HD, 4K UHD, HDR వీడియోలను చూడండి

మీరు Googleలో కొనుగోలు చేసే కొన్ని సినిమాలు మరియు టీవీ షోల కోసం వీడియో క్వాలిటీని ఎంచుకోవచ్చు. చాలా వరకు సినిమాలు మరియు టీవీ షోలు హై డెఫినిషన్ (HD)లో అందుబాటులో ఉంటాయి. స్టాండర్డ్ డెఫినిషన్ (SD) వీడియో కంటే అధిక రిజల్యూషన్‌తో HD వీడియో ప్రదర్శితమవుతుంది, కనుక ఇమేజ్‌లు మరింత షార్ప్‌గా, స్పష్టంగా కనిపిస్తాయి.

వీడియో క్వాలిటీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించండి

సినిమా లేదా టీవీ షో మీరు ఆశించిన దాని కంటే తక్కువ వీడియో క్వాలిటీతో ప్లే అవుతుంటే:

  1. మీరు కొనుగోలు చేసిన వీడియో క్వాలిటీని చెక్ చేయండి. మీరు కొనుగోలు చేసిన క్వాలిటీ వరకు, అలాగే మీ పరికరం సపోర్ట్ చేసే అత్యధిక క్వాలిటీతో మాత్రమే చూడగలరు. మీరు ఏ వీడియో క్వాలిటీని కొనుగోలు చేసారో కనుగొనడానికి మీ ఇమెయిల్‌లోని రసీదును చెక్ చేయండి. 
  2. మీ ఇంటర్నెట్ వేగాన్ని చెక్ చేయండి. వీడియోను HD లేదా 4Kలో ప్లే చేయడానికి మీకు కనీసం 2 Mbps ఇంటర్నెట్ వేగం ఉండాలి.
  3. పరికర అనుకూలత మరియు ఇతర అవసరాలను చెక్ చేయండి. వీడియోను అధిక క్వాలిటీతో ప్లే చేయడానికి, మీరు అనుకూల పరికరాన్ని ఉపయోగించాలి. మీ పరికరం వీడియో క్వాలిటీని బట్టి ఇతర అవసరాలకు కూడా అనుగుణంగా ఉండాలి.
అన్ని అవసరాలకు అనుగుణంగా మీ పరికరం ఉన్నప్పటికీ సరైన క్వాలిటీలో మీ వీడియో ఇంకా ప్లే అవ్వకుండా ఉంటే, సహాయం కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.

HDలో వీడియోలు ప్లే అయినప్పుడు

వీడియోలను HDలో ప్లే చేయగల మీ సామర్థ్యం లైసెన్సింగ్ ఒప్పందాలు మరియు మీ పరికరంతో అనుకూలతపై ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భాలలో మీ వీడియో SDలో ప్లే అవుతుంది:

  • HDలో టైటిల్ అందుబాటులో లేకపోవడం.
  • HDలో స్ట్రీమ్ చేయడానికి మీకు తగినంత బ్యాండ్‌విడ్త్ లేకపోవడం.
  • మీ పరికరం డిస్‌ప్లే కనీస అవసరాలకు అనుగుణంగా లేకపోవడం.

పరికర అనుకూలత మరియు ఇతర అవసరాలు

వీడియోను అధిక క్వాలిటీతో ప్లే చేయడానికి, మీరు అనుకూల పరికరాన్ని ఉపయోగించాలి. అలాగే వీడియో క్వాలిటీని బట్టి ఇతర అవసరాలకు కూడా అనుగుణంగా ఉండాలి.
HD వీడియో అవసరాలు

HD ప్లేబ్యాక్ కోసం వీటిలో సపోర్ట్ ఉంది:

  • చాలా వరకు Android ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లు
  • iOS 7 మరియు అంతకంటే ఆధునిక వెర్షన్ రన్ అవుతున్న iOS పరికరాలు
  • HD టీవీతో ఉపయోగించే Chromecast పరికరాలు
  • Android TV పరికరాలు
  • 720p కంటే ఎక్కువ స్క్రీన్ రిజల్యూషన్ గల ఇతర స్మార్ట్ టీవీలు
  • YouTubeతో ప్లే చేసేటప్పుడు Safari వెబ్ బ్రౌజర్‌లు
4K UHD వీడియో అవసరాలు

4K ఆల్ట్రా హై డెఫినిషన్ (UHD) వీడియోలను చూడటానికి, మీకు ఉండాల్సినవి:

  • అనుకూల పరికరం:
    • Sony Bravia లేదా Nvidia Shield లాంటి 4K Android TV మోడల్స్
    • 4K టీవీకి కనెక్ట్ చేసిన Chromecast Ultra
    • Google TVతో Chromecast
  • కనీసం 15 Mbps డౌన్‌లోడ్ వేగం
HDR వీడియో అవసరాలు

మీరు కొనుగోలు చేసినప్పుడు, మీకు HDR , DV లేదా HDR10+ కోసం చిహ్నం కనిపిస్తుంది.

అనుకూల పరికరాలలో 4K UHD వీడియోలకు మాత్రమే HDR ప్లేబ్యాక్ అందుబాటులో ఉంది:

  • 2016 లేదా ఆ తర్వాత రూపొందించిన Sony 4K Bravia Android TV
  • అనుకూల టీవీకి కనెక్ట్ చేసినప్పుడు Chromecast Ultra
  • Google TVతో Chromecast

మీ టీవీకి వివిధ HDR ఫార్మాట్‌ల సపోర్ట్ ఉన్నట్లయితే, HDR ప్లేబ్యాక్ ఆటోమేటిక్‌గా పని చేస్తుంది. నిర్దిష్ట HDR ప్లేబ్యాక్ సూచనల కోసం, మీ టీవీ తయారీదారు సపోర్ట్ సైట్‌లో చెక్ చేయండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3026407788390945118
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false