Google Playలో ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించండి

మీరు ఫ్యామిలీ గ్రూప్‌లో ఉన్నప్పుడు, ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ లేదా ప్రత్యేక పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించి Google Playలో కొనుగోళ్లు చేయవచ్చు.

ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ ఎలా పని చేస్తుంది

  • ఫ్యామిలీ గ్రూప్ క్రియేట్ అయినప్పుడు, ఫ్యామిలీ మేనేజర్ ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను జోడించగలరు.
  • ఫ్యామిలీ మెంబర్‌లు Google Playలో కొనుగోళ్లు చేయడానికి లేదా Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా యాప్‌లో కొనుగోళ్లు చేయడానికి ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు.
  • ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించి వారి ఫ్యామిలీ మెంబర్‌లు చేసే ఏవైనా కొనుగోళ్లకు ఫ్యామిలీ మేనేజర్ బాధ్యత వహిస్తారు.
  • ఫ్యామిలీ మెంబర్ Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా కొనుగోలు చేసిన ప్రతిసారీ ఫ్యామిలీ మేనేజర్ ఈమెయిల్ రసీదును పొందుతారు.
  • నిర్దిష్ట కొనుగోళ్లు చేయడానికి ఫ్యామిలీ మెంబర్‌లు వారి ఆమోదం పొందాలని ఫ్యామిలీ మేనేజర్ కొనుగోలు ఆమోదాలను ఆన్ చేయవచ్చు.

    ముఖ్య గమనిక: కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లు కేవలం Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తాయి.

ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ ద్వారా కొనుగోళ్లు చేయండి

ఫ్యామిలీ మెంబర్‌లు, ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ లేదా మరొక పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించి కొనుగోళ్లు చేయవచ్చు.

మీరు ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించి చేయగల కొనుగోళ్లు

యాప్‌లో కొనుగోళ్లు చేయడానికి, Google Playలో Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా కింది కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి ఫ్యామిలీ మెంబర్‌లు ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు:

  • యాప్‌లు
  • పుస్తకాలు
  • సినిమాలు
  • గేమ్‌లు
  • టీవీ షోలు
  • మ్యాగజైన్ సంచికలు

చిట్కా: ఫ్యామిలీ లైబ్రరీకి జోడించడానికి కంటెంట్‌కు అర్హత ఉంటే, మీకు వివరాల పేజీలో ఫ్యామిలీ లైబ్రరీ చిహ్నం Family Library కనిపిస్తుంది.

మీరు ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ ద్వారా చేయలేని కొనుగోళ్లు

వీటితో సహా, కొన్ని రకాల కొనుగోళ్ల కోసం ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించలేరు:

ఫ్యామిలీ మేనేజర్ కోసం పేమెంట్ ఆప్షన్‌లు

మీరు మీ ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేస్తే, మీ ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను మేనేజ్ చేయడానికి, కొనుగోళ్లను ట్రాక్ చేయడానికి దిగువున పేర్కొన్న సూచనలను ఉపయోగించండి.

ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి

ముఖ్యమైనది:

  • మీరు ఫ్యామిలీ మేనేజర్ Google ఖాతాకు తప్పనిసరిగా ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను జోడించాలి. ఫ్యామిలీ మేనేజర్ మాత్రమే ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను జోడించగలరు, అనుబంధించగలరు, ఎడిట్ చేయగలరు లేదా తొలగించగలరు.
  • ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌గా మీరు తప్పనిసరిగా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌ను ఉపయోగించాలి. Google Play గిఫ్ట్ కార్డ్‌లతో సహా, మిగిలిన పేమెంట్ ఆప్షన్‌లకు అర్హత లేదు.
  1. మీ Android పరికరంలోని Google Playలో ఫ్యామిలీ లైబ్రరీని సెటప్ చేయండి.
  2. ఫ్యామిలీ లైబ్రరీని, ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను సెటప్ చేయడం కోసం స్క్రీన్‌పై ఉన్న సూచనలను ఫాలో అవ్వండి.
మీ ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను మార్చండి
  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్‌లు ఆ తర్వాత ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను మార్చును ట్యాప్ చేయండి.
  4. కొత్త పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. సరే అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
ప్రతి ఫ్యామిలీ మెంబర్ కోసం కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లను ఎంచుకోండి

మీ ఫ్యామిలీ మెంబర్‌ల కోసం కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లను ఎంచుకోండి. కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లు, కేవలం Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తాయి.

ఫ్యామిలీ మెంబర్‌లు చేసిన కొనుగోళ్లను చూడండి

Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించి చేసిన అన్ని కొనుగోళ్ల లిస్ట్‌ను ఫ్యామిలీ మేనేజర్ చూడగలరు.

  1. Play Store యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున, ప్రొఫైల్ చిహ్నాన్ని ఆ తర్వాత పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత బడ్జెట్ & హిస్టరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. కొనుగోలు హిస్టరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. గత కొనుగోళ్లు అన్నింటినీ స్క్రోల్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా కొనుగోలు చేసినట్లయితే, మీరు "కొనుగోలు చేసినవారు" అని రాసి ఉండటాన్ని, వారి పేరును చూస్తారు.

చిట్కా: మీరు మీ ఫ్యామిలీ మెంబర్‌లతో క్రెడిట్ కార్డ్‌ను షేర్ చేస్తే, మీరు ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌గా ఉపయోగించే క్రెడిట్ కార్డ్‌కు వారు ఇప్పటికే యాక్సెస్‌ను కలిగి ఉండవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్‌లు, కొనుగోలు చేయడానికి ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకుంటే మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్‌తో చేసిన కొనుగోళ్లు మీ ఆర్డర్ హిస్టరీలో కనబడతాయి.

ముఖ్య గమనిక: ఫ్యామిలీ మేనేజర్ Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా ఫ్యామిలీ మెంబర్ చేసిన కొనుగోళ్లను మాత్రమే చూడగలరు. ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్ద్వారా ఫ్యామిలీ మెంబర్ చేసిన కొనుగోళ్లు ఫ్యామిలీ మేనేజర్‌కు కనిపించవని దీని అర్థం.

సమస్యలను పరిష్కరించండి

ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ కనబడటం లేదు

మీరు కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ ఒక ఆప్షన్‌గా కనబడకపోతే, ఆ రకమైన కొనుగోలు కోసం ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించలేరని అర్థం.

"మీ ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ చెల్లదు" ఎర్రర్

దీన్ని పరిష్కరించడానికి, దిగువున పేర్కొన్న సూచనలను అనుసరించమని మీ ఫ్యామిలీ మేనేజర్‌ను కోరండి:

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్‌లు ఆ తర్వాత ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను మార్చును ట్యాప్ చేయండి.
  4. కొత్త పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. సరే అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ రీఫండ్ నాకు కావాలి

ఫ్యామిలీ మేనేజర్‌లు లేదా కంటెంట్‌ను కొనుగోలు చేసిన ఫ్యామిలీ మెంబర్, ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించి కొనుగోలు చేసిన కంటెంట్ కోసం రీఫండ్‌లను అడగవచ్చు.

రీఫండ్‌లు ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌కు రిటర్న్ చేయబడతాయి.

రిక్వెస్ట్‌లను ఎలా చేయాలి అనే దాని గురించి, అలాగే, Google Play రీఫండ్ పాలసీల గురించి మరింత తెలుసుకోండి.

ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను చిన్నారి ఉపయోగించడాన్ని పరిమితం చేయండి

మీ చిన్నారి వయస్సు 18 ఏళ్లలోపు ఉండి, వారి ఖాతాను Family Linkతో మేనేజ్ చేస్తుంటే, ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను వారు ఉపయోగించడాన్ని పరిమితం చేయడానికి మీరు కొనుగోలు ఆమోదాలను సెట్ చేయవచ్చు.

చిట్కా: Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌తో చేసిన కొనుగోళ్లను పరిమితం చేయడానికి మాత్రమే కొనుగోలు ఆమోదాలు ఉపయోగించబడతాయి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1978691014817040632
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false