Google Play గిఫ్ట్ కార్డ్ స్కామ్ వల్ల మీరు మోసపోతే ఏం చేయాలి

మీరు Play గిఫ్ట్ కార్డ్‌ల స్కామ్ వలన మోసపోయిన వారు అయితే, మీరు చేయదగిన అలాగే మీరు తెలుసుకోవలసిన విషయాలను ఇక్కడ వివరించాము.

స్కామ్ రిపోర్ట్ చేయండి

మీరు గిఫ్ట్ కార్డ్ స్కామ్ బాధితులు అయితే, ఆ స్కామ్‌ను మీ స్థానిక పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు రిపోర్ట్ చేయండి.మీరు స్కామ్‌ను ఫెడెరల్ ట్రేడ్ కమీషన్‌కు కూడా రిపోర్ట్ చేయవచ్చు.

తర్వాత, గిఫ్ట్ కార్డ్ స్కామ్‌ను Googleకు రిపోర్ట్ చేయండి. మీరు స్కామ్‌ను రిపోర్ట్ చేస్తే, భవిష్యత్తులో అది మిమ్మల్ని అలాగే ఇతరులను ఇటువంటి అనుమానాస్పద యాక్టివిటీల నుండి కాపాడటంలో సహాయపడవచ్చు.

గిఫ్ట్ కార్డ్ స్కామ్‌ను Googleకు రిపోర్ట్ చేయండి

మీకు Google ఖాతా లేకపోతే: గిఫ్ట్ కార్డ్ స్కామ్‌ను Googleకు రిపోర్ట్ చేయడానికి, ఈ ఫారమ్ ఉపయోగించండి.

చిట్కా: స్కామ్‌ను Googleకు రిపోర్ట్ చేసిన వ్యక్తి తప్పనిసరిగా స్కామ్‌కు గురైన వ్యక్తి అయి ఉండాలి.

మీరు స్కామ్ బాధితులా కాదా అని తెలుసుకోవడం ఎలా

ఎవరైనా, మీరు Google Play గిఫ్ట్ కార్డ్ కొని, దాని కోడ్‌ను వారికి షేర్ చేస్తే, ఆ కార్డ్ విలువతో Google Play కాకుండా వేరే చోట దేనినైనా కొనుగోలు చేసుకోవచ్చు అని మీతో చెప్తే, వారు స్కామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం.

  • స్కామ్ చేసే వ్యక్తి మీకు కాల్ చేసి తను ప్రభుత్వ ఏజెన్సీ వ్యక్తిని అని చెప్పవచ్చు (USలో IRS వంటిది. ఇతర దేశాలలో వేరు వేరు పేర్లతో ఏజెన్సీలు ఉన్నాయి). స్కామ్ చేసే వ్యక్తి మీరు పన్నులు బకాయి ఉన్నారని, బెయిల్ డబ్బులు కట్టాలి అని, అప్పు తీర్చాలి అని ఇంకా అనేక కారణాలు చెప్తారు. మీరు అరెస్ట్ అవ్వకుండా ఉండటానికి లేదా భౌతిక వస్తువులు లేదా మీ వ్యక్తిగతంగా గుర్తించే సమాచారం (USలో SSN. ఇతర దేశాలలో వేరే పేర్లు ఉన్నాయి) సీజ్ అవ్వకుండా ఉండాలి అంటే, మీరు వారికి గిఫ్ట్ కార్డ్ ద్వారా చెల్లించాలి అని చెప్తారు.
  • స్కామ్ చేసే వ్యక్తి ఆపదలో ఉన్న మీ కుటుంబ సభ్యుడు అని కాని, మీ కుటుంబ సభ్యునికి సంబంధించిన అటార్నీ లేదా మరొక ప్రతినిధి అని కాని చెప్తారు. స్కామ్ చేసే వ్యక్తి ఆ ఆపద నుండి బయటపడటానికి గిఫ్ట్ కార్డ్‌లు ఉపయోగించి చెల్లించాలి అని చెప్తారు. మీరు ఇతర కుటుంబ సభ్యులను సంప్రదించి, ఈ విషయాన్ని నిర్ధారించుకోకుండా వారు మిమ్మల్ని ఆపుతారు. వారిని నమ్మవద్దు. వారి కోసం ఎలాంటి గిఫ్ట్ కార్డ్‌లు కొనవద్దు లేదా వారికి గిఫ్ట్ కార్డ్ కోడ్‌లు ఏవీ ఇవ్వవద్దు.

ఈ ఉదాహరణలలో కేవలం కొన్ని రకాల స్కామ్‌లు మాత్రమే వివరించబడ్డాయి. స్కామ్ చేసే వారు ప్రజలను మోసగించడానికి ఉపయోగించే ట్రిక్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని కోడ్ అడిగారు అంటే, అది స్కామ్ అవ్వవచ్చు.

గిఫ్ట్ కార్డ్ ఎలా ఉంటుందో చూడండి

Google Play గిఫ్ట్ కార్డ్ కోడ్

గిఫ్ట్ కార్డ్ స్కామ్‌లను నివారించండి 

  • Google Play గిఫ్ట్ కార్డ్‌లను పన్నులు చెల్లించడానికి, బెయిల్ డబ్బులు చెల్లించడానికి లేదా Google Play వెలుపల వేరేదైనా చెల్లించడానికి ఎప్పుడూ ఉపయోగించవద్దు. Google Play గిఫ్ట్ కార్డ్‌లను Google Playలో కొనుగోళ్ళు చేయడానికి మాత్రమే ఉపయోగించగలరు.
  • గిఫ్ట్ కార్డ్ వెనుక ఉన్న కోడ్‌ను ఎప్పుడూ షేర్ చేయవద్దు.

కోల్పోయిన లేదా దొంగిలించబడిన గిఫ్ట్ కార్డ్‌ను భర్తీ చేయండి

Google Play గిఫ్ట్ కార్డ్‌లను తిరిగి అమ్మలేరు, ఎక్స్‌ఛేంజ్ చేయలేరు, డబ్బు తీసుకుని బదిలీ చేయలేరు, కాబట్టి మేము మీకు కొత్త గిఫ్ట్ కార్డ్‌ను జారీ చేయలేము. 

గిఫ్ట్ కార్డ్‌ల పరిమితుల గురించి మరింత తెలుసుకోవడానికి Google Play గిఫ్ట్ కార్డ్ సర్వీస్ నియమాలను చూడండి.

దురదృష్టవశాత్తు, చట్ట ప్రకారం అవసరమైతే తప్ప, Google Play గిఫ్ట్ కార్డ్‌లు కూడా నగదు రూపంలో రిడీమ్ చేసుకోగలిగినవి కావు, రీలోడ్ అవ్వవు, వాటికి రీఫండ్ లభించదు. 

సంబంధిత రిసోర్స్‌లు

Google స్కామ్‌లను నివారించండి, రిపోర్ట్ చేయండి

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9053866170067122889
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false