మీ Google Play పాయింట్‌లను సంపాదించడం, ట్రాక్ చేయడం

మీరు చేరిన తర్వాత, మీరు ఎన్‌రోల్ చేసుకున్న Google ఖాతా నుండి చేసిన Google Play కొనుగోళ్ల కోసం మీరు పాయింట్‌లను సంపాదిస్తారు. మీరు Google Play పాయింట్‌లలో చేరడానికి ముందు మీరు చేసిన కొనుగోళ్లకు మీరు పాయింట్‌లను పొందలేరు. 

Play పాయింట్‌ల అందుబాటు, అవార్డ్ స్థాయులు, గుణించే రేట్‌లు దేశాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి. Play Points అన్ని దేశాలలో అందుబాటులో లేదు.

పాయింట్‌లను ఎలా సంపాదించాలి

  • యాప్‌లు లేదా గేమ్‌లను Play Storeలో కొనండి
  • Android నుండి Google Oneకు సబ్‌స్క్రయిబ్ చేయండి
  • యాప్‌లలో లేదా గేమ్‌లలో కొనుగోళ్లు, సబ్‌స్క్రిప్షన్‌లు చేయండి
  • Google Play ద్వారా పుస్తకాలను కొనండి
    • ముఖ్యమైనది: ఆస్ట్రియా, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇజ్రాయిల్ లేదా స్పెయిన్ లాంటి దేశాలలో Play క్రెడిట్‌ను పుస్తకాల కోసం రిడీమ్ చేయడం సాధ్యపడదు.
మీరు కొనుగోలు చేయగల కంటెంట్, దాని మీద వచ్చే పాయింట్‌లు మీ దేశం మీద ఆధారపడి ఉంటాయి.

పాయింట్‌ల గురించి తెలుసుకోవాల్సిన అంశాలు

  • మీరు మీ Android పరికరం, కంప్యూటర్, స్మార్ట్ టీవీలలో చేసిన Google Play కొనుగోళ్లతో పాయింట్‌లను సంపాదించవచ్చు.
  • మీరు పాయింట్‌లను కొనుగోలు చేయలేరు లేదా పాయింట్‌లను క్యాష్‌గా మార్చలేరు.
  • పాయింట్‌లను మీరు వేరే ఖాతాలకు లేదా వేరే వ్యక్తులకు బదిలీ చేయలేరు. మీ ఫ్యామిలీ గ్రూప్‌లో భాగమైన వ్యక్తులకు కూడా పాయింట్‌లను బదిలీ చేయడం సాధ్యపడదు.
  • మీ వద్ద Google Play పాయింట్‌లు ఉండి, మీరు మీ బిల్లింగ్ దేశాన్ని మార్చినట్లయితే, మీ పాయింట్‌లను కోల్పోతారు, మీ స్థాయి కొత్త బిల్లింగ్ దేశానికి కొనసాగించబడదు.
 

పాయింట్‌లు ఎలా లెక్కించబడతాయి

సంపాదించిన పాయింట్‌లను లెక్కించడానికి, ఐటెమ్ ధరతో మీ స్థాయిలో బేస్ సంపాదన రేటును గుణించండి. మీరు సంపాదించే పాయింట్‌ల సంఖ్య సమీప పూర్ణ సంఖ్యకు రౌండప్ లేదా రౌండ్ డౌన్ చేయబడుతుంది. వర్తించే ప్రాంతం ఆధారంగా మీరు నిర్దిష్ట మొత్తం కంటే తక్కువ సంపాదిస్తే, మీరు 0  పాయింట్‌లను సంపాదించవచ్చు. 

మీరు కేవలం ఐటెమ్ ధరకు తగిన పాయింట్‌లు మాత్రమే సంపాదిస్తారు, మీరు చెల్లించిన పన్నులు కలపబడవు.

For example:

At the Bronze level, you earn 1 point per €1 EUR on all purchases. If you spend €5 EUR, you’ll get 5 points.

When you move up to the Silver level, you earn 1.10 points per €1 EUR. If you spend €5 EUR, you’ll get 6 points, rounded up from 5.50.

Tip: At the start of each calendar year, your level may change based on how many points you earned the year before. The higher your level, the more you earn per €1 EUR on all purchases. Learn more about level changes.

మీ పాయింట్‌లు వీటికి ఉపయోగపడతాయి

సంపాదించిన పాయింట్‌లు Play పాయింట్‌ల బ్యాలెన్స్‌గానూ, స్థాయి ప్రోగ్రెస్‌లోనూ లెక్కించబడతాయి.

  • Play పాయింట్‌ల బ్యాలెన్స్: యాప్‌లు, గేమ్‌లలో ప్రత్యేక ఐటెమ్‌లను అన్‌లాక్ చేయడానికి లేదా Google Play క్రెడిట్ కోసం మార్పిడి చేయడానికి ఈ పాయింట్‌లను ఉపయోగించండి. మీరు పాయింట్‌లను ఉపయోగించినప్పుడు లేదా మార్పిడి చేసినప్పుడు, ఈ బ్యాలెన్స్ నుండి పాయింట్‌లు డిడక్ట్ అవుతాయి. మీరు చివరిసారిగా పాయింట్‌లు సంపాదించిన లేదా ఉపయోగించిన, ఒక సంవత్సరం తర్వాత మీరు సంపాదించిన అన్ని పాయింట్‌ల గడువు ముగుస్తుంది.
  • స్థాయి ప్రోగ్రెస్: క్యాలెండర్ సంవత్సరంలో మీరు సంపాదించిన పాయింట్‌లు తర్వాతి స్థాయికి ప్రోగ్రెస్‌లో లెక్కించబడతాయి. మీరు పాయింట్‌లను ఉపయోగించినప్పుడు మీ స్థాయి ప్రోగ్రెస్ నుండి పాయింట్‌లు డిడక్ట్ చేయబడవు. మీరు ఒక స్థాయికి చేరుకున్నాక, తర్వాత క్యాలెండర్ సంవత్సరం చివరి వరకు మీరు అదే స్థాయిలో ఉంటారు.

మీరు పాయింట్‌లు సంపాదించిన కొనుగోళ్లను మీరు రిటర్న్ చేసినా లేదా రద్దు చేసినా, ఆ పాయింట్‌లు మీ Play పాయింట్‌ల బ్యాలెన్స్, స్థాయి ప్రోగ్రెస్ నుండి డిడక్ట్ అవుతాయి.

మీ పాయింట్‌లు & వాటి గడువు ముగిసే తేదీలను చెక్ చేయడం

ప్రమోషన్‌ల ద్వారా అదనపు పాయింట్‌లను సంపాదించడం

కొన్ని ప్రమోషన్‌లు ఎంపిక చేసిన కొనుగోళ్ల మీద మీ సంపాదన రేటును పెంచవచ్చు. నిర్దిష్ట సమయ పరిధులలో మీరు అందుబాటులో ఉన్న అత్యధిక సంపాదన రేటు వద్ద పాయింట్‌లను సంపాదించవచ్చు.

  • ఏకైక కొనుగోలు మీద మల్టిపుల్ ప్రమోషన్‌లను కలపడం సాధ్యపడదు.
  • ప్రమోషన్‌లకు అవి వర్తించే సంపాదన రేటు నిర్దేశించబడి ఉంటుంది.
  • ప్రమోషన్‌లు, అలాగే వాటి గడువు ముగింపు తేదీలు మారుతూ ఉండవచ్చు.
  • కొన్ని ప్రమోషన్‌లకు యాక్టివేషన్ చేయాల్సిన అవసరం ఉండవచ్చు.
  • కొన్ని ప్రమోషన్‌లకు గడువు ముగింపు తేదీ ఉండవచ్చు. ఒకవేళ మీరు గడువు ముగింపు తేదీ తర్వాత కొనుగోలు చేస్తే, మీ స్థాయికి తగినట్లుగా మీరు సాధారణ రేటులో పాయింట్‌లను సంపాదిస్తారు.
  • కొన్ని ప్రమోషన్‌లు, కొంతమంది ఎంపిక చేయబడిన పార్టిసిపెంట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ యూజర్‌లు, వారి కొనుగోలు హిస్టరీ ఆధారంగా లేదా Google Play Store యాప్‌తో వారు చేసిన ఇంటరాక్షన్‌ల ఆధారంగా ఎంపిక చేయబడతారు.
  • పలు రకాల కొనుగోలు ప్రమోషన్‌లు, కరెన్సీని బట్టి ఉంటాయి. అర్హత పొందడానికి, తప్పనిసరిగా ప్రమోషన్‌లో పేర్కొన్న కరెన్సీలోనే కొనుగోళ్లు చేయాలి.
    • ఉదాహరణ: "$0.99 USD లేదా అంతకన్నా ఎక్కువ విలువతో కూడిన 5 కొనుగోళ్లను చేసి 100 పాయింట్‌లను పొందండి" అని బహుళ కొనుగోళ్ల ప్రమోషన్ చెప్తుంది. USDలో చేసిన కొనుగోళ్లు మాత్రమే ఈ ప్రమోషన్‌కు అర్హతను పొందుతాయి.
  • యాప్ లేదా గేమ్ ఇన్‌స్టాల్ ప్రమోషన్‌ల కోసం, అది తప్పనిసరిగా మొదటిసారి ఇన్‌స్టాల్ అయి ఉండాలి. మీరు తప్పనిసరిగా యాప్ లేదా గేమ్‌ను డౌన్‌లోడ్ చేసి, మీ ఫోన్‌లో ఒక రోజు పాటు ఉంచాలి. అలా చేయకుంటే, పాయింట్‌లు తీసివేయబడతాయి.

సబ్‌స్క్రిప్షన్‌లు:

  • ఒకవేళ మీరు యాప్ ద్వారా సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేస్తే, మీ స్థాయికి తగినట్లుగా సాధారణ రేటులో మీరు పాయింట్‌లను సంపాదిస్తారు.
  • కొన్ని ప్రమోషన్‌లు ఎంపిక చేసిన యాప్‌లు, గేమ్‌లలో మొదటిసారి సబ్‌స్క్రయిబ్ చేసుకున్న వారి కోసం అదనపు పాయింట్‌లను అందించవచ్చు.
  • ఏదైనా యాప్ లేదా గేమ్‌కు మొదటిసారి సబ్‌స్క్రయిబ్ చేసుకున్నందుకు మీరు గరిష్టంగా ఒకసారి మాత్రమే బోనస్ పాయింట్ సంపాదిస్తారు.
  • యాప్‌లు, గేమ్‌లలో ఎంపిక చేసిన సబ్‌స్క్రిప్షన్‌లు మీరు బిల్లు చేసినప్పుడు అదనపు పాయింట్‌లను అందించవచ్చు.
  • కేవలం Google Play ద్వారా చేసిన కొనుగోళ్లకు మాత్రమే పాయింట్‌లు అందుతాయి.

మీ ప్రమోషన్‌లను చెక్ చేయడం

  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. Play పాయింట్‌లు ఆ తర్వాత సంపాదించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • ఎగువున ఉన్నది మీ ప్రాథమిక స్థాయి సంపాదన రేటు.
    • దిగువున ఉన్నవి ప్రమోషన్‌లు, వాటి ప్రత్యేక ఆఫర్‌ల లిస్ట్.

Here’s an example of how points are calculated with a special earn rate:

John is at the Silver level, and his base earn rate for all purchases is 1.10 points per €1 EUR.
He gets a special offer to earn 3 points per €1 EUR from a specific game. Because the special offer is a better earn rate than his base earn rate, John will get the special offer rate for purchases in that game.
When he spends €1 EUR in that game during the special offer period, he’ll earn 3 points on that purchase.

వారం వారీ బహుమతులను రిడీమ్ చేయడం

ఒకవేళ మీరు Play Pointsలలో సిల్వర్ స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, మీరు మీ వారంవారీ బహుమతిని క్లెయిమ్ చేయడం ద్వారా మీరు రివార్డ్‌లను పొందే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైనది: మీ Play దేశంలో శుక్రవారం రోజు వారం వారీ బహుమతులు రీసెట్ అవుతాయి.

  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. Play పాయింట్‌లు ఆ తర్వాత పెర్క్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • మీ బహుమతిని క్లెయిమ్ చేసుకోవడానికితెరువు ఆ తర్వాత మీ వారపు బహుమతిని క్లెయిమ్ చేేసుకోండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 
    • మీరు ఇప్పటికే మీ వారపు బహుమతిని రిడీమ్ చేసుకున్నారో లేదో చెక్ చేయడానికి: మరిన్ని మరిన్ని ఆ తర్వాత పాయింట్‌ల హిస్టరీ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18146561655874843898
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false