Google Playలో సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి, పాజ్ చేయండి లేదా మార్చండి

Google Playలో సబ్‌స్క్రిప్షన్‌లు నిరవధికంగా కొనసాగుతాయి, అలాగే మీరు సబ్‌స్క్రిప్షన్ తీసివేస్తే మినహా, ప్రతి బిల్లింగ్ కాల వ్యవధి ప్రారంభంలో మీ సబ్‌స్క్రిప్షన్ నియమాల ప్రకారం (ఉదాహరణకు, వారానికొకసారి, సంవత్సరానికొకసారి లేదా మరేదైనా వ్యవధికి) మీకు ఛార్జీ విధించబడుతుంది.

మీ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్న Google ఖాతాకు సైన్ ఇన్ చేయడాన్ని నిర్ధారించుకోండి.

సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి

సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడానికి మీరు మా స్వయం-సహాయక విధానాన్ని ఉపయోగించవచ్చు.

సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి

Google Play యాప్‌లో సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి

ముఖ్యమైనది: మీరు యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసినప్పుడు, మీ సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయబడదు.
  1. మీ Android పరికరంలో, 'Google Playలో సబ్‌స్క్రిప్షన్స్' అనే లింక్‌కు వెళ్లండి.
  2. మీరు రద్దు చేయాలనుకుంటున్న సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోండి.
  3. సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. సూచనలను ఫాలో అవ్వండి.
చిట్కా: మీరు ఒక యాప్‌తో సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటే, Google Play నుండి ఆ యాప్ తీసివేయబడితే, మీ భవిష్యత్తు సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయబడుతుంది. ఈ వార్తా కథనంలో లేదా Google Play రీఫండ్ పాలసీలలో పేర్కొన్న కొన్ని మినహాయింపులతో అయితే తప్ప, మీ మునుపటి సబ్‌స్క్రిప్షన్‌లు తిరిగి రీఫండ్ చేయబడవు.

మీరు రద్దు చేసిన తర్వాత ఏం జరుగుతుంది

మీరు సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసినా, పేమెంట్ చేసిన సమయానికి గాను, మీరు ఇంకా మీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించగలరు.

ఉదాహరణకు, మీరు జనవరి 1న $10కు, ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసి, జూలై 1న రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంటే:

  • డిసెంబర్ 31 వరకు, మీకు సబ్‌స్క్రిప్షన్‌కు యాక్సెస్ ఉంటుంది.
  • వచ్చే జనవరి 1న, మరొక సంవత్సరపు సబ్‌స్క్రిప్షన్‌కు అయ్యే $10 ఛార్జీ మీకు విధించబడదు.

మీరు Play Passను రద్దు చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది

Play Pass నుండి ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు, వాటి డేటా మీ పరికరంలోనే ఉంటాయి. 

Play Pass ద్వారా మీరు పొందిన కంటెంట్ కోసం:

  • పెయిడ్ యాప్‌లు మిమ్మల్ని యాప్‌ను కొనుగోలు చేసేలా లేదా Play Passకు సబ్‌స్క్రయిబ్ చేసుకునేలా ప్రాంప్ట్ చేస్తాయి.
  • యాప్‌లో కొనుగోళ్లు తీసివేయబడతాయి, కానీ ఒక్కో కొనుగోలులో అందుబాటులో ఉంటాయి.
  • అవి తీసివేయబడిన చోట యాప్‌లలో యాడ్‌లు తిరిగి కనిపిస్తాయి.
  • మీరు తిరిగి Play Passలో చేరితే, ఈ కంటెంట్ మొత్తం తిరిగి అన్‌లాక్ చేయబడుతుంది.

మీరు ప్రీపెయిడ్ ప్లాన్‌ను రద్దు చేసిన తర్వాత ఏం జరుగుతుంది

ప్రీపెయిడ్ ప్లాన్‌లు పరిమిత సమయం పాటే వర్తిస్తాయి, కాబట్టి మీరు వాటిని రద్దు చేయాల్సిన అవసరం లేదు. బిల్లింగ్ వ్యవధి చివరిలో, ఆటోమేటిక్‌గా వాటి గడువు ముగుస్తుంది.

మీరు ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఉపయోగించకుండా ఉంటే, దాని రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. Google Playలో రీఫండ్‌ల గురించి మరింత తెలుసుకోండి.

ఉపయోగించబడని ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను రద్దు చేయడానికి:

  1. మీ Android పరికరంలో, 'Google Playలో సబ్‌స్క్రిప్షన్స్' అనే లింక్‌కు వెళ్లండి.
  2. మీరు రద్దు చేయాలనుకుంటున్న సబ్‌స్క్రిప్షన్ లేదా ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోండి.
  3. సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

మీరు పేమెంట్ ప్లాన్‌లో రీ-యాక్టివేషన్‌ను ఆపివేసిన తర్వాత ఏమి జరుగుతుంది

పేమెంట్ ప్లాన్‌కు సంబంధించి, ఒకసారి మీ పేమెంట్ ఆప్షన్ ద్వారా ఛార్జీ విధించబడితే, ఆ పేమెంట్ ప్లాన్‌కు సంబంధించి మిగిలిన పేమెంట్‌లను రద్దు చేయలేరు. అయితే, మీరు మీ పేమెంట్ ప్లాన్ ఆటోమేటిక్‌గా రీ-యాక్టివేట్ చేయబడకుండా నిరోధించవచ్చు. దీని అర్థం, మీ తదుపరి రీ-యాక్టివేషన్ తేదీన మీకు ఛార్జీ విధించబడదు, (దీన్ని మీరు Google Playలో సబ్‌స్క్రిప్షన్‌లు లేదా మీ ఈమెయిల్ రసీదులో చూడవచ్చు) అంతే కాకుండా అప్పటి వరకు మీరు మీ కంటెంట్‌ను యాక్సెస్ చేయడాన్ని కొనసాగించవచ్చు. మీరు మీ పేమెంట్ ప్లాన్‌ను రీ-యాక్టివేట్ చేయకుండా ఆపాలని ఎంచుకుంటే, మీ ప్రస్తుత పేమెంట్ ప్లాన్‌లో మిగిలి ఉన్న ఏవైనా పేమెంట్‌లకు మీరు ఇప్పటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. Google Play రీఫండ్ పాలసీలో పేర్కొన్న అంశాలకు కాకుండా మరే ఇతర వాటికి Google Play, రీఫండ్‌లను జారీ చేయదు.

మరింత సమాచారం కోసం సర్వీస్‌లకు లేదా కంటెంట్‌కు సబ్‌స్క్రయిబ్ చేయండి ఆప్షన్‌ను చూడండి.

Google Playలో మీ సబ్‌స్క్రిప్షన్‌లను మేనేజ్ చేయండి

సబ్‌స్క్రిప్షన్‌ను తిరిగి ప్రారంభించండి లేదా తిరిగి సబ్‌స్క్రయిబ్ చేసుకోండి
చిట్కా: కొన్ని సబ్‌స్క్రిప్షన్‌లు తిరిగి సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ సందర్భంలో, మీ సబ్‌స్క్రిప్షన్‌ను మళ్లీ సెటప్ చేయండి.
  1. మీ Android పరికరంలో, 'Google Playలో సబ్‌స్క్రిప్షన్స్' అనే లింక్‌కు వెళ్లండి.
  2. మీరు రీస్టార్ట్ చేయాలనుకుంటున్న సబ్‌స్క్రిప్షన్ కోసం, తిరిగి సబ్‌స్క్రయిబ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను కనుగొనలేకపోతే, అది వేరే ఖాతాలో ఉండవచ్చు. మీరు ఖాతాల మధ్య మారడం కోసం ట్రై చేయవచ్చు.

సబ్‌స్క్రిప్షన్‌లపై రీఫండ్‌ను పొందండి
ప్రీపెయిడ్ ప్లాన్‌లతో సహా, సబ్‌స్క్రిప్షన్ రీఫండ్‌ల గురించిన సమాచారం కొరకు, Google Playలో రీఫండ్‌ల గురించి మరింత తెలుసుకోండి.
ఒక సబ్‌స్క్రిప్షన్‌ను పాజ్ చేయండి

కొన్ని యాప్‌లు మీ సబ్‌స్క్రిప్షన్‌ను పాజ్ చేసేలా అనుమతిస్తాయి. మీరు సబ్‌స్క్రిప్షన్‌ను పాజ్ చేసినప్పుడు, మీ సబ్‌స్క్రిప్షన్ మీ ప్రస్తుత బిల్లింగ్ వ్యవధి చివరిలో పాజ్ చేయబడుతుంది.

  1. మీ Android పరికరంలో, 'Google Playలో సబ్‌స్క్రిప్షన్స్' అనే లింక్‌కు వెళ్లండి.
  2. మీరు పాజ్ చేయాలనుకుంటున్న సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోండి.
  3. మేనేజ్ చేయండి ఆ తర్వాత పేమెంట్‌లను పాజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. పేమెంట్‌లను పాజ్ చేయడానికి సమయ వ్యవధిని సెట్ చేయండి.
  5. నిర్ధారించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
పాజ్ చేసిన సబ్‌స్క్రిప్షన్‌కు పేమెంట్‌లను రీస్టార్ట్ చేయండి

మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను ఎప్పుడైనా కొనసాగించవచ్చు.

  1. మీ Android పరికరంలో, 'Google Playలో సబ్‌స్క్రిప్షన్స్' అనే లింక్‌కు వెళ్లండి.
  2. మీరు రీస్టార్ట్ చేయాలనుకుంటున్న సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోండి.
  3. కొనసాగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
ససబ్‌స్క్రిప్షన్ కోసం పేమెంట్ ఆప్షన్ మార్చండి

మీ సబ్‌స్క్రిప్షన్ రీ-యాక్టివేట్ అయినప్పుడు, మీరు సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయడానికి ఉపయోగించిన అదే పేమెంట్ ఆప్షన్‌కు ఛార్జీ విధించబడుతుంది. ప్రతి సబ్‌స్క్రిప్షన్ వ్యవధి ప్రారంభమవ్వడానికి, 24 గంటల ముందు రీ-యాక్టివేషన్‌లు ప్రారంభం కావచ్చు.

  1. మీ Android పరికరంలో, 'Google Playలో సబ్‌స్క్రిప్షన్స్' అనే లింక్‌కు వెళ్లండి.
  2. మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోండి.
  3. మేనేజ్ చేయండి ఆ తర్వాత  అప్‌డేట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ పేమెంట్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేయడానికి, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

మీ పేమెంట్ ఆప్షన్ తిరస్కరించబడినా లేదా తగినన్ని ఫండ్స్ లేకపోయినా, మీ సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయబడవచ్చు.బ్యాకప్ పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి, లేదా మీ సబ్‌స్క్రిప్షన్‌ను మళ్లీ సెటప్ చేయండి.

సబ్‌స్క్రిప్షన్‌లు, ప్రీపెయిడ్ ప్లాన్‌ల మధ్య మారండి

యాప్ డెవలపర్‌లు అనుమతిస్తే, మీరు ప్రీపెయిడ్ ప్లాన్ నుండి రిపీట్ అయ్యే సబ్‌స్క్రిప్షన్‌కు లేదా రిపీట్ అయ్యే సబ్‌స్క్రిప్షన్ నుండి ప్రీపెయిడ్ ప్లాన్‌కు మారవచ్చు.

మీరు స్విచ్ అయినప్పుడు, పేమెంట్‌లు వెంటనే ప్రాసెస్ చేయబడతాయి. యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్‌లు లేదా ప్లాన్‌లలో ఏవైనా రోజులు మిగిలి ఉంటే, అవి కొత్త సబ్‌స్క్రిప్షన్‌కు జోడించబడతాయి.

చిట్కా: మీరు సబ్‌స్క్రిప్షన్‌లకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీ సబ్‌స్క్రిప్షన్ రిపీట్ అయ్యేదా లేక ప్రీపెయిడ్ ప్లాన్ రకానికి చెందినదా అన్నది చెక్ చేయవచ్చు.

డెవలపర్‌లు అనుమతించినట్లయితే, ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను మార్చడానికి:

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. మీరు సరైన Google ఖాతాలోనే సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  3. ప్రీపెయిడ్ ప్లాన్ నుండి సబ్‌స్క్రిప్షన్‌కు అప్‌గ్రేడ్ చేయడానికి లేదా సబ్‌స్క్రిప్షన్ నుండి ప్రీపెయిడ్ ప్లాన్‌కు డౌన్‌గ్రేడ్ చేయడానికి ఆఫర్ చేసే యాప్‌ను కనుగొని, తెరవండి.
  4. సబ్‌స్క్రిప్షన్ మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. మీరు మారాలి అని అనుకుంటున్న కొత్త ప్లాన్‌ను ఎంచుకోండి.
  6. సపోర్ట్ చేయబడే పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  7. కొనుగోలు చేయండి లేదా సబ్‌స్క్రయిబ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

Android కంప్యూటర్
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2819970638070287557
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false