మీ యాప్‌లను సురక్షితంగా ఉంచడంలో, అలాగే మీ డేటాను ప్రైవేట్‌గా ఉంచడంలో సహాయపడటానికి Google Play Protectను ఉపయోగించండి

Google Play Protect హానికరమైన ప్రవర్తనకు సంబంధించి మీ యాప్‌లను, పరికరాలను చెక్ చేస్తుంది.

  • ఇది, మీరు Google Play Store నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేసే ముందు, భద్రతా తనిఖీని వాటిపై రన్ చేస్తుంది.
  • ఇతర సోర్స్‌లకు చెందిన హాని కలిగించగల యాప్‌ల కోసం మీ పరికరాన్ని ఇది చెక్ చేస్తుంది. ఈ హానికరమైన యాప్‌లు కొన్ని సార్లు మాల్‌వేర్‌గా పిలవబడతాయి.
  • ఇది హాని కలిగించగల యాప్‌ల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
  • ఇది మీ పరికరం నుండి హానికరమైన యాప్‌లను డీయాక్టివేట్ చేయవచ్చు లేదా తీసివేయవచ్చు.
  • ముఖ్యమైన సమాచారాన్ని దాచి పెట్టడం లేదా తప్పుదోవ పట్టించడం ద్వారా మా అవాంఛిత సాఫ్ట్‌వేర్ పాలసీని ఉల్లంఘించే యాప్‌లను ఇది గుర్తించి, వాటి గురించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
  • ఇది, మా డెవలపర్ పాలసీని ఉల్లంఘిస్తూ మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి యూజర్ అనుమతులను పొందగల యాప్‌ల గురించి మీకు గోప్యతా హెచ్చరికలను పంపుతుంది.
  • ఇది నిర్దిష్ట Android వెర్షన్‌లలో మీ గోప్యతను పరిరక్షించడానికి యాప్ అనుమతులను రీసెట్ చేయవచ్చు.
  • ఆర్థిక మోసాలు చేయడానికి స్కామర్‌లు సాధారణంగా టార్గెట్ చేసే గోప్యమైన 'పరికర అనుమతుల'ను ఉపయోగించే వెరిఫై చేయబడని అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయకుండా ఇది నివారించవచ్చు. 

మీ పరికరం సర్టిఫికేషన్ స్టేటస్‌ను వెరిఫై చేయండి

  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ పరికరం Play Protect సర్టిఫైడ్ అయిందో లేదో చెక్ చేయడానికి, పరికరం గురించి సమాచారం ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

Google Play Protectను ఆన్ లేదా ఆఫ్ చేయడం ఎలా

ముఖ్యమైనది: Google Play Protect ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉంటుంది, కానీ మీరు దానిని ఆఫ్ చేయవచ్చు. భద్రత కోసం మీరు ఎల్లప్పుడూ Google Play Protectను ఆన్‌లో ఉంచాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. Play Protect ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. Play Protectతో యాప్‌లను స్కాన్ చేయండిని ఆన్ లేదా ఆఫ్ చేయండి.

తెలియని యాప్‌లను Googleకు పంపించండి

Google Play స్టోర్‌కు వెలుపల ఉండే తెలియని సోర్స్‌ల నుండి యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తే, తెలియని యాప్‌లను Googleకి పంపమని Google Play Protect మిమ్మల్ని అడగవచ్చు. మీరు “హానికరమైన యాప్‌ను గుర్తించడాన్ని మెరుగుపరచండి” సెట్టింగ్‌ను ఆన్ చేసినప్పుడు, తెలియని యాప్‌లను ఆటోమేటిక్‌గా Googleకు పంపడానికి మీరు Google Play Protectను అనుమతిస్తారు.

  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. Play Protect ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. హానికరమయిన యాప్‌ను గుర్తించడాన్ని మెరుగుపరచండిని ఆన్ లేదా ఆఫ్ చేయండి.

డెవలపర్‌ల కోసం సమాచారం

మీరు యాప్ డెవలపర్ అయితే, మీ యాప్‌కు చెందిన ప్రతి కొత్త వెర్షన్‌ను Googleకు పంపమని మిమ్మల్ని అడగవచ్చు. Google Play Protect మీ యాప్‌ను హానికరమైనదిగా ఫ్లాగ్ చేస్తే:

మీ యాప్, Google Play Protect ద్వారా తప్పుగా ఫ్లాగ్ చేయబడింది లేదా బ్లాక్ చేయబడింది అని మీరనుకుంటే, అప్పీల్‌ను ఫైల్ చేయండి.

Google Play Protect ఎలా పనిచేస్తుంది

మీరు యాప్‌లను ఇన్‌స్టాల్ చేసినప్పుడు Google Play Protect వాటిని చెక్ చేస్తుంది. ఇది కాలానుగుణంగా మీ పరికరాన్ని కూడా స్కాన్ చేస్తుంది. ఒకవేళ ఇది హాని కలిగించగల యాప్‌ను గుర్తిస్తే, ఇది కింద పేర్కొన్న విధంగా చేయవచ్చు:

  • మీకు ఒక నోటిఫికేషన్‌ను పంపుతుంది. యాప్‌ను తీసివేయడానికి, నోటిఫికేషన్‌ను ట్యాప్ చేసి, ఆ తర్వాత అన్‌ఇన్‌స్టాల్ను ట్యాప్ చేయండి.
  • మీరు అన్‌ఇన్‌స్టాల్ చేసేంత వరకూ యాప్‌ను డిజేబుల్ చేస్తుంది.
  • యాప్‌ను ఆటోమేటిక్‌గా తీసివేస్తుంది. చాలా సందర్భాలలో, హానికరమైన యాప్ గుర్తించినప్పుడు, ఆ యాప్‌ను తీసివేసినట్లుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.

మాల్‌వేర్ రక్షణ ఎలా పనిచేస్తుంది

హానికరమైన థర్డ్-పార్టీ సాఫ్ట్‌వేర్, URLలు, ఇతర సెక్యూరిటీ సమస్యల నుండి మిమ్మల్ని రక్షించడానికి, Google కింద పేర్కొన్న వాటి గురించి సమాచారాన్ని పొందవచ్చు:

  • మీ పరికరానికి సంబంధించిన నెట్‌వర్క్ కనెక్షన్‌లు
  • హాని కలిగించగల URLలు
  • ఆపరేటింగ్ సిస్టమ్, Google Play లేదా ఇతర సోర్స్‌ల ద్వారా మీ పరికరంలో ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌లు.

సురక్షితం కాని యాప్ లేదా URL గురించి మీరు Google నుండి హెచ్చరికను పొందవచ్చు. యాప్ గానీ లేదా URL గానీ పరికరాలకు, డేటాకు, లేదా యూజర్‌లకు హానికరమని తెలిస్తే, దాన్ని Google తీసివేయవచ్చు లేదా ఇన్‌స్టాల్ చేయబడకుండా దాన్ని బ్లాక్ చేయవచ్చు. Google Play Protect ద్వారా మునుపెన్నడూ స్కాన్ చేయబడని Google Playకు చెందని యాప్‌ను స్కాన్ చేయడానికి సంబంధించిన సిఫార్సును మీరు పొందవచ్చు. యాప్‌ను స్కాన్ చేయడం వలన కోడ్-స్థాయి పరిశీలన కోసం యాప్ వివరాలు Googleకు పంపబడతాయి. కొద్దిసేపటి తర్వాత, యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం సురక్షితమా కాదా, లేదా స్కాన్ ద్వారా యాప్ హానికరం అని నిర్ధారించినట్లయితే ఆ విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది.

మీ పరికర సెట్టింగ్‌లలో, వీటిలో కొన్ని రక్షణలను డిజేబుల్ చేయడాన్ని మీరు ఎంచుకోవచ్చు. కానీ, Google Play ద్వారా ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌ల గురించి సమాచారాన్ని అందుకోవడం Google కొనసాగించవచ్చు, అలాగే ఇతర సోర్స్‌ల ద్వారా మీ పరికరంలో ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌లను సెక్యూరిటీ సమస్యల కోసం చెక్ చేయడాన్ని Googleకు సమాచారాన్ని పంపించకుండా కొనసాగించవచ్చు.

ఉపయోగించని యాప్‌ల అనుమతులను Google ఎలా రీసెట్ చేస్తుంది

మీ డేటాను ప్రైవేట్‌గా ఉంచడానికి, మీరు అరుదుగా ఉపయోగించే యాప్‌ల కోసం Google Play Protect యాప్ అనుమతులను రీసెట్ చేయవచ్చు. Android వెర్షన్‌లు 6.0–10 రన్ అయ్యే పరికరాలను ఈ ఫీచర్ రక్షిస్తుంది. 

మీరు 3 నెలలకు పైగా ఉపయోగించని యాప్‌ల నుండి మీరు మంజూరు చేసే ఏవైనా అనుమతులను Google రీసెట్ చేయవచ్చు. ఇది జరిగినప్పుడు, మీరు Play Protect నుండి నోటిఫికేషన్‌ను అందుకుంటారు. మీ పరికరం సాధారణ ఆపరేషన్‌కు అవసరమయ్యే యాప్‌ల నుండి అనుమతులను Play Protect ఆటోమేటిక్‌గా రీసెట్ చేయదు.

ఏ యాప్ అనుమతులు రీసెట్ చేయబడతాయో రివ్యూ చేయడానికి లేదా మేనేజ్ చేయడానికి

  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. Play Protect ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఉపయోగించని యాప్‌ల కోసం అనుమతులు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఆటోమేటిక్‌గా అనుమతులను రీసెట్ చేయడం నుండి Play Protectను నివారించడానికి:

  1. లిస్ట్ నుండి యాప్‌ను ఎంచుకోండి.
  2. యాప్‌ను ఉపయోగించకపోతే అనుమతులను తీసివేయండి అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

వ్యక్తిగత యాప్ కోసం ఈ సెట్టింగ్‌ను ఆన్ ఇంకా ఆఫ్ చేయడానికి:

  1. యాప్ ఆ తర్వాత అనుమతులు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. యాప్ ఉపయోగించకుంటే అనుమతులను తీసివేయండిని ఆన్ లేదా ఆఫ్ చేయండి.

మీరు అనుమతులను తీసివేసిన తర్వాత, వాటిని Play Protect మళ్ళీ మంజూరు చేయదు, అలాగే ఏ అనుమతులను రీసెట్ చేయదు.

గోప్యతా హెచ్చరికలు ఎలా పనిచేస్తాయి

Google Play స్టోర్ నుండి యాప్ తీసివేయబడితే Google Play Protect మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఆ యాప్ మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు, కనుక అలర్ట్ వలన మీరు యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసుకోగల ఆప్షన్ ఉంటుంది. 
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10244400172871777546
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false