ఫీజులు, ఛార్జీలు, అలాగే ప్రామాణీకరణలు

Google Paymentsను ఉపయోగిస్తున్నప్పుడు వర్తించే ఫీజులు, ఛార్జీలు అలాగే ప్రామాణీకరణలు గురించి తెలుసుకోవడానికి ఈ పేజీని ఉపయోగించండి.

ఫీజులు

Google Play లేదా Google Drive వంటి Google సర్వీస్‌లలో కొనుగోళ్లు చేసినందుకు ఫీజులు లేవు. మీరు మీ కొనుగోళ్లు, వర్తించే పన్నులు అలాగే డెలివరీ ఫీజులకు మాత్రమే పే చేస్తారు.

ఛార్జీలు

మీరు ఏ Google సర్వీస్ అయితే ఆర్డర్ చేశారో అది మాత్రమే మీ ఖాతా నుండి ఛార్జీ చేయబడుతుంది.

ఛార్జీలు మీ స్టేట్‌మెంట్‌లో GOOGLE*విక్రేత పేరుతో కనిపిస్తాయి, అలాగే అవి సాధారణంగా మీరు ఆర్డర్ చేసిన కొద్ది రోజులలోనే మీ స్టేట్‌మెంట్‌లో కనిపిస్తాయి.

మీ లొకేషన్‌ను బట్టి మీ బ్యాంక్ లేదా కార్డ్ కంపెనీ అంతర్జాతీయ లావాదేవీల కోసం ఫీజును ఛార్జి చేయవచ్చు.

ప్రామాణీకరణలు

మీరు మీ బ్యాంక్ ఖాతా లేదా కార్డ్ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసినప్పుడు, మీకు పెండింగ్ పేమెంట్ ప్రామాణీకరణలు కనిపించవచ్చు. ఈ ప్రామాణీకరణలు జరుగుతాయి కాబట్టి కార్డ్ చెల్లుబాటు అవుతోందని Google నిర్ధారించుకోవచ్చు, అలాగే కొనుగోలు చేయడానికి మీ ఖాతాలో మీకు తగినంత నిధులు ఉన్నాయో లేదో చెక్ చేయవచ్చు.

ఇవి ప్రామాణీకరణ రిక్వెస్ట్‌లు, ఛార్జీలు కాదు. ప్రామాణీకరణల కోసం మీరు పే చేయరు.

మీ బ్యాంక్‌ను బట్టి ప్రామాణీకరణలు మీ ఖాతాలో 1-14 పని దినాలు ఉండవచ్చు. 14 పని దినాల తర్వాత మీకు ఇప్పటికీ పెండింగ్ ప్రామాణీకరణలు కనిపిస్తున్నట్లయితే, మరింత సమాచారం కోసం మీ బ్యాంక్‌ను సంప్రదించండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13489044550041037200
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false