'Google Play Points'లో చేరండి

Google Play Points అనేది ఒక రివార్డ్ ప్రోగ్రామ్, ఇది మీరు Google Play స్టోర్‌లో పాయింట్‌లను, రివార్డ్‌లను సంపాదించేలా చేస్తుంది.

'Google Play Points'తో మీరు ఇవి పొందవచ్చు:

  • Google Play స్టోర్ నుండి డిజిటల్ కంటెంట్‌ను, యాప్‌లోని ఐటెమ్‌లను కొనుగోలు చేయడానికి, ఇంకా డౌన్‌లోడ్‌ల కోసం పాయింట్‌లను సంపాదించవచ్చు.
  • డిస్కౌంట్ కూపన్‌లను, యాప్‌లోని ఐటెమ్‌లను లేదా Google Play క్రెడిట్ పొందడానికి పాయింట్‌లను ఉపయోగించవచ్చు.
  • మీ స్థాయి పెరిగే కొద్దీ, మరిన్ని ప్రయోజనాలను, రివార్డ్‌లను ఇంకా పాయింట్‌లను పొందవచ్చు.
మీరు కొనుగోలు చేయగల కంటెంట్, దాని మీద వచ్చే పాయింట్‌లు మీ దేశం మీద ఆధారపడి ఉంటాయి.

Google Play బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి, మీరు Google Playలో ఖర్చు చేసే ప్రతి 5 INRకు, 1 పాయింట్‌ను సంపాదించడం ప్రారంభిస్తారు. ఒక క్యాలెండర్ సంవత్సరంలోనే మీరు తగినన్ని పాయింట్‌లను కలెక్ట్ చేసినప్పుడు, మీకు ఒక స్థాయి పెరుగుతుంది, దీని ద్వారా మీరు మరిన్ని పాయింట్‌లను, ప్రయోజనాలను పొందుతారు. మీ స్థాయి పెరుగుతున్న కొద్దీ, మీరు మరిన్ని పాయింట్‌లను పొందుతారు. స్థాయిలు, ప్రయోజనాలు ఇంకా పెర్క్‌ల గురించి మరింత తెలుసుకోండి.

మీకు అవసరమైనవి

Google Play Pointsలో చేరడానికి, మీకు అవసరమయ్యేవి:

గమనిక: స్థాయిలు, ప్రయోజనాలు ఇంకా ప్రోగ్రామ్ వివరాలు దేశాన్ని బట్టి మారవచ్చు.

Google Play Pointsలో చేరండి

మీ మొబైల్ పరికరంలో:

  1. Google Play Store యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. Play పాయింట్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. చేరండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ కంప్యూటర్‌లో:

  1. Play Storeను తెరవండి.
  2. ఎడమ వైపున ఉన్న, Play Points అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. చేరండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఒకవేళ మీకు పేమెంట్ ఆప్షన్ లేకపోతే, ఒక పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి అని మిమ్మల్ని అడగవచ్చు.

ఈ వీడియో ద్వారా, Google Play పాయింట్‌ల గురించి మరింత తెలుసుకోండి

Google Play Points explained in Telugu | Making Creators

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
836156780828549845
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false