Gmailలో స్పామ్‌ను రిపోర్ట్ చేయండి

Gmailలో, మీరు అనవసరమైన ఈమెయిళ్లను స్పామ్‌గా రిపోర్ట్ చేయవచ్చు. మీరు స్పామ్‌గా రిపోర్ట్ చేసిన ఈమెయిళ్లు స్పామ్‌కు జోడించబడతాయి. మీరు మరిన్ని స్పామ్‌లను రిపోర్ట్ చేసినప్పుడు Gmail అదే కోవకు చెందిన ఈమెయిళ్లను మరింత సమర్ధవంతంగా స్పామ్‌గా గుర్తిస్తుంది.

ఈమెయిళ్లను స్పామ్‌గా రిపోర్ట్ చేయండి

ముఖ్య గమనిక: మీరు స్పామ్‌ను రిపోర్ట్ చేసినప్పుడు లేదా ఏదైనా ఈమెయిల్‌ను స్పామ్‌కు తరలించినప్పుడు, Googleకు సదరు ఈమెయిల్‌కు సంబంధించిన కాపీ అందుతుంది, స్పామ్ నుండి, అలాగే దుర్వినియోగం నుండి యూజర్‌లను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి, ఆ కాపీని Google విశ్లేషించవచ్చు.

మీ కంప్యూటర్‌లో స్పామ్‌ను ఎలా రిపోర్ట్ చేయాలో చూపే యానిమేషన్. స్పామ్‌గా గుర్తు పెట్టబడిన మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా 30 రోజుల తర్వాత తొలగించబడతాయి.

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఒకటి లేదా మరిన్ని ఈమెయిళ్లను ఎంచుకోండి.
  3. పైన, స్పామ్‌గా రిపోర్ట్ చేయండి ని క్లిక్ చేయండి.

చిట్కా: ఒక నిర్దిష్ట సెండర్ నుండి మెసేజ్‌లను అందుకోవడానికి మీరు సైన్ అప్ చేసి ఉంటే, కానీ ఇప్పుడు వాటిని అందుకోవడం మీకు ఇష్టం లేకపోతే, సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయండిని లేదా వెబ్‌సైట్‌కు వెళ్లండిని క్లిక్ చేయండి. ఈమెయిళ్లను బ్లాక్ చేయడం లేదా ఈమెయిళ్ల నుండి సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయిడం ఎలాగో తెలుసుకోండి.

స్పామ్‌ను తొలగించండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ప్రధాన మెనూలో, ఎడమ వైపున, మరిన్ని ఆ తర్వాత స్పామ్‌ను క్లిక్ చేయండి.
  3. పైన, ఇప్పుడే స్పామ్ మెసేజ్‌లన్నింటినీ తొలగించండిని క్లిక్ చేయండి.
    • మీరు నిర్దిష్ట ఈమెయిళ్లను కూడా తీసివేయవచ్చు, దీని కోసం వాటిని ఎంచుకుని, శాశ్వతంగా తొలగించండిని క్లిక్ చేయండి.

స్పామ్ నుండి ఈమెయిల్‌ను తీసివేయండి

మీ కంప్యూటర్‌లోని స్పామ్ ఫోల్డర్ నుండి ఏదైనా ఈమెయిల్‌ను ఎలా తీసివేయాలో చూపే యానిమేషన్.

మీరు పొరపాటున ఏదైనా ఈమెయిల్‌ను స్పామ్‌గా రిపోర్ట్ చేసి ఉంటే, దాన్ని స్పామ్ నుండి మీరు తీసివేయవచ్చు:

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ప్రధాన మెనూలో, ఎడమ వైపున, మరిన్ని ఆ తర్వాత స్పామ్‌ను క్లిక్ చేయండి.
  3. మీరు తీసివేయాలనుకుంటున్న ఈమెయిల్‌కు పక్కన ఉండే బాక్స్‌ను ఎంచుకోండి.
  4. పైన, స్పామ్ కాదును క్లిక్ చేయండి.

ముఖ్యమైన ఈమెయిళ్లను స్పామ్‌కు వెళ్లకుండా నివారించండి

ముఖ్య గమనిక:మీరు సెండర్‌ను బ్లాక్ చేసినప్పుడు, వారి ఈమెయిళ్లను స్పామ్ నుంచి తీసివేసినప్పటికీ, Gmail ఇప్పటికీ వారి ఈమెయిళ్లను ఆటోమేటిక్‌గా స్పామ్‌గా గుర్తిస్తుంది.

మీకు తెలిసిన వ్యక్తుల నుండి వచ్చే ఈమెయిళ్లను Gmail స్పామ్‌కు పంపుతున్నట్లయితే, మీరు ఈ కింద పేర్కొన్న విధంగా చేయవచ్చు:

Gmail స్పామ్ రకాల గురించి మరింత తెలుసుకోండి

స్పామ్‌లో, మీరు:

  • Gmail ఆటోమేటిక్‌గా స్పామ్‌గా గుర్తించిన అనుమానాస్పద ఈమెయిళ్లను పొందవచ్చు.
  • మీరు స్పామ్‌గా గుర్తించిన ఈమెయిళ్లను కనుగొనవచ్చు.
  • ప్రతి ఈమెయిల్‌కు పైభాగంలో Gmail దాన్ని స్పామ్‌కు ఎందుకు పంపించిందో వివరించే హెచ్చరికను కనుగొనవచ్చు.
మోసపూరిత ఇమెయిల్ చిరునామాలు

ఈ హెచ్చరికకు అర్థం ఏమిటి

ఈమెయిల్ అడ్రస్, దాదాపుగా తెలిసిన సెండర్‌కు చెందిన ఈమెయిల్ అడ్రస్ లాగానే ఉంటుంది. ఉదాహరణకు, ఈమెయిల్ అడ్రస్‌లో "O" అక్షరాన్ని "0" నంబర్‌తో రీప్లేస్ చేసి ఉండవచ్చు.

మీకు ఈ హెచ్చరిక కనిపిస్తే ఏమి చేయాలి

ఈమెయిల్ అడ్రస్ సరైనదే అని మీరు వెరిఫై చేసుకునే దాకా, ఆ ఈమెయిల్‌కు రిప్లయి ఇవ్వడం కానీ, లేదా అందులో ఉండే ఏ లింక్‌లను అయినా తెరవడం కానీ చేయవద్దు.

ముఖ్య గమనిక: మీరు స్పూఫ్ చేయబడిన ఈమెయిల్ అడ్రస్‌ను గమనిస్తే, కానీ దానికి హెచ్చరిక గుర్తు లేకపోతే, తప్పక దాన్ని స్పామ్‌గా రిపోర్ట్ చేయండి.

ఫిషింగ్ స్కామ్‌లు

ఈ హెచ్చరికకు అర్థం ఏమిటి

పాస్‌వర్డ్‌లు లేదా క్రెడిట్ కార్డ్ నంబర్‌ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని మీరు షేర్ చేసేలా ఇమెయిల్ మోసపూరితంగా ఉండవచ్చు.

మీకు ఈ హెచ్చరిక కనిపిస్తే ఏమి చేయాలి

చిట్కా: ఈమెయిల్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని Google ఎప్పుడూ అడగదు. Google స్కామ్‌లను నివారించడం, అలాగే రిపోర్ట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ధృవీకరించని సెండర్ నుండి వచ్చిన మెసేజ్‌లు

ఈ హెచ్చరికకు అర్థం ఏమిటి

మీకు ఈమెయిల్ ఎవరు పంపారో, Gmail నిర్ధారించలేకపోతోంది. మరింత సమాచారం కోసం, మీ Gmail మెసేజ్ ప్రామాణీకరించబడిందో లేదో చెక్ చేయండి.

మీకు ఈ హెచ్చరిక కనిపిస్తే ఏమి చేయాలి

మెసేజ్ విశ్వసనీయమైన సెండర్ నుండే వచ్చిందని మీకు ఖచ్చితంగా తెలిస్తే:

నిర్వాహకుడు సెట్ విధానాలు

ఈ హెచ్చరికకు అర్థం ఏమిటి

మీరు మీ కార్యాలయం, పాఠశాల లేదా సంస్థ ద్వారా Gmailను ఉపయోగిస్తుంటే, మీ ఇమెయిల్ నిర్వాహకులు కొన్ని ఇమెయిల్‌లను స్పామ్‌గా గుర్తు పెట్టడానికి నియంత్రణలను సెట్ చేయవచ్చు.

మీకు ఈ హెచ్చరిక కనిపిస్తే ఏమి చేయాలి

తప్పుగా స్పామ్‌ అని గుర్తు పెట్టిన ఇమెయిల్‌లను మీరు చూస్తే, మీ నిర్వాహకుడిని సంప్రదించండి.

మీరు ఈ పంపినవారి నుండి సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయడానికి ట్రై చేశారు

ఈ హెచ్చరికకు అర్థం ఏమిటి

మీరు సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేసిన తర్వాత ఎవరైనా ఈమెయిల్ పంపితే, వారి ఈమెయిళ్లు నేరుగా మీ స్పామ్‌కు వెళ్తాయి.

మీకు ఈ హెచ్చరిక కనిపిస్తే ఏమి చేయాలి

మీరు ఈ ఈమెయిళ్లను స్పామ్‌కు పంపకూడదని అనుకుంటే, వారి ఈమెయిల్‌ను స్పామ్ నుండి తీసివేయండి.

సందేశాల కంటెంట్ ఖాళీగా ఉంది

ఈ హెచ్చరికకు అర్థం ఏమిటి

ఈమెయిల్ అడ్రస్‌లు చెల్లుబాటు అయినవో, కాదో చెక్ చేయడానికి, స్పామర్‌లు తరచుగా బాడీ లేదా సబ్జెక్ట్‌లో కంటెంట్ లేని ఈమెయిళ్లను పంపుతుంటారు. ఆ తర్వాత, వారు ఆ ఈమెయిల్ అడ్రస్‌లకు స్పామ్‌ను పంపుతారు.

మీకు ఈ హెచ్చరిక కనిపిస్తే ఏమి చేయాలి

  • ఈమెయిల్ అనుమానాస్పదంగా కనిపిస్తే, రిప్లయి ఇవ్వవద్దు. మీరు దాన్ని స్పామ్‌గా లేదా ఫిషింగ్‌గా రిపోర్ట్ చేయవచ్చు.
  • మీకు తెలిసిన వారి నుండి ఈమెయిల్ వచ్చి ఉండి, అది వారు పొరపాటున పంపారని మీరు అనుకుంటే, ఆ ఈమెయిల్‌ను స్పామ్ కాదని రిపోర్ట్ చేయండి.
మీరు స్పామ్‌కు పంపిన ఈమెయిళ్లు

ఈ హెచ్చరికకు అర్థం ఏమిటి

మీరు ఏదైనా ఈమెయిల్‌ను స్పామ్‌గా రిపోర్ట్ చేసినప్పుడు, అది మీ ఇన్‌బాక్స్ నుండి స్పామ్‌కు తరలించబడుతుంది. అదే సెండర్ నుండి వచ్చే ఈమెయిళ్లు, భవిష్యత్తులో స్పామ్ ఫోల్డర్‌కు పంపబడవచ్చు.

మీకు ఈ హెచ్చరిక కనిపిస్తే ఏమి చేయాలి

  • ఈమెయిల్ స్పామ్‌కు వెళ్లకూడదని మీరు అనుకుంటే, దాన్ని స్పామ్ నుండి తీసివేయండి. భవిషత్‌లో సదరు సెండర్ నుండి వచ్చే ఈమెయిళ్లు అన్నీ స్పామ్‌కు వెళ్లవు.
  • మెసేజ్‌ను మీరు ఫిషింగ్‌గా పొరపాటున రిపోర్ట్ చేసినట్లయితే, అది ఫిషింగ్ కాదని రిపోర్ట్ చేయండి.
మీ Gmail ఖాతాపై స్పామ్ అటాక్

ఈ హెచ్చరికకు అర్థం ఏమిటి

మీకు సబ్‌స్క్రిప్షన్‌లు లేదా ప్రమోషనల్ ఆఫర్‌ల వంటి అవాంఛిత ఈమెయిళ్లు చాలానే వస్తుంటే, మీ ఇన్‌బాక్స్‌ను ఒక హ్యాకర్ మెసేజ్‌లతో నింపేయాలని చూస్తున్నారని అర్థం. అప్పుడు మీ Gmail ఖాతాతో మీరు సైన్ అప్ చేసిన వెబ్‌సైట్‌లు లేదా సర్వీస్‌ల నుండి వచ్చే ముఖ్యమైన సెక్యూరిటీ అలర్ట్‌లు మీకు కనిపించవు.

ఉదాహరణకు, హ్యాకర్ మీ బ్యాంక్ ఖాతాలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే, మీ బ్యాంక్ ఇమెయిల్ ద్వారా మీకు తెలియజేస్తుంది. అయితే మీ ఇన్‌బాక్స్ జంక్ మెయిల్‌తో నిండిపోతే, మీరు బ్యాంక్ హెచ్చరికను చూడలేకపోవచ్చు.

మీకు ఈ హెచ్చరిక కనిపిస్తే ఏమి చేయాలి

మీ కాంటాక్ట్‌లలో ఒకరి నుండి స్పామ్ వచ్చింది
మీ Google Contacts లిస్ట్ నుండి ఎవరైనా మీకు స్పామ్‌ను పంపితే, వారి ఖాతాను ఒక హ్యాకర్ స్వాధీనం చేసుకున్నారని అర్థం.
  1. ఆ ఈమెయిల్‌కు సమాధానం ఇవ్వవద్దు.
  2. స్పామ్ అలర్ట్ నుండి, ఈమెయిల్‌ను రిపోర్ట్ చేయండి.
    • దర్యాప్తు చేయడానికి ఈ చర్య Gmailకు ఒక రిపోర్ట్‌ను పంపుతుంది. భవిష్యత్తులో ఈ కాంటాక్ట్ నుండి మీకు ఈమెయిళ్లు అందడం కొనసాగుతుంది.
  3. మీ కాంటాక్ట్‌కు వారి ఈమెయిల్ ఖాతా హ్యాక్ అయి ఉండవచ్చని తెలియజేయండి, Gmail సెక్యూరిటీ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందిగా వారికి సూచించండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8054165727756726921
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false