Wear OSతో Google Playని ఉపయోగించండి

మీ వాచ్ లేదా కారు వంటి ఇతర పరికరాలలో యాప్‌లను, కంటెంట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మీరు మీ ఫోన్ లేదా కంప్యూటర్‌ను ఉపయోగించవచ్చు.

మీ Wear OS వాచ్ కోసం, యాప్‌లను, గేమ్‌లను కూడా మీరు Google Play Store నుండి పొందవచ్చు.

Tip: To use apps from the Play Store, your watch must run Wear OS 2 or newer. Learn how to check your watch version.

మీ వాచ్ కోసం యాప్‌లను పొందండి

  1. మీ పరికరాన్ని ఆన్ చేయడానికి మీ వాచ్ మీద ఉన్న పవర్ బటన్‌ను నొక్కండి.
  2. యాప్‌ల మెనూను తెరవడానికి మళ్లీ పవర్ బటన్‌ను నొక్కండి.
  3. కిందికి స్క్రోల్ చేసి, Google Play Store Google Playను ట్యాప్ చేయండి.
  4. ఒక యాప్‌ను కనుగొనండి:
    • ఏదైనా ఒక యాప్ కోసం బ్రౌజ్ చేయడానికి, కిందికి స్క్రోల్ చేసి, ఫీచర్ చేసిన యాప్‌లు, మీ యాక్టివిటీని ట్రాక్ చేయండి, మీ ఫోన్‌లో వాచ్ లుక్‌లు వంటి టాప్ యాప్ కేటగిరీలను కనుగొనండి. సంబంధిత యాప్‌లను చూడటానికి ఏదైనా కేటగిరీపై ట్యాప్ చేయండి.
    • ఒక కొత్త యాప్ కోసం సెర్చ్ చేయడానికి, Search Searchను ట్యాప్ చేయండి. మీ సెర్చ్ క్వెరీని మాటల ద్వారా చెప్పడానికి, మాట్లాడండి Microphoneని ట్యాప్ చేయండి. మీ సెర్చ్‌ను టైప్ చేయడానికి, కీబోర్డ్ Keyboardను ట్యాప్ చేయండి.
  5. యాప్‌ను పొందడానికి, యాప్ మీద ట్యాప్ చేసి, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
కంప్యూటర్‌ను ఉపయోగించి మీ వాచ్ కోసం యాప్‌లను పొందండి

యాప్‌ల కోసం బ్రౌజ్ చేయండి

  1. Play Store‌లోని Wear OS విభాగానికి వెళ్లండి.
  2. యాప్‌ల కోసం సెర్చ్ లేదా బ్రౌజ్ చేయండి.
  3. ఏదైనా ఐటెమ్‌ను ఎంచుకోండి.
  4. (ఛార్జీ విధించబడని ఐటెమ్‌ల కోసం) ఇన్‌స్టాల్ చేయండి అనే ఆప్షన్‌ను లేదా ఐటెమ్ ధరను క్లిక్ చేయండి.
  5. "పరికరాన్ని ఎంచుకోండి" అని ఉన్న దగ్గర, మీ Wear OS పరికరాన్ని ఎంచుకొని, ఆపై ఇన్‌స్టాల్ చేయండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చిట్కా: మీరు కింది వైపు బాణం Down arrowను క్లిక్ చేయాల్సి రావచ్చు.
  6. లావాదేవీని పూర్తి చేసి, యాప్‌ను పొందడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

యాప్‌ల కోసం సెర్చ్ చేయండి

నిర్దిష్ట యాప్‌ల కోసం play.google.com/storeలో కూడా మీరు సెర్చ్ చేయవచ్చు.

చిట్కా: Android ఫోన్‌లకు అందుబాటులో ఉండే యాప్‌లు అన్నీ Wear OS వాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. మీ వాచ్‌లో ఏదైనా ఒక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ఆప్షన్ మీకు కనిపించకపోతే, బహుశా Wear OSతో ఆ యాప్ అనుకూలంగా లేదని అర్థం.

Android ఫోన్‌ను ఉపయోగించి మీ వాచ్ కోసం యాప్‌లను పొందండి

మీ ఫోన్‌లో మీరు Wear OSలో పనిచేసే యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారంటే, దాన్ని మీ వాచ్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకోగలరు.

  1. మీ ఫోన్‌లో, Google Play Store యాప్ Google Playను తెరవండి.
  2. Wear OSలో కూడా పని చేసే యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయండి.
  3. దానిని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీ వాచ్‌ను చెక్ చేయండి. యాప్‌నకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు కనిపిస్తుంది.
  4. మీ వాచ్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

మీ ఫోన్‌లో ఉండే యాప్‌లలో ఏవేవి మీ వాచ్‌లో కూడా పని చేస్తాయో వాటన్నింటినీ కనుగొనడానికి, మీ వాచ్‌ను ఉపయోగించవచ్చు. పైన "మీ వాచ్ కోసం యాప్‌లను పొందండి" కింద ఉన్న సూచనలను అనుసరించండి, వాటిలో "మీ ఫోన్‌లోని యాప్‌లు" అనే కేటగిరీ కోసం చూడండి.

మీ వాచ్ నుండి యాప్‌లను తీసివేయండి

మీ వాచ్ సెట్టింగ్‌ల మెనూతో, మీరు మీ వాచ్ నుండి యాప్‌లను తీసివేయడం చేయవచ్చు.

Wear OSలో Google Playను ఉపయోగించడానికి సంబంధించిన సాధారణ ప్రశ్నలు

Google Play నుండి నేను ఏ యాప్‌లను నా వాచ్‌లో ఉపయోగించగలను?

Android ఫోన్‌లలో పని చేసే యాప్‌లన్నీ Wear OS వాచ్‌లలో పని చేయకపోవచ్చు.

  • మీరు మీ Wear OS పరికరంలో యాప్‌ల కోసం సెర్చ్ లేదా బ్రౌజ్ చేస్తున్నప్పుడు, మీకు కనిపించే యాప్‌లన్నీ Wear OSలో పని చేస్తాయి.
  • మీరు వెబ్‌లో Google Playని ఉపయోగించినప్పుడు, అన్ని యాప్‌లు మీ వాచ్‌లో పని చేయకపోవచ్చు. అయితే, Play Storeలోని Wear OS విభాగంలో ఉండే యాప్‌లన్నీ పని చేస్తాయి. వెబ్ నుండి మీరొక యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ట్రై చేస్తే, ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ఆప్షన్ మీ వాచ్‌లో మీకు కనిపించకపోతే, బహుశా Wear OSకు అది అనుకూలంగా లేదని అర్థం.

యాప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి, నేను వేరొక ఖాతాను ఎలా ఉపయోగించాలి

వేరొక ఖాతాను ఉపయోగించడం కోసం:

  1. మీ పరికరాన్ని ఆన్ చేయడానికి 'పవర్' బటన్‌ను నొక్కండి.
  2. యాప్‌ల మెనూను తెరవడానికి మళ్లీ పవర్ బటన్‌ను నొక్కండి.
  3. కిందికి స్క్రోల్ చేసి, Google Play Store Google Playను ట్యాప్ చేయండి.
  4. స్క్రీన్ పై భాగం నుండి కిందికి నావిగేషన్ డ్రాయర్‌ను స్వైప్ చేయండి.
  5. మీ ఖాతా Peopleపై ట్యాప్ చేయండి.
  6. స్విచ్ చేయడానికి మరొక ఖాతాను ట్యాప్ చేయండి.

PINకు సంబంధించిన సమస్యలు

మీ వాచ్‌లోని అంశాలను కొనుగోలు చేయడానికి, Google ఖాతా PIN నంబర్‌ను ఉపయోగించవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇప్పటికే నంబర్ లేకపోతే, మీ Wear OSలో మీరు మొదటి కొనుగోలును చేసేటప్పుడు ఒక నంబర్‌ను ఎంచుకోండి. ఈ సెటప్‌లో కొంత భాగాన్ని మీరు మీ మొబైల్ పరికరంలో పూర్తి చేయాల్సి రావచ్చు.

అవసరమైతే, మీరు మీ Google ఖాతా PINను మార్చుకోవచ్చు.

మీ PINను మీరు ఎప్పుడు ఉపయోగించాల్సి ఉంటుంది

మీరు దేనినైనా మొదటిసారి కొనుగోలు చేసినప్పుడు మీ పిన్‌ను ఎంత తరచుగా ఎంటర్ చేయాలనే విషయాన్ని ఎంచుకుంటారు. మీరు ఒకవేళ సెట్టింగ్‌లను మార్చాలనుకుంటే, సెట్టింగ్‌ల మెనూను ఉపయోగించండి:

  1. మీ వాచ్‌లో, Google Play Store Google Playను తెరవండి.
  2. మీ Play Store సెట్టింగ్‌లు Settingsకు వెళ్లండి.
  3. కొనుగోళ్ల కోసం PINను అడగండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు ఉపయోగించాలనుకుంటున్న సెట్టింగ్‌ను ట్యాప్ చేయండి.

పని చేయని యాప్‌ను పరిష్కరించండి

Wear OSలో Play Storeను iPhoneతో ఉపయోగించండి

మీరు iPhone లేదా iPadను ఉపయోగిస్తుంటే, Play Store‌ను ఉపయోగించడానికి మీ వాచ్ & ఫోన్‌ను Wi-Fiకి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. iPhone లేదా iPad యూజర్‌లకు అన్ని యాప్‌లూ అందుబాటులో ఉండవు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7002348908847155870
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false