మీ Google Play పాయింట్‌లను సంపాదించడం, ట్రాక్ చేయడం

మీరు చేరిన తర్వాత, మీరు ఎన్‌రోల్ చేసుకున్న Google ఖాతా నుండి చేసిన Google Play కొనుగోళ్ల కోసం మీరు పాయింట్‌లను సంపాదిస్తారు. మీరు Google Play పాయింట్‌లలో చేరడానికి ముందు మీరు చేసిన కొనుగోళ్లకు మీరు పాయింట్‌లను పొందలేరు. 

Play పాయింట్‌ల అందుబాటు, అవార్డ్ స్థాయులు, గుణించే రేట్‌లు దేశాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి. Play Points అన్ని దేశాలలో అందుబాటులో లేదు.

పాయింట్‌లను ఎలా సంపాదించాలి

  • యాప్‌లు లేదా గేమ్‌లను కొనడం
  • యాప్‌లో లేదా గేమ్‌లో కొనుగోళ్లు, సబ్‌స్క్రిప్షన్‌లు చేయండి
  • Google Play ద్వారా పుస్తకాలను కొనండి
    • ముఖ్యమైనది: ఆస్ట్రియా, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇజ్రాయిల్ లేదా స్పెయిన్ లాంటి దేశాలలో Play క్రెడిట్‌ను పుస్తకాల కోసం రిడీమ్ చేయడం సాధ్యపడదు.
మీరు కొనుగోలు చేయగల కంటెంట్, దాని మీద వచ్చే పాయింట్‌లు మీ దేశం మీద ఆధారపడి ఉంటాయి.

పాయింట్‌ల గురించి మరింత తెలుసుకోండి

  • మీరు మీ Android పరికరంతో Play Pointsకు సైన్ అప్ చేస్తే, ఇంకా మీరు మీ కంప్యూటర్ లేదా స్మార్ట్ టీవీతో చేసే Google Play కొనుగోళ్లపై పాయింట్‌లను సంపాదిస్తారు. 
  • మీరు పాయింట్‌లను కొనుగోలు చేయలేరు లేదా పాయింట్‌లను క్యాష్‌గా మార్చలేరు.
  • మీరు మీ వ్యక్తిగత ఖాతాతో మాత్రమే పాయింట్‌లను సంపాదించగలరు ఇంకా వాటిని ఉపయోగించగలరు.
  • ఒకవేళ మీ వద్ద Google Play పాయింట్‌లు ఉండి, మీరు మీ బిల్లింగ్ దేశాన్ని మార్చినట్లయితే, మీరు మీ పాయింట్‌లను కోల్పోతారు, అలాగే మీ స్థాయి కొత్త బిల్లింగ్ దేశానికి కొనసాగించబడదు.

పాయింట్‌లను లెక్కించడం ఎలా

సంపాదించిన పాయింట్‌లను లెక్కించడానికి, ఐటెమ్ ధరతో మీ స్థాయిలో బేస్ సంపాదన రేటును గుణించండి. మీ పాయింట్‌లను సమీప పూర్ణ సంఖ్యకు రౌండప్ చేయండి.

మీరు ఐటెమ్ బేస్ ధరపై మాత్రమే పాయింట్‌లను సంపాదిస్తారు.

ఉదాహరణకు:

  • బ్రాంజ్ స్థాయిలో, మీరు అన్ని కొనుగోళ్ల మీద ఖర్చు చేసే ప్రతి Rp1,500 IDRకు 1 పాయింట్‌ను సంపాదిస్తారు. మీరు Rp7,500 IDR ఖర్చు చేస్తే, 5 పాయింట్‌లను సంపాదిస్తారు.
  • మీరు సిల్వర్ స్థాయికి వెళ్లినప్పుడు మీరు ఖర్చు చేసే ప్రతి Rp1,500 IDRకు 1.1 పాయింట్‌లను సంపాదిస్తారు. మీరు Rp7,500 IDR ఖర్చు చేస్తే, మీరు 5.5ను రౌండప్ చేయడం ద్వారా 6 పాయింట్‌లను పొందుతారు.
చిట్కా: ప్రతి క్యాలెండర్ సంవత్సరం ప్రారంభంలో, మీరు సంవత్సరానికి ముందు ఎన్ని పాయింట్‌లు సంపాదించారో దాని ఆధారంగా మీ స్థాయి మారవచ్చు. మీ స్థాయి పెరిగే కొద్దీ, మీరు ఖర్చు పెట్టే ప్రతి Rp1,500 IDRకు మరిన్ని పాయింట్‌లను సంపాదిస్తారు. స్థాయి మార్పుల గురించి మరింత తెలుసుకోండి.

మీరు మీ పాయింట్‌లను ఎలా ఉపయోగించవచ్చు

సంపాదించిన పాయింట్‌లు, Play పాయింట్‌ల బ్యాలెన్స్‌గానూ ఇంకా స్థాయి ప్రోగ్రెస్‌లోనూ లెక్కించబడతాయి.

  • Play పాయింట్‌ల బ్యాలెన్స్: 
    •  యాప్‌లు, గేమ్‌లలో ప్రత్యేక ఐటెమ్‌లను అన్‌లాక్ చేయడానికి లేదా Google Play క్రెడిట్ కోసం మార్పిడి చేయడానికి పాయింట్‌లను ఉపయోగించండి. 
    •  మీరు పాయింట్‌లను ఉపయోగించినప్పుడు లేదా మార్పిడి చేసినప్పుడు, మీ బ్యాలెన్స్ నుండి పాయింట్‌లను Play డిడక్ట్ చేస్తుంది.
    •  ఇటీవలి మీ పాయింట్‌ల యాక్టివిటీ తేదీ నుండి ఒక సంవత్సరం పూర్తవగానే పాయింట్‌లు ముగుస్తాయి.
  • స్థాయి ప్రోగ్రెస్: 
    •  ఒక క్యాలెండర్ సంవత్సరంలో మీరు సంపాదించిన పాయింట్‌లు తర్వాతి స్థాయికి ప్రోగ్రెస్ అవ్వడంలో లెక్కించబడతాయి. 
    •  ఉపయోగించిన పాయింట్‌లు ఇంకా మీ స్థాయి ప్రోగ్రెస్‌కు జోడించబడుతాయి. 
    •  మీరు ఒక స్థాయికి చేరుకున్నాక, తర్వాతి క్యాలెండర్ సంవత్సరం చివరి వరకూ మీరు అదే స్థాయిలో ఉంటారు.

మీరు పాయింట్‌లు సంపాదించిన కొనుగోళ్లను మీరు రిటర్న్ చేసినా లేదా రద్దు చేసినా, Play వాటిని మీ Play పాయింట్‌ల బ్యాలెన్స్ నుండి డిడక్ట్ చేస్తుంది అంతే గాకుండా ఇది Play పాయింట్‌ల ద్వారా లభించిన కొత్త స్థాయి, కొత్త స్థాయి సంపాదన రేటు ఇంకా ప్రయోజనాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

మీ పాయింట్‌లు & వాటి గడువు ముగిసే తేదీలను చెక్ చేయండి

  1. Google Play Store యాప్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఫోటో profile pictureను ట్యాప్ చేయండి.
  3. Play పాయింట్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • మీ పాయింట్‌ల బ్యాలెన్స్‌ను చెక్ చేయడానికి:
      • ఉపయోగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
      • ఎగువున, మీ పాయింట్‌ల బ్యాలెన్స్‌ను ఇంకా గడువు ముగింపు తేదీని కనుగొనండి.
    • ఒక కొనుగోలుకు మీరు ఎన్ని పాయింట్‌లను సంపాదించారో చెక్ చేయడానికి:  
      • మరిన్ని మరిన్ని  ఆ తర్వాత పాయింట్‌ల హిస్టరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ప్రమోషన్‌ల ద్వారా అదనపు పాయింట్‌లను సంపాదించండి

కొన్ని ప్రమోషన్‌లు కొన్ని నిర్దిష్ట కాల వ్యవధులలో ఎంచుకోబడిన కొనుగోళ్ల మీద మీ సంపాదన రేటును పెంచుతాయి.

  • చేసే ప్రతి కొనుగోలుపై మీరు ఒక ప్రమోషన్‌ను ఉపయోగించుకోవచ్చు.
  • కొనుగోళ్లకు సంపాదన రేటులను సెట్ చేయడంలో ప్రమోషన్‌లు వర్తిస్తాయి.
  • ప్రమోషన్‌లు, వాటి గడువు ముగింపు తేదీలు మారుతూ ఉండవచ్చు. ఒకవేళ మీరు ప్రమోషన్ గడువు ముగింపు తేదీ తర్వాత కొనుగోలు చేస్తే, మీ స్థాయికి తగినట్లుగా మీరు సాధారణ రేటులో పాయింట్‌లను సంపాదిస్తారు.
  • కొన్ని ప్రమోషన్‌లకు యాక్టివేషన్ అవసరం.
  • బహుళ-కొనుగోలు ప్రమోషన్‌లు నిర్దేశిత కరెన్సీని బట్టి ఉంటాయి. అర్హత పొందడానికి, తప్పనిసరిగా ప్రమోషన్‌లో పేర్కొన్న కరెన్సీనే ఉపయోగించాలి.
    • ఉదాహరణ: "$0.99 USD లేదా అంతకన్నా ఎక్కువ విలువతో కూడిన 5 కొనుగోళ్లను చేసి 100 పాయింట్‌లను సంపాదించండి" అని బహుళ కొనుగోళ్ల ప్రమోషన్ చెప్తుంది. USDలో చేసిన కొనుగోళ్లు మాత్రమే ఈ ప్రమోషన్‌కు అర్హతను పొందుతాయి.

సబ్‌స్క్రిప్షన్‌లు

  • ఒకవేళ మీరు యాప్ ద్వారా సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేస్తే, మీ స్థాయికి తగినట్లుగా సాధారణ రేటులో మీరు పాయింట్‌లను సంపాదిస్తారు. కొన్ని ప్రమోషన్‌లు కొన్ని నిర్దిష్ట యాప్‌లు, గేమ్‌లలో మొదటిసారి సబ్‌స్క్రయిబర్‌లకు మరిన్ని పాయింట్‌లను ఆఫర్ చేస్తాయి.
  • ఏదైనా అర్హత గల యాప్ లేదా గేమ్‌కు మీరు మొదటిసారి సబ్‌స్క్రయిబర్ అయితే, బోనస్ పాయింట్‌లను పొందవచ్చు.
  • మీకు బిల్లు విధించినప్పుడు, కొన్ని యాప్‌లు, గేమ్‌ల లోని సబ్‌స్క్రిప్షన్‌లు మీకు అదనపు పాయింట్‌లను అందిస్తాయి. 
  • మీరు Google Play ద్వారా చేసే కొనుగోళ్లపై మాత్రమే మీరు పాయింట్‌లు సంపాదిస్తారు.

మీ ప్రమోషన్‌లను చెక్ చేయండి

  1. Google Play Store యాప్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఫోటో profile pictureను ట్యాప్ చేయండి.
  3. Play పాయింట్‌లు ఆ తర్వాత సంపాదించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • ఎగువున ఉన్నది మీ బేస్ సంపాదన రేటు.
    • దిగువున ఉన్నవి ప్రమోషన్‌లు, వాటి ప్రత్యేక ఆఫర్‌ల లిస్ట్.

ప్రత్యేక సంపాదన రేటుతో పాయింట్‌లు ఎలా లెక్కించబడతాయో ఇక్కడ ఒక ఉదాహరణ అందించాము:

జాన్ అనే వ్యక్తి సిల్వర్ స్థాయిలో ఉన్నాడు, అలాగే అన్ని కొనుగోళ్లకు అతని బేస్ సంపాదన రేటు ప్రతి Rp1,500 IDRకు 1.1 పాయింట్‌లుగా ఉంటుంది.

  • అతను ఒక గేమ్ నుండి ప్రతి Rp1,500 IDRకు 3 పాయింట్‌లను సంపాదించడానికి ప్రత్యేక ఆఫర్‌ను పొందుతాడు. ఎందుకంటే జాన్ తన బేస్ సంపాదన రేటు కన్నా ప్రత్యేక ఆఫర్ ద్వారా మెరుగైన సంపాదన రేటును పొందగలడు, ఆ గేమ్‌లలో కొనుగోలు ద్వారా జాన్ ప్రత్యేక ఆఫర్ రేట్లను అందుకొంటాడు.
  • ప్రత్యేక ఆఫర్ సమయంలో జాన్ గేమ్‌లో Rp3,000 IDR వెచ్చించినప్పుడు, అతను ఆ కొనుగోలుపై 6 పాయింట్‌లను పొందుతాడు.

వారంవారీ బహుమతులను రిడీమ్ చేయండి

ఒకవేళ మీరు Play Pointsలలో సిల్వర్ స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, మీరు మీ వారంవారీ బహుమతిని క్లెయిమ్ చేసుకోవడం ద్వారా మీరు అదనపు పాయింట్‌లను పొందే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైనది: మీ Play దేశంలో శుక్రవారం రోజు వారంవారీ బహుమతులు రీసెట్ అవుతాయి.

  1. Google Play Store యాప్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఫోటో profile pictureను ట్యాప్ చేయండి.
  3. Play పాయింట్‌లు ఆ తర్వాత పెర్క్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • మీ బహుమతిని క్లెయిమ్ చేసుకోవడానికి: తెరవండి ఆ తర్వాత మీ వారంవారీ బహుమతిని క్లెయిమ్ చేేసుకోండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • మీరు ఇప్పటికే మీ వారంవారీ బహుమతిని రిడీమ్ చేసుకున్నారో లేదో చెక్ చేయడానికి: మరిన్ని మరిన్ని ఆ తర్వాత పాయింట్‌ల హిస్టరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7638883414828616410
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false