మీ Android ఫోన్‌లో యాప్ అనుమతులను మార్చడం

మీ పరికరంలోని వివిధ ఫీచర్‌లను ఉపయోగించడానికి మీరు కొన్ని యాప్‌లను, అంటే మీ కెమెరా లేదా కాంటాక్ట్స్ లిస్ట్ లాంటి వాటిని అనుమతించవచ్చు. మీ పరికరంలోని ఫీచర్‌లను ఉపయోగించడం కోసం అనుమతులు అడగడానికి యాప్ మీకు నోటిఫికేషన్‌ను పంపుతుంది, మీరు అందులో అనుమతించవచ్చు లేదా నిరాకరించవచ్చు. అలాగే మీరు ఒక్కో యాప్ కోసం విడిగానూ అనుమతులను మార్చవచ్చు లేదా మీ పరికరం సెట్టింగ్‌లలో అనుమతి రకం ఆధారంగానూ మార్చవచ్చు.

ముఖ్యమైనది: ఈ దశలలో కొన్ని, Android 11లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

యాప్ అనుమతులను మార్చండి 

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. యాప్‌లను ట్యాప్ చేయండి.
  3. మీరు మార్చాలనుకుంటున్న యాప్‌ను నొక్కండి. మీరు దాన్ని కనుగొనలేకుంటే, అన్ని యాప్‌లను చూడండి ఆప్షన్‌ను నొక్కండి. ఆ తర్వాత, మీ యాప్‌ను ఎంచుకోండి.
  4. అనుమతులు ఆప్షన్‌ను నొక్కండి.
    • మీరు యాప్ కోసం ఏవైనా అనుమతులను అనుమతించినా లేదా తిరస్కరించినా, మీరు వాటిని ఇక్కడ చూడగలరు.
  5. అనుమతి సెట్టింగ్‌ని మార్చడానికి, దానిపై ట్యాప్ చేసి, ఆపై అనుమతించండి లేదా అనుమతించవద్దు‌ను ఎంచుకోండి.

లొకేషన్, కెమెరా, అలాగే మైక్రోఫోన్ అనుమతుల కోసం, మీరు వీటిని ఎంచుకోవచ్చు:

  • అన్నివేళలా అనుమతించండి: లొకేషన్ కోసం మాత్రమే. మీరు యాప్‌ను ఉపయోగించనప్పటికీ, యాప్ ఎప్పుడైనా అనుమతిని ఉపయోగించవచ్చు.
  • యాప్ ఉపయోగంలో ఉన్నప్పుడు మాత్రమే అనుమతించండి: మీరు యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే సదరు యాప్ అనుమతిని ఉపయోగించగలుగుతుంది.
  • ప్రతిసారి అడగాలి: మీరు యాప్‌ను తెరిచిన ప్రతిసారి, వినియోగించడం కోసం అనుమతి అడుగుతుంది. మీరు యాప్‌ను ముగించే వరకు అది అనుమతిని ఉపయోగించగలదు.
  • అనుమతించవద్దు: మీరు యాప్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ, ఈ యాప్ అనుమతిని వినియోగించుకోలేదు.

అనుమతులను వాటి రకం ఆధారంగా మార్చండి

ఏయే యాప్‌లకు అదే అనుమతి సెట్టింగ్ ఉందో మీరు చెక్ చేయవచ్చు. ఉదాహరణకు, మీ క్యాలెండర్‌ను చూడటానికి ఏయే యాప్‌లకు అనుమతి ఉందో మీరు చెక్ చేయవచ్చు. 
  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. సెక్యూరిటీ, అలాగే గోప్యత ఆ తర్వాత గోప్యత ఆ తర్వాత అనుమతి మేనేజర్ను ట్యాప్ చేయండి.
  3. అనుమతి రకాన్ని ట్యాప్ చేయండి.
    • మీరు ఏవైన యాప్‌ల కోసం అనుమతిని ఇచ్చినా లేదా తిరస్కరించినా, మీరు వాటిని ఇక్కడ చూడవచ్చు.
  4. యాప్ అనుమతిని మార్చడానికి, యాప్‌పై ట్యాప్ చేసి, ఆపై మీ అనుమతుల సెట్టింగ్‌లను ఎంచుకోండి.
అనుమతుల రకాలు

కింద అనుమతుల లిస్ట్, ఒక యాప్ కోసం వాటిని ఆన్ చేస్తే అవి ఏమి చేస్తాయన్నది వివరించబడింది.

  • శరీర సెన్సార్‌లు: మీ కీలక ఆరోగ్య కొలమాన సంకేతాల గురించి సెన్సార్ సమాచారాన్ని యాక్సెస్ చేస్తుంది.
  • క్యాలెండర్: మీ క్యాలెండర్‌ను యాక్సెస్ చేస్తుంది.
  • కాల్ లాగ్‌లు: మీ కాల్ లాగ్‌ను చదువుతుంది, ఎడిట్ చేస్తుంది.
  • కెమెరా: ఫోటోలను తీస్తుంది, అలాగే వీడియోలను రికార్డ్ చేస్తుంది.
  • కాంటాక్ట్‌లు: మీ కాంటాక్ట్‌లను యాక్సెస్ చేస్తుంది.
  • ఫైళ్లు: మీ పరికరంలోని అన్ని ఫైళ్లను యాక్సెస్ చేస్తుంది.
  • లొకేషన్: మీ పరికర లొకేషన్‌ను యాక్సెస్ చేస్తుంది. లొకేషన్ సెట్టింగ్‌ల గురించి తెలుసుకోండి.
  • మైక్రోఫోన్: ఆడియోను రికార్డ్ చేస్తుంది.
  • మ్యూజిక్, అలాగే ఆడియో: మీ పరికరంలో మ్యూజిక్, ఇంకా ఇతర ఆడియో ఫైళ్లను యాక్సెస్ చేస్తుంది.
  • సమీపంలోని పరికరాలు: సమీపంలోని పరికరాలను కనుగొనగలదు, వాటికి కనెక్ట్ అవ్వగలదు, అవి ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకొనగలదు.
  • నోటిఫికేషన్‌లు: నోటిఫికేషన్‌లను పంపుతుంది.
  • ఫోన్: ఫోన్ కాల్స్ చేస్తుంది, అలాగే వాటిని మేనేజ్ చేస్తుంది.
  • ఫోటోలు & వీడియోలు: మీ పరికరంలో మీ ఫోటోలు, వీడియోలను యాక్సెస్ చేస్తుంది.
  • ఫిజికల్ యాక్టివిటీ: నడక, సైక్లింగ్, డ్రైవింగ్, అడుగుల గణన ఇంకా మరిన్ని వంటి మీ ఫిజికల్ యాక్టివిటీను యాక్సెస్ చేస్తుంది.
  • SMS: SMS మెసేజ్‌లను పంపుతుంది, అలాగే చూస్తుంది.
తెలియని యాప్‌ల కోసం అనుమతులను ఆటోమేటిక్‌గా తీసివేస్తుంది
  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. యాప్‌లను ట్యాప్ చేయండి.
  3. మీరు మార్చాలనుకుంటున్న యాప్‌ను నొక్కండి.
    • మీరు దాన్ని కనుగొనలేకుంటే, అన్ని యాప్‌లను చూడండి ఆప్షన్‌ను నొక్కండి. ఆ తర్వాత, మీ యాప్‌ను ఎంచుకోండి.
  4. "ఉపయోగించని యాప్ సెట్టింగ్‌లు" కింద, ఉపయోగించకుండా ఉంటే యాప్ యాక్టివిటీని పాజ్ చేయండి‌ని ఆన్ చేయండి.
మీ పరికరంలో కెమెరా లేదా మైక్రోఫోన్ యాక్సెస్‌ని డిజేబుల్ చేయండి
  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. సెక్యూరిటీ, అలాగే గోప్యత ఆ తర్వాత గోప్యత ఆ తర్వాత గోప్యతా కంట్రోల్స్‌ను ట్యాప్ చేయండి.
  3. కెమెరా యాక్సెస్ లేదా మైక్రోఫోన్ యాక్సెస్‌ను ఆఫ్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16606999340775646169
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false