మీ విష్‌లిస్ట్‌ను మేనేజ్ చేయండి

మీరు Google Playలో ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న లేదా కొనుగోలు చేయాలనుకుంటున్న యాప్‌ల, డిజిటల్ కంటెంట్‌ల లిస్ట్‌ను మీరు క్రియేట్ చేయవచ్చు. మీరు మీ కలెక్షన్‌కు ఏమి జోడించాలనుకుంటున్నారో కూడా ట్రాక్ చేయవచ్చు, కానీ మీ విష్‌లిస్ట్ ఐటెమ్‌లు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేయబడవు.

మీ విష్‌లిస్ట్‌కు ఐటెమ్‌లను జోడించడం లేదా దాని నుండి తీసివేయడం

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. కంటెంట్ కోసం సెర్చ్ లేదా బ్రౌజ్ చేయండి, దానిలో ఒక ఐటెమ్‌ను ఎంచుకోండి.
  3. ఎగువున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత విష్‌లిస్ట్‌కు జోడించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ విష్‌లిస్ట్ నుండి ఒక ఐటెమ్‌ను తీసివేయడానికి, మీరు పైన పేర్కొన్న దశలను ఫాలో చేసి, విష్‌లిస్ట్ నుండి తీసివేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ విష్‌లిస్ట్ నుండి అన్నింటినీ తీసివేయడం

ముఖ్యమైనది: మీరు ఈ చర్యను రద్దు చేయలేరు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play Store యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత జనరల్ ఆ తర్వాత ఖాతా, పరికర ప్రాధాన్యతలు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. విష్‌లిస్ట్‌ను క్లియర్ చేయండి అనే ఆప్షన్‌కు స్క్రోల్ చేసి, ట్యాప్ చేయండి.

మీ విష్‌లిస్ట్‌ను కనుగొనడం

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play Store యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. లైబ్రరీ ఆ తర్వాత విష్‌లిస్ట్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీ విష్‌లిస్ట్‌లో పుస్తకాలు ఉన్నట్లయితే, వాటిని కూడా మీరు Google Play Books యాప్‌నకు చెందిన "విష్‌లిస్ట్" ట్యాబ్‌లో కనుగొనవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8063326645031666085
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false