Daydreamతో Google Playను ఉపయోగించడం

Daydream వర్చువల్ రియాలిటీ (VR) హెడ్‌సెట్‌తో ఉపయోగించడానికి, మీరు Google Play స్టోర్ నుండి యాప్‌లు, గేమ్‌లు కొనుగోలు చేయవచ్చు. కొన్ని యాప్‌లు కేవలం Daydreamకు మాత్రమే అందుబాటులో ఉంటాయి, అలాగే మీరు ఉపయోగిస్తున్న కొన్ని యాప్‌లు ఇప్పటికే Daydreamతో కూడా పనిచేసేలా ఉంటాయి. 

Play నుండి Daydreamలో యాప్‌లను కొనడం

  1. Daydream యాప్ Daydream Viewను తెరవండి.
  2. Daydream యాప్‌లో, Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  3. మీరు కొనాలనుకున్నదానిని బ్రౌజ్ చేసి, ఎంచుకోండి.
  4. ఇన్‌స్టాల్ ఆప్షన్ లేదా ధరను ఎంచుకోండి.
  5. మీ కొనుగోలును పూర్తి చేయడానికి స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.

మీరు ఏదైనా కొనడం లేదా ఇన్‌స్టాల్ చేశాక, అది మీ Daydream లైబ్రరీకి వస్తుంది, దాన్ని మీరు వర్చువల్ రియాలిటీలో ఉపయోగించవచ్చు.

మీరు కొనుగోళ్లు చేస్తున్న సమయంలో సమస్యలు

నేను Daydreamతో ఏ యాప్‌లను ఉపయోగించవచ్చు?

మీ Daydream హెడ్‌సెట్‌తో పనిచేసే యాప్‌లను కనుగొనడానికి, హెడ్‌సెట్ ఉపయోగిస్తుండగా Play స్టోర్‌ను తెరవండి. మీకు కనిపించే అన్ని యాప్‌లు Daydream VRతో పనిచేస్తాయి.

మీ కొనుగోలును పూర్తి చేయడానికి VR నుండి నిష్క్రమించడం

కొనుగోలును పూర్తి చేయడానికి మీరు కొన్నిసార్లు VR మోడ్ నుండి నిష్క్రమించాల్సి ఉంటుంది. మీరు చేయాల్సినది పూర్తి చేశాక, మీరు Daydreamను VR మోడ్‌లో ఉపయోగించడం కొనసాగించవచ్చు.

PIN నంబర్ సహాయం

Daydreamలో Google Play ద్వారా ఐటెమ్‌లను కొనడానికి, మీకు Google ఖాతా PIN నంబర్ అవసరం. ఒకవేళ మీ దగ్గర లేకపోతే, మీ పరికరంలో మీరు Daydreamను సెటప్ చేసేటప్పుడు ఒకటి ఎంచుకోండి. మీరు కొనుగోలు చేసిన ప్రతిసారీ మీరు దాన్ని ఎంటర్ చేయాలి.

అవసరమైతే, మీరు మీ Google ఖాతా PINను మార్చుకోవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17288598457461520369
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false