స్పేస్‌ను ఖాళీ చేయండి

మరిన్ని యాప్‌లు, మీడియాను డౌన్‌లోడ్ చేయడానికి, లేదా మీ ఫోన్ మెరుగ్గా పనిచేయడానికి, మీరు మీ ఫోన్‌లో స్పేస్‌ను క్లియర్ చేయవచ్చు.

  • స్టోరేజ్ అనేది మీరు మ్యూజిక్, అలాగే ఫోటోలు లాంటి డేటాను ఉంచే ప్రదేశం.
  • మెమరీ అనేది మీరు యాప్‌లు, అలాగే Android సిస్టమ్ వంటి ప్రోగ్రామ్‌లను రన్ చేసే ప్రదేశం.

ముఖ్య గమనిక: ఈ దశలలో కొన్ని, Android 9లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

స్టోరేజ్‌ను ఖాళీ చేయండి

ఫోటోలను తీసివేయండి
మీరు Google Photosతో బ్యాకప్ చేసినట్లయితే, మీరు మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో కాపీలను తొలగించవచ్చు. మీ పరికరం ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడినప్పుడు మీరు యాప్‌లో బ్యాకప్ చేసిన కాపీలను కనుగొనవచ్చు. మీ పరికరం నుండి ఫోటోలు, వీడియోలను ఎలా తొలగించాలో తెలుసుకోండి.
డౌన్‌లోడ్ చేసిన సినిమాలు, మ్యూజిక్ & ఇతర మీడియాను తీసివేయండి

Google Play నుండి కంటెంట్‌ను తొలగించడానికి:

  1. Play Music లేదా Play Movies & TV వంటి కంటెంట్‌ను కలిగి ఉన్న Google Play యాప్‌ను తెరవండి.
  2. మెనూ మెనూఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత డౌన్‌లోడ్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. డౌన్‌లోడ్ చేయబడినవి Downloadedఆ తర్వాత తీసివేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఇతర సోర్స్‌ల నుండి కంటెంట్‌ను తొలగించడానికి, మీరు డౌన్‌లోడ్ చేయడానికి ఉపయోగించిన యాప్ నుండి తొలగించండి.

యాప్‌లు, & యాప్ డేటాను తీసివేయండి

ప్రతిస్పందించని యాప్‌లను మూసివేయండి

మీరు సాధారణంగా యాప్‌లను మూసివేయాల్సిన అవసరం లేదు. కానీ, యాప్ ప్రతిస్పందించకపోతే, యాప్‌ను మూసివేయడానికి ట్రై చేయండి లేదా ఫోర్స్ స్టాప్ చేయండి. పని చేయని యాప్‌లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం ఎలాగో తెలుసుకోండి.

మీరు ఉపయోగించని యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి

మీరు యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి తర్వాత అది అవసరం అయితే, మీరు దాన్ని మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా యాప్ కోసం మీరు పేమెంట్ చేసినట్లయితే, దానిని మళ్లీ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

యాప్ కాష్ & డేటాను క్లియర్ చేయండి

సాధారణంగా మీరు మీ ఫోన్ సెట్టింగ్‌ల యాప్ ద్వారా యాప్ కాష్, ఇంకా డేటాను క్లియర్ చేయవచ్చు. యాప్ సెట్టింగ్‌లు ఫోన్‌ను బట్టి మారవచ్చు. మరింత సమాచారం కోసం, మీ పరికర తయారీదారు నుండి సహాయాన్ని పొందండి.

  • కాష్‌ను క్లియర్ చేయడం:తాత్కాలిక డేటాను తొలగిస్తుంది. కొన్ని యాప్‌లను మరొకసారి మీరు తెరిచినప్పుడు నెమ్మదిగా పని చేయవచ్చు.
  • డేటా స్టోరేజ్‌ను క్లియర్ చేయడం: యాప్ డేటా అంతటినీ శాశ్వతంగా తొలగిస్తుంది. ముందుగా యాప్‌లోని డేటాను తొలగించడానికి ట్రై చేయండి.
స్పేస్‌ను ఖాళీ చేయడానికి, ఆటోమేటిక్‌గా యాప్‌లను ఆర్కైవ్ చేయండి

కొత్త యాప్‌ల కోసం స్పేస్‌ను ఖాళీ చేయడానికి, మీరు తరచుగా ఉపయోగించని యాప్‌లను మీ పరికరం ఆటోమేటిక్‌గా ఆర్కైవ్ చేయగలదు. ఈ సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు, మీరు తరచుగా ఉపయోగించని యాప్‌లు తీసివేయబడతాయి, కానీ యాప్‌లోని మీ వ్యక్తిగత డేటా సేవ్ చేయబడుతుంది. యాప్ చిహ్నం మీ పరికరంలో అలాగే ఉంటుంది. ఆ యాప్ Google Playలో అందుబాటులో ఉన్నంత వరకు మీరు దాన్ని మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీరు యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ట్రై చేసి తగినంత స్పేస్ లేకుంటే, యాప్‌లను ఆటోమేటిక్‌గా ఆర్కైవ్ చేయమని మీకు తెలియజేయబడుతుంది. మీ పరికరం ఆటోమేటిక్‌గా యాప్‌లను ఆర్కైవ్ చేసే విధానాన్ని సెట్ చేయడానికి:

  1. Play Store యాప్ ను తెరవండి.
  2. సెట్టింగ్‌లుఆ తర్వాత సాధారణ సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  3. ఆటోమేటిక్‌గా యాప్‌లను ఆర్కైవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
ఫైళ్లను తొలగించండి లేదా తరలించండి

డౌన్‌లోడ్ చేసిన ఫైళ్లను తొలగించండి

డౌన్‌లోడ్ చేసిన ఫైళ్లను కనుగొని తీసివేయడం ఎలాగో తెలుసుకోవడానికి, మీ పరికర తయారీదారు సపోర్ట్ సైట్‌కు వెళ్లండి.

ఫైళ్లను కంప్యూటర్‌కు కాపీ చేయండి

మీరు USB కేబుల్‌ను ఉపయోగించి ఫైళ్లు, ఫోల్డర్‌లను కంప్యూటర్‌కు తరలించవచ్చు, ఆపై వాటిని మీ ఫోన్ నుండి తొలగించవచ్చు.మీ ఫోన్, ఇంకా కంప్యూటర్‌ల మధ్య ఫైళ్లను ఎలా బదిలీ చేయాలో తెలుసుకోండి.

మెమరీని చెక్ చేసి, ఖాళీ చేయండి

మీరు సాధారణంగా యాప్‌లను మూసివేయాల్సిన అవసరం లేదు. కానీ, యాప్ ప్రతిస్పందించకపోతే, యాప్‌ను మూసివేయడానికి ట్రై చేయండి లేదా ఫోర్స్ స్టాప్ చేయండి. పని చేయని యాప్‌లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం ఎలాగో తెలుసుకోండి.

చిట్కా:  యాప్ ఎక్కువ మెమరీని ఉపయోగిస్తుంది అని మీరు భావిస్తే, మీరు యాప్‌ను తొలగించవచ్చు.యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15904852761890039740
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false