Gmailలో మెసేజ్‌లకు రిప్లయి ఇవ్వండి

మీరు Gmailలో మెసేజ్‌ను స్వీకరించినప్పుడు, మీరు వీటిని చేయవచ్చు:

  • పంపినవారికి రిప్లయి ఇవ్వండి.
  • ప్రతి ఒక్క స్వీకర్తకూ రిప్లయి ఇవ్వండి.

మెసేజ్‌లకు రిప్లయి ఇవ్వండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. మెసేజ్‌ను తెరవండి.
  3. మెసేజ్ కింద, క్లిక్ చేయండి: 
    • రిప్లయి: పంపినవారికి మెసేజ్‌ను పంపండి.
    • అందరికీ రిప్లయి ఇవ్వండి: పంపిన వారికి మెసేజ్ పంపండి, దానితో పాటుగా "వీరికి పంపండి:", ఇంకా "Cc:" లైన్‌లలో ఉన్న వారెవరికైనా పంపండి.
  4. మెసేజ్‌ను ఎంటర్ చేయండి.
  5. పంపండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ డిఫాల్ట్ రిప్లయి సెట్టింగ్‌లను మార్చండి

“రిప్లయి”, అలాగే “అందరికీ రిప్లయి ఇవ్వండి” బటన్‌ల క్రమాన్ని మార్చడానికి, మీ డిఫాల్ట్ రిప్లయి సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి.

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు  ఆ తర్వాతఅన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. సాధారణం ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. "ఆటోమేటిక్‌గా రిప్లయి ఇచ్చే పద్ధతి" విభాగంలో రిప్లయి లేదా అందరికీ రిప్లయి ఇవ్వండిని క్లిక్ చేయండి.

క్విక్ రిప్లయిల కోసం సూచనలను పొందండి

మీ ఇన్‌బాక్స్‌లోని ఈమెయిల్స్‌కు త్వరితంగా సమాధానం ఇవ్వడానికి స్మార్ట్ రిప్లయిని ఆన్ చేయండి. స్మార్ట్ రిప్లయి ఆన్‌లో ఉన్నప్పుడు, మీరు మీ మెసేజ్‌ల కింద సూచించబడిన రిప్లయిలను కనుగొనవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు  ఆ తర్వాతఅన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  3. సాధారణం ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. "స్మార్ట్ రిప్లయి," పక్కన స్మార్ట్ రిప్లయి ఆన్ చేయండిని క్లిక్ చేయండి. 
  5. దిగువున‌, మార్పులను సేవ్ చేయిని క్లిక్ చేయండి.

చిట్కాలు:

  • రిప్లయి ఇవ్వడానికి, మెసేజ్ దిగువున ఒక సూచనను ఎంచుకోండి.
  • మీరు రిప్లయి ఇచ్చే ముందు సూచనను ఎడిట్ చేయవచ్చు.
  • మీరు “స్మార్ట్ రిప్లయి” సెట్టింగ్‌ను కనుగొనలేకపోతే, Gmailలో “స్మార్ట్ ఫీచర్‌లు, వ్యక్తిగతీకరణ” ఎనేబుల్ చేయబడిందని నిర్ధారించుకోండి. స్మార్ట్ ఫీచర్‌లు, కంట్రోల్స్ గురించి మరింత తెలుసుకోండి.

ముఖ్యమైన ఈమెయిల్స్ గురించి రిమైండర్‌లను పొందండి

ముఖ్య గమనిక: మీరు ముఖ్యమైన ఈమెయిల్స్‌కు రిమైండర్‌లను పొందే ముందు, సెట్టింగ్‌లలో సంభాషణ వీక్షణను ఆన్ చేయండి. సంభాషణ వీక్షణను ఎలా ఆన్ చేయాలో తెలుసుకోండి.

మీ ఇన్‌బాక్స్ ఎగువన, మీరు రిప్లయి ఇవ్వాల్సిన లేదా ఫాలో అప్ చేయాల్సిన ఈమెయిల్స్ కోసం సూచనలు (లేదా “ఆటోమేటిక్ రిమైండర్‌లు”) కనిపించవచ్చు. మీరు ఈ నడ్జ్‌లను సెట్టింగ్‌లలో ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాతఅన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. సాధారణం ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. "ఆటోమేటిక్ రిమైండర్" పక్కన ఉన్న వీటిని ఎంచుకోండి:
    • రిప్లయి ఇవ్వాల్సిన ఈమెయిల్స్‌ను సూచించండి: మీ ఇన్‌బాక్స్ ఎగువన, మీరు రిప్లయి ఇవ్వడం మర్చిపోయిన ఈమెయిల్స్‌ను కనుగొనవచ్చు.
    • ఫాలో అప్ చేయాల్సిన ఈమెయిల్స్‌ను సూచించండి: మీ ఇన్‌బాక్స్ ఎగువన, మీరు ఫాలో అప్ చేయాల్సిన ఈమెయిల్స్‌ను కనుగొనవచ్చు.
  5. దిగువున‌, మార్పులను సేవ్ చేయిని క్లిక్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11112979049225772618
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false