Gmailలో, ఎవరినైనా ఈమెయిల్‌లో జోడించకపోతే, వారికి మీరు ఈమెయిల్‌ను ఫార్వర్డ్ చేయవచ్చు.
సింగిల్ ఈమెయిల్‌ను ఫార్వర్డ్ చేయడం
- మీ కంప్యూటర్‌లో, Gmail తెరవండి.
- ఒక ఈమెయిల్‌ను తెరవండి.
- ఈమెయిల్‌కు దిగువున ఉన్న, ఫార్వర్డ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- ఈమెయిల్‌లో, మీ స్వీకర్తలను జోడించండి.
- పంపండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
చిట్కా: సంభాషణ థ్రెడ్‌లోని ఈమెయిల్‌ను ఫార్వర్డ్ చేయడానికి, ఈమెయిల్‌కు ఎగువున కుడి వైపున ఉన్న, మరిన్ని ఫార్వర్డ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
థ్రెడ్‌ను ఫార్వర్డ్ చేయడం
ముఖ్య గమనిక: మీరు థ్రెడ్‌ను ఫార్వర్డ్ చేయడానికి ముందు, సంభాషణ వీక్షణను ఆన్ చేయండి.
- ఈమెయిల్‌కు ఎగువున ఉన్న, టూల్‌బార్‌లో, మరిన్ని అన్నింటిని ఫార్వర్డ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- ఈమెయిల్‌లో, మీ స్వీకర్తలను జోడించండి.
- పంపండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.