కొత్త Android యాప్‌లను, అవి అధికారికంగా రిలీజ్ కావడానికి ముందే ట్రై చేయండి

యూజర్ ఫీడ్‌బ్యాక్ పొందడానికి, కొంతమంది డెవలపర్‌లు కొత్త యాప్‌లు లేదా ఫీచర్‌లను అధికారికంగా వాటిని రిలీజ్ చేయక ముందే అందుబాటులో ఉంచుతారు. మీరు ముందస్తు యాక్సెస్ లేదా బీటా ప్రోగ్రామ్‌లో చేరినప్పుడు ఈ యాప్‌లు లేదా ఫీచర్‌లను ట్రై చేయవచ్చు.

ముందస్తు యాక్సెస్, బీటా యాప్‌లు

ముందస్తు యాక్సెస్ యాప్‌లు అనేవి ఇంకా రిలీజ్ చేయని యాప్‌లు. బీటా యాప్‌లు, ఇప్పటికే రిలీజ్ అయిన యాప్‌లకు చెందిన మరింత కొత్త, ప్రయోగాత్మక వెర్షన్‌లు. ముందస్తు యాక్సెస్ వున్నవి, అలాగే బీటా యాప్‌లు, చాలా యాప్‌ల కంటే, తక్కువ స్థిరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, యాప్ క్రాష్ కావచ్చు లేదా కొన్ని ఫీచర్‌లు సరిగ్గా పనిచేయకపోవచ్చు.

కొన్ని యాప్‌లు ముందస్తు యాక్సెస్‌లోను, బీటా ప్రోగ్రామ్‌లోను చేరగల యూజర్‌ల సంఖ్యను పరిమితం చేస్తాయి. యూజర్‌లతో నిండిపోయినప్పుడు, ప్రస్తుత టెస్టర్‌లు నిష్క్రమిస్తే లేదా డెవలపర్ ఎక్కువ మంది యూజర్‌లను చేరడానికి అనుమతించినట్లయితే తర్వాత ఎక్కువ స్పేస్ ఏర్పడేందుకు అవకాశం ఉండవచ్చు.

ఇంకా రిలీజ్ కాని యాప్‌లకు ముందస్తు యాక్సెస్‌ను పొందండి

  1. Play స్టోర్ Google Playను తెరవండి.
  2. “మీ కోసం” ట్యాబ్‌కు వెళ్ళండి.
  3. "డెవలప్‌మెంట్‌లో ఉన్న యాప్‌ల కింద మీరు ట్రై చేయాలనుకున్న గేమ్‌ను ట్యాప్ చేయండి.
  4. ఇన్‌స్టాల్ చేయిని ట్యాప్ చేయండి.
  5. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
చిట్కా: మీరు రిలీజ్ చేయని యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తే, ఆ యాప్‌ను లాంచ్ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్‌గా బీటా ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ చేయబడవచ్చు.

ఇంకా రిలీజ్ కాని గేమ్‌లకు ముందస్తు యాక్సెస్‌ను పొందండి

  1. Play స్టోర్ Google Playను తెరవండి.
  2. "కొత్త" ట్యాబ్‌కు వెళ్ళండి.
  3. "ఆడేవారిలో మొదటి వ్యక్తి అవ్వండి" కింద మీరు ట్రై చేయాలనుకున్న గేమ్‌ను ట్యాప్ చేయండి.
  4. ఇన్‌స్టాల్ చేయిని ట్యాప్ చేయండి.
  5. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

యాప్‌లకు చెందిన బీటా వెర్షన్‌లను పొందండి

ముఖ్యమైనది: యాప్ బీటా వెర్షన్‌ను పొందడానికి, యాప్, మీ పరికరంలో ముందే ఇన్‌స్టాల్ అయి ఉండాలి.
  1. Play స్టోర్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. యాప్‌లు& పరికరాలను మేనేజ్ చేయి ఆ తర్వాత ఇన్‌స్టాల్ చేసినవి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. యాప్ వివరాల పేజీని తెరవడానికి, యాప్‌ను ట్యాప్ చేయండి.
  5. "బీటాలో చేరండి" ఆప్షన్ కింద ఉన్న, చేరండి ఆ తర్వాత చేరండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: మీరు "బీటాలో చేరండి"ని కనుగొనలేక పోతే, ఈ సమయంలో డెవలపర్ యాప్‌నకు పబ్లిక్ బీటాలను ఆఫర్ చేయటంలేదని అర్థం.

బీటా ప్రోగ్రామ్ నుండి నిష్క్రమించండి

ముఖ్యమైనది: మీరు బీటా యాప్ నుండి నిష్క్రమించి, అన్‌ఇన్‌స్టాల్ చేసినప్పుడు, మీరు మీ ప్రోగ్రెస్‌ను, అలాగే యాప్‌నకు చేసిన ఏవైనా అనుకూలీకరణలను కోల్పోవచ్చు.
  1. Play స్టోర్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. యాప్‌లు & పరికరాలను మేనేజ్ చేయి ఆ తర్వాత బీటా ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు నిష్క్రమించాలనుకుంటున్న యాప్‌ను కనుగొనండి.
  5. యాప్ వివరాల పేజీని తెరవడానికి, యాప్‌ను ట్యాప్ చేయండి.
  6. "మీరు బీటా టెస్టర్" ఆప్షన్ కింద నిష్క్రమించండి ఆ తర్వాత నిష్క్రమించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: మీరు ముందస్తు యాక్సెస్ లేదా బీటా ప్రోగ్రామ్ నుండి నిష్క్రమిస్తే, మీ స్పేస్ ఖాళీ అవుతుంది, మరొకరు ఆ స్పేస్‌ను ఉపయోగించుకోవచ్చు. బీటా ప్రోగ్రామ్‌లో తర్వాత మీ స్పేస్‌ను తిరిగి పొందగలరని మీకు హామీ ఉండదు.

యాప్ పబ్లిక్ వెర్షన్‌ను ఉపయోగించండి

బీటా ప్రోగ్రామ్ నుండి నిష్క్రమించిన తర్వాత, యాప్‌ను ఉపయోగించడాన్ని కొనసాగించడానికి:
  1. యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. యాప్‌ను ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేయాలో తెలుసుకోండి.
  2. యాప్ పబ్లిక్ వెర్షన్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. యాప్‌లను మళ్లీ ఇన్‌స్టాల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

డెవలపర్‌కు ఫీడ్‌బ్యాక్‌ను అందించండి

  1. Play స్టోర్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. యాప్‌లు & పరికరాలను మేనేజ్ చేయి ఆ తర్వాత బీటా ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకున్న యాప్ ను కనుగొనండి.
  5. యాప్ వివరాల పేజీని తెరవడానికి, యాప్‌ను ట్యాప్ చేయండి.
  6. “డెవలపర్‌కు ప్రైవేట్ ఫీడ్‌బ్యాక్”, కింద ఫీడ్‌బ్యాక్ రాయండిని ట్యాప్ చేయండి.
  7. యాప్‌ను రేట్ చేయడానికి స్టార్‌లను ట్యాప్ చేయండి, డెవలపర్ కోసం మీ అనుభవాన్ని వివరించడానికి బాక్స్‌ను ఉపయోగించండి.
    • ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించడానికి, రేటింగ్‌తో పాటు, ప్రతిస్పందనను రాత పూర్వకంగా ఇవ్వడం అవసరం.
  8. పోస్ట్ చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: మీరు మీ ముందస్తు యాక్సెస్‌ను, బీటా యాప్‌లను రివ్యూ చేసినప్పుడు, డెవలపర్ మాత్రమే మీ ఫీడ్‌బ్యాక్‌ను చూడగలరు.

డెవలపర్‌తో డేటా షేర్ చేయబడింది

మీ యాప్ వినియోగం ఆధారంగా నిర్దిష్ట డేటా (పరికర సమాచారం, యాప్ వినియోగ సమాచారం అలాగే యూజర్ చేత ట్రిగ్గర్ చేయబడే ఈవెంట్‌లు వంటివి) సేకరించబడి డెవలపర్‌తో షేర్ చేయబడుతుంది, తద్వారా వారు యాప్‌ను మెరుగుపరచడంలో ఈ డేటా సహాయపడుతుంది.

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14273354982348548026
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false