Play ఇన్‌స్టంట్ యాప్‌లను ఉపయోగించండి

Play Store నుండి, మీరు Google Play ఇన్‌స్టంట్‌ను ఉపయోగించి మీ పరికరంలో యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకుండానే వాటిని ఉపయోగించవచ్చు.

ఇన్‌స్టంట్ యాప్‌లను ఉపయోగించండి 

Play ఇన్‌స్టంట్ యాప్‌లు ఎలా పని చేస్తాయి

మీరు లింక్‌ను ట్యాప్ చేసినప్పుడు, లింక్‌ను తెరవగల యాప్ ఏదైనా ఉందో లేదో Google Play చెక్ చేస్తుంది. ఇప్పటికే మీ పరికరంలో సంబంధిత యాప్ ఇన్‌స్టాల్ చేసి ఉండకపోతే, Google Play, ఇన్‌స్టంట్ యాప్‌లో (అందుబాటులో ఉంటే) లింక్‌ను తెరుస్తుంది. 
ఇన్‌స్టంట్ యాప్ ప్రస్తుత చర్యను అమలు చేయడానికి అవసరమైన యాప్‌లోని భాగాలను మాత్రమే లోడ్ చేస్తుంది. యాప్‌లోని భాగాలు, అవి స్టోర్ చేసే ఏదైనా డేటా తాత్కాలికంగా పరికరానికి జోడించబడతాయి. ఆ డేటాను తీసివేయడానికి, దిగువున “నిర్దిష్ట ఇన్‌స్టంట్ యాప్ సంబంధిత డేటాను క్లియర్ చేయండి”ని చూడండి. 
గమనిక: మీరు ఎప్పుడైనా Play ఇన్‌స్టంట్ యాప్‌లను ఆఫ్ చేయవచ్చు. ఎగువున అందించిన “ఇన్‌స్టంట్ యాప్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి” విభాగంలో ఉన్న సూచనలను ఫాలో అవ్వండి. 

మీకు సంబంధించిన ఇటీవలి ఇన్‌స్టంట్ యాప్‌లను చూడండి

మీరు ఇటీవల ఏయే ఇన్‌స్టంట్ యాప్‌లను ఉపయోగించారో చూడవచ్చు:
  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్ సెట్టింగ్‌లును తెరవండి.
  2. Google Google శోధనఆ తర్వాతఇన్‌స్టంట్ యాప్‌లు అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  3. ఏదైనా యాప్‌నకు సంబంధించిన వినియోగం గురించి మరిన్ని వివరాలను చూడటానికి, ఆ యాప్‌ను ట్యాప్ చేయండి. మీ ఫోన్ ఓవర్‌వ్యూ మెనూ లో ఇటీవలి యాప్‌ల లిస్ట్‌లో మీరు ఉపయోగించిన ఇన్‌స్టంట్ యాప్‌లు కూడా కనిపిస్తాయి.

యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి

మీరు ఇన్‌స్టంట్ యాప్‌ను మీ పరికరంలో ఇన్‌స్టాల్ చేయకుండానే ఉపయోగించవచ్చు. మీరు యాప్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించాలనుకుంటే లేదా యాప్‌ను ఆఫ్‌లైన్‌లో ఉపయోగించాలనుకుంటే, మీరు దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దాన్ని Play Storeలో కనుగొనండి లేదా ఇన్‌స్టంట్ యాప్‌ల మెనూలో చూడండి:  

దాన్ని Google Play Store ద్వారా ఇన్‌స్టాల్ చేయండి

  1. Google Play Store యాప్ Google Playను తెరవండి.
    • గమనిక: మీరు play.google.com లింక్‌కు కూడా వెళ్లవచ్చు. 
  2. యాప్ కోసం సెర్చ్ లేదా బ్రౌజ్ చేయండి. 
  3. దాన్ని ఎంచుకోండి.
  4. ఇన్‌స్టాల్ చేయండిని ట్యాప్ చేయండి.
  5. మీ పరికరంలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.  

దాన్ని ఇన్‌స్టంట్ యాప్‌ల మెనూ నుండి ఇన్‌స్టాల్ చేయండి

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్ సెట్టింగ్‌లును తెరవండి.
  2. Google Google శోధనఆ తర్వాతఇన్‌స్టంట్ యాప్‌లు అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  3. మీరు ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న యాప్‌ను ట్యాప్ చేయండి. 
  4. ఇన్‌స్టాల్ చేయండిని ట్యాప్ చేయండి. 
  5. మీ పరికరంలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి. 

నిర్దిష్ట ఇన్‌స్టంట్ యాప్‌నకు సంబంధించిన డేటాను క్లియర్ చేయండి

మీరు ఉపయోగించిన ఇన్‌స్టంట్ యాప్‌నకు సంబంధించిన డేటాను మీరు ఈ విధంగా క్లియర్ చేయవచ్చు:

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్ సెట్టింగ్‌లును తెరవండి.
  2. Google Google శోధనఆ తర్వాతఇన్‌స్టంట్ యాప్‌లు అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  3. మీరు ఏ ఇన్‌స్టంట్ యాప్‌నకు సంబంధించిన సెట్టింగ్‌ను మార్చాలనుకుంటున్నారో దానిపై ట్యాప్ చేయండి.
  4. యాప్ డేటాను క్లియర్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 

చిట్కా: మీరు మీ Google ఖాతాకు కనెక్ట్ చేసిన యాప్‌లను మేనేజ్ చేయడానికి మీ ఖాతా పేజీకి వెళ్లాలి. మీరు డెవలపర్‌తో షేర్ చేసిన సమాచారం డెవలపర్‌కు చెందిన గోప్యతా పాలసీకి లోబడి ఉంటుందని గమనించండి, కాబట్టి మీరు ఈ సమాచారాన్ని మేనేజ్ చేయాలనుకుంటే డెవలపర్‌ను సంప్రదించండి. 

ఇన్‌స్టంట్ యాప్‌లకు సంబంధించిన అనుమతులను మేనేజ్ చేయండి

ఇన్‌స్టాల్ చేసిన యాప్‌నకు సంబంధించిన అనుమతులను మేనేజ్ చేయడం లాగానే మీరు ఇప్పటికీ ఇన్‌స్టంట్ యాప్ విషయంలో అనుమతులను, మీ సమాచారానికి యాక్సెస్‌ను కంట్రోల్ చేస్తారు. మీ అనుమతులను మేనేజ్ చేయడం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి. 

ఇన్‌స్టంట్ యాప్‌ల విషయంలో సహాయం

Play ఇన్‌స్టంట్ యాప్‌ల విషయంలో మీకు సమస్యలు ఉన్నట్లయితే, సహాయాన్ని పొంది, సమస్యను పరిష్కరించుకోండి.
 

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3168595523155537926
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false