Gmail సందేశం ప్రామాణీకరించబడిందో లేదో తనిఖీ చేయండి

 మీరు పంపేవారి పేరు పక్కన ప్రశ్న గుర్తును చూసినట్లయితే, మెసేజ్ ప్రామాణీకరించబడలేదు అని అర్థం. ఇమెయిల్ ప్రామాణీకరించబడనప్పుడు, సందేశం పంపిన వ్యక్తి నుండి వస్తున్నదో Gmailకి తెలియదు. మీరు దీన్ని చూసినట్లయితే, ఏదైనా అటాచ్‌మెంట్‌లకు రిప్లయి ఇవ్వడం లేదా డౌన్‌లోడ్ చేయడం గురించి జాగ్రత్తగా ఉండండి.

కార్యాలయం లేదా పాఠశాల సంబంధిత Google యాప్‌ల నుండి మరిన్ని పొందాలనుకుంటున్నారా?  ఎటువంటి ఛార్జీ విధించబడని Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

మెసేజ్ ప్రామాణీకరించబడిందో లేదో చెక్ చేయండి

ముఖ్యమైనది: ప్రామాణీకరించబడని మెసేజ్‌లు తప్పనిసరిగా స్పామ్ కాదు. మెయిలింగ్ లిస్ట్‌లకు పంపిన మెసేజ్‌ల వంటి పెద్ద గ్రూప్‌లకు మెయిల్ పంపే నిజమైన సంస్థలకు కొన్నిసార్లు ప్రామాణీకరణ పనిచేయదు.

Gmail మెసేజ్‌లను చెక్ చేయండి
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Gmail యాప్‌ను తెరవండి.
  2. ఒక ఇమెయిల్‌ను తెరవండి.
  3. వివరాలను చూడండి ఆ తర్వాత సెక్యూరిటీ వివరాలను చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు చూస్తే సందేశం ప్రామాణీకరించబడుతుంది:
  • google.com వంటి డొమైన్ పేరుతో "వీరి ద్వారా మెయిల్ చేయబడింది" శీర్షిక.
  • పంపే డొమైన్‌తో "సంతకం చేసినది" శీర్షిక

పంపినవారి పేరు పక్కన ప్రశ్న గుర్తును చూస్తే సందేశం ప్రామాణీకరించబడదు. మీరు దీన్ని చూసినట్లయితే, ఏదైనా అటాచ్‌మెంట్‌లకు రిప్లయి ఇవ్వడం లేదా డౌన్‌లోడ్ చేయడం గురించి జాగ్రత్తగా ఉండండి.

Outlook వంటి మరొక మెయిల్ క్లయింట్‌లో మెసేజ్‌లను చెక్ చేయండి
మీరు మీ ఈమెయిల్‌ను మరొక ఈమెయిల్ క్లయింట్‌లో చెక్ చేస్తుంటే, మీరు మెసేజ్ హెడర్‌లను చెక్ చేయవచ్చు.
ప్రామాణీకరణ ఎలా పనిచేస్తుందనే దాని గురించి మరింత తెలుసుకోండి (SPF & DKIM)

SPF లేదా DKIM ఉపయోగించి ఈమెయిల్‌లను ప్రామాణీకరించవచ్చు.

SPF రికార్డ్‌ను క్రియేట్ చేయడం ద్వారా ఇచ్చిన డొమైన్ నుండి మెసేజ్‌లను పంపడానికి ఏ హోస్ట్‌లు అనుమతించబడతాయో, SPF సూచిస్తుంది.

పబ్లిక్ కీని ఉపయోగించి, స్వీకర్తలు వెరిఫై చేయగలిగే విధంగా, చట్టబద్ధమైన ఈమెయిల్స్‌ను ఎలక్ట్రానిక్‌గా సైన్ చేయడానికి, పంపే వారిని DKIM అనుమతిస్తుంది.

ఫార్వర్డ్ చేయబడిన మెసేజ్‌ల మునుపటి ప్రామాణీకరణ స్థితిని, ARC చెక్ చేస్తుంది. ఫార్వర్డ్ చేయబడిన మెసేజ్, SPF లేదా DKIM ప్రామాణీకరణను పాస్ అయినప్పటికీ, దాని ప్రామాణీకరణ మునుపటిసారి విఫలమైనట్లుగా చూపితే, Gmail ఆ మెసేజ్‌ను ప్రామాణీకరించబడనట్లుగా పరిగణిస్తుంది.

ఈమెయిల్ ప్రామాణీకరణ గురించి మరింత తెలుసుకోండి.

ప్రామాణీకరించని మెసేజ్‌లను పరిష్కరించండి

నేను అందుకున్న మెసేజ్ ప్రామాణీకరించబడలేదు
నమ్మదగిన సోర్స్ నుండి మీకు వచ్చిన మెసేజ్ ప్రామాణీకరించబడకపోతే, మీకు ఈమెయిల్ పంపిన వ్యక్తి లేదా సంస్థను సంప్రదించండి. మీరు వారిని సంప్రదించినప్పుడు, ఈ సహాయ పేజీకి లింక్‌ను అందించండి, తద్వారా వారి మెసేజ్‌లను ఎలా ప్రామాణీకరించాలో వారు తెలుసుకోవచ్చు.
నా డొమైన్ నుండి నేను పంపిన మెసేజ్ ప్రామాణీకరించబడలేదు

మీరు పంపిన మెసేజ్, ప్రశ్న గుర్తుతో "?" మీ ఈమెయిల్ అడ్రస్ పక్కన చేరితే, మెసేజ్ ప్రామాణీకరించబడలేదు అని అర్థం.

సందేశాలు సరిగ్గా వర్గీకరించబడ్డాయని నిర్ధారించుకోవడానికి ప్రామాణీకరించాలి. అలాగే, ప్రామాణీకరించని సందేశాలు తిరస్కరించబడే అవకాశం ఉంది. ఎందుకంటే స్పామర్‌లు మెయిల్‌ను కూడా ప్రామాణీకరించగలరు కాబట్టి, మీ మెసేజ్‌లను డెలివరీ చేయవచ్చని హామీ ఇవ్వడానికి ప్రామాణీకరణ మాత్రమే సరిపోదు.

ప్రామాణీకరించని మెసేజ్‌లను పరిష్కరించండి

మీరు పంపిన మెసేజ్‌లు DKIM (ప్రాధాన్యత) లేదా SPF ఉపయోగించి ప్రామాణీకరించబడ్డాయని నిర్ధారించుకోండి.

మీ ఈమెయిల్‌లను Gmail బ్లాక్ చేయకుండా నివారించడానికి మీరు ఈ దశలను ఉపయోగించవచ్చు:

  • కనీసం 1024-బిట్‌లు పొడవు ఉండే RSA కీలను ఉపయోగించండి. 1024-బిట్‌ల కంటే తక్కువ కీలతో సంతకం చేసిన ఇమెయిల్‌లు సంతకం చేయనివిగా పరిగణించబడతాయి, సులభంగా మోసానికి గురౌతాయి.
  • సందేశాలను వర్గీకరించేటప్పుడు, Gmail, ప్రామాణీకరణ సమాచారంతో యూజర్ నివేదికలు మరియు ఇతర సంకేతాలను మిళితం చేస్తుంది. మీ సందేశాలు సరిగ్గా వర్గీకరించబడ్డాయని నిర్ధారించడానికి మెయిల్ పంపినపంపే ప్రతివారికి ప్రామాణీకరణ తప్పనిసరి. 
  • మీ డొమైన్ నుండి ప్రామాణీకరించని మెయిల్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడటానికి, పాలసీని క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15949368358706211865
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false