యాప్‌లు, సినిమాలు, పుస్తకాలు & ఆడియోబుక్‌ల కోసం ముందే ఆర్డర్ ఇవ్వండి లేదా ముందస్తుగా రిజిస్టర్ చేసుకోండి

మీరు నిర్దిష్ట సినిమాలు, ఇ-బుక్‌లు, ఆడియోబుక్‌లను ముందస్తుగా ఆర్డర్ చేయవచ్చు, అవి అందుబాటులోకి రాగానే వాటిని మీ లైబ్రరీలో కనపడేలా చేయవచ్చు. మీరు ఇంకా రిలీజ్ కానటువంటి నిర్దిష్ట యాప్‌లు, గేమ్‌ల కోసం కూడా ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

ముఖ్య గమనిక: రెగ్యులేటరీ ఆవశ్యకతల కారణంగా, Google భారతదేశంలో ముందస్తు ఆర్డర్‌లను అందించదు. భారతదేశంలో కంటెంట్, సేల్ జరిగే తేదీలలో అందుబాటులో ఉంటుంది.

ఐటెమ్ కోసం ముందస్తుగా ఆర్డర్ లేదా ముందస్తుగా రిజిస్టర్ చేయండి

ఐటెమ్ మీ యాప్‌లో అందుబాటులోకి వచ్చేంత వరకు ముందస్తు ఆర్డర్‌ల కోసం మీకు ఛార్జి విధించబడదు. 

ముఖ్యమైనది: మీరు ఐటెమ్ కోసం ముందస్తుగా రిజిస్టర్ చేసుకుంటే, మీరు మీ ముందస్తు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయలేరు. 

  1. మీ Android పరికరంలో, Google Play Store యాప్ Google Playను తెరవండి.
  2. మీరు ముందస్తుగా ఆర్డర్ చేయాలనుకుంటున్న ఐటెమ్‌ను ట్యాప్ చేయండి.
  3. ఐటెమ్ వివరాల పేజీలో, ముందస్తుగా ఆర్డర్ చేయండి లేదా ప్రీ - రిజిస్టర్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ ముందస్తు ఆర్డర్ ప్లేస్ చేయబడినప్పుడు మీకు ఇమెయిల్ అందుతుంది. మీరు ఆ ఐటెమ్‌ను పొందినప్పుడు లేదా డౌన్‌లోడ్ చేయడానికి అది అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ లేదా ఇమెయిల్ అందుతుంది.

ముఖ్యమైనది: మీ పేమెంట్ తిరస్కరించబడితే ముందస్తు ఆర్డర్ రద్దు చేయబడవచ్చు. మీరు మీ ముందస్తు ఆర్డర్ కోసం Google Play స్టోర్ బ్యాలెన్స్‌ను పేమెంట్ ఆప్షన్‌గా ఉపయోగించినట్లయితే, ఐటెమ్ రిలీజ్ అయినప్పుడు మీ ఖాతాలో తగినంత క్రెడిట్ లేకపోతే మీ ఆర్డర్ రద్దు చేయబడుతుంది. 

స్టేటస్‌ను చెక్ చేయండి లేదా మీ ముందస్తు ఆర్డర్‌ను రద్దు చేయండి

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత బడ్జెట్ & హిస్టరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు రద్దు చేయాలనుకుంటున్న ఐటెమ్‌ను ఎంచుకోండి.
  5. ముందస్తు ఆర్డర్‌ను రద్దు చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీరు మీ ఆర్డర్‌ను రద్దు చేసిన తర్వాత రద్దుకు సంబంధించిన ఇమెయిల్‌ను అందుకుంటారు.

ముందస్తుగా ఆర్డర్ చేయడానికి, అందుబాటులో ఉన్న పుస్తకాలను కనుగొనండి

  1. మీ Android పరికరంలో, Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. లైబ్రరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ముందస్తుగా ఆర్డర్ చేయడం కోసం అందుబాటులోకి రాబోయే పుస్తకాలు, లేదా ఇప్పటికే మీరు ముందస్తుగా ఆర్డర్ చేసిన పుస్తకాలను కనుగొనడానికి, రాబోయేవి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు రాబోయే పుస్తకంతో కూడిన సిరీస్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నట్లయితే, మీరు పుస్తకాన్ని మళ్లీ ముందస్తుగా ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. మీ సబ్‌స్క్రిప్షన్‌లను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

Android కంప్యూటర్
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8736101405630116435
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false