Google Play ఫ్యామిలీ లైబ్రరీని ఉపయోగించండి

మీరు Google Play నుండి కొనుగోలు చేసిన యాప్‌లు, గేమ్‌లు, సినిమాలు, టీవీ షోలు, ఈ-బుక్‌లు ఇంకా ఆడియోబుక్‌లను, Google Play ఫ్యామిలీ లైబ్రరీ ద్వారా గరిష్ఠంగా 5 మంది ఫ్యామిలీ మెంబర్‌ల వరకు షేర్ చేసుకోవచ్చు.

ఫ్యామిలీ లైబ్రరీకి సైన్ అప్ చేయండి

ముఖ్యమైనది:  ఒకవేళ మీరు ఏదైనా ఫ్యామిలీ గ్రూప్‌లో భాగం కాకపోతే, ముందుగా మీరు ఒక ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేసుకోవాలి.

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత ఫ్యామిలీ ఆ తర్వాత ఫ్యామిలీ లైబ్రరీకి సైన్ అప్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఫ్యామిలీ లైబ్రరీని సెటప్ చేయడానికి స్క్రీన్‌పై ఉన్న సూచనలను ఫాలో చేయండి. 

గమనిక: ఫ్యామిలీ లైబ్రరీని సెటప్ చేయాలంటే, పైన పేర్కొన్న సూచనలను మీ ఫ్యామిలీలో అందరూ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.

ఆవశ్యకతలు

ఫ్యామిలీ మేనేజర్ ఆవశ్యకతలు

మీరు ఇప్పటికే ఫ్యామిలీలో భాగం కానట్లయితే, మీరు ఫ్యామిలీ లైబ్రరీకి సైన్ అప్ చేసినప్పుడు, ఫ్యామిలీ మేనేజర్ అవుతారు. ఫ్యామిలీ మేనేజర్‌లు ఇక్కడ పేర్కొన్న ఆవశ్యకతలు అన్నింటినీ తప్పనిసరిగా పూర్తి చేయాలి:

  • 18 సంవత్సరాలు లేదా అంత కన్నా ఎక్కువ వయస్సు (లేదా మీ దేశంలో వర్తించే వయస్సు) ఉండాలి
  • ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌గా ఉపయోగించడానికి మీ వద్ద చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉండాలి
  • మీరు Googleలోని వేరొక ఫ్యామిలీ గ్రూప్‌లో మెంబర్ అయ్యి ఉండకూడదు

గమనిక: మీరు ఆఫీస్, స్కూల్ లేదా ఇతర సంస్థకు సంబంధించిన Google ఖాతాతో ఫ్యామిలీని క్రియేట్ చేయకూడదు.

ఫ్యామిలీ మెంబర్ ఆవశ్యకతలు

ఫ్యామిలీ గ్రూప్‌లో చేరడానికి, మీరు తప్పనిసరిగా ఈ ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండాలి:

  • Google ఖాతాను కలిగి ఉండాలి. మీ వయస్సు 13 లేదా మీ దేశంలో వయోపరిమితి, కంటే తక్కువ ఉన్నప్పుడు, మీ ఫ్యామిలీ మేనేజర్ మీకోసం Google ఖాతాను క్రియేట్ చేయాల్సి వస్తుంది.
  • ఫ్యామిలీ మేనేజర్ నివసిస్తున్న దేశంలోనే మీరు నివసిస్తూ ఉండాలి.
  • మీరు Googleలోని వేరొక ఫ్యామిలీ గ్రూప్‌లో మెంబర్ అయ్యి ఉండకూడదు.
దేశాలు

Google Playను ఉపయోగించే చాలా దేశాలలో మీకు ఫ్యామిలీ లైబ్రరీ అందుబాటులో ఉంటుంది.

ఫ్యామిలీ లైబ్రరీ కొనుగోళ్లను జోడించడం లేదా తీసివేయడం

అర్హత కలిగిన కొనుగోళ్లు ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ లైబ్రరీకి జోడించబడతాయి, లేదా వాటిని కొనుగోలు చేసిన తర్వాత మీకై మీరే జోడించవచ్చు. కొన్ని దేశాలలో, ఫ్యామిలీ లైబ్రరీ ద్వారా యాప్‌లు & గేమ్‌లు, సినిమాలు & టీవీ షోలు, ఇంకా పుస్తకాలు షేర్ చేయడం అనేది పరిమితంగా ఉండవచ్చు.

మీరు ఫ్యామిలీ లైబ్రరీ నుండి కొనుగోళ్లను తీసివేసినప్పుడు లేదా మీ ఫ్యామిలీ గ్రూప్ నుండి నిష్క్రమించినప్పుడు, మీ ఫ్యామిలీ మెంబర్‌లు, మీరు ఫ్యామిలీ లైబ్రరీకి జోడించిన కొనుగోళ్లకు యాక్సెస్‌ను కోల్పోతారు.

ముఖ్య గమనికలు:

  • సినిమాలు, టీవీ షోలు: మీరు ఫ్యామిలీ లైబ్రరీకి కంటెంట్‌ను జోడించినప్పుడు ఎదురయ్యే సమస్యలను నివారించడానికి, మీ వ్యక్తిగత క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌కు బదులుగా ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించి కొనుగోలు జరపండి.
  • పుస్తకాలు, యాప్‌లు లేదా గేమ్‌లు: కింద పేర్కొన్న వాటికి అనుగుణంగా ఉన్నంత వరకు, ఎలాంటి పేమెంట్ ఆప్షన్‌తో అయినా, ఫ్యామిలీ లైబ్రరీలో చేరవచ్చు:
    • ఫైల్‌లో ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ ఉంది.
    • ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ ఇంకా చెల్లుబాటు అవుతుంది.
    • ఫ్యామిలీ షేరింగ్ ఆన్ చేయబడింది.
వ్యక్తిగత కొనుగోళ్లను జోడించడం లేదా తీసివేయడం

యాప్‌లు & గేమ్‌లు

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. యాప్‌లు & పరికరాలను మేనేజ్ చేయి ఆ తర్వాత ఇన్‌స్టాల్ చేసినవి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు జోడించాలనుకున్న కొనుగోలు చేసిన యాప్ లేదా గేమ్‌ను ట్యాప్ చేయండి.
  5. కంటెంట్‌కు చెందిన వివరాల పేజీలో, ఫ్యామిలీ లైబ్రరీని ఆన్ చేయండి.

కంటెంట్‌ను తీసివేయడానికి, ఫ్యామిలీ లైబ్రరీని ఆఫ్ చేయండి.

సినిమాలు & టీవీ షోలు

  1. Play Movies & TV యాప్ Play Moviesను తెరవండి.
  2. దిగువున ఉన్న, లైబ్రరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "సినిమాలు" లేదా "టీవీ షోలు" అనే ట్యాబ్‌లో మీరు కొనుగోలు చేసిన కంటెంట్‌లో వేటిని జోడించాలని అనుకుంటున్నారో వెతకండి.
  4. కంటెంట్‌కు చెందిన వివరాల పేజీలో, ఫ్యామిలీ లైబ్రరీ అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి.

కంటెంట్‌ను తీసివేయడానికి, ఫ్యామిలీ లైబ్రరీని ఆఫ్ చేయండి.

గమనిక: మీరు Play Movies & TV యాప్ నుండి టీవీ షోలను జోడించినప్పుడు, మీరు షోకు సంబంధించిన ఎపిసోడ్‌లన్నింటిని జోడిస్తారు. మీరు విడిగా కొనుగోలు చేసిన నిర్దిష్ట సీజన్‌లు లేదా ఎపిసోడ్‌లను జోడించాలనుకున్నా లేదా తీసివేయాలనుకున్నా, Play Store యాప్‌లో కంటెంట్ కోసం సెర్చ్ చేయండి, దానిని ఎపిసోడ్ లేదా షో వివరాల పేజీ నుండి ఫ్యామిలీ లైబ్రరీకి జోడించండి.

పుస్తకాలు

  1. Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. దిగువున ఉన్న, లైబ్రరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు జోడించాలనుకుంటున్న ఈ-బుక్‌లు లేదా ఆడియోబుక్‌ల కోసం చూడండి.
  4. బుక్ పేరును నొక్కి, పట్టుకోండి.
  5. ఫ్యామిలీ లైబ్రరీకి జోడించడానికి, కిందికి స్క్రోల్ చేయండి.

కంటెంట్ తీసివేత కోసం, బుక్ పేరును నొక్కి, పట్టుకోండి. ఆ తర్వాత ఫ్యామిలీ లైబ్రరీ నుండి తీసివేయండి అనే ఆప్షన్‌కు స్క్రోల్ చేయండి.

మీ ఫ్యామిలీ లైబ్రరీ సెట్టింగ్‌లను మార్చండి

ఆటోమేటిక్‌గా, మీరు ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేసిన తర్వాత లేదా దానిలో చేరిన తర్వాత, అర్హత గల కొనుగోళ్లు ఆటోమేటిక్‌గా మీ ఫ్యామిలీ లైబ్రరీకి జోడించబడతాయి.

ఫ్యామిలీ లైబ్రరీ సెట్టింగ్‌లను మార్చడానికి, లేదా నిర్దిష్ట రకమైన కొనుగోళ్లు అన్నింటినీ తీసివేయడానికి:

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత ఫ్యామిలీ ఆ తర్వాత ఫ్యామిలీ లైబ్రరీ సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. యాప్‌లు & గేమ్‌లు, సినిమాలు & టీవీ, లేదా Booksను ఎంచుకోండి.
  5. ఆటోమేటిక్‌గా జోడించకు, నా అంతట నేను చేసుకుంటాను, లేదా కొనుగోలు చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఐటెమ్‌లను జోడించండి ఆ తర్వాత సరే, అలాగే అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
.
నిర్దిష్ట ఫ్యామిలీ మెంబర్‌లకు కంటెంట్‌ను నియంత్రించండి

ఫ్యామిలీ లైబ్రరీకి జోడించిన కంటెంట్‌ను మీ ఫ్యామిలీ గ్రూప్‌లోని వారందరూ చూడగలరు.

ఫ్యామిలీ మెంబర్‌లు చూసే కంటెంట్‌ను నియంత్రించడానికి, మీరు తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేయవచ్చు.

ఫ్యామిలీ లైబ్రరీ కంటెంట్‌ను చూడండి

యాప్‌లు & గేమ్‌లు

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత ఫ్యామిలీ ఆ తర్వాత ఫ్యామిలీ లైబ్రరీ సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. యాప్‌లు & గేమ్‌లు, సినిమాలు & టీవీ, లేదా Booksను ఎంచుకోండి.
    • చిట్కా: ఒకవేళ లిస్ట్‌లో ఏదైనా ట్యాబ్ లేకపోతే, ఆ కేటగిరీలో మీ ఫ్యామిలీ మెంబర్‌లు ఎలాంటి కంటెంట్‌ను జోడించలేదని అర్థం.

సినిమాలు & టీవీ షోలు

  1. Google Play Movies & TV యాప్ Play Moviesను తెరవండి.
  2. దిగువున ఉన్న, లైబ్రరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. సినిమాలు లేదా టీవీ షోలు అనే ట్యాబ్‌ను ట్యాప్ చేయండి.
  4. "ఫ్యామిలీ లైబ్రరీ" లిస్ట్ చూడటానికి కిందికి స్క్రోల్ చేయండి. మీకు "ఫ్యామిలీ లైబ్రరీ" అనే లిస్ట్ కనబడకపోతే, మీ ఫ్యామిలీ మెంబర్‌లు ఫ్యామిలీ లైబ్రరీకి ఇంకా ఏమీ జోడించలేదు అని అర్థం.

గమనిక: ఒక్కో ఫ్యామిలీ మెంబర్‌కు గరిష్ఠంగా 5 పరికరాలలో, ఒక్కో ఫ్యామిలీకి సంబంధించి 12 పరికరాలలో సినిమాలను ఆఫ్‌లైన్‌లో ప్లే చేయవచ్చు. 6 సినిమాలు ఒకేసారి ప్లే చేయవచ్చు, కానీ ప్రతి సినిమాను, ఒక వ్యక్తి ఒక సమయంలో మాత్రమే స్ట్రీమ్ చేయగలరు.

పుస్తకాలు

  1. Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. దిగువున ఉన్న, లైబ్రరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఫ్యామిలీ ట్యాబ్‌ను ట్యాప్ చేయండి. మీకు "ఫ్యామిలీ" అనే ట్యాబ్ కనబడకపోతే, మీ ఫ్యామిలీ మెంబర్‌లు ఫ్యామిలీ లైబ్రరీకి ఇంకా పుస్తకాలు ఏవీ జోడించలేదు అని అర్థం.

గమనిక: ప్రతి పుస్తకాన్ని ఒకే సమయంలో గరిష్ఠంగా 6 పరికరాలలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా వారి పరికరం నుండి ఒక పుస్తకాన్ని తీసివేస్తే, అది ఆ ఫ్యామిలీ గ్రూప్‌లోని ఇతర ఫ్యామిలీ మెంబర్‌లకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది.

కంటెంట్‌ను ఫ్యామిలీ లైబ్రరీకి జోడించవచ్చో లేదో చూడండి

ఎక్కువగా కొనుగోలు చేయబడే యాప్‌లు, గేమ్‌లు, సినిమాలు, టీవీ షోలు ఇంకా పుస్తకాలను మీ ఫ్యామిలీ లైబ్రరీకి జోడించవచ్చు. ఏదైనా ఐటెమ్ జోడించడానికి అర్హతను కలిగి ఉంటే, కంటెంట్ వివరాల పేజీ Family Libraryలో ఫ్యామిలీ లైబ్రరీ చిహ్నాన్ని మీరు చూస్తారు.

సినిమాలు & టీవీ షోలు

 

మీ ఫ్యామిలీ లైబ్రరీని క్రియేట్ చేయడానికి ముందు, మీరు కొనుగోలు చేసిన ఏవైనా సినిమాలు లేదా టీవీ షోలు ఫ్యామిలీ లైబ్రరీకి జోడించబడతాయి.

మీరు ఫ్యామిలీ లైబ్రరీకి సైన్ అప్ చేసిన తర్వాత లేదా ఎవరిదైనా ఫ్యామిలీ గ్రూప్‌లో చేరిన తర్వాత, కొత్త సినిమాలను, టీవీ షోలను ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌తో, Google Play గిఫ్ట్ కార్డ్‌తో లేదా ప్రోమో కోడ్‌తో కొనుగోలు చేసినట్లయితే మాత్రమే వాటిని జోడించే అవకాశం ఉంటుంది.

సినిమాలు

  • కొన్ని దేశాలలో, ఫ్యామిలీ లైబ్రరీ ద్వారా సినిమాలు షేర్ చేయడం అనేది పరిమితంగా ఉండవచ్చు.
  • మీరు సినిమాల బండిల్‌ను కొనుగోలు చేస్తే, మీరు మొత్తం బండిల్‌ను మీ ఫ్యామిలీ లైబ్రరీ నుండి మాత్రమే జోడించగలరు లేదా తీసివేయగలరు, కానీ విడివిడిగా సినిమాలను జోడించడం లేదా తీసివేయడం సాధ్యం కాదు.
  • మీరు Play సినిమా రెంటల్స్‌ను లేదా YouTube ద్వారా కొనుగోలు చేసిన సినిమాలను ఫ్యామిలీ లైబ్రరీకి జోడించలేరు.

టీవీ షోలు

  • కొన్ని దేశాలలో, ఫ్యామిలీ లైబ్రరీ ద్వారా టీవీ షోలను షేర్ చేయడం అనేది పరిమితంగా ఉండవచ్చు.
  • టీవీ షో రెంటల్స్‌ను ఫ్యామిలీ లైబ్రరీకి మీరు జోడించలేరు.
  • మీరు YouTubeలో కొనుగోలు చేసిన టీవీ షోలను జోడించలేరు.
  • టీవీ షోలు అన్ని దేశాలలో అందుబాటులో ఉండవు.
యాప్‌లు & గేమ్‌లు
  • కొన్ని దేశాలలో, ఫ్యామిలీ లైబ్రరీ ద్వారా యాప్‌లను, గేమ్‌లను షేర్ చేయడం అనేది పరిమితంగా ఉండవచ్చు.
  • యాప్‌లో కొనుగోళ్లను, డౌన్‌లోడ్ చేసిన యాప్‌లను ఎలాంటి ఛార్జీ విధించబడకుండా మీరు మీ ఫ్యామిలీ మెంబర్‌లతో షేర్ చేయడం సాధ్యపడదు.
  • జూలై 2, 2016 తర్వాత కొనుగోలు చేసిన ఏవైనా యాప్‌లు లేదా గేమ్‌లు ఫ్యామిలీ లైబ్రరీకి జోడించడానికి అర్హత కలిగి ఉంటాయి. మీరు జులై 2, 2016 లోపు యాప్‌ను లేదా గేమ్‌ను కొనుగోలు చేసినట్లయితే, డెవలపర్ గతంలో చేసిన కొనుగోళ్లను అందుబాటులో ఉంచినట్లయితే, అది ఫ్యామిలీ లైబ్రరీకి అర్హత కలిగి ఉంటుంది.

ఫ్యామిలీ లైబ్రరీకి జోడించడానికి, కంటెంట్ అర్హతను కలిగి ఉందా లేదా అనేది కనుక్కోవాలంటే, కింద పేర్కొన్నట్లుగా చేయండి:

  1. ఈ గేమ్/యాప్ గురించిన వివరాలు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. ఒకవేళ అర్హత కలిగి ఉన్నట్లయితే, దిగువున, "మరింత సమాచారం" కింద, "ఫ్యామిలీ లైబ్రరీకి అర్హత కలిగి ఉంది" అని చెబుతుంది.
పుస్తకాలు
  • ఒకవేళ పుస్తక పబ్లిషర్ గనుక, ఈ-బుక్‌లను లేదా ఆడియోబుక్‌లను ఫ్యామిలీ లైబ్రరీకి జోడించడానికి అనుమతించినట్లయితే, మీరు దానిని మీ ఫ్యామిలీ మెంబర్‌లతో షేర్ చేసుకోవచ్చు.
  • మీరు ఎలాంటి ఛార్జీ లేకుండా అందించిన నమూనాలు, పబ్లిక్ డొమైన్ పుస్తకాలు, మీరు అప్‌లోడ్ చేసిన వ్యక్తిగత డాక్యుమెంట్‌లు లేదా మీరు అద్దెకు తీసుకున్న పుస్తకాలను ఫ్యామిలీ లైబ్రరీకి జోడించలేరు.
  • కొన్ని దేశాలలో మాత్రమే పుస్తకాలను ఫ్యామిలీ లైబ్రరీకి జోడించవచ్చు.
Newsstand

Newsstand కొనుగోళ్లు ఫ్యామిలీ లైబ్రరీకి జోడించడం సాధ్యం కాదు.

సమస్యలను పరిష్కరించండి

నా ఫ్యామిలీని క్రియేట్ చేసేటప్పుడు నాకు ఒక ఎర్రర్ వచ్చింది ఫ్యామిలీ లైబ్రరీ నుండి కంటెంట్ తీసివేయబడింది

ఎవరైనా ఫ్యామిలీ లైబ్రరీ నుండి కంటెంట్‌ను తీసివేసినా, వారు ఫ్యామిలీ గ్రూప్‌ను పూర్తిగా వదిలివేసినా లేదా మీ ఫ్యామిలీ గ్రూప్ తొలగించబడినా, మీరు కంటెంట్‌ను ఉపయోగించడానికి దాన్ని కొనుగోలు చేయాలి.

మీరు దాన్ని కొనుగోలు చేసిన తర్వాత, మీరు ఎక్కడ ఆపివేశారో అక్కడ నుండి మొదలు పెడతారు. మీరు యాప్‌లో కొనుగోళ్లను గేమ్‌లో కొనుగోలు చేసినట్లయితే, మీరు గేమ్‌ను కొనుగోలు చేసిన తర్వాత వాటిని తిరిగి పొందుతారు.

నేను కంటెంట్‌ను కొనుగోలు చేశాను, కానీ దాన్ని ఫ్యామిలీ లైబ్రరీకి జోడించలేకపోయాను

మీరు ఫ్యామిలీ లైబ్రరీ కోసం కొనుగోలు చేసిన కంటెంట్‌ను దానికి జోడించలేనట్లయితే, అది వీటి వలన అయి ఉండవచ్చు:

  • ఫ్యామిలీ లైబ్రరీకి జోడించడానికి కంటెంట్ అర్హత కలిగి ఉండకపోవచ్చు.
  • మీరు సినిమా లేదా టీవీ షోను కొనుగోలు చేయడానికి, ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌కు బదులుగా, వ్యక్తిగత క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌ను ఉపయోగించి ఉండవచ్చు.
"మీ ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ చెల్లదు"

మీకు ఈ మెసేజ్ కనబడితే, మీ ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ చెల్లదు అని అర్థం. మీరు ఫ్యామిలీ మేనేజర్ అయినట్లయితే, మీ ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డ్‌కు అప్‌డేట్ చేయండి, తద్వారా మీరు ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్‌లు, చేసే కొనుగోళ్లను ఫ్యామిలీ లైబ్రరీకి జోడించవచ్చు.

ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ చెల్లనిది అయినప్పటికీ, ఇతర పేమెంట్ ఆప్షన్‌ల ద్వారా చేసిన కొనుగోళ్లు, ఫ్యామిలీ లైబ్రరీకి ఆటోమేటిక్‌గా జోడించబడవు. మీ ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ అప్‌డేట్ చేయబడిన తర్వాత, మీరు ఆ ఐటెమ్‌లను ఫ్యామిలీ లైబ్రరీకి, వివరాల పేజీ నుండి మాన్యువల్‌గా జోడించాలి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5555139116260566067
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false