మీ చిన్నారి Google Play యాప్‌లను మేనేజ్ చేయండి

మీరు మీ చిన్నారి Google ఖాతాను మేనేజ్ చేయడానికి Family Linkను ఉపయోగించినప్పుడు, మీ చిన్నారి నిర్దిష్ట పరికరాలలో ఉపయోగించగల యాప్‌లను పరిమితం చేయడాన్ని మీరు ఎంచుకోవచ్చు.

మీ చిన్నారి యాప్‌లను మేనేజ్ చేయడానికి, మీ చిన్నారి తప్పనిసరిగా కింది పరికరాలలో ఒకదాన్ని ఉపయోగిస్తూ ఉండాలి:

  • Android పరికరం (Android 5.1 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌తో పని చేస్తూ ఉండాలి)
  • Chromebook (Chrome OS వెర్షన్ 71 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌తో పని చేస్తూ ఉండాలి)

ముఖ్య గమనిక: సిస్టమ్ యాప్‌లపై పరిమితులు విధించడం సాధ్యపడదు. Android 7, ఇంకా ఆ తర్వాతి వెర్షన్‌లతో రన్ అయ్యే పరికరాలకు మీరు పరిమితులను సెట్ చేయవచ్చు.

మీ చిన్నారి Google Play నుండి ఏ యాప్‌లను ఉపయోగించవచ్చో ఎంచుకోండి

యాప్‌ను బ్లాక్ చేయండి లేదా అన్‌బ్లాక్ చేయండి

దాదాపు 5 నిమిషాల్లో, లేదా పరికరం ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన తర్వాత యాప్ బ్లాక్ చేయబడుతుంది లేదా అన్‌బ్లాక్ చేయబడుతుంది. మీరు యాప్‌ను బ్లాక్ చేసే సమయంలో మీ చిన్నారి దాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, యాప్ బ్లాక్ చేయబడే లోపు పూర్తి చేసేందుకు వారికి 1 నిమిషం హెచ్చరిక వస్తుంది. మీ చిన్నారి అన్ని Android పరికరాలు లేదా Chromebookలలో యాప్ బ్లాక్ చేయబడాలి.

ముఖ్యమైనది: కొన్ని యాప్‌లను బ్లాక్ చేయడం సాధ్యపడదు, ఎందుకంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ సెట్టింగ్‌లు పని చేయడానికి లేదా మీ చిన్నారి పరికరం పని చేయడానికి అవి అవసరం.

Family Link యాప్

Family Link యాప్‌లో మీరు చివరిగా సందర్శించిన చిన్నారి ఖాతా సెట్టింగ్‌లకు వెళ్లడానికి, దిగువ బటన్‌ను ట్యాప్ చేయండి:

Family Linkలో యాప్‌ను బ్లాక్ లేదా అన్‌బ్లాక్ చేయండి
  1. Family Link యాప్ Family Link‌ను తెరవండి.
  2. మీ చిన్నారిని ఎంచుకోండి.
  3. కంట్రోల్స్ ఆ తర్వాత యాప్‌లపై పరిమితులు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు అనుమతించాలనుకుంటున్న లేదా బ్లాక్ చేయాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి.
  5. బ్లాక్ చేయండి Block ఆ తర్వాత పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కాలు:

  • మీ చిన్నారికి వారి ఖాతా సెట్టింగ్‌లపై కంట్రోల్ ఉన్నా, లేకపోయినా ఈ సెట్టింగ్‌లు ఆటోమేటిక్‌గా మారవు. ఈ కంట్రోల్‌ను మార్చిన తర్వాత, ఈ సెట్టింగ్‌లు సరిగా ఉన్నట్లు తల్లిదండ్రులు నిర్ధారించుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
  • g.co/YourFamily లింక్‌లో మీ చిన్నారి పేరును క్లిక్ చేసి కూడా మీ చిన్నారికి చెందిన ఖాతాను మీరు మేనేజ్ చేయవచ్చు.

ఎల్లవేళలా అనుమతించబడే యాప్‌లను ఎంపిక చేయండి
ముఖ్య గమనిక: Android 7, ఇంకా ఆ తర్వాతి వెర్షన్‌లతో రన్ అయ్యే పరికరాలలో సైన్ ఇన్ అయ్యి ఉన్న చిన్నారులకు మాత్రమే ఎల్లవేళలా అనుమతించబడే యాప్‌లకు సపోర్ట్ ఉంటుంది. అయితే, Google Kids Space రన్ అయ్యే పరికరాలకు ఈ షరతు వర్తించదు. మీ చిన్నారి ఏ Android వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారో చెక్ చేయండి.
  1. Family Link యాప్ Family Linkను తెరవండి.
  2. మీ చిన్నారిని ఎంచుకోండి.
  3. కంట్రోల్స్ ఆ తర్వాతయాప్‌లపై పరిమితులు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీకు కావలసిన యాప్‌ను ఎంచుకోండి.
  5. 'ఎల్లవేళలా అనుమతించండి' అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి always allow ఆ తర్వాత పూర్తయింది అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కాలు:

  • ఎల్లవేళలా అనుమతించబడే యాప్‌లు, మీ చిన్నారికి సంబంధించిన పరికర వినియోగ వ్యవధి పరిమితులలో భాగంగా లెక్కించబడవు, మీ చిన్నారికి 'అందుబాటులో లేని సమయం' ఆన్‌లో ఉన్నప్పుడు, ఈ యాప్‌లు అందుబాటులో ఉండవు.
  • మీరు "లాక్ చేయండి" అనే ఆప్షన్‌ను ట్యాప్ చేస్తే, ఎల్లవేళలా అనుమతించబడే యాప్‌లు అందుబాటులో ఉండవు. అవి అందుబాటులో ఉండాలంటే మీరు ఈ సెట్టింగ్‌ను పరికరానికి చెందిన లాక్ స్క్రీన్ నుండి మార్చాల్సి ఉంటుంది.
    1. పరికరాలను ఎంచుకోండి ఆ తర్వాత మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న పరికరాన్ని ఎంచుకోండి.
    2. లాక్ స్క్రీన్ సెట్టింగ్‌లు ఆ తర్వాత ఎల్లవేళలా అనుమతించబడే యాప్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
ఎల్లవేళలా అనుమతించబడే యాప్‌లను ఎడిట్ చేయండి
ముఖ్య గమనిక: Android 7, ఇంకా ఆ తర్వాతి వెర్షన్‌లతో రన్ అయ్యే పరికరాలలో సైన్ ఇన్ అయ్యి ఉన్న చిన్నారులకు మాత్రమే ఎల్లవేళలా అనుమతించబడే యాప్‌లకు సపోర్ట్ ఉంటుంది. అయితే, Google Kids Space రన్ అయ్యే పరికరాలకు ఈ షరతు వర్తించదు. మీ చిన్నారి ఏ Android వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారో చెక్ చేయండి.
  1. Family Link యాప్ Family Linkను తెరవండి.
  2. మీ చిన్నారిని ఎంచుకోండి.
  3. కంట్రోల్స్ ఆ తర్వాతయాప్‌లపై పరిమితులు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీకు కావలసిన యాప్‌ను ఎంచుకోండి.

ఇక్కడి నుండి, మీరు ఈ కింది పనులను చేయడానికి, సంబంధిత ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు:

  • ఎల్లవేళలా అనుమతించడం always allow.
  • సమయ పరిమితిని సెట్ చేయడం Set limit.
  • యాప్‌ను బ్లాక్ చేయడం Block.

చిట్కాలు:

  • ఎల్లవేళలా అనుమతించబడే యాప్‌లు, మీ చిన్నారికి సంబంధించిన పరికర వినియోగ వ్యవధి పరిమితులలో భాగంగా లెక్కించబడవు, మీ చిన్నారికి 'అందుబాటులో లేని సమయం' ఆన్‌లో ఉన్నప్పుడు, ఈ యాప్‌లు అందుబాటులో ఉండవు.
  • మీరు "లాక్ చేయండి" అనే ఆప్షన్‌ను ట్యాప్ చేస్తే, ఎల్లవేళలా అనుమతించబడే యాప్‌లు అందుబాటులో ఉండవు. అవి అందుబాటులో ఉండాలంటే మీరు ఈ సెట్టింగ్‌ను పరికరానికి చెందిన లాక్ స్క్రీన్ నుండి మార్చాల్సి ఉంటుంది.
    1. పరికరాలను ఎంచుకోండి ఆ తర్వాత మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న పరికరాన్ని ఎంచుకోండి.
    2. లాక్ స్క్రీన్ సెట్టింగ్‌లు ఆ తర్వాత ఎల్లవేళలా అనుమతించబడే యాప్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
Google Playలో కొత్త యాప్‌ల కోసం మీ ఆమోదం అవసరం

మీ చిన్నారి కొనుగోలు ఆమోదాలను Google Playలో ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

పెద్దలకు మాత్రమే తగిన యాప్‌లను డౌన్‌లోడ్ చేయకుండా మీ చిన్నారిని నిరోధించడంలో సహాయపడండి

మీ చిన్నారి Google Play నుండి డౌన్‌లోడ్ చేయగల లేదా కొనుగోలు చేయగల కంటెంట్‌ను పరిమితం చేయడానికి మీరు తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేయవచ్చు.

  1. Family Link యాప్ Family Link‌ను తెరవండి.
  2. మీ చిన్నారిని ఎంచుకోండి.
  3. కంట్రోల్స్‌ ఆ తర్వాత కంటెంట్ పరిమితులు ఆ తర్వాత Google Play ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. "కంటెంట్ పరిమితులు" కింద, మీ ఫిల్టర్‌లను ఎంచుకోండి:
    • యాప్‌లు, గేమ్‌లు, సినిమాలు, అలాగే టీవీ: డౌన్‌లోడ్ చేయడం కోసం లేదా కొనుగోలు చేయడం కోసం మీరు అనుమతించాలనుకుంటున్న కంటెంట్‌కు సంబంధించి యుక్తవయస్సు పైబడినవారి అత్యధిక స్థాయిని ఎంచుకోండి.
    • మ్యూజిక్, పుస్తకాలు: అందరికీ తగని కంటెంట్‌కు సంబంధించిన డౌన్‌లోడ్‌లు లేదా కొనుగోళ్లను మీరు పరిమితం చేయాలనుకుంటున్నారో లేదో ఎంచుకోండి.

చిట్కాలు:

  • మీ చిన్నారికి వారి ఖాతా సెట్టింగ్‌లపై కంట్రోల్ ఉన్నా, లేకపోయినా ఈ సెట్టింగ్‌లు ఆటోమేటిక్‌గా మారవు. ఈ కంట్రోల్‌ను మార్చిన తర్వాత, ఈ సెట్టింగ్‌లు సరిగా ఉన్నట్లు తల్లిదండ్రులు నిర్ధారించుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
  • g.co/YourFamily లింక్‌లో మీ చిన్నారి పేరును క్లిక్ చేసి కూడా మీ చిన్నారికి చెందిన ఖాతాను మీరు మేనేజ్ చేయవచ్చు.

అనుచితమైన కంటెంట్‌ను ఫ్లాగ్ చేయండి

Google Play

ముందుగా, కంటెంట్‌లో "టీచర్‌లు ఆమోదించినవి" అనే బ్యాడ్జ్ ఫ్యామిలీ స్టార్ బ్యాడ్జ్ ఉందో లేదో చెక్ చేయండి. మీరు "టీచర్‌లు ఆమోదించినవి" అనే బ్యాడ్జ్‌ను కనుగొంటే, కింది దశలను దాటవేసి, ఫ్యామిలీ కంటెంట్‌తో సమస్యను రిపోర్ట్ చేయండి. లేకపోతే, కింది దశలను ఫాలో అవ్వండి.

Play, యాప్‌లు, గేమ్‌లు & మ్యూజిక్

  1. మీ చిన్నారి పరికరంలో, Play Store యాప్ Play Store‌ను తెరవండి.
  2. అనుచితమైన మ్యూజిక్, యాప్ లేదా గేమ్‌ను ట్యాప్ చేయండి.
  3. పేజీకి దిగువున, అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు కంటెంట్‌ను అనుచితమైనదిగా భావించే కారణాన్ని ఎంచుకోండి.
  5. సమర్పించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
మీ చిన్నారి Play Games ప్రొఫైల్ అనుమతులను మార్చండి

ముఖ్యమైనది: మీరు మీ చిన్నారి Play Games ప్రొఫైల్‌ను ఆన్ చేసినప్పుడు, మీ చిన్నారి సపోర్ట్ చేయబడే గేమ్‌ను తెరిచినప్పుడు ఆటోమేటిగ్‌గా సైన్ ఇన్ చేయబడతారు.

  1. మీ పరికరంలో, Family Link యాప్ Family Link‌ను తెరవండి.
  2. మీ చిన్నారిని ఎంచుకోండి.
  3. కంట్రోల్స్ ఆ తర్వాత కంటెంట్ పరిమితులు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. Google Play ఆ తర్వాత Google Play Games ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. చిన్నారి Play Games ప్రొఫైల్‌ను ఆమోదించండి ఆప్షన్‌ను లేదా చిన్నారి Play Games ప్రొఫైల్‌ను తొలగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కాలు:

  • మీ చిన్నారి సమ్మతిని రిక్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మీ తల్లి/తండ్రి పరికరంలో Play Games సెట్టింగ్ డిస్‌ప్లే అవుతుంది.
  • పర్యవేక్షించబడే ఖాతా ప్రొఫైల్స్ తమ గేమ్ ఆడే విధానాన్ని రికార్డ్ చేయలేవు అలాగే షేర్ చేయలేవు.
  • పర్యవేక్షించబడే ఖాతా ప్రొఫైల్స్‌కు Play Gamesలో ఫ్రెండ్స్ ఉండకూడదు.
  • పర్యవేక్షించబడే ఖాతా ప్రొఫైల్స్‌కు ఆటోమేటిక్‌గా జెనరేట్ చేయబడిన గేమర్ ట్యాగ్ ఇవ్వబడుతుంది.
  • పిల్లల కోసం, Play Games ప్రొఫైల్‌తో ఆటోమేటిక్ సైన్-ఇన్‌కు అన్ని గేమ్‌లు సపోర్ట్ చేయవు.

మీరు ఇంకా పూర్తి చేయకుంటే, ఒక Play Games ప్రొఫైల్‌ను తయారు చేయవచ్చు:

  1. మీ పిల్లల పరికరంలో, Android సెట్టింగ్‌లు Settingsకు వెళ్లండి.
  2. Google ఆ తర్వాత అన్ని సర్వీస్‌లు ఆ తర్వాత Google యాప్‌ల సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. Play Games ఆ తర్వాత ప్రొఫైల్‌ను క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ గేమర్ పేరును, అవతార్‌ను ఎంచుకోండి.
  5. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. చిన్నారి పరికరంలో కొత్త ప్రొఫైల్‌ను ఆమోదించడానికి, స్వయంగా హాజరు అయ్యి అడగండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  7. మీ తల్లి/తండ్రి పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.

మరొక Play Games ప్రొఫైల్‌కు మారడానికి:

  1. మీ చిన్నారి పరికరంలో, Android సెట్టింగ్‌లు Settingsకు వెళ్లండి.
  2. Google ఆ తర్వాత Google యాప్‌ల సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. Play Games ఆ తర్వాత ఖాతాకు సైన్ ఇన్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. వీటి కోసం మీ ప్రొఫైల్‌ను మార్చండి:
    • అన్ని గేమ్‌ల కోసం
    • గేమ్‌ల సబ్‌సెట్ కోసం
Play Gamesలో తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెట్ చేయండి

మీరు కొనుగోలు చేసిన లేదా సిఫార్సు చేసిన గేమ్‌లతో సహా, Play Games యాప్‌లో మీకు కనిపించే గేమ్‌లను తల్లిదండ్రుల కంట్రోల్స్ మార్చవు.

మీరు Play Games యాప్‌ను ఉపయోగించి గేమ్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ట్రై చేస్తే, మీరు Play Store యాప్‌నకు తీసుకెళ్లబడతారు, అక్కడ మీ తల్లిదండ్రుల కంట్రోల్స్ సెట్టింగ్‌లు యాక్సెస్‌ను నియంత్రించవచ్చు.

  1. Family Link యాప్ Family Link‌ను తెరవండి.
  2. మీ చిన్నారిని ఎంచుకోండి.
  3. సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి ఆ తర్వాత Google Play ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు ఫిల్టర్ చేయాలనుకుంటున్న కంటెంట్ రకాన్ని ట్యాప్ చేయండి.
  5. ఫిల్టర్ చేయడం లేదా యాక్సెస్‌ను నియంత్రించడం ఎలాగో ఎంపిక చేసుకోండి.

చిట్కా: మీరు g.co/YourFamily లో మీ చిన్నారి పేరుపై క్లిక్ చేయడం ద్వారా కూడా ఈ సెట్టింగ్‌ను మేనేజ్ చేయవచ్చు.

మీ చిన్నారి యాప్ యాక్టివిటీని చెక్ చేయండి

మీ చిన్నారి తమ Android పరికరాలు లేదా Chromebookలలో యాప్‌ల కోసం ఎంత సమయం గడుపుతున్నారనేది మీరు చెక్ చేయవచ్చు. యాప్ తెరవబడి, స్క్రీన్‌పై చూపబడినప్పుడు సమయం ట్రాక్ అవుతుంది, కానీ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయినప్పుడు కాదు.

  1. Family Link యాప్ Family Link‌ను తెరవండి.
  2. మీ చిన్నారిని ఎంచుకోండి.
  3. హైలైట్‌లు ఆ తర్వాత పరికర వినియోగ వ్యవధి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సమస్యలను పరిష్కరించండి

నేను నా చిన్నారి వద్ద ఉండకూడదనుకుంటున్న యాప్‌ను వారు Google Play నుండి ఉపయోగిస్తున్నారు

మీరు మీ చిన్నారి ఉపయోగించకూడదనుకునే యాప్‌నకు వారు యాక్సెస్‌ను కలిగి ఉంటే, యాప్‌ను బ్లాక్ చేయడానికి పైన పేర్కొన్న సూచనలను ఫాలో అవ్వండి.

మీ చిన్నారి డౌన్‌లోడ్ చేసే లేదా కొనుగోలు చేసే ప్రతి యాప్‌ను మీరు ఆమోదించాలనుకుంటే, మీ చిన్నారి కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లను మార్చండి.

ముఖ్యమైనది: మీరు మునుపు ఇన్‌స్టాల్ చేసిన లేదా ఆమోదించిన యాప్‌లకు, లేదా మీ Play ఫ్యామిలీ లైబ్రరీ ద్వారా అందుబాటులో ఉన్న యాప్‌లకు, డౌన్‌లోడ్ చేయడం కోసం అదనపు ఆమోదం అవసరం లేదు.

నేను నా ఫ్యామిలీతో యాప్‌లను షేర్ చేయాలనుకుంటున్నాను

అర్హత ఉన్న పెయిడ్ యాప్‌లను మీ ఫ్యామిలీతో షేర్ చేయడానికి మీరు Google Play ఫ్యామిలీ లైబ్రరీని సెటప్ చేయవచ్చు.

ముఖ్యమైనది: మీరు మీ చిన్నారి కోసం తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేస్తే, మీరు ఎంచుకున్న తల్లిదండ్రుల కంట్రోల్ సెట్టింగ్‌లను అతిక్రమించే యాప్‌లు ఏవీ వారికి కనిపించవు.

"ప్రస్తుతం ఈ యాప్ చిన్నారుల కోసం అందుబాటులో లేదు" ఎర్రర్

13 సంవత్సరాల లోపు వయసున్న (లేదా మీ దేశంలో వర్తించే వయోపరిమితిలోపు వయసున్న ) చిన్నారుల కోసం అందుబాటులో లేని Google యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మీ చిన్నారి ట్రై చేస్తే, తనకు ఈ ఎర్రర్ కనిపిస్తుంది.

నేను నా చిన్నారి యాప్ యాక్టివిటీని ట్రాక్ చేయకూడదనుకుంటున్నాను

మీరు మీ చిన్నారి యాప్ యాక్టివిటీని మానిటర్ చేయకూడదనుకుంటే, అదనపు Family Link యాప్ యాక్టివిటీ సెట్టింగ్‌ను మీరు ఆఫ్ చేయవచ్చు.

ముఖ్యమైనది: మీరు ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేస్తే, మీ చిన్నారి Family Link యాప్ యాక్టివిటీ డేటా తొలగించబడుతుంది.

  1. Family Link యాప్ Family Link‌ను తెరవండి.
  2. మీ చిన్నారిని ఎంచుకోండి.
  3. కంట్రోల్స్‌ ఆ తర్వాత ఖాతా సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. గోప్యతా సెట్టింగ్‌లు ఆ తర్వాత Family Link యాప్ యాక్టివిటీ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

సంబంధిత ఆర్టికల్స్ 

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15697751090017853781
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false