Play Games ప్రొఫైల్ గోప్యత & ఇతర సెట్టింగ్‌లు

మీరు గేమ్‌లకు ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయాలో వద్దో ఎంచుకోవచ్చు, మీ గేమ్ యాక్టివిటీని పబ్లిక్‌గా ఉంచండి, లేదా ఇతర సెట్టింగ్‌లను మార్చండి.

గేమ్‌లకు ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయండి

మీ ప్రోగ్రెస్‌ను సేవ్ చేసుకోవడానికి, విజయాలను సాధించడానికి, మీకు సపోర్ట్ చేయబడే గేమ్‌లలో మీరు ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయవచ్చు. ప్రస్తుతం మీరు ఆడుతున్న గేమ్‌లకు, ఇంకా భవిష్యత్తులో మీరు ఆడబోయే గేమ్‌లకు సైన్ ఇన్ చేయవచ్చు.

Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. Google ఆ తర్వాత Google యాప్‌ల కోసం సెట్టింగ్‌లు ఆ తర్వాత Play Games అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. సపోర్ట్ చేయబడే గేమ్‌లకు ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ అవ్వండి అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి.
  4. మీకు అనేక ఖాతాలు ఉంటే: "సెట్టింగ్‌లు" పేజీలో ఎగువున, సరైన ఖాతాకు సైన్ ఇన్ అయ్యారేమో నిర్ధారించుకోండి. ఆ ఖాతాతో, మీరు కొత్త గేమ్‌లకు సైన్ ఇన్ అవుతారు, విజయాలను సాధిస్తారు, ఇంకా గేమ్ ప్రోగ్రెస్‌ను సేవ్ చేసుకోగలరు.

చిట్కాలు: 

  • పర్యవేక్షించబడే Google ఖాతా, మల్టిపుల్ Play Games ప్రొఫైల్స్‌ను కలిగి ఉండటం సాధ్యం కాదు.
  • పర్యవేక్షించబడే Google ఖాతాల Play Games ప్రొఫైల్‌తో, అన్ని గేమ్‌లు ఆటోమేటిక్ సైన్-ఇన్‌కు సపోర్ట్ చేయవు.

Android TVలో

  1. Play Games యాప్ Play Gamesను తెరవండి.
  2. సైడ్‌బార్‌లో, సెట్టింగ్‌లు ఆ తర్వాత గేమర్ ప్రొఫైల్‌ను ఎంచుకోండి.
  3. తర్వాత అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. "సపోర్ట్ చేయబడే గేమ్‌లకు ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయాలా?" అని మీరు చూసినప్పుడు, అనుమతించు లేదా అనుమతించవద్దుఅనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: మీరు గేమ్ కోసం వేరే Google ఖాతాలోకి సైన్ ఇన్ కావాలనుకుంటే, ఆ గేమ్ నుండి సైన్ అవుట్ అయ్యి మళ్ళీ తిరిగి సైన్ ఇన్ అవ్వండి.

మీ గేమ్ యాక్టివిటీని ఎవరు చూడవచ్చు అనేదాన్ని మార్చండి

మీ ప్రొఫైల్‌ను విజయాలను, లీడర్ బోర్డ్‌లను, ఆడిన గేమ్‌లను ఎవరు చూడవచ్చు అనేది ఎంచుకోండి.

Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. Google ఆ తర్వాత Google యాప్‌ల కోసం సెట్టింగ్‌లు ఆ తర్వాత Play Games అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "ప్రొఫైల్, గోప్యత," కింద మీ ఖాతాను ఎవరు చూడవచ్చో ఎంచుకోండి:
    • Google Play Games మొబైల్ యాప్‌లో ప్రతి ఒక్కరూ
    • ఫ్రెండ్స్ మాత్రమే
    • మీరు మాత్రమే
చిట్కా: Play Games ప్రొఫైల్‌తో, ఆటోమేటిక్ సైన్-ఇన్, విజయాలకు, లీడర్‌బోర్డ్‌లకు యాక్సెస్‌ను పొందడం ద్వారా, మీ చిన్నారికి చెందిన పర్యవేక్షించబడే Google ఖాతా, Play ప్లాట్‌ఫామ్‌లలో మరింత గొప్పగా గేమింగ్ అనుభవాన్ని పొందుతుంది. ప్రస్తుతానికి, ఈ సెట్టింగ్ ఆటోమేటిక్‌గా "మీకు మాత్రమే" అని సెట్ చేయబడింది. ఈ సెట్టింగ్‌ను మార్చడం సాధ్యపడదు.

Android TVలో

  1. Play Games యాప్ Play Gamesను తెరవండి.
  2. సైడ్‌బార్‌లో, సెట్టింగ్‌లు ఆ తర్వాత గేమర్ ప్రొఫైల్‌ను ఎంచుకోండి.
  3. తర్వాత అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. "మీ గేమింగ్ యాక్టీవిటీని చూడటానికి ఇతరులను అనుమతించాలా?" అని మీరు చూసినప్పుడు, అనుమతించు లేదా అనుమతించవద్దు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: మీరు మీ గేమర్ పేరుతో గేమ్‌ను ఆడుతున్నప్పుడు, మీ యాక్టివిటీ ఇంకా గేమ్‌లో మీరు కొనుగోలు చేసిన వాటి సమాచారాన్ని గేమ్ డెవలపర్ పొందుతారు. గేమ్ డెవలపర్‌లు ఈ సమాచారాన్ని వారి గేమ్‌లను ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఉపయోగిస్తారు. డెవలపర్‌లు ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారనే దాని గురించి మరింత తెలుసుకోవాలంటే, గేమ్ డెవలపర్ గోప్యతా పాలసీని చెక్ చేయండి.

వ్యక్తులు, మీ ఈమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించి మీ ప్రొఫైల్‌ను కనుగొనేలా చేయండి

మీ ఇమెయిల్ అడ్రస్‌తో సెర్చ్ చేయడం ద్వారా, మీ గేమర్ ప్రొఫైల్‌ను ఇతర ఆటగాళ్ళు కనుగొనగలిగేలా అనుమతించవచ్చు.

Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. Google ఆ తర్వాత Google యాప్‌ల కోసం సెట్టింగ్‌లు ఆ తర్వాత Play Games అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. 'ఇతరులు మీ ఈమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించడం ద్వారా మీ ప్రొఫైల్‌ను చూడనివ్వండి' అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి.
చిట్కా: మీరు మీ చిన్నారికి చెందిన పర్యవేక్షించబడే Google ఖాతా కోసం Play Games ప్రొఫైల్‌ను క్రియేట్ చేసినప్పుడు, వారి ప్రొఫైల్‌లో ఈ సెట్టింగ్ ఆటోమేటిక్‌గా "ఆఫ్"కు సెట్ చేయబడుతుంది. ఈ సెట్టింగ్‌ను మార్చడం సాధ్యపడదు.

Android TVలో

  1. Play Games యాప్ Play Gamesను తెరవండి.
  2. సైడ్‌బార్‌లో, సెట్టింగ్‌లు ఆ తర్వాత గేమర్ ప్రొఫైల్‌ను ఎంచుకోండి.
  3. తర్వాత అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. "మీ ఇమెయిల్ అడ్రస్ లేదా పేరును ఉపయోగించి మీ గేమర్ IDని అన్వేషించడానికి ఇతరులను అనుమతించాలా?" అని మీరు చూసినప్పుడు, అనుమతించు లేదా అనుమతించవద్దు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ ఫ్రెండ్స్ లిస్ట్‌ను గేమ్‌లు ఎప్పుడు యాక్సెస్ చేయవచ్చు అనేది మార్చండి

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. Google ఆ తర్వాత Google యాప్‌ల కోసం సెట్టింగ్‌లు ఆ తర్వాత Play Games అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "ప్రొఫైల్, గోప్యత," అనే విభాగంలో, మీరు ఆడే గేమ్‌లు, మీ ఫ్రెండ్స్ లిస్ట్‌ను ఆటోమేటిక్‌గా యాక్సెస్ చేయాలా వద్దా అనేది ఎంచుకోండి.
చిట్కా: పర్యవేక్షించబడే Google ఖాతాల Play Games ప్రొఫైల్స్, Play Games ఫ్రెండ్స్ ఫీచర్‌కు యాక్సెస్‌ను కలిగి ఉండవు. ఈ సెట్టింగ్‌ను మార్చడం సాధ్యపడదు.
మీ ఫ్రెండ్స్ లిస్ట్‌ను గేమ్స్ యాక్సెస్ చేసి ఎలా ఉపయోగించవచ్చు

మీ ఫ్రెండ్స్ లిస్ట్‌కు మీరు గేమ్ యాక్సెస్‌ను ఇచ్చినప్పుడు, మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న, గేమర్ పేర్ల లిస్ట్‌ను గేమ్‌తో షేర్ చేస్తారు. ఈ లిస్ట్‌లో, మీ ఫ్రెండ్స్ ఈమెయిల్ అడ్రస్‌లు ఉండవు. గేమ్‌ల గోప్యతా పాలసీలకు లోబడి మీరు ఫ్రెండ్స్‌ను చూడటానికి ఇంకా వారితో కలిసి సులభంగా ఆడటానికి గేమ్‌లు ఈ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు, వీటిని మీరు గేమ్‌లలో ఇంకా Play Store పేజీలలో కనుగొనవచ్చు.

అదనంగా, ప్రతి గేమ్, ఫ్రెండ్స్ లిస్ట్‌ను వినియోగించుకోవడానికి, Google Play Games మొబైల్ యాప్, ప్రతి గేమ్ డెవలపర్ వీటికి సమ్మతించాలని సూచిస్తుంది:

  • ఫ్రెండ్స్ లిస్ట్‌ను ఉపయోగించుకోవడం అనేది గేమ్‌లో మీకు ఫ్రెండ్స్ లిస్ట్‌ను ప్రదర్శించడానికి లేదా దానికి సంబంధించిన ఫ్రెండ్స్ ఫంక్షనాలిటీని ఎండ్ యూజర్‌కు కనిపించే విధంగా ఎనేబుల్ చేయడానికి తప్ప అడ్వర్టయిజింగ్ లాంటి మరే ప్రయోజనాన్ని ఉద్దేశించి కాదు.
  • ఈ ఫ్రెండ్స్ లిస్ట్‌ను 30 రోజుల కన్నా మించి స్టోర్ చేయడానికి లేదా ఉంచుకోవడానికి వీలు లేదు. 30 రోజుల తర్వాత ఈ ఫ్రెండ్స్ లిస్ట్‌ను, గేమ్ తొలగించాలి లేదా రిఫ్రెష్ చేయాలి.
  • చట్ట ప్రకారం అవసరమైతే తప్ప, ఈ ఫ్రెండ్స్ లిస్ట్‌ను మరే థర్డ్ పార్టీలకు అందుబాటులో ఉంచకూడదు.

మీ గేమ్‌లకు ఉండే నోటిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చుకోండి

పరికరాన్ని బట్టి సెట్టింగ్‌లు మారుతూ ఉంటాయి. మీ పరికర వివరాల కోసం, మీ పరికర తయారీదారును సంప్రదించండి.

ఆప్షన్ 1: మీ సెట్టింగ్‌ల యాప్‌లో

  1. మీ పరికర సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. యాప్‌లు & నోటోఫికేషన్‌లు ఆ తర్వాత 'నోటిఫికేషన్‌లు'ను ట్యాప్ చేయండి.
  3. "ఇటీవల పంపినవి," ఆప్షన్ కింద, మీకు ఈ మధ్యన నోటిఫికేషన్‌లను పంపిన యాప్‌లను చూడండి.
    • లిస్ట్‌లో ఉన్న యాప్‌లలో, ఒక్కో దాని నుండి వచ్చే నోటిఫికేషన్‌లన్నింటినీ మీరు ఆఫ్ చేయవచ్చు.
    • కొన్ని నిర్దిష్ట కేటగిరీలకు సంబంధించిన నోటిఫికేషన్‌లను ఎంపిక చేసుకోవడానికి, యాప్ పేరును ట్యాప్ చేయండి.
    • మరిన్ని యాప్‌లను చూడటానికి, గత 7 రోజుల నుండి ఉన్న అన్నింటినీ చూడండి. అత్యంత ఇటీవలివి లేదా అత్యంత తరచుగా వచ్చేవి అనే వాటి ప్రకారం క్రమపద్ధతిలో అమర్చడానికి, వాటిని ట్యాప్ చేయండి.

మీరు గనుక "ఇటీవల పంపినవి," చూడకపోతే, మీరు పాత Android వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారు అని అర్థం. బదులుగా, యాప్ నోటిఫికేషన్‌లు ఇంకా యాప్‌ను ట్యాప్ చేయండి. మీరు నోటిఫికేషన్‌లను, నోటిఫికేషన్ డాట్‌లను, ఇంకా నోటిఫికేషన్ కేటగిరీలను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. ఒకవేళ యాప్‌లో కేటగిరీలు ఉంటే, మరిన్ని ఆప్షన్‌ల కోసం మీరు ఒక కేటగరీని ట్యాప్ చేయవచ్చు.

ఆప్షన్ 2: నోటిఫికేషన్‌లో

  • మీ స్క్రీన్ ఎగువ నుండి, దిగువకు స్వైప్ చేసిన తర్వాత, నోటిఫికేషన్‌ను కొద్దిగా కుడి వైపునకు లేదా ఎడమ వైపునకు లాగండి, ఆ తర్వాత సెట్టింగ్‌లు ను ట్యాప్ చేయండి.
  • నోటిఫికేషన్ డాట్ నుండి, యాప్‌ను నొక్కి పట్టుకోండి, ఆ తర్వాత సమాచారాన్ని  ట్యాప్ చేయండి.

ఆప్షన్ 3: నిర్దిష్ట యాప్‌లో

చాలా యాప్‌లు మిమ్మల్ని, యాప్‌లోని సెట్టింగ్‌ల మెనూ నుండి మీరు కంట్రోల్ చేసే విధంగా అనుమతిస్తాయి, ఉదాహరణకు, ఒక యాప్, దానికి వచ్చే నోటిఫికేషన్‌లు చేసే సౌండ్‌ను ఎంచుకొనే సెట్టింగ్‌ను కలిగి ఉండవచ్చు.

ఆటోమేటిక్‌గా ప్లే కావడం నుండి వీడియోలను ఆపివేయండి

మీరు 'నా గేమ్‌లు' లేదా ఆర్కేడ్‌ను కిందకు స్క్రోల్ చేసినప్పుడు, మీ వీడియోలు వెంటనే ప్లే చేయబడతాయి. ప్లే కావడం నుండి వాటిని ఆపడానికి:

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. Google ఆ తర్వాత Google యాప్‌ల కోసం సెట్టింగ్‌లు ఆ తర్వాత Play Games అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. వీడియోలను ఆటోమేటిక్‌గా ప్లే చేయండి అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

Play Games మీ డేటాను హ్యాండిల్ చేసే విధానం (Play Games యాప్ ఇన్‌స్టాల్ చేసి లేదు)

మీరు Play Games యాప్‌ను ఇన్‌స్టాల్ చేయనట్లయితే, మీరు Play Games ప్రొఫైల్‌ను క్రియేట్ చేసినా, Play Games సర్వీసులను ఉపయోగించినా లేదా Play Games యాప్‌ను ఇన్‌స్టాల్ చేయమని ప్రాంప్ట్ చేయబడినా, Google నిర్దిష్ట సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ ఫీచర్లు Google Play సర్వీసులను ఉపయోగిస్తాయి.

Play Games అనేది ఫంక్షనాలిటీ, ఖాతా మేనేజ్‌మెంట్, ఎనలిటిక్స్, డీబగ్గింగ్ కోసం మీ యాక్టివిటీని, వినియోగ సమాచారాన్ని, పనితీరు సమాచారాన్ని, వ్యక్తిగత ఐడెంటిఫయర్‌లను అలాగే పరికర ఐడెంటిఫయర్‌లను సేకరిస్తుంది. Play Games సేకరించే డేటా, బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది.

చిట్కా: కలెక్ట్ చేసిన డేటాను తొలగించమని మీరు Android సెట్టింగ్‌లలో రిక్వెస్ట్ చేయవచ్చు. "Play Games" కింద, "ప్రొఫైల్ సెట్టింగ్‌లకు" వెళ్లండి. మీరు నా ఖాతా ద్వారా కూడా రిక్వెస్ట్‌ను సమర్పించవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17401627323161782060
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false