మీ Google Play పాయింట్‌ల స్థాయి, అలాగే ప్రయోజనాలను ఎలా చెక్ చేయాలి

మీరు ఒక క్యాలెండర్ సంవత్సరంలో పాయింట్‌లను సంపాదించినట్లయితే, మిమ్మల్ని ఒక నిర్దిష్ట స్థాయిలో ఉంచడానికి, మీ పాయింట్‌లు జోడించబడతాయి. మీరు మరిన్ని పాయింట్‌లు పొందే కొద్దీ, మీ స్థాయి పెరుగుతూ ఉంటుంది. మీ స్థాయి పెరుగుతుంది అంటే, మీరు మరిన్ని పాయింట్‌లు, పెర్క్‌లు, ఇంకా ప్రయోజనాలను పొందవచ్చు అని అర్థం.

Play పాయింట్‌ల అందుబాటు, అవార్డ్ స్థాయులు, గుణించే రేట్‌లు దేశాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి. Play Points అన్ని దేశాలలో అందుబాటులో లేదు.

Google Play పాయింట్‌లు, వాటి స్థాయిని బట్టి ప్రయోజనాలు

స్థాయి మీ వద్ద తప్పనిసరిగా ఉండాల్సిన
పాయింట్‌ల సంఖ్య
వెచ్చించిన ప్రతి ¥100కు గాను
సంపాదించిన పాయింట్‌లు
అదనపు ప్రయోజనాలు
బ్రాంజ్ 0 నుండి 249 వరకు 1 పాయింట్
  • నెలవారీ ఈవెంట్‌లలో పుస్తక కొనుగోళ్ల ద్వారా మరిన్ని పాయింట్‌లు పొందే సదుపాయం
సిల్వర్ 250 నుండి 999 వరకు 1.25 పాయింట్‌లు
  • సిల్వర్ వారంవారీ రివార్డ్‌లు
  • నెలవారీ ఈవెంట్‌లలో పుస్తక కొనుగోళ్ల ద్వారా మరిన్ని పాయింట్‌లు పొందే సదుపాయం
గోల్డ్ 1000 నుండి 3999 వరకు 1.50 పాయింట్‌లు
  • గోల్డ్ వారంవారీ రివార్డ్‌లు
  • నెలవారీ ఈవెంట్‌లలో పుస్తక కొనుగోళ్ల ద్వారా మరిన్ని పాయింట్‌లు పొందే సదుపాయం
ప్లాటినం 4,000 నుండి 14,999 వరకు 1.75 పాయింట్‌లు
  • ప్లాటినం వారంవారీ రివార్డ్‌లు
  • నెలవారీ ఈవెంట్‌లలో పుస్తక కొనుగోళ్ల ద్వారా మరిన్ని పాయింట్‌లు పొందే సదుపాయం
  • ప్రీమియం సపోర్ట్
డైమండ్ 15,000 పాయింట్‌ల కంటే ఎక్కువ లేదా సమానం 2 పాయింట్‌లు
  • డైమండ్ వారంవారీ రివార్డ్‌లు
  • నెలవారీ ఈవెంట్‌లలో పుస్తక కొనుగోళ్ల ద్వారా మరిన్ని పాయింట్‌లు పొందే సదుపాయం
  • ప్రీమియం సపోర్ట్

మీ Google Play పాయింట్‌ల స్థాయిని ఎలా చెక్ చేయాలి

మీ వద్ద ఎన్ని Google Play పాయింట్‌లు ఉన్నాయి, తర్వాతి స్థాయికి చేరుకోవడానికి మీకు ఎన్ని పాయింట్‌లు కావాలి, మీ బేస్ సంపాదన రేటు అలాగే తర్వాతి స్థాయిని పొందడానికి కావలసిన పాయింట్‌లు సంపాదించకపోతే ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే ఎంతవరకు కొనసాగుతారు లాంటి విషయాలను కూడా చెక్ చేయవచ్చు.

మీ స్థాయి ఎలా ప్రోగ్రెస్ అవుతుంది

మీరు ఒక కొత్త స్థాయికి చేరుకున్నప్పుడు, దాని తర్వాత క్యాలెండర్ సంవత్సరం చివరి వరకు మీరు అదే స్థాయిలో ఉంటారు. ప్రతి క్యాలెండర్ సంవత్సరం ప్రారంభంలో, మీరు మునుపటి సంవత్సరంలో ఎన్ని పాయింట్‌లు సంపాదించారో దాని ఆధారంగా మీ స్థాయి మారవచ్చు.

మీ స్థాయి 2021 నుండి 2022 వరకు మీ స్థాయి ఎలా మారవచ్చో ఇక్కడ ఒక ఉదాహరణ అందించాము:

  • జనవరి 1, 2021 - డిసెంబర్ 31, 2021, క్యాలెండర్ సంవత్సరంలో మీరు గోల్డ్ స్థాయి చేరుకున్నారు. మీరు ఎలాంటి పాయింట్‌లు సంపాదించక పోయినా కూడా తర్వాతి క్యాలెండర్ సంవత్సరం చివర (డిసెంబర్ 31, 2022) వరకూ గోల్డ్ స్థాయిలోనే ఉంటారు.
  • జనవరి 1 2022 నుండి డిసెంబర్ 31 2022 వరకు, మీరు కింది విధంగా పాయింట్‌లను సంపాదిస్తే:
    • 250 పాయింట్‌లకు, మీరు జనవరి 1, 2023 నుండి సిల్వర్ స్థాయిలో ఉంటారు.
    • 1000 పాయింట్‌లకు, మీరు జనవరి 1, 2023 నుండి గోల్డ్ స్థాయిలో ఉంటారు.
    • 4000 పాయింట్‌లకు, మీరు జనవరి 1, 2023 నుండి ప్లాటినం స్థాయిలో ఉంటారు.
    • 15,000 పాయింట్‌లకు, మీరు జనవరి 1, 2023 నుండి డైమండ్ స్థాయిలో ఉంటారు.

ప్లాటినం లేదా డైమండ్ స్టేటస్ Play పాయింట్‌ల యూజర్‌లకు ప్రీమియం సపోర్ట్

మీరు Google Play పాయింట్‌లలో ప్లాటినం లేదా డైమండ్ స్థాయిని కలిగి ఉంటే, అదనపు సపోర్ట్ ప్రయోజనాలను పొందుతారు. ప్లాటినం లేదా డైమండ్ స్థాయిని పొందడం ఎలాగో తెలుసుకోండి.

  • Play సమస్యల కోసం, వెయిటింగ్ లిస్ట్‌ను దాటి ముందుకు సాగండి. మేము మా సపోర్ట్ టీమ్‌తో కాల్ లేదా చాట్ చేసినప్పుడు, మీరు ఆటోమేటిక్‌గా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇంకా నిరీక్షించాల్సిన సమయం తగ్గుతుంది. 
  • ప్రత్యేకంగా కేటాయించబడిన సపోర్ట్ టీమ్‌లోని నిపుణుడితో చాట్ చేయండి. మీరు ప్లాటినం లేదా డైమండ్ స్టేటస్ కలిగి ఉంటే, అటువంటి యూజర్‌లను సపోర్ట్ చేయడానికి ప్రత్యేకంగా కేటాయించబడిన టీమ్ నుండి ఎంచుకోబడ్డ ఏజెంట్‌లతో మీరు తక్షణమే జత చేయబడతారు.

గమనిక: Google Play, ఎంతసేపు వేచి ఉండాలనేదానికి ఎటువంటి భరోసా ఇవ్వలేదు. అన్ని సపోర్ట్ ప్రయోజనాలు వాటి లభ్యతను బట్టి అందుబాటులో ఉంటాయి.

 

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2683050795153565486
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false