Google Play పాయింట్‌లతో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి

మీకు Google Play పాయింట్‌లతో సమస్యలు ఉన్నట్లయితే, దిగువున పేర్కొన్న సమస్యలలో మీరు ఎదుర్కొన్న దానిని కనుగొనండి.

Google Play పాయింట్‌ల కోసం సైన్ అప్ చేయడంలో సమస్యలను పరిష్కరించండి

Google Play Pointsలో చేరడానికి, మీకు అవసరమయ్యేవి:

Google Play పాయింట్‌లను సంపాదించడం ఇంకా ఉపయోగించడంలో ఉన్న సమస్యలను పరిష్కరించండి

నా Google Play పాయింట్‌లు, నా కొనుగోలు కోసం చూపబడటం లేదు

దశ 1: మీరు Google Play పాయింట్‌ల కోసం సైన్ అప్ చేశారని నిర్ధారించుకోండి

కొనుగోళ్ల నుండి పాయింట్‌లను సంపాదించడానికి, Google Play పాయింట్‌లలో చేరండి. మీరు Google Play పాయింట్‌లలో చేరక ముందు మీరు చేసిన ఏవైనా కొనుగోళ్లకు మీరు పాయింట్‌లను సంపాదించలేరు.
ముఖ్యమైనది: మీ స్వంత ఖాతాతో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు మాత్రమే మీరు పాయింట్‌లను సంపాదించగలరు. మీ ఫ్యామిలీ గ్రూప్‌లో ఎవరైనా ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించి Google Playలో కొనుగోళ్లు చేసినప్పటికీ, మీరు ఏ పాయింట్‌లను సంపాదించలేరు.

దశ 2: కొంత సమయం వేచి ఉండండి, ఆ తర్వాత మీ పాయింట్‌ల హిస్టరీని చెక్ చేసుకోండి

కొంత కంటెంట్‌పై లేదా Android TV వంటి కొన్ని పరికరాలపై సంపాదించిన పాయింట్‌ల కోసం నిర్ధారణను పొందటానికి కొంత సమయం పట్టవచ్చు.
  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. Play పాయింట్‌ల ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఏదైనా కొనుగోలు కోసం మీరు ఎన్ని పాయింట్‌లు పొందారో చెక్ చేయడానికి, మరిన్ని మరిన్ని ఆ తర్వాత పాయింట్‌ల హిస్టరీ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

దశ 3: మీరు Google Play పాయింట్‌లలో ఎన్‌రోల్ అయిన అదే Google ఖాతాతో ఐటెమ్‌ను కొనుగోలు చేశారో లేదో చెక్ చేసుకోండి

మీకు ఇప్పటికీ సమస్య ఉన్నట్లయితే, మరింత సహాయాన్ని పొందండి.
నేను ఒక గేమ్‌లోని ఐటెమ్ కోసం పాయింట్‌లు ఉపయోగించాను, కానీ దాన్ని అందుకోలేదు

దశ 1: మీ పాయింట్‌ల హిస్టరీని చెక్ చేసుకోండి

  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. Play పాయింట్‌ల ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఏదైనా కొనుగోలు కోసం మీరు ఎన్ని పాయింట్‌లు పొందారో చెక్ చేయడానికి, మరిన్ని మరిన్ని ఆ తర్వాత పాయింట్‌ల హిస్టరీ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
మీ పాయింట్‌లను ఉపయోగించకపోతే, యాప్‌ను తెరిచి, కొనుగోలును రిపీట్ చేయడానికి ట్రై చేయండి.

దశ 2: ఫోర్స్ స్టాప్ చేసి, ఆపై యాప్ లేదా గేమ్‌ను మళ్లీ తెరవండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, సెట్టింగ్‌లు Settingsను తెరవండి.
  2. మీ పరికరం ఆధారంగా, యాప్‌లు లేదా యాప్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు యాప్‌లో చేసే కొనుగోళ్ల కోసం ఉపయోగించిన యాప్‌ను ట్యాప్ చేయండి.
  4. ఫోర్స్ స్టాప్ను ట్యాప్ చేయండి.
  5. మీరు యాప్‌లో చేసిన కొనుగోళ్ల కోసం ఉపయోగించిన యాప్‌ను మళ్ళీ తెరవండి.
  6. మీ ఐటెమ్ డెలివరీ అయ్యిందో లేదో చెక్ చేయండి.

దశ 3: మీ పరికరాన్ని రీస్టార్ట్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, పవర్ బటన్‌ను నొక్కి, పట్టుకోండి.
  2. 'పవర్ ఆఫ్ చేయండి' లేదా 'రీస్టార్ట్ చేయండి'ని ట్యాప్ చేయండి. ఇది పరికరాన్ని బట్టి మారుతుంది.
  3. అవసరమైతే, పరికరాన్ని తిరిగి ఆన్ చేయడానికి మళ్లీ పవర్ బటన్‌ను నొక్కి, పట్టుకోండి.
  4. పరికరం మళ్లీ స్టార్ట్ అయ్యే వరకు వేచి ఉండండి.
  5. యాప్‌ను లేదా గేమ్‌ను మళ్లీ తెరిచి, మీరు యాప్‌లో కొనుగోలు చేసిన ఐటెమ్ మీకు డెలివరీ అయ్యిందో లేదో చెక్ చేయండి.

దశ 4: Play స్టోర్ యాప్‌ను అప్‌డేట్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. మెనూ మెనూ and then సెట్టింగ్‌లు and then బిల్డ్ వెర్షన్ లేదా Play స్టోర్ వెర్షన్‌ను ట్యాప్ చేయండి.
ఇది సాధారణంగా సెట్టింగ్‌ల లిస్ట్ దిగువున ఉంటుంది.

దశ 5: మీ పరికరం తేదీ & సమయం సరిగా ఉన్నాయని నిర్ధారించుకోండి

  1. మీ Android పరికరంలో, సెట్టింగ్‌లు Settingsను తెరవండి.
  2. తేదీ & సమయం మీద ట్యాప్ చేయండి.
  3. "ఆటోమేటిక్ తేదీ & సమయం" అలాగే "ఆటోమేటిక్ టైమ్ జోన్" కనుగొనండి, ఆ తర్వాత దిగువున ఉన్న దశలను ఫాలో అవ్వండి.
"ఆటోమేటిక్ తేదీ & సమయం" అలాగే "ఆటోమేటిక్ టైమ్ జోన్" ఆఫ్ చేయబడి ఉంటే:
  1. రెండు సెట్టింగ్‌లను ఆన్ చేయండి.
  2. కొన్ని నిమిషాలు వేచి ఉండి, ఆపై మీ సమస్య పరిష్కరించబడిందో లేదో చెక్ చేయండి.
  3. పరిష్కారం కాకపోతే, మీ పరికరాన్ని రీస్టార్ట్ చేసి, మళ్లీ చెక్ చేయండి.
"ఆటోమేటిక్ తేదీ & సమయం" అలాగే "ఆటోమేటిక్ టైమ్ జోన్" ఆన్ చేయబడి ఉంటే:
ఈ సెట్టింగ్‌లు రెండూ ఆన్‌లో ఉంటే, తేదీ అలాగే సమయం మీ సమస్యకు కారణం కాకపోవచ్చు. మీ కనెక్టివిటీని చెక్ చేసి, మీ పరికరాన్ని రీస్టార్ట్ చేయండి.

దశ 6: సపోర్ట్ కోసం యాప్ డెవలపర్‌ను సంప్రదించండి

మీకు ఇప్పటికీ యాప్‌లో చేసిన కొనుగోలుతో సమస్యలు కలిగి ఉండి, ఫీడ్‌బ్యాక్‌ను అందించాలనుకుంటే లేదా సహాయాన్ని కోరాలని భావిస్తుంటే, యాప్ డెవలపర్‌ను కాంటాక్ట్ చేయండి.
Play Pass కొనుగోళ్లు లేదా ఇతర Google స్వంత యాప్ కొనుగోళ్లకు మీరు పాయింట్‌లను అందుకోకపోతే, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.
నేను నా యాప్‌లో లేదా గేమ్‌లో క్రెడిట్‌ను ఎందుకు రిడీమ్ చేసుకోలేకపోతున్నాను

దశ 1: మీ పాయింట్‌ల హిస్టరీని చెక్ చేసుకోండి

  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. Play పాయింట్‌ల ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఏదైనా కొనుగోలు కోసం మీరు ఎన్ని పాయింట్‌లు పొందారో చెక్ చేయడానికి, మరిన్ని మరిన్ని ఆ తర్వాత పాయింట్‌ల హిస్టరీ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
మీ పాయింట్‌లను ఉపయోగించకపోతే, యాప్‌ను తెరిచి, ఐటెమ్‌ను మళ్లీ పొందండి.

Step 2: ఐటెమ్ విలువ, కనీసం కూపన్ విలువకు తగినంతగా ఉంటుందని నిర్ధారించుకోండి

సమానంగా లేదా ఎక్కువ విలువ గల ఐటెమ్‌లను క్రెడిట్‌గా పొందడానికి మాత్రమే, మీరు క్రెడిట్‌లను ఉపయోగించవచ్చు.

దశ 3: మీరు ఇప్పటికే మరొక కూపన్ లేదా ప్రమోషన్‌ను ఉపయోగించడం లేదని నిర్ధారించుకోండి

మీరు ఒకసారి ఒక క్రెడిట్‌ను లేదా ఒక ప్రమోషన్‌ను మాత్రమే ఉపయోగించగలరు. చెక్ అవుట్ వద్ద క్రెడిట్‌లు లేదా ప్రమోషన్‌ల మధ్య స్విచ్ కావడానికి, పేమెంట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

దశ 4: ఫోర్స్ స్టాప్ చేసి, ఆపై యాప్ లేదా గేమ్‌ను మళ్లీ తెరవండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, సెట్టింగ్‌లు Settingsను తెరవండి.
  2. మీ పరికరం ఆధారంగా, యాప్‌లు లేదా యాప్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు యాప్‌లో చేసే కొనుగోళ్ల కోసం ఉపయోగించిన యాప్‌ను ట్యాప్ చేయండి.
  4. ఫోర్స్ స్టాప్ను ట్యాప్ చేయండి.
  5. మీరు యాప్‌లో చేసిన కొనుగోళ్ల కోసం ఉపయోగించిన యాప్‌ను మళ్ళీ తెరవండి.
  6. మీ ఐటెమ్ డెలివరీ అయ్యిందో లేదో చెక్ చేయండి.

దశ 5: Play స్టోర్ కాష్, అలాగే డేటాను క్లియర్ చేయండి

ఇది యాప్‌ను తిరిగి ప్రారంభిస్తుంది, అలాగే సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.
  1. మీ Android పరికరంలో, సెట్టింగ్‌లు Settingsను తెరవండి.
  2. యాప్‌లు & నోటిఫికేషన్‌లు and then అన్ని యాప్‌లను చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. కిందికి స్క్రోల్ చేసి Google Play స్టోర్ Google Playను ట్యాప్ చేయండి.
  4. స్టోరేజ్ and then కాష్‌ను క్లియర్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. డేటాను క్లియర్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. Play స్టోర్‌ను మళ్ళీ తెరవండి
  7. మీ క్రెడిట్‌ను మళ్లీ ఉపయోగించండి.
మీకు ఇప్పటికీ సమస్య ఉన్నట్లయితే, మరింత సహాయాన్ని పొందండి.
ప్రమోట్ చేయబడే యాప్‌ను డౌన్‌లోడ్ చేసినందుకు, నేను పాయింట్‌లను పొందలేదు
యాప్ లేదా గేమ్ ఇన్‌స్టాల్ ప్రమోషన్‌ల కోసం, అది తప్పనిసరిగా తొలిసారి చేసిన ఇన్‌స్టాల్ అయి ఉండాలి. పాయింట్‌లను కొనసాగించడానికి, మీరు తప్పనిసరిగా యాప్ లేదా గేమ్‌ను డౌన్‌లోడ్ చేసి, మీ ఫోన్‌లో ఒక రోజు వరకు ఉంచుకోవాలి, లేకపోతే పాయింట్‌లు తీసివేయబడతాయి.
నా థర్డ్-పార్టీ వోచర్ కోడ్‌తో సమస్య ఉంది
థర్డ్-పార్టీ ప్లాట్‌ఫామ్‌లు అందించిన వోచర్ కోడ్‌లతో సమస్యల విషయంలో సపోర్ట్ కోసం మీరు నేరుగా థర్డ్-పార్టీని సంప్రదించాలి.
నేను నా Google Play పాయింట్‌లను యాక్సెస్ చేయలేను లేదా ఉపయోగించలేను
మీ ఖాతాలో మేము మోసాన్ని లేదా దుర్వినియోగాన్ని గుర్తించినట్లయితే, అనధికారిక యాక్సెస్ లేదా దుర్వినియోగం నుండి సురక్షితంగా ఉంచడానికి మేము Google Play పాయింట్‌లకు మీ యాక్సెస్‌ను పరిమితం చేయవచ్చు. Google Play పాయింట్‌లను ఉపయోగించడాన్ని కొనసాగించడానికి, దయచేసి ఎర్రర్ మెసేజ్‌లోని సూచనలను ఫాలో అవ్వండి.

మిస్ అయిన Google Play పాయింట్‌లను కనుగొనండి

నేను ఐటెమ్‌ను రీఫండ్ చేసినప్పుడు లేదా రద్దు చేసినప్పుడు పాయింట్‌లను కోల్పోయాను
మీరు Google Playలో కొనుగోలు చేసిన ఐటెమ్‌ను రీఫండ్ చేయగలిగితే, ఆ కొనుగోలులో మీరు సంపాదించిన పాయింట్‌లు ఏవైనా ఉంటే, అవి మీ Play పాయింట్‌ల బ్యాలెన్స్, అలాగే మీ స్థాయి ప్రోగ్రెస్ నుండి తీసివేయబడతాయి.
నా దేశ ప్రొఫైల్‌ను మార్చినప్పుడు, నేను పాయింట్‌లను కోల్పోయాను
మీరు Google Play పాయింట్‌లను కలిగి ఉండి, మీ Play దేశాన్ని మార్చినట్లయితే, మేము మీ పాయింట్‌లను రికవర్ చేయలేము, అలాగే మీ స్థాయి అనేది కొత్త Play దేశంలో కొనసాగించబడదు. మీ కొత్త దేశంలో Google Play పాయింట్‌లతో మార్చుకున్న ఏవైనా కూపన్‌లను మీరు కోల్పోవచ్చు. మీ Google Play దేశాన్ని మార్చడం ఎలాగో తెలుసుకోండి.
  • మీ కొత్త Play దేశంలో Google Play పాయింట్‌లతో మార్చుకున్న ఏవైనా కూపన్‌లను మీరు కోల్పోవచ్చు.
  • మీరు పాయింట్‌లను ఉపయోగించి మార్చుకున్న ఏవైనా యాప్‌లో చేసిన కొనుగోళ్లకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13210424973574224082
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false