మీ యాప్‌లలో ముదురు రంగు రూపాన్ని ఉపయోగించండి

కొన్ని యాప్‌లలో, మీరు రంగు స్కీమ్‌ను మార్చవచ్చు. ముదురు రంగు రూపాన్ని చూడడం మరింత సులభం, అలాగే కొన్ని స్క్రీన్‌లలో అది బ్యాటరీని సేవ్ చేయగలదు.

అన్ని యాప్‌లు బహుళ రంగు స్కీమ్‌లను అందించవు.

యాప్ కోసం ముదురు రంగు రూపాన్ని ఆన్ చేయండి

ముఖ్యమైనది: సెట్టింగ్‌లు యాప్‌ను బట్టి మారుతూ ఉంటాయి. మరింత సమాచారం కోసం, యాప్ డెవలపర్‌ను సంప్రదించండి

  1. యాప్‌ను తెరిచి, సెట్టింగ్‌లను కనుగొనండి.
  2. సెట్టింగ్‌లలో, "డిస్‌ప్లే" లేదా "రూపం" సెట్టింగ్‌లను కనుగొనండి.

చిట్కా: మీరు వాటిని కనుగొనలేకపోతే, యాప్ రూపాన్ని మార్చడం మీకు సాధ్యం కాకపోవచ్చు. 

ముదురు రంగు రూపంలో చూపించే యాప్‌లలో ఉండే సమస్యలను పరిష్కరించండి

మీ యాప్ మీరు అనుకున్నది కాకుండా వేరే రంగు స్కీమ్‌ను చూపించినట్లయితే, దానికి కారణం ఈ కింది వాటిలో ఒకటి అయి ఉంటుంది:

  • మీ ఫోన్‌లో మీరు రూపం సెట్టింగ్‌లను మార్చారు.
  • మీ ఫోన్‌లో మీరు బ్యాటరీ సేవర్‌ను ఆన్ చేశారు.
  • యాప్, బహుళ రంగు స్కీమ్‌లను అందించదు.

మీ ఫోన్ సెట్టింగ్‌లలో ముదురు రంగు రూపాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయండి

Android పరికరం, వెర్షన్‌ను బట్టి సెట్టింగ్‌లు మారుతూ ఉంటాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో, అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.

ముఖ్యమైనది: మీ ఫోన్‌లో మీరు ముదురు రంగు రూపాన్ని ఆన్ చేసినప్పుడు, చాలా యాప్‌లు కూడా ముదురు రంగు రూపాన్ని ఉపయోగిస్తాయి.

  1. మీ ఫోన్‌లో, 'సెట్టింగ్‌లు యాప్'‌ను తెరవండి.
  2. డిస్‌ప్లేని ట్యాప్ చేయండి.
  3. ముదురు రంగు రూపంను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

బ్యాటరీ సేవర్‌ను ఆఫ్ లేదా ఆన్ చేయండి

Android పరికరం, వెర్షన్‌ను బట్టి సెట్టింగ్‌లు మారుతూ ఉంటాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో, అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.

  1. మీ ఫోన్‌లో, 'సెట్టింగ్‌లు యాప్'‌ను తెరవండి.
  2. బ్యాటరీ ఆ తర్వాత బ్యాటరీ సేవర్ ఆ తర్వాత ఇప్పుడే ఆఫ్ చేయిని ట్యాప్ చేయండి.

చిట్కా: లేత రంగు రూపంలో బ్యాటరీ సేవర్‌ను మీరు ఉపయోగించలేరు. మీరు లేత రంగు రూపాన్ని ఉపయోగించాలనుకుంటే, బ్యాటరీ సేవర్‌ను మీరు ఆఫ్ చేయాల్సి ఉంటుంది.

మరింత సహాయాన్ని పొందండి

ఈ చిట్కాలు సమస్యను ఒకవేళ పరిష్కరించకపోతే, యాప్‌నకు వేరే సెట్టింగ్‌లు ఉండటం వలన ఇది జరిగి ఉండవచ్చు. యాప్ డెవలపర్‌ను ఎలా సంప్రదించాలో తెలుసుకోండి.

 

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14310928478650511767
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false