగత, ఫైనాన్షియల్ సమాచారాన్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచండి:

  • యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు, వాటికి చేసిన మార్పులతో సహా
  • సోషల్ సెక్యూరిటీ లేదా గవర్నమెంట్ గుర్తింపు నంబర్‌లు
  • బ్యాంక్ ఖాతా నంబర్‌లు
  • పిన్‌లు (వ్యక్తిగత గుర్తింపు సంఖ్యలు)
  • క్రెడిట్ కార్డ్ నంబర్‌లు
  • పుట్టినరోజు
  • మీ తల్లి పుట్టింటి పేరు లాంటి ఇతర ప్రైవేట్ సమాచారం
చిట్కా: మీరు ఏదైనా వెబ్‌సైట్ ప్రాచుర్యమైనదని నిర్ధారణ చేసుకుంటేనే, మీ ఇమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ వంటి కాంటాక్ట్ సమాచారాన్ని ఇవ్వండి. పబ్లిక్ ఫోరమ్‌లలో మీ కాంటాక్ట్ సమాచారాన్ని పోస్ట్ చేయవద్దు.

3. ఏదైనా మెసేజ్‌లోని లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవద్దు

మీరు ఖాతాలోకి సైన్ ఇన్ అయ్యి ఉంటే, Googleలో ఇమెయిల్‌లు మిమ్మల్ని ఆ ఖాతాకు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని అడగవు.

మీరు ఒక లింక్‌ను క్లిక్ చేసినప్పుడు, మీ Gmailకు సంబంధించిన లేదా మీ Google ఖాతాకు సంబంధించిన లేదా ఇతర సర్వీస్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని మిమ్మల్ని కోరితే, మీ సమాచారం ఎంటర్ చేయవద్దు, మీరు ఉపయోగించాలనుకున్న వెబ్‌సైట్‌కు నేరుగా వెళ్లండి. 

Google నుంచి వచ్చినట్లుగా కనబడే సెక్యూరిటీ ఇమెయిల్, ఫేక్ అని మీకు అనిపిస్తే, నేరుగా myaccount.google.com/notificationsకు వెళ్ళండి. ఆ పేజీలో, మీరు మీ Google ఖాతాకు సంబంధించిన ఇటీవలి సెక్యూరిటీ యాక్టివిటీని చెక్ చేసుకోవచ్చు.

4. అత్యవసరం లేదా చాలా వరకు వాస్తవం అనిపించే మెసేజ్‌ల పట్ల జాగ్రత్త వహించండి

స్కామ్ చేసేవారు మిమ్మల్ని ఎమోషన్‌కు గురి చేయడం ద్వారా వేరే ఆలోచన లేకుండా మీరు స్పందించేటట్లు చేస్తారు. 

అత్యవసరం అనిపించే మెసేజ్‌ల పట్ల జాగ్రత్త వహించండి

ఉదాహరణకు, ఇక్కడ పేర్కొన్న వారి నుండి వచ్చినట్లుగా అత్యవసరం అనిపించే మెసేజ్‌ల పట్ల జాగ్రత్త వహించండి: 

  • మీ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్, లేదా ఆఫీస్‌లోని వ్యక్తి లాంటివారైన, మీకు బాగా తెలిసిన వ్యక్తులు. స్కామర్‌లు వారి మెసేజ్‌లు బాగా నిజమైనవని నమ్మించే విధంగా ఉండటానికి, తరచుగా సోషల్ మీడియా ఇంకా పబ్లిక్‌గా అందుబాటులో ఉండే సమాచారాన్ని ఉపయోగించుకుంటారు. మీకు వచ్చిన మెసేజ్ ప్రామాణికతను కనుగొనడానికి, మీ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్, లేదా సహోద్యోగిని నేరుగా సంప్రదించండి. మీరు సాధారణంగా వారితో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే కాంటాక్ట్ సమాచారం ఉపయోగించండి.
  • అధికార యంత్రాంగమైన టాక్స్ కలెక్టర్‌లు, బ్యాంకులు, చట్టాన్ని అమలు పరిచే అధికారులు, లేదా ఆరోగ్య అధికారులు. స్కామర్‌లు పేమెంట్ లేదా గోప్యతతో కూడిన వ్యక్తిగత సమాచారాన్ని రిక్వెస్ట్ చేయడానికి తరచుగా అధికార యంత్రాంగం లాగా నటిస్తుంటారు. వచ్చిన మెసేజ్ ప్రామాణికమైనదా, కాదా అని నిర్ధారించుకోవడానికి సంబంధిత అధికార యంత్రాంగాన్ని నేరుగా కాంటాక్ట్ చేయండి.

చిట్కా: COVID-19 సంబంధిత స్కామ్‌ల గురించి జాగ్రత్త వహించండి, ఇవి క్రమంగా సర్వసాధారణమై పోతున్నాయి. COVID-19 స్కామ్‌లు నివారించడం కోసం చిట్కాల గురించి మరింత తెలుసుకోండి.

ఏదైనా మెసేజ్ చాలావరకు వాస్తవం అనిపించేలా ఉంటే దాని పట్ల జాగ్రత్త వహించండి

చాలా వరకు వాస్తవం అనిపించేలా ఉండే మెసేజ్‌లు లేదా రిక్వెస్ట్‌ల పట్ల జాగ్రత్త వహించండి. ఉదాహరణకు, కింద పేర్కొనబడిన వాటి ద్వారా స్కామ్‌నకు గురికావద్దు:

  • తొందరగా ధనవంతులు అవుతారు అనే స్కామ్‌లు. ఎప్పుడూ కొత్తవారికి డబ్బును గానీ లేదా వ్యక్తిగత సమాచారాన్ని గానీ పంపవద్దు.
  • రొమాన్స్‌కు సంబంధించిన స్కామ్‌లు. మీరు ఆన్‌లైన్‌లో కలిసిన వారికి ఎవరికైనా ఎప్పుడూ డబ్బును కానీ లేదా వ్యక్తిగత సమాచారం కానీ పంపవద్దు.
  • బహుమతి విజేత స్కామ్‌లు. మీరు బహుమతిని లేదా స్వీప్‌స్టేక్‌లు గెలుచుకున్నారని ఎవరైనా క్లెయిమ్ చేసినప్పుడు, ఎప్పుడూ డబ్బును గానీ లేదా వ్యక్తిగత సమాచారం గానీ పంపవద్దు.

5. క్లిక్ చేసే ముందు ఆగి, ఆలోచించండి

స్కామర్‌లు తరచుగా అవాంఛిత సాఫ్ట్‌వేర్‌ను లింక్‌లలో ఇమెయిల్ ద్వారా, సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా, లేదా మెసేజ్‌లు, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా పంపించడానికి ట్రై చేస్తుంటారు. కొత్తవారి నుండి లేదా నమ్మదగని సోర్స్‌ల నుండి వచ్చిన లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.

 ఫిషింగ్ నుండి రక్షించడంలో సహాయపడటానికి, టూల్‌లను ఉపయోగించండి

1. ఫిషింగ్ ఇమెయిల్‌లను గుర్తించడంలో మీకు సహాయ పడటానికి Gmail ఉపయోగించండి

ఫిషింగ్ ఈమెయిల్‌లను ఆటోమేటిక్‌గా గుర్తించి, మీ ఖాతాను రక్షించడంలో సహాయపడటానికి, Gmail రూపొందించబడింది. హానికరమైన ఇమెయిల్‌లు, అటాచ్‌మెంట్‌ల గురించిన హెచ్చరికల కోసం చూడండి.

గమనిక: Gmail ఎప్పటికీ మిమ్మల్ని ఇమెయిల్ ద్వారా మీ పాస్‌వర్డ్ లాంటి వ్యక్తిగత సమాచారం కోసం అడగదు.

మీరు అనుమానాస్పదంగా ఉన్న ఇమెయిల్‌ను పొందినప్పుడు, చెక్ చేయాల్సిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి:

2. Chromeలో సురక్షిత బ్రౌజింగ్‌ను ఉపయోగించండి

మాల్‌వేర్, రిస్క్ ఉన్న ఎక్స్‌టెన్షన్‌లు, ఫిషింగ్ లేదా Google లిస్ట్‌లో ఉండే సురక్షితం కాని సైట్‌ల గురించి అలర్ట్‌లను పొందడానికి, Chromeలో సురక్షిత బ్రౌజింగ్‌ను ఉపయోగించండి

అదనపు రక్షణల కోసం ఇంకా సురక్షిత బ్రౌజింగ్, మొత్తంగా వెబ్ సెక్యూరిటీని మెరుగుపరచడంలో సహాయపడటానికి, మీ సురక్షిత బ్రౌజింగ్ సెట్టింగ్‌లలో మెరుగుపరచిన భద్రత ఎంచుకోండి.

మీరు ఎటువంటి ఛార్జీ లేకుండా Chromeను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

3. సురక్షితం కాని సేవ్ చేయబడిన పాస్‌వర్డ్‌ల కోసం చెక్ చేయండి

మీ ఖాతాలను సురక్షితంగా ఉంచుకోవడంలో సహాయపడటానికి, మీరు మీ Google ఖాతాలో సేవ్ చేయబడిన సురక్షితం కాని పాస్‌వర్డ్‌లను కనుగొని వాటిని మార్చవచ్చు.

4. మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను రక్షించడంలో సహాయపడండి

మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను మీరు Google యేతర సైట్‌లో ఎంటర్ చేసినప్పుడు నోటిఫికేషన్ పొందడానికి, Chromeకు పాస్‌వర్డ్ హెచ్చరికను ఆన్ చేయండి. ఆ విధంగా, ఏదైనా సైట్, Google లాగా వ్యవహరిస్తుంటే, మీకు తెలుస్తుంది, మీ పాస్‌వర్డ్ దొంగిలించబడితే, మీరు దాన్ని మార్చుకోవచ్చు.

5. 2-దశల వెరిఫికేషన్ గురించి తెలుసుకోండి

2-దశల వెరిఫికేషన్‌తో మీ ఖాతాకు అదనపు భద్రతా లేయర్‌ను జోడించడం ద్వారా మీ పాస్‌వర్డ్‌ను దొంగిలించినప్పటికీ మీ ఖాతాను తెరవకుండా నివారించవచ్చు. 2-దశల వెరిఫికేషన్‌తో మీ ఖాతాను రక్షించుకోవడం ఎలాగో తెలుసుకోండి.

ఫిషింగ్ ఇమెయిల్‌లను రిపోర్ట్ చేయండి

ఇమెయిల్ ఫిషింగ్‌గా ఉండవచ్చని లేదా అనుమానాస్పదంగా ఉందని మేము గుర్తించినప్పుడు, హెచ్చరికను చూపిస్తాము లేదా ఇమెయిల్‌ను స్పామ్‌కు తరలిస్తాము. ఈమెయిల్‌కు సరిగ్గా గుర్తును పెట్టనట్లయితే, దాన్ని ఫిషింగ్‌గా గుర్తు పెట్టడానికి లేదా గుర్తును తీసివేయడానికి, కింది దశలను ఫాలో చేయండి.

ముఖ్యమైనది: మీరు ఈమెయిల్‌ను మీ స్పామ్ ఫోల్డర్‌లోకి మాన్యువల్‌గా తరలించినప్పుడు, ఈమెయిల్ కాపీని ఇంకా ఏవైనా అటాచ్‌మెంట్‌లను Google అందుకుంటుంది. స్పామ్ ఇంకా దుర్వినియోగం నుండి మా యూజర్‌లను రక్షించడంలో సహాయపడటానికి, ఈ ఈమెయిల్‌లను, అటాచ్‌మెంట్‌లను Google విశ్లేషించవచ్చు.

ఫిషింగ్ ఈమెయిల్‌ను రిపోర్ట్ చేయడం

  1. కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. మెసేజ్‌ను తెరవండి.
  3. రిప్లయి తర్వాత, మరిన్నిమరిన్నిని క్లిక్ చేయండి.
  4. ఫిషింగ్‌ని రిపోర్ట్ చేయిని క్లిక్ చేయండి.

ఇమెయిల్ తప్పుగా ఫిషింగ్ అని గుర్తు పెట్టబడింది

  1. కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. మెసేజ్‌ను తెరవండి.
  3. రిప్లయి తర్వాత, మరిన్నిమరిన్నిని క్లిక్ చేయండి.
  4. 'ఫిషింగ్ కాదని రిపోర్ట్ చేయి'ని క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17939201830489464427
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false