బౌన్స్ అయిన లేదా తిరస్కరించబడిన ఇమెయిల్‌లను పరిష్కరించడం

పలు కారణాల దృష్ట్యా, స్వీకర్తల ఇమెయిల్ సర్వర్‌లు మీరు పంపే ఇమెయిల్‌లను తిరస్కరించవచ్చు. స్వీకర్తల సర్వర్ ద్వారా అందజేయబడిన ప్రతిస్పందనను ప్రతిబింబించే సందేశాన్ని Gmail అందజేస్తుంది.

దిగువన, మీరు ఎదుర్కొనే అవకాశం ఉన్న కొన్ని సాధారణ ఎర్రర్ సందేశాలను చూడండి. మీ సందేశాలు ఎందుకు బౌన్స్ అవుతున్నాయి అలాగే సమస్యని ఎలా పరిష్కరించాలి కనుగొనండి. 

సాధారణ బౌన్స్ ప్రత్యుత్తరాల వివరణ

"మీరు సంప్రదించేందుకు ప్రయత్నించిన ఇమెయిల్ ఖాతా" ఉనికిలో లేదు

మీ సందేశం ఎందుకు బౌన్స్ అయింది

మీ స్వీకర్త చిరునామా పని చేయకపోవచ్చు లేదా ఇకపై ఉనికిలో లేకపోవచ్చు. లేదా, మీరు టైప్ చేసే సమయంలో తప్పు నమోదు చేసి ఉండవచ్చు.

మీరు చేయగలిగేవి

  1. మీరు ఇమెయిల్ చేస్తున్న అడ్రస్‌లోని ఈ సాధారణ పొరపాటుల కోసం తనిఖీ చేయండి:
    • కొటేషన్ గుర్తులు
    • చిరునామాకి చివరన చుక్కలు
    • చిరునామాకి ముందు లేదా తర్వాత స్పేస్‌లు
    • స్పెల్లింగ్ ఎర్రర్‌లు
  2. అదే వ్యక్తి ఉపయోగిస్తున్న మరొక అడ్రస్ కోసం మీ కాంటాక్ట్‌లను వెతకండి.

మీ ఆఫీస్, స్కూల్ లేదా ఇతర సంస్థలకు సంబంధించిన ఎవరికైనా మీరు ఇమెయిల్ పంపుతున్నప్పుడు ఈ ఎర్రర్‌ని పొందినట్లయితే , మీ అడ్మినిస్ట్రేటర్‌ని సంప్రదించండి.

"మెసేజ్ స్పామ్‌గా ఫ్లాగ్ చేయబడింది" లేదా "మెసేజ్ తాత్కాలికంగా తిరస్కరించబడింది"

మీ సందేశం ఎందుకు బౌన్స్ అయింది

  • మీ సందేశ వచనం లేదా లింక్‌లు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి.
  • మీరు స్వీకర్తలలోని వీరికి, Cc లేదా Bccలలో పెద్ద గుంపుని జోడించారు.

మీరు చేయగలిగేవి

  1. వ్యక్తిగత సమాచారాన్ని కోరే వెబ్‌సైట్‌ల లింక్‌లను తీసివేయండి.
  2. మీరు ఒక పెద్ద గ్రూప‌కి ఇమెయిల్ చేస్తున్నట్లయితే, Google Groupsని ఉపయోగించడం ద్వారా ఒక గ్రూప్‌ని క్రియేట్ చేసి, తర్వాత ఆ గ్రూప్‌కి ఇమెయిల్ చేయండి.
    గ్రూప్‌ని క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

"స్వీకర్త సర్వర్ మా రిక్వెస్ట్‌లను ఆమోదించలేదు"

మీ సందేశం ఎందుకు బౌన్స్ అయింది

Gmail మీ స్వీకర్త ఇమెయిల్ సర్వర్‌కి కనెక్ట్ కాలేని పక్షంలో మీరు ఈ ఎర్రర్ సందేశాన్ని చూస్తారు.

మీరు చేయగలిగేవి

మీరు ఏమీ చేయవలసిన అవసరం లేకుండానే సమస్య త్వరలోనే పరిష్కరించబడుతుంది. ఇమెయిల్‌ని తర్వాత మళ్లీ పంపేందుకు ప్రయత్నించండి.

మీరు ఈ ఎర్రర్‌ని పొందడం కొనసాగుతున్నట్లయితే:

  1. స్వీకర్త ఇమెయిల్ చిరునామాలో ఏవైనా పొరపాట్లు ఉన్నాయేమోనని తనిఖీ చేయండి.
  2. మీ స్వీకర్త ఇమెయిల్ ప్రదాతకు సంబంధించిన కస్టమర్ మద్దతు కేంద్రాన్ని సంప్రదించండి.

మీ ఆఫీస్, స్కూల్ లేదా ఇతర సంస్థలకు సంబంధించిన ఎవరికైనా మీరు ఇమెయిల్ పంపుతున్నప్పుడు ఈ ఎర్రర్‌ని పొందినట్లయితే , మీ అడ్మినిస్ట్రేటర్‌ని సంప్రదించండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16737142673425083688
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false